వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
కడప జిల్లా లోని పుణ్యక్షేత్రాలు ని తీసేస్తే ఎలా ఉంటుంది? ఈ వర్గం ఉండడం వల్ల చాలా క్షేత్రాలు అక్కడ ఉండి
లోంచి తప్పించు కోంటున్నాయి--మాటలబాబు 19:16, 3 జూన్ 2007 (UTC)
classification of temples.
[మార్చు]మొత్తం ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలను జిల్లాలవారీగా వర్గీకరిస్తే అంటే ఎలాగైతే కడపజిల్లా పుణ్యక్షేత్రాలు అని ఉందో అలాగ, అప్పుడు పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలనుకునేవారికీ, వానిని దర్శించాలను కునేవారికీ కూడా సులువుగా ఉంటుంది. వర్గీకరణ వలన మొత్తం వెతకవలసిన అవసరం ఉండదుకదా! ప్రత్యేకించి ఒక జిల్లాలోని ఆలయాల గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఆ జిల్లా పేరుతో వర్గీకరించబడితే అక్కడ పూర్తిగా ఆజిల్లాలోని దేవాలయాల వివరాలు లభిస్తాయి కదా!madhuriprakash 09:32, 7 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007
ఆంధ్రరాష్రంలో ఎన్నో పురాతనాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు తమ కాలంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండి ఎన్నో భోగాలను చవిచూసాయి. ఈ కాలములో ఈ ఆలయాలు చరిత్రకు ఆధారాలు, వీనిని గురించి అధ్యయనంచేయకుండా ఆరాష్రమునకుగానీ, ప్రాంతమునకుగానీ చెందిన చరిత్రను పూర్తిగా తెలుసుకోవడం అసంభవం. ఇంతటి విలువ కలిగిన అపురూప సంపదలలో కొన్ని పూర్తిగా శిధిలమైపోయి నేలమట్టమైపోయాయి.మరికొన్నిటిని పెద్దదేవస్థానాలవారో, మఠాలో, సంస్థలవారో లేక స్థానికులో నిర్వహిస్తున్నారు. ఇంకొన్ని పూర్తిగా తమ రూపునే మార్చుకొని ఆధునికతను సంతరించుకున్నాయి.ఇంకమిగిలినవి శిధిలావస్తలో ఉండి చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి. కానీ ఈ అపురూప సంపదలు ఒక్కసారి నేలమట్టమై, అద్రుశ్యమైపోతే,మరల ఏమిచేసినా పోందలేనివి. కనుక వీని ప్రాముఖ్యతను గుర్తించి, కాపాడుకోవలసిన బాధ్యత మనందరిమీదా ఉంది. పోయింది పొల్లు ఉన్నది గట్టి అన్నట్లుగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అవి అలాగే దీనావస్తలో ఉన్నా, అత్యంత ఆధునికంగానూ అతి సుందరంగానూ, ఎంతో ధనం ఖర్చుపెట్టి ఎన్నో నూతనాలయాలు నిర్మించబడుతున్నాయి. ఇవి కూడా సమాజంలో అవసరమే కాదంటంలేదు. ఈ ఆధునికాలయాల నిర్మాణకర్తలు వారు ఖర్చుచేసే ధనంలో ఒక్క వంతు ఆ ప్రాంతములో ఉన్న పురాతనాలయాల అభివ్రుధి కోసం వినియోగించ గలిగితే అవి కూడా తమ పూర్వవైభవాన్ని ఒకింతైనా పొంది, మళ్ళీ కళ కళలాడుతూ ఉంటాయేమో! madhuriprakash 10:34, 7 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007