యుగపురుషుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుగపురుషుడు
Yuga Purushudu Movie Poster.jpg
యుగపురుషుడు సినిమా పోస్టర్
దర్శకత్వంకె.బాపయ్య
రచనబాలమురుగన్ (కథ), జంథ్యాల (మాటలు)
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1978 జూలై 14 (1978-07-14)
భాషతెలుగు

యుగపురుషుడు 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] వైజయంతీ మూవీస్ పతాకంపై ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘ఎదురులేని మనిషి’ తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త తరహాలో ఉండడంతోపాటు యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత.[2] ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

కథ[మార్చు]

కరాటే ఫైటర్ రాజేష్ (ఎన్.టి.ఆర్) అతని తండ్రి మారుతీరావు (కైకాల సత్యనారాయణ) కోరికపై జమిందారు (ప్రభాకర్ రెడ్డి) మనువడు కళ్యాణ్ గా నటించడానికి ఒప్పకుంటాడు. రాజేష్ ను ప్రేమించిన లత (జయప్రద) అతనిని అపార్థం చేసుకుంటుంది. జమిందారును కాపాడటానికే వచ్చానని చెబుతాడు. తన చిన్నాన్న జగ్గు (జగ్గయ్య) ద్వారా తానే ఆసలైన కళ్యాణ్ అని తెలుసుకుని వాళ్ళ ఆట కట్టించి తన తల్లిని, తాతను ఒక దగ్గరకు చేరుస్తాడు. తన మరదలు లతను పెళ్ళిచేసుకుంటాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఇదిగిదిగో మగసిరి వస్తాదు - 3.30 ని.
  2. గాలి మళ్ళింది నీపైన - 4.06 ని.
  3. ఎంత వింత లేత వయసు - 4.15 ని.
  4. ఒక్క రాత్రి వచ్చిపోరా - 4.10 ని.
  5. అబ్బా అబ్బబ్బా బొబ్బర్లంక చిన్నది - 5.28ని

మూలాలు[మార్చు]

  1. "యుగపురుషుడు (1978)". telugumoviepedia.com. తెలుగు మూవీపీడియా. Retrieved 15 October 2016.[permanent dead link]
  2. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (21 July 1978). సినిమా విశేషాలు. ఆంధ్ర సచిత్ర వార పత్రిక. p. 30. Retrieved 13 July 2017.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]