యారో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక ఆరో కాలర్ల ప్రకటన. ఇందులో వివిధ రకాల కాలర్లను చూడవచ్చును

ఆరో అనునది అమెరికాకు చెందిన ఒక రెడీమేడ్ వస్త్రాల బ్రాండు.

1851 లో న్యూ యార్కు లోని ఒక గదిలో మౌలిన్, బ్లాంకార్డ్ అను ఇద్దరు వ్యక్తులు క్లుయెట్ పీ బాడీ అండ్ కో. ని స్థాపించారు. ఈ సంస్థకి వ్యాపార ప్రకటనల నిర్వాహకుడు ఛార్లెస్ కొన్నోల్లీ 1905 లో జె.సి లెయెండెకర్ ని ఫ్యాషన్ ఇల్లస్ట్రేటర్ గా నియమించాడు.

1912 లో మెక్సికో నుండి ఒక భారీ ఆర్డరు రావటంతో ఆరోకి అంతర్జాతీయ గుర్తింపు లభించినది. దీనితో ఆరో క్యూబా, ప్యూర్టో రికో, స్కాండినేవియా, హాలండ్ లకు విస్తరించినది. షర్టులకి అతికించే/తీసివేసే వీలుగా కాలర్లను రూపొందించేది ఆరో. 1920 లలో బ్రాడ్ వే మ్యూజికల్ లో ఆరో కాలర్ మ్యాన్ ప్రధానాకర్షణగా మారినది. వారానికి 4 మిలియన్ ఆరో కాలర్లు రూపొందించ బడేవి. 1930లో ఆరో స్పోర్ట్స్ వేర్ లోకి ప్రవేశించినది. క్రీడల సమయంలో ధరించే షర్టులు, షార్టులు రూపొందించటంతో స్పోర్ట్ ఫేర్ లో పరిపూర్ణతని సంపాదించుకొన్నది. 1940 లో గ్రేట్ బ్రిటన్ లోని ఆరో ఏజెంట్ ల పై బాంబుదాడి జరిగినది.అయితే కెనడా నుండి కొంత సరుకుని తెప్పించుకొని వారి కార్యాలయాన్ని త్వరలోనే పున:ప్రారంభించారు. 1952 లో సూట్ లకి ఆదరణ తగ్గటంతో ఆరో షర్టింగ్ పైనే దృష్టిని కేంద్రీకరించినది.

1968 లో తెల్ల షర్టుల స్థానే చారల షర్టులు, తెలుపు కాలర్లతో వినియోగదారులని ఆకట్టుకొన్నది. 1971 లో క్లుయెట్ పీ బాడీ ఇంటర్నేషనల్ స్థాపించబడ్డది. ఫ్రాన్స్, ఈక్వెడార్, ఇండోనేసియా, పాకిస్థాన్ లకు విస్తరించినది. 1980 నాటికి యుగోస్లేవియా, సౌత్ ఆఫ్రికా, హాంగ్ కాంగ్, బ్రెజిల్, సింగపూర్, ఈజిప్ట్, కొరియా లకి విస్తరించినది. 90వ దశకం ముగిసే సమయానికి పోర్చుగల్, భారతదేశం, మధ్యప్రాచ్య దేశాలు, ఆస్ట్రేలియా లలో కూడా ప్రారంభించబడినది.

భారతదేశంలో ఆరో వస్త్రాలను అరవింద్ మిల్స్ లైసెన్స్డ్ బ్రాండు క్రింద ఉత్పత్తి చేస్తున్నది.

ఆరో కాలర్ మ్యాన్

[మార్చు]

క్లుయెట్ పీ బాడీ అండ్ కో. యొక్క వ్యాపార ప్రకటనల్లో కనిపించే మాడళ్ళను ఆరో కాలర్ మ్యాన్గా వ్యవహరించేవారు. ఈ ప్రకటనలు 1905 లో ప్రారంభం అయిననూ అప్పటి నుండి చాలా కాలం తర్వాతే ఆరో కాలర్ మ్యాన్ ఉపయోగం లోకి వచ్చినది. లెయెండెకర్ తో బాటు నివసిస్తున్న తన స్నేహితుడు ఛార్లెస్ బీచ్ ను ప్రేరణగా తీసుకుని సృష్టించిన కల్పిత పాత్రే ఆరో కాలర్ మ్యాన్. ఆరో కాలర్ మ్యాన్ 1920 నాటికి జనాదరణ పొంది అభిమానుల నుండి ఉత్తరాలను కూడా పొందాడు. ప్రెసిడెంట్ థియోడర్ రూజ్ వెల్ట్ ఆరో కాలర్ మ్యాన్ ని సగటు మనిషి యొక్క అద్భుత ప్రతిబింబం (superb portrait of the common man)గా పేర్కొన్నాడు.

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యారో&oldid=4230719" నుండి వెలికితీశారు