తూర్పు కాపు
| తూర్పు కాపు మరియు గాజుల కాపు | |
|---|---|
| వర్గీకరణ | ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా |
| మతాలు | హిందూమతం |
| వాస్తవ రాష్ట్రం | కళింగ రాజ్యం ( ఆంధ్రప్రదేశ్,ఒడిశా,తెలంగాణ,ఛత్తిస్గడ్ ) |
| జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఒడిశా, ఛత్తిస్గడ్ |
| జనాభా | 16 లక్షలు |
| Subdivisions |
(వ్యవసాయధారులు, గ్రామాధికారులు),
(గాంగ భూపతులు, గాంగులు, మాన్యరాజులు, గాంగరాజులు (ఏలికలు, మొఖాసాదార్లు, వ్యాపారులు),
(సైనికులు, సామంతులు),
|
| Reservation (Education) | బి.సి-డి |
| Reservation (Employment) | బి.సి-డి |
తూర్పు కాపు మరియు గాజులకాపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం.
[1] భారతదేశంనకు తూర్పు ప్రాంతంలో నివసించు కాపులను తూర్పు కాపులు అంటారు. వీరినే ఆంధ్రప్రదేశ్ కు ఉత్తర ప్రాంత భూభాగమున నివసించుట చేత ఉత్తరంద్రా కాపులనీ, పూర్వ కళింగ రాజ్యమున నివసించుట చేత కళింగాంద్రా కాపులు లేక కళింగ సీమ కాపులు అని పిలవబడుతున్నారు. వీరిని ఒరిస్సా లో కాంపులు అని ఆంధ్రప్రదేశ్ లో కాపులు అని సంభోదిస్తారు.
చరిత్ర
[మార్చు]కాపు అనగా రక్షకుడు (protector) అని పురాతన కాల నిర్వచనం . వీరు చాలా శాతబ్దాలకి పూర్వము కాంపిల్య నగరం నుండి వచ్చిన కాంపు వారని ప్రతీతీ. చాలా శాతాబ్దాలు గడిచిన పిదప స్థానికులుగా గుర్తింపునొందిరి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రా ప్రాంతంలో స్థానిక కులాలలో నుండు తూర్పు మరియు పడమర అను దేశీయ భేదమే కాపులలోనూ ఏర్పడినది. నవీన కాలమున వలస వచ్చిన కులాలలో ఇట్టి భేదము కానరాదు. తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న కాపులను తూర్పుకాపులు అంటారు. వీరులో అత్యధికులు సైన్యంలో పనిచేస్తూ ఉత్తరాంధ్రా ప్రాంతంలో చాలా గ్రామాలకు పెద్దలుగా వ్యవహరించడం వలన నాయుడోరు ( మధ్యాంద్రా జిల్లాలో గ్రామ పెద్దను పెదకాపు అంటారు ) అని తూర్పు నాయుళ్ళని, అంటారు. అనంతర కాలంలో కాపులు వ్యవసాయన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయటం వలన కాపు అంటే వ్యవసాయదారుడు(పంటకాపులు) అని కూడా అంటూవుంటారు. ఈ కాపులనుండే వీడిపోయి చాలా కులాలు ఏర్పడ్డాయని చరిత్రకారుల అభిప్రాయం. నాయుడు అనేది తూర్పు కాపుల బిరుదు . వీరితో పాటు గాజుల కాపులు(వణిజులు, మొఖాసాదార్లు) అనువారు కలరు వారు చరిత్రకంగా గంగభూపతులుగా చెప్పుకొందురు.వీరు పూర్వము మాన్యరాజులు మరియు కాపురాజులుగా కీర్తి నొందిన వారు. అనంతర కాలంలో వీరు సైనికులుగాను, మొఖాసాధార్లుగాను మరియు గ్రామ పెద్దలుగాను అత్యధిక గ్రామాలకు గ్రామాధికారులు(మున్సబ్లు,నాయుడువారు)గా కూడా చేసారు. మరియు వీరు పూర్వము గాజులు తయారుచేసి అమ్మకం చేసే వారు, నేడు వీరు గాజుల వ్యాపారం వదిలి బంగారు నగల వాణిజ్యంలోను మరియు వివిధ వ్యాపారములను చేస్తున్నారు. వీరులో కొందరు బంగారు నగల తయ్యారి యందు ప్రావీణ్యము పొంది స్వర్ణకార వృత్తి చేస్తున్నారు. ఇంకొందరు వ్యవసాయం కూడా చేయుదురు. వీరు గాజుల వారు, గంగభూపతులు (గాంగులు), గాజుల నాయుడోరు, గాజులవణిజులు, గాజుల కాపు వారు, గాజు కాపు వారు, కాపురాజులు, మాన్యరాజులు, అని పిలవబడుతున్నారు. వీరి నుండి ఏర్పడిన వారే పాత్రుడు కాపులు (విజయనగరం రాజులకు నమ్మకస్తులైన(పాత్రులైన) కాపు సైనికులు) వీరే అయ్యారిక కాపులు (గ్రామ అయ్యావార్లు) వీరికి పాత్రుడు బిరుదు కలదు నేడు వీరు ప్రత్యేకంగా గుర్తించబడుచున్నారు. ఉత్తరాంధ్రలో మహానాటి కాపులు (పెదకాపు లేదా నాయుడోరు) అను వారు కూడా గాజులకాపు వారే. ఆంధ్ర ప్రాంతమున గాజుల కాపు వారికి నాయుడు, పాత్రుడు అనునవి బిరుదు నామములు. ఒరిస్సా ప్రాంతమున నివసిస్తున్న గాజుల కాపులకు నాయుడు, దేవు, ప్రధాన్, పాత్రుడు అను బిరుదు నామములు ఉన్నాయి. ధరస్ట్రన్ రచించిన క్యాస్ట్ & ట్రైబ్స్ అను పుస్తక సంపుటలలో కాపు విభాగంలో గాజుల వారిని ప్రస్తావిస్తూ వీరికి గోష వున్నదని వీరు వ్యాపారం విడిచి వ్యవసాయం పై ఆధారపడడం ప్రారంభించిన తరువాత గాజులకాపులని వ్యవహారిస్తున్నారని కానీ వీరు పూర్వము బలిజలని తెలపడం జరిగింది.
విస్తరణ
[మార్చు]ఉత్తరాంధ్రలో అత్యధిక సంఖ్యాకులు తూర్పుకాపులు / గాజులకాపులు రెండు శాతాబ్దల పూర్వం గంగభూపతులుగా, సైనికులుగా, వ్యాపారులుగా, భూస్వాములుగా ఎంతో ఉన్నతమైన జీవనంతో సామజిక గౌరవం పొందిన వీరు ఒకొక్క శాతాబ్దనికి ఒకొక్క మెట్టు దిగుతూ గత శాతాబ్దన్నర కాలంగా వీరు జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారి ఎకరం నుండి ఐదు, పది ఎకరాల సన్నకారు రైతులుగా మారడం, వర్షాదార పంట వలన కరువులు ఏర్పడిన సందర్భంలో ఉత్తరాంధ్రను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు గణనీయంగా వలసపోయి వ్యవసాయ కవులు దారులుగా, వ్యవసాయ కూలీలుగా ఇతర పనులయందు జేరి ఆర్థిక, సామాజిక వెనకభాటుకు గురైనారు . తూర్పుకాపులు మరియు గాజులకాపులు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తెలంగాణలో హైదరాబాద్, ఒడిస్సాలో గంజాం, గజపతి, రాయగడ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తూర్పుకాపు /గాజులకాపు జనాభా 16 లక్షలు మాత్రమే[2] కానీ వారి సంఖ్య 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటారని ఆ కుల సంఘము వారు తెలుపుచున్నారు.
రిజర్వేషన్లు
[మార్చు]తూర్పుకాపు / గాజులకాపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం. రిజర్వేషన్గకు పూర్వము వీరు కాపు వారిగా అగ్రవర్ణ జాభితాలో ఉండెడివారు. ఉత్తరాంధ్రలో వర్షాదార పంటల వల్ల వీరి యొక్క ఆర్థిక వెనుకబాటు కారణంగా వీరికి వున్న కొద్దిపాటి భూములను అమ్ముకుని వలసలు వెళ్ళుట వలన సామజిక వెనకబాటుకు లోనైనారు అది గమనించిన మాన్యులు లుకలాపు లక్ష్మణదాస్ గారు, గొర్లె శ్రీరాములనాయుడు గారు మొదలగువారు ఉత్తరాంధ్రాలో నివసిస్తున్న కాపులను వెనుకబడిన తరగతులలో చేర్చేందుకు ప్రయత్నించసాగారు. వారికి పుంజాల శివశంకర్ గారి సహాయ సహకారాలు, సూచనలుతోడై అప్పటి వరకు కాపువారిగా అగ్రకులంగా ఉన్న వీరిని తూర్పు, పడమర దేశీయ భేదాన్ని మరియు ఆర్ధిక, సామజిక వెనకబాటును ఆధారంగా చేసుకొని తూర్పు ప్రాంత కాపు వారిని తూర్పు కాపు పేరుతో బీసీ (డి ) రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆనాటికి పడమటి కాపు వారు కాలువ ఆధారిత పంటల కారణంగా వారి జీవన స్థితిగతులు మెరుగుగా ఉండుట చేత వారు బీసీలుగా గుర్తింపబడెందుకు ఇష్టపడక పోవుటచేత కాపు పేరుతో ఓసీ లుగానే ఉంచడం జరిగింది. అనంతర కాలంలో ఓసీలుగా ఉండిపోయిన కాపులు తెలగలతో కొంత సంబంధభాంధవ్యలు కలిగివుండుటచేత తెలగలతో పూర్తిగా ఏకీకృతం అయినారు. కొంతకాలనికి గాజుల వారు కూడా తూర్పుకాపులతో జేరి గాజులకాపు పేరుతో బీసీలుగా గుర్తించబడినారు. కానీ బీసీ లలో ఏ, బి, సి, డి వర్గీకరణలో ' డి ' కి అంతగా అవకాశాలు లేకపోవడంతో వీరు ఆశించినంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. కావున వీరు తమని బీసీ (ఏ ) జాబితాలో చేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నారు.
ప్రముఖులు
[మార్చు]సినీ ప్రముఖులు
[మార్చు]- కోరాడ సింహాచలం ( ఆంధ్రా దిలీప్ కుమార్ ) (సంబరాల రాంబాబు సినిమా ఫేమ్ చలం )
- కోడి రామకృష్ణ ( సినీ దర్శకుడు, నటుడు )
- గంట్ల రామకృష్ణ ( సినీ నటుడు ) (పూజ, నోము సినిమాల పేమ్ )
- అలమండ పాండురంగస్వామి ( ఏలేశ్వం రంగా ) ( సినీ నటుడు )
- సారిక రామచంద్రరావు ( సినీ నటుడు )
- శివాల ప్రభాకర్ (సినీ దర్శకుడు )
- కొంగరాపి వెంకటరమణ (సినీ దర్శకుడు )
- కరుమజ్జి శివ నాగేశ్వరావు ( సినీ దర్శకుడు )
- మీసాల కోట మావుళ్ళయ్య ( సినీ నిర్మాత )
- వాకాడ అప్పారావు ( సినీ నిర్మాత )
- కొంగరాపు రాంబాబు ( సినీ దర్శకుడు )
- మామిడి సూర్యతేజ ( సినీ నటుడు )
- గేదలు ఆనందబాబు ( g ఆనంద్ ) ( సినీ గేయ రచయిత )
- కరుమజ్జి సత్యన్నారాయణ (సినీ నిర్మాత )
- ఎస్ ఎస్ రవిచంద్ర (సారిక శ్రీ రవిచంద్ర ) (సినీ దర్శకుడు )
- అట్టాడ సృజన్ (సినీ దర్శకుడు)
- లుకలాపు రాహుల్ శ్రీనివాస్ (సినీ దర్శకుడు)
వ్యాపారవేత్త
[మార్చు]- లోలుగు మదన్ ( ఒన్ అఫ్ థ ఫౌండర్ అఫ్ అడాప్ట్ చిప్స్ )
- గేదల శ్రీనుబాబు ( ఫౌండర్ అండ్ సి ఇ ఒ అఫ్ పల్సస్ )
- కొరికాన రవికుమార్ (హెచరీస్ ఇన్ పాండిచ్చేరి)
కవులు-రచయితలు
[మార్చు]- ఎడ్ల రామదాసు (తత్త్వవేత్త-రచయిత)
- అట్టాడ అప్పలనాయుడు (రచయిత)
- గంట్యాడ గౌరినాయుడు (రచయిత)
- గార రంగనాధం (రచయిత)
- వావిలాపల్లి జగన్నాధనాయుడు (వక్త & రచయిత)
విద్యా సంస్థలు
[మార్చు]• సీతమ్స్ కాలేజీ (విజయనగరం)
• జెవై డిఫెన్స్ అకాడమీ (విశాఖపట్నం)
కళాకారులూ-క్రీడాకారులు
[మార్చు]- ఎడ్ల గోపాలరావు (పౌరాణిక నాటక కళాకారులు)
- కోరాడ నరసింహారావు (నాట్య కళాకారులు)
- మజ్జి దేవిశ్రీ (జానపద కళాకారులు)
దేవతలు-పేరంటాళ్ళు
[మార్చు]- మజ్జి గౌరమ్మ (రాయగడ)
- సానిపల్లి సన్యాసమ్మ (దిమిలి,యలమంచిలి మండలం)
రాజకీయా నాయకులు
[మార్చు]- కీ శే గొర్లె శ్రీరాములు నాయుడు (మాజీ మంత్రి)
- కీ శే లుకలాపు లక్ష్మణ దాస్ ( మాజీ ఎమ్మెల్యే )
- కీ శే దారపు లచ్చన్న నాయుడు (మాజీ ఎమ్మెల్యే, ఒడిస్సా )
- కోడూరి నారాయణరావు (మాజీ ఎమ్మెల్యే, ఒడిస్సా )
- కర్రి నారాయణ రావు, (మాజీ ఎంపీ)
- కీ శే తాడ్డి సన్యాసినాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే ధర్మాన నారాయణ రావు నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే కోట్ల సన్యాసి అప్పలనాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- పాలవలస రాజశేఖరం (మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే)
- కెంబూరి రామ్మోహన్ రావు (మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే)
- కొండపల్లి పైడితల్లి నాయుడు (మాజీ ఎంపీ)
- కీ శే తాడ్డి వెంకట్రావు (మాజీ ఎమ్మెల్యే )
- డోలా సీతారాములనాయుడు
- బొత్స ఝాన్సీ లక్ష్మి (మాజీ ఎంపీ) )
- బొత్స సత్యనారాయణ (రాష్ట్ర మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ)
- పతివాడ నారాయణస్వామి నాయుడు (మాజీ మంత్రి)
- కిమిడి కళా వెంకటరావు (మాజీ మంత్రి, టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు మాజీ అధ్యక్షుడు)
- కిమిడి మృణాళిని (మాజీ మంత్రి)
- పాలవలస సంఘమ నాయుడు
- బడ్డుకొండ అప్పల నాయుడు ( మాజీ ఎమ్మెల్యే)
- డోల జగన్
- కొండపల్లి అప్పల నాయుడు (ఎమ్మెల్యే)
- మజ్జి చిన్న శ్రీను (జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం )
- కొండపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే )
- కలమట మెహనరావు
- కలమట వెంకటరమణ
- మీసాల గీత
- రౌతు సూర్యప్రకాష్ రావు (మాజీ ఎమ్మెల్యే )
- రెడ్డి అప్పలనాయుడు
- కలిశెట్టి అప్పలనాయుడు (ఎంపీ )
- మీసాల నీలకంఠం నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే బొత్స ఆదినారాయణ (మాజీ ఎమ్మెల్యే )
- బొత్సా అప్పలనరసయ్య (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే గొర్లె హరిబాబు నాయుడు (మాజీ ఎమ్మెల్సీ )
- గొర్లె కిరణ్ కుమార్ నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- పొట్నూరు సూర్యనారాయణ నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- ముదిలి బాబూ పరాంకుశం నాయుడు ( మాజీ ఎమ్మెల్యే )
- బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు ) (మాజీ ఏంపి )
- కొరికాన రవికుమార్ (suda చైర్మన్ )
- దర్మేంద్ర ప్రధాన్ ( ఒడిస్సా )
- దేవేంద్ర ప్రధాన్ ( ఒడిస్సా )
- కరణం ధర్మశ్రీ (ఎమ్మెల్యే )
- మామిడి గోవిందరావు (ఎమ్మెల్యే పాతపట్నం )
- రెడ్డి శాంతి
- బంక కోదండ రాంబాబు (రామ్) ఏలేశ్వరం
- తాడ్డి శకుంతల (ex మేయర్ అఫ్ విజయవాడ )
- బలగం సేతుబంధన సీతారామం ( ex చైర్పర్సన్ అఫ్ తణుకు )
- మేరగాని నారాయణమ్మ (ex చైర్పర్సన్ అఫ్ భీమవరం )
- గమిడి సూర్యారావు ( ex చైర్పర్సన్ అఫ్ పాలకొల్లు )
- పతివాడ నూక దూర్గారాణి ( చైర్పర్సన్ అఫ్ మండపేట )
- శిడగం పాపారావు ( ex ఛైర్పర్సన్ అఫ్ పాలకొల్లు )
- శ్రీమతి పాలవలస యశస్వి (చైర్ పర్సన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్)
- దారపు జ్యోష్ణ (శ్రీకాకుళం ఏఎంసీ చైర్మెన్ )
- కోడిగుడ్ల రవి కుమార్ (పొలిటికల్ అనలిస్ట్ )
- అలమండ సత్యవతి చలమయ్య (మున్సిపల్ చైర్మన్ ఆఫ్ ఏలేశ్వరం)
మూలాలు
[మార్చు]- ↑ "Caste in Andhra". www.vepachedu.org. Retrieved 2020-09-25.
- ↑ Rao, K. Srinivasa (2022-12-28). "Turpu Kapu association demands BC-A status for community". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-30.