మున్నంగి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మున్నంగి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 13.50 km² (5.2 sq mi)
జనాభా (2011)[1]
 - మొత్తం 6,399
 - పురుషుల సంఖ్య 3,166
 - స్త్రీల సంఖ్య 3,233
 - గృహాల సంఖ్య 1,957
పిన్ కోడ్ : 522 304
ఎస్.టి.డి కోడ్ : 08644

మున్నంగి గుంటూరు జిల్లా కొల్లిపర మండలములోని ఒక గ్రామము. పిన్ కోడ్: 522 304. ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరువెనుక చరిత్ర[మార్చు]

మునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావడానికి కారణంగా ఈ కథను చెప్పుకుంటారు.

పూర్వం కోటి మంది మునులు కృష్ణా నది తీరాన ప్రాతఃకాలానికి ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయేవారు. ఒక రోజు కృష్ణా నదీ తీరాన గల పంట పొలాలలో (లంక) పనిచేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రేయి అక్కడే నిదురించెను.అర్దరాత్రి సమయములో మెలకువ వచ్చిన ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణా నదీ తీరాన తపస్సు చేస్తూ కనిపించారు. ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు "ఈ విషయాన్ని ఎవరికైనా తెలియపరచిన నీ తల వేయి ముక్కలవును"అని శపించెను. భయముతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బంధువులకు వెల్లడించగా, వెంటనే అతని తల వేయి వ్రక్కలయెను. ఆ తెల్లవారు ఝామున ప్రజలు కృష్ణా నదీ తీరానికి వెళ్ళి చూడగా మునులు అదృశ్యమై, ఆ రోజు నుండి వారు మరలా ఎవరికీ కనిపించలేదు. అలా ఈ ఊరికి "మునికోటిపురము" అనే నామము వచ్చెను. కాలక్రమేణా 'మున్నంగి'గా వ్యవహరించబడసాగెను.

గ్రామ భౌగోళికం[మార్చు]

మున్నంగి కృష్ణా నది తీరాన ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

వల్లభాపురం 3 కి.మీ, కొల్లిపర 4 కి.మీ, దంతులూరు 4 కి.మీ, చివలూరు 5 కి.మీ, ఈమని 8 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

తూర్పున తోట్లవల్లూరు మండలం, పశ్చిమాన దుగ్గిరాల మండలం, దక్షణాన తెనాలి మండలం, ఉత్తరాన కంకిపాడు మండలం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

APSRTC ప్రతి గంటకు ఒక బస్సు సర్వీసును తెనాలికి నడుపుచున్నది. మున్నంగి నుండి గుంటూరు మరియు విజయవాడలకు ప్రతి పూట ఒక బస్సు సర్వీసు ఉంది.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 1987-88 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు, తిరిగి ఈ పాఠశాలలో 2016, మే-15వ తేదీ ఆదివారంనాడు కలుసుకొననున్నారు. [9]
 2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
 3. వివేకానంద విద్యామందిర్.
 4. ఊషోదయా పబ్లిక్ స్కూల్.
 5. ఉర్దూ పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ గ్రామం కొల్లిపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉంది. ఈ కేంద్రానికి నూతన భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయాల విలువైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ ఆరిగ కోటిరెడ్డి విరాళంగా అందజేసినారు. ఈ స్థలంలో నిర్మించిన నూతన భవనాన్ని, 2015, డిసెంబరు-5న ప్రారంభించారు. దీనితో ఈ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోనికి వచ్చినవి. 6 పడకలు, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో ఈ ఆసుపత్రి నడచుచున్నది. [8]

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వేమూరి దీనమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

మున్నంగి గ్రామ కూడలిలో, 2014, ఏప్రిల్-8, మంగళవారం నాడు, శ్రీ రామభక్త హనుమంతుని విగ్రహాన్ని, మొదట గ్రామ వీధులలో ఊరేగించి, తరువాత ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. [4]

శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

 1. మున్నంగి దేవాలయాలలో శివాలయము ప్రత్యేకమైనది. ఇది ఐదు గుళ్ళ సముదాయము.ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దైవస్వరూపము (శ్రీగంగా పార్వతీ సమేత శ్రీసకల కోటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశైలమల్లిఖార్జున స్వామి, శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ షట్‌కోణ బాలత్రిపురసుందరీ దేవి, అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి కలరు. ఈ ఐదు గుళ్ళకు ఒకే ద్వారముండుట ఈ గుడి ప్రత్యేకత. అందుకే ఈగుడిని "ఐదు దేవుళ్ళ గుడి"గా పిలుస్తారు.
 2. ఈ ఆలయం శిధిలమవటంతో, గ్రామస్థులు నూతన ఆలయం నిర్మించినారు. స్వామివారి విగ్రహాలను హంపీ నుండి తెచ్చారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015 జూన్ 3 వతేదీ బుధవారంనాడు ప్రారంభించినారు. 6 వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి అష్టోత్తర కలశ అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. 7వ తేదీ ఆదివారంనాడు, తొలిగా, యంత్రబింబ స్థాపన, జీవన్యాసం, కళాన్యాసం, మహాకుంభాభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం, శ్రీ బాలాత్రిపురసుందరీదేవి, శివలింగం, ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం, భక్తుల జయజయధ్వానాలమధ్య, వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]&[7]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, పసుపు, మొక్కజొన్న, అరటి

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • విశ్వనాథ సత్యనారాయణ గారిని మున్నంగి గ్రామ ప్రజలు ఆహ్వానించి సన్మానమును జరిపెను. విశ్వనాథ వారు మున్నంగిలోని వేణుగోపాలస్వామి మీద "మున్నంగి వేణుగోపాలా!" అను మకుటముతో నొక శతకమును వ్రాసెను. అది మధ్యాక్కరలలో గలదు.
 • స్వర్గీయ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి మున్నంగిని సందర్శించి ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణను జరిపెను.
 • ఈ గ్రామానికి చెందిన శ్రీ అరిగ కోటిరెడ్డి (70) దాతృత్వంలో నిండైన మనిషి, కర్షకుడు, అన్నదాతలకు ఉత్తమ సలహాదారు. వీరు విద్యుత్తు సబ్-స్టేషను ఏర్పాటుకు కావల్సిన 60 సెంట్ల భూమిని, తను కొనుగోలుచేసి, ప్రభుత్వానికి ఇచ్చారు. పాఠశాలలో గది నిర్మాణానికి, 4 బస్ షెల్టర్లకూ, విరాళం ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవసరమైన 40 సెంట్ల స్థలాన్ని తన స్వంతనిదులతో కొనుగోలుచేసి ఇచ్చారు.
 • అభివృద్ధిలో నేను సైతం అంటూ గ్రామానికి చెందిన శ్రీ బొంతు పిచ్చిరెడ్డి , విదేశాలలో ఉంటున్న కుమారుడు, కుమార్తెల ఆర్థిక సాయంతో గ్రామంలో గ్రంథాలయ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు అందించారు. 5 లక్షల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి దోహదపడ్డారు.

గ్రామ విశేషములు[మార్చు]

 • మున్నంగి గ్రామము సర్వమతసమానమైనది. ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం.

గణాంకాలు[మార్చు]

 • జనాభా: 6597
 • పురుషుల సంఖ్య: 3325
 • స్త్రీల సంఖ్య: 3272
 • అక్షరాస్యత: 69.35 శాతం
 • పురుషుల అక్షరాస్యత: 73.77 శాతం
 • స్త్రీల అక్షరాస్యత: 64.91 శాతం
 • నివాస గృహాలు 1984
 • విస్తీర్ణం 1350 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు
జనాభా (2011) - మొత్తం 6,399 - పురుషుల సంఖ్య 3,166 - స్త్రీల సంఖ్య 3,233 - గృహాల సంఖ్య 1,957

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 14,402. Retrieved 22 September 2015. 

బయటి లింకులు[మార్చు]

[3] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013, జూలై-17; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014, ఏప్రిల్-9; 2వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013, ఆగస్టు-3; 1వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ; 2015, జూన్-1; 5వపేజీ. [7] ఈనాడు గుంటూరు సిటీ; 2015, జూన్-8; 34వపేజీ. [8] ఈనాడు గుంటూరు సిటీ; 2015, డిసెంబరు-6; 35వపేజీ. [9] ఈనాడు గుంటూరు సిటీ/తెనాలి; 2016, మే-15; 2వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=మున్నంగి&oldid=2125143" నుండి వెలికితీశారు