రథసారధి
రథసారధి (1993 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శరత్ |
నిర్మాణం | బి.బుల్లి సుబ్బారావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, రవీనా టాండన్, సుహాసిని, ఆలీ, కోట శ్రీనివాసరావు, శ్రీకాంత్ |
సంగీతం | రాజ్ కోటి |
నేపథ్య గానం | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి ప్రసన్న కంబైన్స్ |
భాష | తెలుగు |
రథసారధి 1993 లో తెలుగు యాక్షన్ చిత్రం, శ్రీ సాయి ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థ [1] లో బూరుగుపల్లి సుబ్బారావు నిర్మించాడు, శరత్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్, రవీనా టాండన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు.[3] రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[4]
కథ[మార్చు]
బాపినీడు (సత్యనారాయణ) దుర్మార్గుడు. మంచిగా నటిస్తూ గౌరవప్రదమైన వ్యక్తిగా చలమణీ అవుతూంటాడు. అతని ఇద్దరు కుమారులు అంకినీడు (దేవన్) & రామినీడు (శ్రీకాంత్) తో కలిసి సమాజంలో దుర్మార్గపు పనులు చేస్తూంటాడు. ఆ భయంకరమైన పరిస్థితిలో, ఒక కొత్త కలెక్టర్ రాజశేఖరం (అక్కినేని నాగేశ్వరరావు) వస్తాడు. అతడు నీతిమంతుడు, నిజాయితీ పరుడు. వారు అతడికి లంచం ఇవ్వబోగా తిరస్కరిస్తాడు. వారి దుర్మార్గపు పనులకు ఆటంకం కలిగిస్తాడు. ఒకసారి రాజశేఖరానికి నిరాశ చెందిన నిరుద్యోగ యువకుడు పార్థ సారధి (వినోద్ కుమార్) తో పరిచయం ఏర్పడుతుంది. అతడు టాక్సీ తీసుకోవడానికి సహాయం చేస్తాడు. అక్కడ నుండి, పార్ధ సారది రాజశేఖరంతో చనువుగా మెలుగుతూంటాడు. అతడి కుమార్తె అంజలి (అంజలి) ని తన సోదరిగా చూసుకుంటాడు. అతను రేఖ (రవీనా టాండన్) అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. రాజశేఖరం బాపినీడుకు అతడి ముఠాకూ వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరిస్తాడు. బాపినీడు మనుషులు అతన్ని చంపబోగా అతన్ని అతడి మాజీ ప్రేయసి డాక్టర్ శకుంతల (సుహాసిని) రక్షిస్తుంది. ఆమె రాజశేఖరం మీద ప్రేమను వదులుకోక ఒంటరిగా నివసిస్తూంటుంది. ఆ తరువాత, రామినీడు అంజలిని మానభంగం చేసి చంపి, న్యాయవ్యవస్థ నుండి నకిలీ సాక్ష్యాలతో నిర్దోషిగా విడుదలౌతాడు. దీనిపై కోపగించిన రాజశేఖరం రాజీనామా చేసి, పార్ధ సారధి సహాయంతో దుష్టులను నిర్మూలించి ప్రతీకారం తీర్చుకుంటాడు. చివరగా, రాజశేఖరం పార్ధ సారధి, రేఖలను జతచేసి శకుంతలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
నటీనటులు[మార్చు]
సాంకేతిక సిబ్బంది[మార్చు]
- కళ: శ్రీనివాస రాజు
- నృత్యాలు: డికెఎస్ బాబు, శివ శంకర్
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, భువన చంద్ర
- నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- సంగీతం: రాజ్-కోటి
- కథ: కొన్నపల్లి గణపతి రావు
- కూర్పు: కె.నాగేశ్వరరావు, సత్యనారాయణ
- ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి
- నిర్మాత: బూరుగుపల్లి సుబ్బారావు
- చిత్రానువాదం - దర్శకుడు: శరత్
- బ్యానర్: శ్రీ సాయి ప్రసన్న పిక్చర్స్
- విడుదల తేదీ: 1993 ఆగస్టు 14
పాటలు[మార్చు]
రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఆకాష్ ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.
ఎస్. | పాట పేరు | సాహిత్యం | సింగర్స్ | పొడవు |
---|---|---|---|---|
1 | "అబ్బారే జబ్బారే" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, చిత్ర | 4:38 |
2 | "మేఘమా ప్రియా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, చిత్ర | 5:00 |
3 | "నర్మదా నదీ తీరంలో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, చిత్ర | 4:30 |
4 | "సీతమ్మ చిలికింధి" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, చిత్ర | 4:39 |
5 | "తప్పు తప్పు" | భువన చంద్ర | ఎస్పీ బాలు | 4:28 |
మూలాలు[మార్చు]
- ↑ "Ratha Saradhi (Banner)".
- ↑ "Ratha Saradhi (Direction)".
- ↑ "Ratha Saradhi (Cast & Crew)". Archived from the original on 2018-07-14. Retrieved 2020-08-08.
- ↑ "Ratha Saradhi (Review)".