రత్నగిరి కృష్ణవేణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నగిరి కృష్ణవేణి
జననంరాజవరపు కృష్ణవేణి
1947
నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
తండ్రిరాజవరపు వీరాస్వామి
తల్లిరామమ్మ

రత్నగిరి కృష్ణవేణి రంగస్థల నటి.

జననం[మార్చు]

కృష్ణవేణి 1947వ సంవత్సరం రాజవరపు వీరాస్వామి, రామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించింది. తన 9వ ఏట పునర్జన్మ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశంచేసి, 5 దశాబ్దలలో శతాధికంగా నాటక/నాటిక ప్రదర్శనల్లో పాత్రలు ధరించింది.

నటిగా[మార్చు]

సాధన, కసాయిగుండె, మండే గుండెలు - ఎండే పెదవులు, నటన, నటరాజు, కళ్ళు, ఛాయ, మల్లెపూలు, తప్పెవరిది, పట్టాలు తప్పినబండి, ఊరుమ్మడి బతుకులు, కదలిక, రగిలిన జ్వాల, సార్వభౌముడు, కాలజ్ఞానం, దేవుడు, మద్యంలో మానవుడు, సర్పయాగం, పల్లెపడుచు, కీలుబొమ్మలు, అన్నాచెల్లెలు, నటనాలయం, విడాకులు, కనకపుష్యరాగం మొదలగు నాటిక/నాటకాల్లో నటించింది. కుంతి, శబరి ఏకపాత్రాభినయ ప్రదర్శలనలిచ్చింది. సినీ నటుటు రావుగోపాలరావు, కొమ్మినేని శేషగిరిరావు, ప్రసాద్ బాబు, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నది.

సత్కారాలు, అవార్డులు[మార్చు]

  1. సంస్కృతి సమ్మేళనం - గూడురు వారిచే, ఏలూరులో రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి చేతుల మీదుగా
  2. కీ.శే. కామేశ్వరరావు మెమోరియల్ పరిషత్తు - నెల్లూరు వారిచే డా. ఎస్.పి.బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా
  3. మద్రాసులోని పద్మశ్రీ డా. శివాజి గణేషన్ సంప్థవారిచే
  4. కళింగపట్నం కళాపరిషత్తు వారిచే ఎస్.వి. రంగారావు అవార్డు
  5. కడప - వై.ఎమ్.డి.ఏ. వారిచే శ్రీమతి పసుపులేటి కన్నాంబ అవార్డు
  6. శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తువారి ప్రతిష్ఠాత్మక ’గరుడపురస్కారం‘ (రూ. 10,000/- నగదు), 2008 జూన్ 9, మహాతి కళాక్షేత్రం, తిరుపతి

మూలాలు[మార్చు]

రత్నగిరి కృష్ణవేణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 32.