Jump to content

రావులపాటి సీతారాం

వికీపీడియా నుండి
రావులపాటి సీతారాం
జననంరావులపాటి సీతారాం
1964
India ఖమ్మం జిల్లా ఆరెంపల, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం జిల్లా ఆరెంపల, తెలంగాణ
వృత్తికవి, సాహితీవేత్త, విమర్శకుడు, సామాజికవేత్త, అధ్యాపకుడు.
తండ్రినారాయణ,
తల్లిమాణిక్యం

రావులపాటి సీతారాం ఆధునిక తెలుగు సాహిత్యం లో మూడు దశాబ్దాలుగా విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలుగు అధ్యాపకుడిగా పేరొందాడు.[1]

ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజాకవి కాళోజీ నారాయణరావు- 2017 పురస్కారం అందుకున్నాడు.[2]

బాల్యం, విద్యాబ్యాసం

[మార్చు]

రావులపాటి సీతారాం 1964 లో ఖమ్మం జిల్లా ఆరెంపులకు చెందిన నారాయణ, మాణిక్యం దంపతులకు జన్మించాడు. ఆయన పదో తరగతి, డిగ్రి ఖమ్మంలో పూర్తి చేశాడు. ఏంఏ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయంలో పూర్తి పూర్తి చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పట్టాను పొందాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రక్తస్పర్శ కవితాసంపుటితో ఆర్ సీతారాం సాహితీలోకానికి పరిచయమయ్యారు. అఫ్సర్, ప్రసేన్‌తో కలిపి సీతారాం ఈ కవితా సంపుటిని వెలువరించారు. ఇదిగో ఇక్కడిదాకా పేరుతో ఆయన వెలువరించిన కవితాసంపుటి సంచలనం సృష్టించింది. సన్నాఫ్ మాణిక్యం కవితాసంకలనం ఆయనకు మంచి పేరుప్రతిష్ఠలను తీసుకొచ్చింది. ఆధునిక కవితా ధోరణులు అనే అంశంపైన ఆయన పరిశోధన చేశారు. మానుకోటలో డిగ్రీ కాలేజీ విద్యార్థులతోనే రచనలు చేయించి విద్యార్థులలోని సృజన్మాతకతకు పదునుపెట్టారు. మా టీచర్, మానుకోట ముచ్చట్లు విద్యార్థులను ప్రోత్సహించే ఆయన ఉన్నత లక్షణానికి ప్రతిబింబాలు.

ఆయన 1998లో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్ల పాడు జూనియర్‌ కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌ గా ఉద్యోగ జీవనం ప్రారంభించి ఖమ్మంలోని శ్రీరామ భక్త గెంటేల నారాయణ రావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ లో గత మూడు సంవత్సరాల నుండి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా అధ్యాపకత్వం నిర్వహించి ఉద్యొగ జీవనంలో పదవి విరమణ పొందాడు.

రచనలు

[మార్చు]
  • 1985:రక్తస్పర్శ
  • 1990:ఇదిగో ఇక్కడిదాకే
  • 1995:S/O మాణిక్యం
  • 2008:కుప్పం
  • 2010:అదే పుట
  • 2011:కారేపల్లి కబుర్లు
  • 2009:ఆ ముగ్గురు సరే-మన మాటేమిటి

పురస్కారాలు

[మార్చు]

ప్రజాకవి కాళోజీ నారాయణరావు- 2017 పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. "ఇతగాడు.. సన్నాఫ్‌ కవిత్వం". NT News. 11 November 2024. Archived from the original on 14 October 2025. Retrieved 14 October 2025.
  2. "కవితా భిషక్కు 'సీతారాం'". Navatelangana. 28 June 2025. Archived from the original on 14 October 2025. Retrieved 14 October 2025.