రావూరిపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రావూరిపేట
గ్రామం
రావూరిపేట is located in Andhra Pradesh
రావూరిపేట
రావూరిపేట
నిర్దేశాంకాలు: 15°46′37″N 80°18′20″E / 15.776944°N 80.305564°E / 15.776944; 80.305564Coordinates: 15°46′37″N 80°18′20″E / 15.776944°N 80.305564°E / 15.776944; 80.305564 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంవేటపాలెం మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08594 Edit this at Wikidata)
పిన్(PIN)523187 Edit this at Wikidata

రావూరిపేట, ప్రకాశం జిల్లా వేటపాలెం మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ కనకనాగ వరపమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

సుమారు 400 సంవత్సరాల క్రితం రావూరిపేట శివారులో అమ్మవారు దండుబాట కాలువ ప్రక్కన వెలసినట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. నాటినుండి భక్తుల నిత్యపూజలు అందుకొనుచున్నది. ప్రతి ఆది, మంగళవారాలలో చుట్టుప్రక్కల గ్రామాలతోపాటు, ఇతర జిల్లాలకు చెందిన భక్తులు వచ్చి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలనాడు భక్తులు అమ్మవారికి చిన్న ఆలయం నిర్మించి పూజలుచేసేవారు. శిరస్సుపై నాగేంద్రుడు పడగ విప్పి ఉండటంతో అమ్మవారిని, "నాగస్వరూపిణి" అని గూడా పిలిచేవారు. ఈ ఆలయం వద్ద జంట నాగేంద్రస్వామి ఆలయం గూడా ఉంది. అమ్మవారికి ఆలయం వెనుక మరియూ కారంచేడు మండలంలోని కొడవలివారిపాలెంలో సుమారు 26 ఎకరాల మాన్యం భూమి ఉంది. వీటిపై ప్రతి సంవత్సరం, రు. 4 లక్షల పైగానే ఆదాయం వస్తున్నది. అమ్మవారికి సంతరావూరు (చినగంజాం మండలం) పుట్టినిల్లు, రావూరిపేట మెట్టినిల్లు. 1982 లో ఆలయాన్ని దేవదాయశాఖవారు స్వాధీనం చేసికొన్నారు. పురాతనమైన ఈ ఆలయం క్రమేణా శిథిలావస్థకు చేరడంతో, భక్తుల విరాళాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. ఇక్కడకు వచ్చే భక్తులకోసం విశ్రాంతి గదులు, పొంగలి, భోజనశాలలు త్రాగునీటి సౌకర్యాలు, కలుగజేసినారు. చీరాల - ఒంగోలు రహదారి వెంట ఉన్న రామన్నపేటలో అమ్మవారి ఆలయానికి వచ్చే మార్గంలో ముఖద్వారం గూడా ఏర్పాటు చేసారు. ఆలయం చుట్టూ సిమెంటు రహదారి ఏర్పాటు చేసారు. ఇపుడు ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా కనిపించుచున్నది.

శిడిమానోత్సవం అమ్మవారి శిడిమానోత్సవం ప్రతి సంవత్సరం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి నిర్వహించెదరు. ఇదివరకు ఈ ఉత్సవాన్ని ఒక నెల రోజులపాటు నిర్వహించేవారు, ఇప్పుడు ఒక వారం రోజులుమ్మాత్రమే నిర్వహించుచునారు. సంతరావూరులో ఐదురోజులు, ఆలయంలో మూడు రోజులు నిర్వహించుచున్నారు. ఈ ఏడాది, 2014, జూన్-12 గురువారం నాడు ఈ ఉత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ క్రతువు తిలకించేటందుకు, స్థానికులే గాక, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. రైలులో వచ్చేవారు, ఒంగోలు స్టేషనులో దిగి, అక్కడనుండి ఆటోలలో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవారు, రామన్నపేటలో దిగి, ఆలయానికి చేరుకోవచ్చు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-7, 16వపేజీ.