వరంగల్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరంగల్ రెవెన్యూ డివిజను
Montage of Warangal city images.
ఎగువ నుండి సవ్యదిశలో: గోవిందరాజుల కొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ కోట, వెయ్యి స్తంభాల దేవాలయం, కాకతీయ కళా తోరణం నగర వీక్షణ దృశ్య చిత్రాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్

వరంగల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. వరంగల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం వరంగల్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం, వరంగల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

వరంగల్ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం వరంగల్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 వరంగల్ మండలం 8 రెవెన్యూ గ్రామాలు
2 ఖిలా వరంగల్ మండలం 11 రెవెన్యూ గ్రామాలు
3 సంగెం మండలం 17 రెవెన్యూ గ్రామాలు
4 గీసుగొండ మండలం 16 రెవెన్యూ గ్రామాలు
5 వర్ధన్నపేట మండలం 12 రెవెన్యూ గ్రామాలు
6 పర్వతగిరి మండలం 14 రెవెన్యూ గ్రామాలు
7 రాయపర్తి మండలం 18 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-13.
  3. "List of Revenue Divisions, Mandals in Warangal District". TeachersBadi. 2022-03-01. Archived from the original on 2021-05-15. Retrieved 2022-05-13.
  4. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-05-13.