Jump to content

మైలాదుత్తురై జిల్లా

వికీపీడియా నుండి
(మైలాదుతురై జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Mayiladuthurai district
Location in Tamil Nadu
Location in Tamil Nadu
పటం
Mayiladuthurai district
Country India
రాష్ట్రం Tamil Nadu
RegionChola Nadu
Established28 డిసెంబరు 2020
(3 సంవత్సరాల క్రితం)
 (2020-12-28)
Founded byEdappadi K. Palaniswami
ముఖ్యపట్టణంMayiladuthurai
Taluks
Kuthalam,
Mayiladuthurai,
Sirkali,
Tharangambadi,
Kollidam
Government
 • District CollectorR. Lalitha, IAS
 • Superintendent of PoliceN.S.Nisha, IPS[1]
విస్తీర్ణం
 • Total1,172 కి.మీ2 (453 చ. మై)
 • Rank37
Elevation
11 మీ (36 అ.)
జనాభా
 • Total9,18,356
 • Rank34
 • జనసాంద్రత782/కి.మీ2 (2,030/చ. మై.)
Languages
 • OfficialTamil
Time zoneUTC+05:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
609001
Telephone Code04364
Vehicle registrationTN 82

మైలాదుత్తురై జిల్లా, భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటి. జిల్లా ప్రధాన కార్యాలయం మైలాదుత్తురైలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో కడలూరు జిల్లా, పశ్చిమాన తంజావూరు జిల్లా, దక్షిణ సరిహద్దులో తిరువారూర్, పుదుచ్చేరిలోని , కారైకాల్ జిల్లాలు, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి.

కావేరీ నది సారవంతమైన తీరప్రాంతంలో ఈ జిల్లా ఉంది.పూర్తిగా చదునైన మైదానంతో ఉంటుంది. కావేరి, అలాగే దానిఅనేక ఉపనదులు జిల్లాగుండా ప్రవహించి ఇక్కడ సముద్రంలో కలుస్తాయి.కడలూరు ఉత్తర సరిహద్దులో ఎక్కువ భాగం కొల్లిడం నది ద్వారా ఏర్పడింది.[2]

జనాభా శాస్త్రం

[మార్చు]
మతాల ప్రకారం జిల్లాలో మైలదుతరై ప్రజలు (2011)[3]
మతం శాతం
హిందూ
  
89.37%
తమిళం
  
7.21%
క్రిష్టియన్లు
  
3.13%
మత వివరం తెలపనివారు
  
0.29%
మతాల వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం, మైలదుత్తురై జిల్లాలో 9,18,356 జనాభా ఉన్నారు. అందులో 1,76,568 (19.23%) మంది పట్టణ ప్రాంతాల్లో నివిసిస్తున్నారు.మైలదుత్తురై జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1029 మంది స్త్రీలు ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 32.31% ఉండగా,షెడ్యూల్డ్ తెగలు వారు 0.23% మంది ఉన్నారు.[4] 99.32% మంది ప్రధాన భాషగా తమిళ్ మాట్లాడతారు.[5]

పరిపాలనా విభాగాలు

[మార్చు]

మైలాదుత్తురై జిల్లాలో మైలాదుత్తురై, సిర్కలి అనే రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మైలాదుత్తురై, కుతాళం, సిర్కలి, తరంగంబాడిఅనే నాలుగు తాలూకాలు ఉన్నాయి. 287 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాలో మైలాదుత్తురై, కుతాళం, సిర్కలి, కొల్లిడం, సెంబనోర్‌కోయిల్‌ అనే ఐదు పంచాయితీ బ్లాకులు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మైలాదుతురై, సిర్కలి అనే రెండు పురపాలక సంఘాలు, మానల్మేడు, వతీశ్వరన్కోయిల్, కుతాళం, తరంగంబాడి అనే నాలుగు పట్టణ పంచాయతీలు ఉన్నాయి.[6]

రాజకీయం

[మార్చు]
జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ కూటమి వ్యాఖ్యలు
మైలాదుత్తురై జిల్లా 160 సిర్కాళి (ఎస్.సి) ఎం. పన్నీర్ సెల్వం ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ
161 మైలాదుత్తురై ఎస్ . రాజకుమార్ భారత జాతీయ కాంగ్రెస్ యు.పి.ఎ
162 పూంపుహార్ నివేదా ఎం. మురుగన్ ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ

వ్యవసాయం

[మార్చు]

జిల్లా ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన వ్యవసాయం రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో అధిక వాటాను అందిస్తుంది. ఈ జిల్లాలో చాలా ముఖ్యమైన వ్యవసాయ పంటలను పండిస్తారు. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, పప్పులు, అల్లం, చెరకు, పత్తి.[7]

చేపలు పట్టడం

[మార్చు]

ఎండుచేపలు తయారీ , రొయ్యల పెంపకం వంటి పారా మెరైన్ కార్యకలాపాలతో పాటు చేపలు పట్టడం జిల్లాకు రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థ మానవాళికి ఆహారం, మందులు, పారిశ్రామిక ఉత్పత్తులపై ద్వారా ఆర్థిక పరిస్థతి ఆధారపడి ఉంది, లోతట్టు ఫిషింగ్ ఈ ప్రాంతంలో బాగా దోహదం చేస్తుంది.[7]

ఇది కూడా చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Special Officer, SP appointed for Mayiladuthurai district". The Hindu. Special Correspondent. 2020-07-12. ISSN 0971-751X. Retrieved 2021-09-07.{{cite news}}: CS1 maint: others (link)
  2. "Mayiladuthurai | TWAD". www.twadboard.tn.gov.in. Retrieved 2023-01-28.
  3. "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  4. "District Census Hand Book – Nagapattinam" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
  5. "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
  6. "About District | Mayiladuthurai District, Government of Tamilnadu | India". Retrieved 2023-01-23.
  7. 7.0 7.1 https://mayiladuthurai.nic.in/about-district/

వెలుపలి లంకెలు

[మార్చు]