మున్నూరు కాపు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
- మున్నూరు కాపులు తెలంగాణా బీసీ కులాల జాబితా డి గ్రూపులో ఒక ప్రధానమైన కులం. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులు
వీరు ప్రధానంగా వ్యవసాయ దారులు, అలాగే వీరు చిన్న, సన్నకారుతో పాటు పెద్ద రైతులు.తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోతుబరి రైతులుగా భూస్వాములుగా కూడా వున్నారు వీరు గ్రామాల్లో పట్వారీ పటెళ్లుగా, పోలీస్ పటెళ్ళుగా, వుండడం వలన చాలా గ్రామాలలో వీరి ఆధిపత్యం ఉన్నది, గ్రామాలలో నాయకొళ్లుగా గ్రామాధికారులుగా పనిచేసి వున్నందున మున్నూరు కాపులు తమ పేరు చివర [పటేల్] అని పెట్టుకుంటున్నారు.
చరిత్ర
[మార్చు]- పండితుడు బాలగోపాల్ ప్రకారం, "మున్నూరు కాపులు, తూర్పు కాపులు,బలిజలు, తెలగలు, ఒంటరి కులాలను సమిష్టిగా 'కాపులు'గా సూచిస్తారు". వారు ఒకే సంఘంగా సంఘటితం కావడానికి ప్రయత్నించారు, కానీ "అది పూర్తికావాల్సి ఉంది ".[20][21
మున్నూరు కాపులు తెలంగాణలో అత్యధిక జనాభాగల ప్రధాన సామాజికవర్గం వీరి ప్రధాన వృత్తి వ్యవసాయమే అయిన కాకతీయుల కాలంలో సామంత రాజులుగా జమీందారులుగా సైనిక దళాల నాయకులుగా కొనసాగరు అలాగే బహమనీ సుల్తానుల & కులీ కుతుబ్ షాహీ కాలంలో, మరియు నైజాం పాలనలో సైనిక అధికారులుగా సుభేదారులుగా అలాగే గ్రామ అధికారులుగా గ్రామ పటేల్లుగా సుంకాలు, పన్నులు వసూలు చేసే గ్రామ నాయకొళ్లుగా [నాయికోటి తనం] పనిచేసారు, వీరు సహజంగా ఆత్మాభిమానం పౌరుషం గలవారు గ్రామ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం బలి పెట్టడానికి వెనుకాడరు వీరు కాపు కులానికి చెందిన వారు, మున్నూరు అనేది ఒక సంఖ్యా పదం మున్నూరు అనేది సంఖ్యా మాత్రమే అదీ కులానికి చిహ్నం కాదు, వీరు కాపులు తెలంగాణాలో 3 నూర్లా కాపులు అని, కర్ణాటకలో మున్నూరు రెడ్లు అనీ తమిళనాడులో నాయకర్లుగా కేరళలో నాయర్లుగా మహారాష్ట్రలో కున్భి మరాఠా బిహార్ లో కూర్మిగా పిలవబడుతున్నరు, మున్నూరు పదానికి చరిత్రలో పురాణ ఇతిహాసం వున్నదీ రామాయణ కాలంలో శిరధ్వజుడు అనగా సీత మాత తండ్రీ గారు జనక మహారాజు, ఇతను కాపు కులానికి చెందిన వారు సీత మాత స్వయంవరం ఏర్పాటు చేశారు పవిత్రమైన శివుని యొక్క ధనస్సు తమ పూజా మందిరము నుండి తేవటానికి చాలామంది సైనికులు ప్రయత్నం చేసినా వీలుపడలేదు అప్పుడు జనక మహారాజు తమ బంధువులను ఆ పవిత్రమైన శివ ధనుస్సు తెమ్మని తెలపడంతో మొదట ఒక నూరు మంది వెళ్లి ప్రయత్నం చేస్తే అది తేవటానికి వీలు పడదు తరువాత మారో నూరు మంది వెళతారు అయిన శివ ధనుస్సు లేపలేక పోతారు అల మరో నూరు మంది వెళ్లి పవిత్రమైన శివ ధనుస్సుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రయత్నం చేయడంతో శివ ధనుస్సు కదులుతుంది అల మూడు నూర్ల కాపులు ఆ ధనస్సును స్వయంవర మందిరానికి తీసుకొస్తారు ఆ పవిత్రమైన శివ ధనుస్సును తెచ్చిన మూడు నూరుల కాపులే తదనంతరం మున్నూరు కాపులుగా రూపాంతరం చెందినారని చరిత్ర కారులు కుల పెద్దలు బాశెట్టి రంగమ్మా పటేల్ గారు అలాగే సుతారి నర్సింహులు గారు తెలిపారు, *ఆధునిక కాలంలో వీరి మూల పురుషునిగా కాకతీయ సేనాని జాయాప సేనుని కొలుస్తారు. మున్నూరు కాపులకు కాకతీయులతో బంధుత్వం కలదు*
- మూడు వైపులా నీటిని ఆపి అడ్డుకట్టలు వేసి చెరువులని కట్టి వ్యవసాయం చేసిన కాపులే మున్నూరు కాపులు. మున్నూరు కాపులు వ్యవసాయంతో పాటు రాజ్యానికి అవసరం వచ్చినపుడు సైనిక సేవలు అందించారు.[హజారీ] సైనిక దళంలో పనిచేసిన మున్నూరు కాపుల ఇంటి పేరు హజారీగా స్థిరపడింది
- కాకతీయ సామ్రాజ్యంలో [రుద్రమదేవి] పాలనలోనే [బతుకమ్మ పండుగ] ప్రారంభమైనట్లు కులాలు, పండుగలు అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి డాక్టరేట్ పొందిన పి.శారద తెలిపారు. బతుకమ్మ పండుగకు ప్రధాన కారణం- రుద్రమదేవిపై ఆమె సవతి కుమారులు హరిహరమురారి దేవులు తిరుగుబాటు చేసినప్పుడు జరిగిన పోరాటంలో [హజారీ మంగమ్మ] అనే మున్నూరు కాపు కులానికి చెందిన అంగరక్షకురాలు రుద్రమదేవిని కాపాడి తను చనిపోతూ రుద్రమదేవిని బతికించినందున బతుకమ్మ పండుగను జరుపడం ఆనవాయితీగా వస్తున్నదని కాకతీయుల కాలంలో మహిళ గ్రంథంలో రచయిత యం. రాధాకృష్ణ పేర్కొన్నారు.
- [గణపతిదేవుడు] స్నేహితుడు, గజ సేనాధిపతి ఐన జాయాప సేనాని తన చెల్లెలైన నారమ్మ, పేరమ్మలని గణపతిదేవుడికిచ్చి పెండ్లి చేసిండు. యుద్ధ విద్యలలో అరితేరిన వాడే కాక [నృత్య రత్నావళి] అనే గ్రంథ రచయిత ఐన ఈ [జాయప సేనాని] మున్నూరు కాపు. మున్నూరు కాపులు నైజాం నవాబు పాలనలో సైన్యంలో చేరి అక్కడ ఉన్నత పదవులు అనుభవించారు, అలాగే వీరు ప్రధానంగా నైజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో గ్రామ అధికారులైన పట్వారీ పటేల్లుగా, పోలీస్ పటేల్లుగా గ్రామాలపై ఆధిపత్యం వహిస్తు నైజాం నవాబుకు నమ్మకంగా వుంటూ సమాజంలో ఉన్నతంగా గౌరవ ప్రదంగా తమ జీవనాన్ని కొనసాగించేవారు, కాపులు ప్రధానంగా వ్యవసాయం చేస్తూ ఉన్నత విద్య అప్పటి ఉర్దూ అరబిక్ పర్షియన్ తో పాటు తెలుగు మరాఠీ కన్నడ భాషలు అభ్యసించారు.
కాపు-ఉప కులాలు
[మార్చు]- తూర్పు కాపు (ఉత్తరాంధ్ర)
- కాపు (కోస్తా ఆంధ్ర)
- తెలగ (కోస్తా ఆంధ్ర)
- ఒంటరి (కోస్తా ఆంధ్ర)
- బలిజ (రాయలసీమ)
- బనజిగ బలిజ (కర్ణాటక)
- గవర బలిజ (తమిళనాడు)
- మున్నూరు కాపు -పటేల్ (తెలంగాణా)
రాజకీయ నాయకులు
[మార్చు]ఎల్కోటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మక్తల్ మాజీ మార్కెటింగ్ గిడ్డంగుల మంత్రివర్యులు [1]
- పి.శివశంకర్, మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి
- పీవీ రంగయ్య నాయుడు మాజీ కేంద్ర మంత్రి
- వి.హనుమంతరావు ఆంధ్ర ప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు
- ధర్మపురి శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు
- కే. కేశవరావు ఆంధ్ర ప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు
- పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు
- కె. లక్ష్మణ్ బిజెపి జాతీయ బిసి మోర్చా అధ్యక్షులు
- బండి సంజయ్ కుమార్ ఎంపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షులు
- ధర్మపురి అరవింద్ ఎంపీ
- గంగుల కమలాకర్ మంత్రి
- కొండా సురేఖ మాజీ మంత్రి
- జోగు రామన్న మాజీ మంత్రి
- దానం నాగేందర్ మాజీ మంత్రి
- వనమా వెంకటేశ్వరరావు మాజీ మంత్రి
- బండి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు భారత జనశక్తి పార్టీ (INDIA JANSHAKTI PARTY-IJP) తెలంగాణ రాష్ట్రం
- Gangula Kamalakar ex minister
- కీర్తిశేషులు బొమ్మ వెంకన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనమండలి ఇందుర్తి నియోజకవర్గం
- బొమ్మ శ్రీరామ చక్రవర్తి న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి
మూలాలు
[మార్చు]- ↑ "10.1063/1.4831988.4". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2024-10-19.