Jump to content

మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల పటం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేజీని సాధారణ వ్యాస పేజీగా పరిగణించకూడదు

[మార్చు]
తరలించారు

పేజీని మూస పేరుబరి లోకి తరలించాలని నిర్ణయించారు

కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

పటం పేజీని ప్రత్యేక పేజీగా పరిగణించాలని క్రింది కారణాల దృష్ట్యా కోరుతున్నాను

  • ఈ పటాలను ఒకటి కంటె ఎక్కువ వ్యాసాలలో వాడుకోవచ్చు.
  • ఈ పటాలలో {{Location map}} లాంటి క్లిష్టమైన మూసలు వాడబడ్డాయి.
  • ఈ పటాల కోడ్ నేరుగా వ్యాసంలో చేరిస్తే, మామూలు సవరణలు చేసేవారికి అసౌకర్యంగాను, ఎవరైనా పొరబాటున ఈ కోడ్ లో సవరణలు చేస్తే వ్యాసం దెబ్బతింటుంది.

కావున ఈ పేజీలో, ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల పటం లో {{మొలక}} తొలగించమని User:Chaduvari గారిని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:18, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, అలాంటపుడు ఇది "మూస"గా ఉంటే మంచిది కదా! దానివలన కింది ఉపయోగాలున్నై:
  1. మీరనుకున్న పై మూడు లక్ష్యాలనూ ఇది సాధిస్తుంది.
  2. మూస పేరుబరి ఉన్నదే అందుకు
  3. అప్పుడు ఈ మొలకల సమస్యలేమీ రావు.
పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 00:58, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మూసతో పాటు ప్రధానపేజీలోని వివరాన్ని కూడా ఇతరపేజీలలో చేర్చే సదుపాయం కూడా వున్నందున, ఇది మెరుగైనదని భావించి వాడాను. దానికి ప్రధాన కారణం ఏమంటే, ప్రధానపేరుబరిలో పేజీ గూగుల్ ఫలితాలలో కనబడుతుంది. పటం కావున, ఈ పేజీ నేరుగా చూసిన అర్ధవంతమవుతుంది. లింకులు ద్వారా ఇతర వ్యాసాలకు వెళ్లగలుగుతారు. ఇటువంటి పేజీలు పరిమితంగానే వుంటాయి, కావున సమస్యకాదు. ఇక మొలకలుగా నిర్ణయించడానికి ఇప్పటికే జాబితాలకు లాంటి వాటికి మినహాయింపులు వున్నాయి. అదే విధంగా పటం అనే పేజీలకు మినహాయింపు ఇవ్వాలని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 22:06, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, మీరు చెప్పిన కారణం -
"దానికి ప్రధాన కారణం ఏమంటే, ప్రధానపేరుబరిలో పేజీ గూగుల్ ఫలితాలలో కనబడుతుంది. పటం కావున, ఈ పేజీ నేరుగా చూసిన అర్ధవంతమవుతుంది. లింకులు ద్వారా ఇతర వ్యాసాలకు వెళ్లగలుగుతారు." - అని అన్నారు. ఇది మూస పెట్టినా జరుగుతుంది. గూగుల్ చూస్తుంది. ఆ లింకులకు వెళ్తుంది. వాడుకరులూ చూస్తారు, వాళ్ళూ ఆ లింకులకు వెళ్ళగలుగుతారు. కాబట్టి, మూస పెట్టకపోవడానికి మీరు చెప్పిన కారణాలు సబబుగా లేవు.
దీన్ని మూసగా మార్చాలన్న నా అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. దాని పట్ల మీకు ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి. __ చదువరి (చర్చరచనలు) 03:43, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: గారు, కొన్ని మూసల పేర్లను గూగుల్ వెతికి చూశాను, మీరు చెప్పినట్లు కనబడుతున్నాయి కాని మూస అనే సాధారణ తెలుగు వాడుకరికి పరిచయంలేని పదంతో కనబడుతున్నాయి. కావున ప్రధాన పేరుబరిలో ప్రత్యేక వ్యాసం అదే పేరుతో వచ్చేంతవరకు, ఇవి ఇలా వుండడమే మంచిది. ఏదైనా సౌలభ్యానికి వివిధ రకాలున్నప్పుడు, వాటిలో కొన్ని కొంతవరకు మెరుగైనప్పుడు, వికీ అభివృద్ధికి నిరోధం కానప్పడు, ఒకే పద్ధతి వాడాలనడం, వికీస్పూర్తి కి భిన్నం అని నా భావన. కావున ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు వికీ పద్ధతులను అవలంబించి, ఫలితం ప్రకారం సవరించితే నాకు అభ్యంతరంలేదు. అర్జున (చర్చ) 22:08, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, "కొన్ని మూసల పేర్లను గూగుల్ వెతికి చూశాను, మీరు చెప్పినట్లు కనబడుతున్నాయి కాని మూస అనే సాధారణ తెలుగు వాడుకరికి పరిచయంలేని పదంతో కనబడుతున్నాయి." అని రాసారు. ఏంటి ఈ కారణం? అసలు గూగుల్లో మూస అనేది కనబడకూడదా? మీ అభిప్రాయం ప్రకారమైతే మూస అనే పేరుబరిని తీసెయ్యాలి. ముందు ఇక్కడ రాసేది సరిగ్గా రాసామా లేదా అనేది ముఖ్యం. గూగుల్లో కనబడుతోందా లేదా అనేది తరవాతి సంగతి.
మూసగా చెయ్యాల్సినదాన్ని మీరు ప్రధాన పేబరిలో పెట్టారు. అది పొరపాటు. దానికి సమర్ధనగా ఒక్క కారణమూ మీరు చెప్పలేకపోయారు. పొరపాటు చేసేందుకు మీరు ఏ ఏకాభిప్రాయమూ తీసుకోలేదు. దాని సరిచేసేందుకు మాత్రం ఏకాభిప్రాయం కావాలా!!? మీ వాదన సరిగ్గా లేదు.__ చదువరి (చర్చరచనలు) 00:54, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను చెప్పిన కారణం మీకు సమ్మతం కానందున, అది వికీపీడియా సముదాయానికి సమ్మతం కాదని అర్ధం కాదు. కావున ఏకాభిప్రాయం దిశగా చర్యలు తీసుకొని ఫలితం వచ్చేంతవరకు, మీరు చేర్చిన హెచ్చరిక మూస వలన తెవికీలో ఒక ప్రముఖ వ్యాసమైన ఆంధ్రప్రదేశ్ వ్యాస రూపు దెబ్బతింటున్నందున, దయచేసి మీరు చేర్చిన హెచ్చరిక మూసలు తొలగించండి. --అర్జున (చర్చ) 22:03, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, దీన్ని మూసగా ఎందుకు చెయ్యలేదో, ప్రధానబరి వ్యాసంగా ఎందుకు ఉంచాలో ఇంతవరకు ఒక్క కారణమూ చెప్పలేదు. పైగా ఒక మొలక వ్యాసాన్ని సృష్టించి, దాన్ని మొలకగా పరిగణించకూడదని అంటున్నారు. మొలక వ్యాసాన్ని మొలక అనకూడదని కొత్త నిబంధన తెస్తున్నారు, ఇది మొలక విధానానికి విరుద్ధం. మరొక్క రోజు చూసి, మీరు కారణం చెప్పకపోతే దీన్ని తరలిస్తాను. __ చదువరి (చర్చరచనలు) 02:20, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, నేను చెప్పిన కారణాలను, చేసిన అభ్యర్ధనను ఎందుకు త్రోసిపుచ్చుతున్నారో ముందుగా తెలపండి. సహాయం:Transclusion ప్రకారం ప్రతిక్షేపణ(Transclusion) కొరకు కేవలం మూస పేరుబరి మాత్రమే వాడాలని లేదు. తెలుగు వికీలో అటువంటి నియమం చేసినట్లు నాకు తెలియదు. అందువలన నేను చేసిన దానిని తప్పు అని ఎందుకంటున్నారు? అర్జున (చర్చ) 23:35, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పేరులో పటం అని స్పష్టంగా వున్నందున, దీనిని సాధారణ వ్యాసంగా పరిగణించవద్దని, జాబితాల పేజీలను సాధారణ వ్యాసంగా ఎలా పరిగణించుటలేదో అలానే వీటిని పరిగణించవద్దని నేను చేసిన అభ్యర్ధనని ఎందుకు త్రోసిపుచ్చుతున్నారు. వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం సాధారణ వ్యాసాలకు వర్తిస్తుందే కాని జాబితాలకు, అటువంటి పేజీలకు (ప్రస్తుత చర్చలోని పటం పేజీ ఉదాహరణ) వర్తించదు కదా. అర్జున (చర్చ) 23:39, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఒక్క రోజు గడువు విధించడం, కారణం చెప్పకపోతే తరలిస్తాననడం, తెవికీలో చర్చలు సామరస్యపూర్వకంగా కొనసాగటానికి సహకరించవు. ఈ వివాద పరిష్కారానికి వికీపీడియా:వివాద_పరిష్కారం#మధ్యవర్తిత్వం ప్రకారం, నా దృష్టిలో సహాయం చేయగల నిర్వాహకుడు రవిచంద్ర గారిని మధ్యవర్తిత్వం చేయమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 23:48, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూసగా మార్చాలి. ఇటువంటిదే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం అనే వ్యాసం ఉంది. దీనిని కూడా మూసగా మార్చాలి. -- K.Venkataramana -- 03:49, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి , వెంకటరమణ గారల అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.ఇది ప్రధాన పేరిబరిలో ఉండతగినది కాదు.మూసగా తరలింపు చేయాలనే చదువరి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.ఇది ఒక్కటే కాదు అలాంటివి ఎన్ని ఉన్ననూ ఇదే చర్యలు గైకొనాలి. యర్రా రామారావు (చర్చ) 05:00, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికీ నమస్కారం, పై విషయంలో అందరితోనూ ఏకీభవించలేను, అలా అని పూర్తిగా వ్యతిరేకించలేను, అంశాల వారీగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

1. మొలక అనే వ్యాసం తెలుగులో ఉండకూడదు అనేది సమర్ధనీయం కాదు, కొన్ని పేజీలు అలా ఉండడం కూడా సమంజసమే అందుకు ఉదాహరణ ఇతర భాషల్లో కూడా మొలకలు అనేవి చాలా ఉన్నాయి. హిందీలోనూ, ఇంగ్లీషులోనూ, కన్నడంలోనూ, కోకొల్లలుగా ఉన్నాయి.

2. కొన్ని పదాలు మన తెలుగుతో పిలవడం, కాల్బంతి ఫుట్బాల్ అంటేనే అర్థమవుతుంది కాలు బంతి అని మనం అందులో ఉన్న వ్యాసంలో కొన్ని వాక్యాలు చదివితే కానీ అర్థం కాదు. వికీపీడియాలో కొంత అనుభవం వచ్చాక మూస అంటే అర్థం అవుతుంది కానీ, కొత్తవారికి అర్థం కాదు.

3. సందర్భం వేరే కావచ్చు కానీ దానికి ఉదాహరణ కొంత సంబంధం ఉంది మరియు అనే పదం యొక్క అనేది విపరీతంగా వాడితే తప్పు కానీ నిషేధిత పదం అవడం సరి అయింది కాదు, వికీపీడియాలో ఏ పని అయినా మనకు అనుకూలంగా ఉండాలి కానీ, అలా ఉండటం లేదు అని అనుమానం.

4. పటం అని వ్యాసం పేరులో ఉండటం తొలగించాల్సిందే, వ్యాసంలో ఉన్న పటం కింద ఈ వ్యాసం పేరు పెట్టాలి. ఆ పటం కింద ఉన్న వాక్యాన్ని వ్యాసం పేరు పెట్టాలి. వ్యాసం పేరు దారి మార్పు లేకుండా తిప్పండి.

5. కేవలం పటం చేర్చి ఇది ఖాళీ ఉండాలంటే అంటే కూడా సమంజసం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయా స్థలాల గురించి అంటే విమానాశ్రయాలు ఉన్న ప్రదేశాల గురించి నాలుగు వాక్యాలు రాస్తే సరిపోతుంది, నౌకాశ్రయాల గురించి నాలుగు వాక్యాలు రాస్తే సరిపోతుంది.

6. ఆయా పేజీల్లో పటం అనే పదం తొలగించాక ఆ నాలుగు వాక్యాలు ఎవరైనా రాయవచ్చు, అవకాశం ఇస్తే నేను అయినా రాస్తాను. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 10:05, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

  1. @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ,
    1. మొలక అనేది తెవికీలో ఉండకూడదని ఎవరూ అనలేదు. అసలు ఇక్కడి సమస్య అది కాదు. ఒక మొలకను తెచ్చి ఒక పెద్ద పేజిలో పెడితే 2 లక్షల బైట్లున్న ఆంధ్రప్రదేశ్ అనే వ్యాసం మొలక అయిపోయింది. సమస్య అది. ఆ మొలక అసలు అక్కడ ఉండాల్సినది కాదు. అది మూస పేరుబరిలో ఉండాలి -అదీ సమస్య.
    2. మూస అనేది కొత్తవారికి అర్థం కాదు అని మీరు రాసారు. అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే ఆ మూస పేజీ మాతృవ్యాసంలో ట్రాన్స్‌క్లూడు అయిపోయాక అది మూసా మరోటా అనేది పాఠకుడికి తెలియనే తెలియదు. ప్రస్తుతం కొన్ని వేల మూసలు, మరికొన్ని వేల పేజీల్లో ట్రాన్స్‌క్లూడు చేసి ఉన్నై. ఏ పెద్ద పేజీలోనైనా చూడండి, కనీసం ఒక్కటైనా మూస ట్రాన్స్‌క్లూడై ఉంటుంది. పాఠకుడికి ఆ సంగతి తెలుస్తోందనుకుంటున్నారా.. లేదు! ఇంకొకటి ఆలోచించారా ..ఒక పాఠకుడు వికీ వాడుకరిగా నమోదయ్యీ కాగానే వారిని ఆహ్వానించడానికి మనం వాడుతున్నది ఒక మూస! మరి అది వారికి అర్థం కాదు అని మీరు చెప్పేదే కరెక్టైతే, వారికి మనం పలుకుతున్న స్వాగతం వారికి పనికి రావడం లేదన్న మాటేనా? (కేవలం ఆహ్వానించే మనకు దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోడానికి మాత్రమే పనికొస్తోందన్న మాటేనా?)
    3. వ్యాసంలో పటం అనే పేరు ఉండకూడదు అని అన్నారు మీరు. ఉంటే తప్పేంటి? అది కేవలం ట్రాన్స్‌క్లూడు చేసేందుకే సృష్టించిన పేజీ అయితే, దానికి పేరు ఏదుంటే పాఠకుడికేంటి? ట్రాన్స్‌క్లూడు చేసేవారికి ఆ పేరు అర్థమైతే చాలు. కదా?
    ఇక మీరు రాసిన మిగతా పాయింట్లలో ఒకటి ఈ చర్చకు సంబంధం లేనిది. మిగతావి పెద్దగా పట్టించుకోనక్కర్లేనివి.
    మూస గురించి మళ్ళీ ఒక్కసారి చెబుతాను సార్.. మూస అనేది మళ్ళీ మళ్ళీ వాడుకునే అవసరాలున్న పేజీ. ఆ పేరుబరి ఉన్నదే అందుకు. ఒకసారి మూసను తీసుకెళ్ళి ఏదైనా పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసాక, ఆ పేజీని చదివే పాఠకుడికి సంబంధించిన వరకు ఆ మూసకు విడిగా అస్తిత్వమేమీ ఉండదు. కాబట్టి ఆ పాఠకుడికి "మూస" అర్థం కాదు అనే వాదనకు ఆస్కారమే లేదు. గ్రహించగలరు. __ చదువరి (చర్చరచనలు) 11:42, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, మీ స్పందన చేర్చినందులకు ధన్యవాదాలు. వ్యాసం చేసినపుడు మూసలాగా చేయవచ్చని తెలిపారు. రెండవది జాబితాలాగా ఎందుకు మినహాయింపు ఇవ్వకూడదు. లేదా ఆ వ్యాసం అంత వరకు ఇలానే వుంటే ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్న. ఒకే ఒక్క పద్దతిలో ఎక్కువ వ్యాసాల్లో చేర్చే సమాచారం ఎక్కువనే ఎందుకుండాలి అనేది ప్రధాన ప్రశ్న. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:19, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గారూ మీరు సమస్యనే సరిగ్గా అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తోంది. ఈ పేజీ ఉండాల్సిన పేరుబరి, మూస. కానీ అందులో సృష్టించకుండా ప్రధాన పేరుబరిలో సృష్టించడం ఏంటి? అలా సృష్టించి.. దాన్ని జాబితా లాగా చూడొచ్చు గదా.., మొలక మూసను తీసేయొచ్చు గదా.. అని అడుగుతున్నారు. సార్ ఏంటండీ ఇది.. మీరు తప్పు చేస్తారు, ఎవరైనా ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును సవరించుకోరు, అది తప్పు అని వాళ్ళు అసలు చెప్పకూడదు అని అంటున్నారు మీరు. ఆలోచించండి, ఇది సబబేనా? చదువరి (చర్చరచనలు) 13:32, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని ఇంత చర్చ అవసరం లేదు. వికీ విధివిధానాలు తెలియని వారికైతే చర్చల ద్వారా విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ ఈ వ్యాసంలో ఒక పటం తప్ప ఇంకేమీ సమాచారం లేదు. దీనిని మూస పేరు బరిలో ఉంచాలని వికీ అనుభవమున్న విజ్ఞులకు తెలియదా! దీని కోసం అనవసర వాదన అనవసరం. ఒక్క రోజులో ఈ వ్యాస సృష్టికర్త తమ అభిప్రాయాన్ని తెలియజేయనిచో దీనిని మూస పేరుబరిలోకి మార్చవచ్చు.-- K.Venkataramana -- 15:01, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, వెంకటరమణ గారు, హెల్ప్ ట్రాన్స్‌క్లూడు చదివానండి, ఇలాంటివి సాధారణంగా మూస బరిలోనే ఉంచాలని ఉంది. కానీ ప్రధాన పేరుబరిలో అసలు పెట్టకూడదని మాత్రం లేదు. ఇంతగా ఎందుకు చర్చిస్తున్నాం అంటే, నేను నేర్చుకోవాలి హెల్ప్ ట్రాన్స్‌క్లూడు గురించి మరింత అవగాహన కోసం మాత్రమే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 15:35, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, మీ తాజా వాదనతో, అసలు అంశం మరుగున పడినట్లుగా నాకు తోస్తోంది. (దీన్ని ప్రధానబరిలో ఉంచొచ్చా, ఉంచకూడదా అనేది అసలిక్కడ సమస్య కానే కాదు.) అంచేత చర్చను మళ్ళీ గాట్లో పెడతాను.

  1. మీరు ఈ మొలక పేజీని సృష్టించి, దాన్ని ఆంధ్రప్రదేశ్ పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసారు.
  2. అది మొలక స్థాయిలో ఉంది కాబట్టి, దానికి మొలక మూస పెట్టాను. దాంతో ఈ పేజీని ట్రాన్స్‌క్లూడు చేసిన ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద పేజీ కూడా మొలక వర్గం లోకి చేరిపోయింది.
  3. అందుకని మీరు ఈ పేజీని మొలక అని అనకూడదు, ప్రత్యేక పేజీగా పరిగణించాలి అంటూ దానికి మూడు కారణాలు చెప్పి ఈ చర్చను మొదలుపెట్టారు (ఈ చర్చకు మీరు పెట్టిన శీర్షిక చూడండి. మీరు రాసిన తొలి వ్యాఖ్య చూడండి)
  4. మీరు చెప్పిన మూడు కారణాలనూ సాధించే మార్గంతో పాటు, ఈ మొలక సమస్యను తీర్చే ఉపాయం కూడా ఉంది. అదే మూస అని చెబుతూ దీన్ని మూసగా చేయవచ్చు గదా అని నేను అన్నాను. (ఈ చర్చలో నా మొట్టమొదటి స్పందన చూడండి.)
  5. దానికి మీరు చాలా చర్చ చేసారు గానీ మీ చర్యకు సరైన కారణం ఒక్కటి కూడా ఇంతవరకూ చెప్పలేదు.
  6. పైగా దీన్ని మొలకగా పరిగణించవద్దు అని చెబుతూ మొలక నియమాలను దీనికి వర్తింజేయరాదని చెప్పారు. మొలకను మొలక కాదని ఎలా అంటాం? ఉన్న పద్ధతులను వాడుకోకుండా (మూసగా చెయ్యకుండా) మొలక నియమాలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఇదీ.

ఇక దీన్ని మూసగా ఎందుకు చెయ్యకూడదో మీరు చెప్పిన కారణాలు ఇవి:

  1. వాడుకరులకు ముస అంటే అర్థం కాదు అన్నారు. ట్రాన్స్‌క్లూడు చేసాక, అది మూస అయినా మరోటైనా వాడుకరికి ఏమీ తెలియదు. కాబట్టి అది సమస్యే కాదు.
  2. గూగులు దాన్ని చదవదు అన్నారు. (అసలు మీరు చేసిన పనికి ఇది సమర్ధనే కాదు. అయినప్పటికీ) గూగుల్ చదువుతుంది అని చెప్పాను. ఆ తరువాత మీరు కూడా ఔనన్నారు.
  3. ఆ తరువాత, వికీస్ఫూర్తి ప్రకారం ఈ పేరుబరి లోనే ఉండాలన్నారు. (ముందసలు మీ వాదనకు వికీస్ఫూర్తి ఉందా అనేది ఆలోచించండి)
  4. చివరిగా ఇప్పుడు, వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం సాధారణ వ్యాసాలకు వర్తిస్తుందే కాని జాబితాలకు, అటువంటి పేజీలకు (ప్రస్తుత చర్చలోని పటం పేజీ ఉదాహరణ) వర్తించదు కదా. అని మీ తాజా వాదనలో రాసారు. కానీ, మీరు చెప్పిన ఆ పేజీలో అసలు జాబితాల గురించి గాని, ఇలాంటి పేజీల గురించి గానీ ప్రస్తావనే నాకు కనబడలేదు! ఎందుకు ఇలా లేని సమర్ధనలను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సింపులుగా ఈ పేజీని మూస పేరుబరి లోకి తరలించడమనే చిన్న చర్య తీసుకోకుండా, ఎందుకు ఇంత పట్టుదలకు పోతున్నారు?

మూసగా ఎందుకు చెయ్యనంటున్నారో సరైన కారణం చెప్పలేదు, ఏకాభిప్రాయం కావాలన్నారు. అది వచ్చాక, ఇప్పుడు మధ్యవర్తిత్వం కావాలంటున్నారు. సరే, మీ ఇష్టం ప్రకారమే కానివ్వండి. __చదువరి (చర్చరచనలు) 00:46, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ప్రదేశ్ వ్యాసంలో ట్రాన్స్‌క్లూడ్ చేసిన ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల పటం వ్యాసాల వల్ల ఆ వ్యాస మొలక వ్యాసంగా కనిపిస్తుంది. ఈ వ్యాసాలలో ఎవరైనా అనామక వాడుకరులు/కొత్త వాడుకరులు ఇది వ్యాసం గదా అని ఏవైనా అంశాలు చేర్చినా, మూస కోడింగ్ లో ఏదైనా తొలగించినా,చేర్చినా ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో ఆయా మార్పులు కనిపిస్తాయి. దానిఫలితంగా వ్యాస నాణ్యత చెడిపోతుంది. కనుక ఈ రెండు వ్యాసాలను మూసలుగా చేయడం ఉత్తమం. దయచేసి అర్జున గారు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.-- K.Venkataramana -- 01:59, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చ అంతా గమనించాకా నా అభిప్రాయం ఇది. ఇది గోటితో కొట్టెయ్యాల్సిన చిన్న సమస్య.
  • మొదట - అర్జున రావు గారు ఈ విమానాశ్రయాల పటాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచించి, మూసలో పెట్టవచ్చునని తట్టక తెచ్చి ఒక వ్యాసం సృష్టించారు. నా ఉద్దేశంలో ఇదేమంత తప్పు కాదు. ఎందుకంటే ఒక విషయం గబుక్కున తట్టకపోవడం మానవ సహజం. నాకు కూడా మరేదో సందర్భంలో ఇలా తట్టక పొరబాటు చేసివుండొచ్చు.
  • తర్వాత - చదువరి గారు వచ్చి ప్రశ్నించి "అలాంటపుడు ఇది "మూస"గా ఉంటే మంచిది కదా!" అన్నప్పుడు, అర్జున గారు ఆ సరళమైన విషయాన్ని ఒప్పుకోవడం మానేసి పొసగని కారణాలు ఏవో ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇవన్నీ వెనక్కి తిరిగి చేసిన పనిని సమర్థించుకునేవే తప్ప సరైన కారణాలు కావు. ఉదాహరణకు, "ప్రధాన కారణం ఏమంటే, ప్రధానపేరుబరిలో పేజీ గూగుల్ ఫలితాలలో కనబడుతుంది" అని అర్జున గారు అన్నారు అది కారణం అయినట్టు. కానీ, చదువరి గారు మూస పెట్టినా గూగుల్‌లో కనబడుతుంది అన్నాకా, "కొన్ని మూసల పేర్లను గూగుల్ వెతికి చూశాను, మీరు చెప్పినట్లు కనబడుతున్నాయి కాని" అంటూ ఇంకేదో చెప్తున్నారు. అంటే మొదట ప్రధానపేరుబరి గూగుల్‌లో కనబడుతుంది అన్నప్పుడు ఆయనకు మూస కూడా కనబడుతుందని తెలియదన్నమాట. కనీసం గూగుల్ చేసి కూడా చూడలేదన్నమాట.
  • ప్రస్తుతం - ఈ వ్యాసం విషయంలో చేయాల్సింది ఏమిటంటే దీన్ని సింపుల్‌గా మూసకు తరలించెయ్యాలి. భవిష్యత్తులో ఈ తరహాలో ఏం చేసినా చక్కగా మూసలోనే చేసుకోవాలి. ఇదే పొరబాటు నేను చేసి, అర్జున గారో, చదువరి గారో ఇది పొరబాటు కదా అని నాకు గుర్తు చేసివుంటే సింపుల్‌గా, "చూసుకోలేదండీ, నిజమే మూసగా మార్చి ఉండాల్సింది" అని నేనే చేసేద్దును. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అర్జున గారే ఇప్పటికైనా దీన్ని సింపుల్‌గా మూసగా తరలిస్తే మంచిది. --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చా ఫలితం

[మార్చు]

ఈ పేజీలో ఇప్పటికే చాలా చర్చ జరిగింది కాబట్టి జరిగిన చర్చల సారాంశాన్ని క్రోడీకరించి ఫలితం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. అర్జున గారు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల పటం అనే ఈ వ్యాసాన్ని ప్రధాన పేరుబరిలో సాధారణ వ్యాసంగా రాశారు. ఇందులో అర్జున గారు ఒక ఖాళీ SVG బొమ్మలో ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలున్న ప్రాంతాలను లొకేషన్లు గుర్తించి పటంగా చేశారు. ఇది పటాల తయారీలో ఒక మంచి స్టెప్. ఇందుకు నేను అర్జున గార్ని అభినందిస్తున్నాను. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో ట్రాన్స్‌క్లుజన్ చేసి వాడుకున్నారు. అంటే {{:ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల పటం}} అని వ్యాసంలో పెడితే ఈ వ్యాసంలో ఉన్న సమాచారమంతా అక్కడికి చేరిపోతుంది. మనం ఇప్పటి దాకా కేవలం మూసల్లో ఉండే సమాచారాన్నే ట్రాన్స్‌క్లూడ్ చేసుకుని వాడుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన వ్యాసమైపోయింది. ప్రధాన పేరుబరిలో తక్కువ సమాచారంతో ఉంది కాబట్టి చదువరి గారు మొలక మూస చేర్చారు. మనం ఏర్పాటు చేసుకున్న నిర్వహణ నియమాల ప్రకారం ఇది సరియైనదే. పటాల వ్యాసాన్ని ఒక ప్రత్యేకమైన వర్గంగా చూడమని అర్జున గారు కోరుతున్నారు. అంటే జాబితా వ్యాసం, అయోమయ నివృత్తి, మూస లాగే పటం కూడా ఒక ప్రత్యేక (స్పెషల్) రకంగా చూడమని ఆయన చెబుతున్నారు. కానీ ఈ పటాన్ని తయారు చేయడానికి మూస అందుబాటులో ఉండగా ప్రత్యేక రకం అవసరం లేదని చదువరి గారు, వెంకటరమణ గారు, పవన్ సంతోష్ గారు, రామారావు గారు అభిప్రాయ పడ్డారు. అలాగే ప్రభాకర్ గౌడ్ ఈ చర్చకు సంబంధించిన విషయాల ప్రకారం వ్యాసం పేరులో పటం ఉండకూడదన్నారు. అలాగే వ్యాసంలో కేవలం పటం మాత్రమే ఉండకుండా విమానాశ్రయాల గురించి వాక్యాలు ఉండాలన్నారు. ఆయన వెలిబుచ్చిన ఇతర అభిప్రాయాలను నేను ఇక్కడ పరిగణించడం లేదు కానీ కింద నిర్ణయంలో చూచాయగా రాస్తాను.

కాబట్టి నా నిర్ణయం యిది.

  1. చర్చలో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ఈ వ్యాసాన్ని మూసకు తరలించాలనే నిర్ణయాన్ని సమర్ధించారు కాబట్టి కేవలం పటాలు మాత్రమే ఉన్న వ్యాసాల్ని మూస పేరుబరిలోకి మార్చాలి. అలా చేసిన తర్వాత మొలక మూస తీసేయవచ్చు. పటాల కోసం అర్జున గారు, ఇంకా ఎవరైనా పటాలు మూసకు లోబడని ప్రత్యేకమైన కోవకు చెందాలని ఆశించి, విస్తృత చర్చ కోరుకునే వారు, దీన్ని ఒక పాలసీ లేదా శైలి చర్చ లేవదీయవచ్చు.
  2. ఇవి గూగుల్ లో వెతికినపుడు మూస పేరుబరిలో కాకుండా సాధారణ పేరుబరిలో కనిపించాలంటే దానికోసం ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాలు అనో లేక విమానాశ్రయాల జాబితా అనో ఇంకో వ్యాసంగా రాసి అందులో ఎంతో కొంత సమాచారం చేర్చాలి. స్వల్ప సమాచారంతో సృష్టించిన పరవాలేదు. అందులో మొలక మూస ఉంచినా సమస్య లేదు. నిర్వహణ కోసం తప్పదు. ఇటీవలి కాలంలో మొలక వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నామే కానీ తొలగించడం లేదు. తొలగించడానికి వేరే కారణాలున్నాయి. మొలకలను ఎందుకు తొలగిస్తున్నామనే విషయం మీద వేరే దగ్గర చర్చించవచ్చు.

- రవిచంద్ర (చర్చ) 07:44, 30 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారు, ధన్యవాదాలు మీ పరిష్కారం బాగుంది. మీ పరిష్కారంలో మొలక మూస ఉండనివ్వ వచ్చు అన్నారు. అయితే, సమస్య అదేనండి చదువరి గారు ట్రాన్స్‌క్లూడ్ వాడి మొలక మూస చేర్చారు, దానితో 2 లక్షల బైట్లున్న ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, శీర్షిక వద్ద మొలక మూస చేరింది. ఆ విషయం ఒకటి వదిలేశారు మీరు, గమనించగలరు. మిగతా పరిష్కారం మీ పూర్తి విశ్లేషణ బాగుంది. సార్. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:14, 30 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ గారూ, ఈ వ్యాసాన్ని మూస పేరుబరిలోకి తరలిస్తే మొలక మూస తీసేయవచ్చు అని మొదటి పాయింటు లో చెప్పాను చూడండి. అప్పుడు ఈ మూసను ట్రాన్స్‌క్లుడ్ చేసిన ఏ వ్యాసంలోనూ మొలక మూస కనిపించదు. రవిచంద్ర (చర్చ) 09:08, 30 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:రవిచంద్ర గారికి, నిర్ణయం తెలిపినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 21:40, 31 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం అమలు

[మార్చు]

ఈ నిర్ణయం ప్రకారం,

  1. ఈ పేజీని, దీనితో పాటు ఇదే పద్ధతిలో సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల పటం పేజీనీ, "మూస" పేరుబరి లోకి తరలించాను.
  2. ఆ రెండు మూసల్లోనూ {{మొలక}} మూసను తీసేసాను.
  3. "ఆంధ్రప్రదేశ్" పేజీలో ఆ రెండింటి ప్రతిక్షేపణను సరిచేసాను.

నిర్ణయం ప్రకటించిన రవిచంద్ర గారికి, చర్చలో తమ అభిప్రాయాలను హేతువులతో వివరించి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడిన వారికీ, అర్జున గారికీ ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 04:32, 1 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.