Jump to content

వాడుకరి చర్చ:Ahmed Nisar/పాతచర్చలు 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్లేటో వ్యాసం

[మార్చు]

మీరు ప్రారంభించిన ప్లాటో వ్యాసం, ఇదివరకే ప్లేటో పేరుతో ఉన్నది. ఒక సారి పరిశీలించగలరు. రవిచంద్ర(చర్చ) 11:18, 6 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారూ, నమస్తే, ప్లేటో వ్యాసం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. ప్లాటో వ్యాసంలోని కొద్ది సమాచారాన్ని, ప్లేటో వ్యాసము నందు చేర్చాను. ఇంకొక విషయం, గంగులాస్ గారు, ప్లాటో వ్యాసానికి దారిమార్పునిచ్చారు, కానీ సమాచారం అంతా ఆవ్యాసంలో అలానే వున్నది, ప్లాటో పేజీ తొలగించి ఆతరువాత దారిమార్పు ఇస్తే బాగుంటుందా తెలుప గలరు. అహ్మద్ నిసార్ 12:06, 6 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ప్లాటో అనే పేజీ లోని మొత్తం సమాచారాన్ని ప్లేటో అనే పేజీలో విలీనం చేసి ఉంటే దారి మార్పు ఇప్పుడున్న విధంగా ఓకే. లేదా మీ ఉద్దేశ్యం వ్యాసానికి ప్లాటో అన్నది సరైన పేరు అనుకుంటే, మీరు చెప్పినట్లు ప్లాటో పేజీని తొలగించి ప్లేటో పేజీని తరలించాలి. కానీ నాకు తెలిసి పాఠ్య పుస్తకాల్లో ప్లేటో అని ఉంది. అందువల్ల ఇప్పుడున్న విధంగా ఉండాలని నా ఉద్దేశ్యం. రవిచంద్ర(చర్చ) 13:40, 6 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యత్వం తీసుకోమని సలహా ఇవ్వడానికి {{అగంతకుడు}} అనే మూస వాడండి. సులభంగా ఉంటుంది. రవిచంద్ర(చర్చ) 08:24, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రవిచంద్రగారూ :)అహ్మద్ నిసార్ 08:26, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్వికీ లింకుల గురించి

[మార్చు]

నిసార్ గారూ! అనువాదం చేసేటపుడు ఆంగ్లం నుంచి తెవికీ లోకి అంతర్వికీలు చేర్చినట్లే తెలుగు అంతర్వికీని ఆంగ్ల వ్యాసంలో చేర్చేయండి. అంటే ఆంగ్ల వ్యాసం నుంచి సంబంధిత తెలుగు వ్యాసానికి లింకు అన్నమాట. ఉదాహరణకు [[te:ఆల్ప్స్ పర్వతాలు]]. అన్న లింకును ఆంగ్ల వ్యాసంలో చేరిస్తే అక్కడి నుంచి తెలుగు వ్యాసానికి వచ్చేయవచ్చు. రవిచంద్ర(చర్చ) 06:58, 21 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీలో బొమ్మ

[మార్చు]

నిసార్ గారూ! మొదటి పేజీలో బొమ్మ ఇపుడు సరైన పరిమాణంలో కనబడుతుందా? నేను మార్పులు చేసినా కూడా పెద్దది గానే కనిపిస్తోంది. మీకు ఎలా కనిపిస్తోంది రవిచంద్ర(చర్చ) 05:08, 20 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వానికి ప్రతిపాదన

[మార్చు]

నిసార్ గారూ! తెవికీ అభివృద్ధికి మీరు సల్పుతున్న కృషి అనుపమానం. మీరు చేరి సంవత్సరం పైనే అవుతోంది. ఈ కాలంలో కొన్ని వేల దిద్దుబాట్లు చేశారు. వికీ విధి విధానాలను, వికీ నియమాలను బాగా వంటపట్టించుకున్నారు. మీలాంటి కృషీవలుల అవసరం తెవికీ కి ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని నిర్వాహకత్వానికి ప్రతిపాదించాలనుకుంటున్నాను. మీరు ఇందుకు అంగీకరిస్తే నేను (మేరైనా సరే) తదుపరి ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రవిచంద్ర(చర్చ) 11:37, 8 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. రవిచంద్ర ప్రతిపాదన సముచితమైనది. నిర్వాహక అభ్యర్ధిత్వానికి అంగీకరించమని నిస్సార్ అహమ్మద్‌ను కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:50, 8 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి, నిర్వాహక అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు. కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.
  1. ఇప్పటికే చక్కటి నిర్వాహక బృందమున్నది. వారి నిర్వాహకత్వంలో వికీ చక్కగా ముందుకు సాగుతున్నది.
  2. తెవికీకి ప్రస్తుతం వ్యాసకర్తల, అనువాదకుల అవసరం ఎక్కువ.
  3. నిర్వహణ చేపట్టడంలో టెక్నికల్ విషయాలపై నాకు ఓమాదిరి అవగాహన కూడా లేదు.
  4. వ్యాసాలు వ్రాయడం, అనువాదాలు చేపట్టడం, లాంటివి నేను చేపట్టగలను.
  5. వ్యాసాలకు ఓ రూపం ఇవ్వడంలో నా కర్తవ్యం నిర్వహించగలను.
  6. తెవికీలో నాకు ఇంకనూ నేర్చుకోవలసినది చాలావున్నది.
  7. తెవికీ కి నా సేవలు ఎల్లప్పుడూ వుంటాయి.

పై విషయాలు దృష్టిలో పెట్టుకొని, నేను నిర్వాహకుడిగా అర్హుడిని, అని సభ్యులు భావించి తమ అభిప్రాయాలు తెలిపితే, ఆ బాధ్యతను స్వీకరించడానికి, సంతోషంగా అంగీకరిస్తాను. నిసార్ అహ్మద్ 05:11, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పైన పేర్కొన్న్ విషయాలు చిన్నవే, తెలియనివి అడిగి తెలుసుకొనే వీలున్నది కనుక అది పెద్ద విషయం కాదు. నిర్వహకునిగా మీరు తెవికీకి సేవలందించగలరు. రవిచంద్ర ప్రతిపాదనకు నేను మద్దతు తెలుపుతున్నాను.విశ్వనాధ్. 12:25, 12 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారూ, మీకు నిర్వాహక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి ఉంది, అందుకు మీరు అర్హులు కూడా కాబట్టి మీరు నిర్వాహక హోదా కొరకు ఇక్కడ ప్రతిపాదించవచ్చు. నిర్వాహక బాధ్యతలు చేపట్టడానికి సాంకేతిక విషయాలు తప్పనిసరి కాదు. తెవికీ పాలసీల పట్ల అవగాహన ఉండటమే ముఖ్యం. నిర్వాహక హోదా కొరకు స్వీయ ప్రతిపాదనలే ఆరోగ్యకరమైనవి కాబట్టి మీరు స్వయంగా ప్రతిపాదించుకోవడమే మంచిది. దానికి వారం రోజుల సమయం ఉంటుంది. ఆ లోపున సభ్యులు ప్రకటించిన ఓటింగ్ నిర్ణయాల ప్రకారం అధికారులు మీకు నిర్వాహక బాధ్యతలు ఇస్తారు. నా అభిప్రాయాలను అక్కడే ప్రకటిస్తాను. స్వీయ ప్రతిపాదన ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి నేనే ప్రతిపాదిస్తాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 11:06, 13 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నేనే మిమ్మల్ని ప్రతిపాదించాల్సింది. కానీ సంక్రాంతికి ఊరికి వెళ్ళిపోవడంతో అలా వాయిదా పడిపోయింది. రవిచంద్ర(చర్చ) 10:42, 19 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుగారూ, మీ అభిమానానికి, మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 12:23, 13 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెవికీ అధికారులలో( అధికారులంటే నిర్వాహకుల కంటే ఎక్కువ అధికారాలుంటాయి.) ఎవరో ఒకరు ( అంటే వైజాసత్య గారు కానీ, చదువరి గారు కానీ, ప్రదీప్ గారు కానీ) నిర్వహక హక్కులు ఇవ్వగలరు. వారు తీరిక లేకుండా ఉన్నట్లున్నారు. నేను ఒకసారి ప్రదీప్ గారిని అడుగుతాను. రవిచంద్ర(చర్చ) 08:45, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం పేరు అనువాదం

[మార్చు]

నిసార్ గారూ! ఒక చిన్న సలహా. ఆంగ్ల వ్యాసాన్ని అనువదించేటపుడు, మీరు వర్గాల పేర్లు యధాతథంగా అనువదించనక్కర్లేదు. ఎందుకంటే ఆ వర్గాలు ఆంగ్ల వికీపీడీయాలోనే ఉంటాయి(అందువల్లనే అవి ఎర్ర రంగులో కనిపిస్తున్నాయి). అనువాదం వర్గాల విభాగాన్ని పూర్తిగా తొలగించి, మన తెవికీ కోసం ప్రత్యేకంగా వర్గాలు సృష్టించుకుందాం. రవిచంద్ర(చర్చ) 07:35, 2 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్రగారూ, మీ సలహాకు ధన్యవాదాలు. అలాగే చేద్దాం.నిసార్ అహ్మద్ 07:44, 2 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సలహా

[మార్చు]

నిసార్ గారూ! నా దొక చిన్న సలహా. తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాలు అని మీ చర్చాపేజీలో రాసుకుంటున్నారు కదా!. దానికి నేనొక మార్గం చెబుతాను. మీ సభ్యుని పేజీకి ఒక ఉప పేజీ(తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాలు) అని చేర్చుతాను. మీ చర్చా పేజీకి వచ్చే సభ్యులకు గందరగోళం లేకుండా ఉంటుంది. మీ సౌలభ్యం కోసం, మీ సభ్యుని పేజీ లో ఈ ఉప పేజీకి లింకు పెడతాను. ఎప్పుడైనా మీకు ఉపపేజీని మార్చాలంటే ఆ లింకును నొక్కి మార్చుకోవచ్చు. మీరు సరే అంటే చేస్తాను. లేదంటే ఓకే. రవిచంద్ర(చర్చ) 11:10, 21 నవంబర్ 2008 (UTC)

రవిచంద్రగారూ ధన్యవాదాలండి, అలాగే చేయండి, "తెలుగు వికీపీడియాలో తప్పకుండవలసిన వ్యాసాలు" జాబితా తయారవుతున్నది, నాచర్చాపేజీలోని జాబితా దాదాపు అవసరం లేనిదే. కానీ నా పేజీకి ఉపపేజీ అంటున్నారు, అదెలావుంటుందో చూడాలని ఉత్సుకత వుంది. తెలుసుకోనూ వచ్చు. అలాగే చేసి పెట్టండి. ఇలా సదా మీ సలహాలు అందిస్తూ వుండండి. నిసార్ అహ్మద్ 11:27, 21 నవంబర్ 2008 (UTC)
మీ సభ్య పేజీ లో ఉప పేజీకి లింకు అని ఉంటుంది చూడండి. మీరు దీని కోసం కాకపోయినా వేరే ఏదైనా అవసరం వస్తే ఇలాగే చేయండి. సభ్యులు:అహ్మద్ నిసార్/ఉప పేజీ పేరు అనే పేరుతో పేజీ సృష్టించుకుంటే సరి. రవిచంద్ర(చర్చ) 11:35, 21 నవంబర్ 2008 (UTC)
ఎక్కువగా ప్రయోగశాల ను ఇలా ఉపపేజీగా క్రియేట్ చూసుకుంటూ ఉంటారు. (నా సభ్య పేజీకి వెళ్ళి ప్రయోగ శాల అని లింకు ఉంటుంది చూడండి.). మీ ప్రయోగశాలను ఉప పేజీగా సృష్టించాలంటే సభ్యులు:అహ్మద్ నిసార్/ప్రయోగశాల పేరుతో పేజీని సృష్టించుకోండి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేసుకోవచ్చు. మూసలు, టేబుళ్ళు ఇలాంటివి. రవిచంద్ర(చర్చ) 11:51, 21 నవంబర్ 2008 (UTC)

చెత్త వ్యాఖ్య

[మార్చు]

ఇక్కడ ఒక సభ్యుడు కాని అనామకసభ్యుడు ఒక చెత్త వ్యాఖ్య చేశాడు, ఆ చెత్త, నా చర్చాపేజీలో వుంచడం శోభనీయం గాదని తొలగించాను. నిసార్ అహ్మద్ 09:29, 28 డిసెంబర్ 2008 (UTC)

ఇస్లామోఫోబియా వ్యాసం

[మార్చు]

ఇస్లామోఫోబియా వ్యాసం ఇస్లాంని కించపరచడానికి కాదు. అది ఇస్లాంని వ్యతిరేకించే హిందువులు మరియు క్రైస్తవులని విమర్శించడానికి రచించినది. అందుకే వైజాసత్య మరియు Kumarrao మొదట దీన్ని ఎడిట్ చేసి తమకి అనుకూలమైన మార్పులు చెయ్యడానికి ప్రయత్నించారు. వీళ్ళ్ ఉద్దేశం అర్థమవడంతో నేను కొన్ని వాక్యాలు తొలిగించాను. అందుకే నిర్వాహకురాలు వైజాసత్య నా ఐ.పి. బ్లాక్ చేసింది. వైజాగ్ లో ఉండే ఐ.ఎస్.పి. అడ్మినిస్ట్రేటర్ నా స్నేహితుడు కావడం వల్ల నా ఐ.పి. అడ్రెస్ మార్పించగలిగాను.

తాకీదు

[మార్చు]

హిందూ మతం మరియు ఇస్లాం మతాలు "మహోన్నతమైన మీనార్లు", అవి ఎండుటాకులు కావు, కొందరు నికృష్టులు ఊదితే అవి పడిపోవడానికి. వీటికి మీలాంటి (ఇద్దరు సభ్యులూను) వారి సహారా ఈ మతాలకు మరియు వారిని అవలంబించేవారికి అక్కరలేదు. మీ సొంత బాకాలు ఊదుకోవాలంటే, మీరు సొంత వెబ్‌సైట్లు, సొంత బ్లాగులు తెరుచుకోండి, వాటిలో మీ ఆలోచనలను పొందు పరచుకోండి. తెవికీ ఇలాంటి బాకాలకు వేదిక కాదు. ఇది విజ్ఞాన సర్వస్వం. ఇందులో వైజ్ఞానిక విషయాలు వ్రాయండి. మా సొంత ఆలోచనలు మా బాకాలు మేము ఊదుకోలేమా? మేము విమర్శలు చేయలేమా, లోకజ్ఞానం మాకు లేదా?, ఏమిటి మీకు తెలిసిన నిజాలు, నిజాలు ప్రూవ్ చేయడమేమిటి? మీ వాగ్ధాటిలో అంత సత్తువ ఉంటే, ఏదైనా ఒక బ్లాగులో కలుసుకుందాం రండి, అక్కడ వాదులాడుకుందాం! అపుడు తెలుస్తుంది ఎవరి వాదనలలో ఎంత సత్తువ ఉందో ఎంత నిజాయతి ఉందో ఎంత సత్యముందో, ఒళ్ళంతా విషం నింపుకుని, అవతలి వాళ్ళకు వైద్యం చేయడానికి వచ్చారా? మీకు "అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ" అనే శ్లోకానికి అర్థం తెలుసా? దీని అర్థం తెలుసుకుంటే మీ (మా) జన్మలు ధన్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకు నిజంగానే హిందూమతం, ఇస్లాం మతం పట్ల అపార ప్రేమలుంటే, లక్షలకొద్దీ కన్‌స్ట్రక్టివ్ వ్యాసాలు వ్రాయవచ్చు. అలా చేయండి, అవి అందరికీ మంచి ఫలాలనిచ్చే వృక్షాలవుతాయి, వీటి వలన లభించే పుణ్యంతో మీకు మోక్షమూ కలుగవచ్చు. మీకు సన్మతి ఇవ్వాలని మనసారా ఆ పరమేశ్వరుణ్ణి (అల్లాహ్) ను కోరుకుంటున్నాను. నిసార్ అహ్మద్ 13:20, 5 డిసెంబర్ 2008 (UTC)

ఇక్కడ కేవలం దేవుడు లేడు, దెయ్యాలు లేవు అని నేను శృంగం(బాకా) ఊదడం లేదు. జార్జ్ బుష్, ఈదీ అమీన్ లాంటి హింసా వాదుల్ని ఆదర్శంగా తీసుకుని మతం పేరుతో హింస జరిపే వాళ్ళని విమర్శిస్తున్నాను. శృంగనాదాలు చెయ్యడం ఆర్.ఎస్.ఎస్. వాళ్ళకీ, జార్జ్ బుష్ మరియు ఈదీ అమీన్ లాంటి వారి అభిమానులకి చేతనవుతుంది కానీ నాకు చేతకాదులే.

40వేల వ్యాసం

[మార్చు]
నిసార్ అహ్మద్ గారూ, మీరు ప్రారంభించిన మానస్ జాతీయ అభయారణ్యం వ్యాసంతో తెవికీ 40వేల వ్యాసాల మైలురాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా శుభాభివందనాలు. తెవికీలో మీకు కృషి అభినందనీయం --వైజాసత్య 00:23, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాథమిక హక్కులు వ్యాసం

[మార్చు]

నిసార్ గారు, భారతదేశంలో ప్రాథమిక హక్కులు వ్యాసాన్ని బాగా తీర్చిదిద్దుతున్నారు. Right against exploitation కు దోపిడిని నివారించే హక్కు గాను, Right to constitutional remedies కు రాజ్యాంగ పరిహారపు హక్కుగాను వ్రాయవచ్చు. అట్లే ఆస్తి హక్కు విభాగంలో ఆర్టికల్ 19 నుండి 31 అని వ్రాశారు, దాన్ని ఒకసారి సరిచూడండి. వ్యాసం మొత్తం పూర్తయిన తర్వాత వాక్యాల అమరిక సరిచేయాల్సి వస్తుంది. అనువాదం చేసేటప్పుడు ఏ వ్యాక్యానికి ఆ వాక్యం విడివిడిగా వ్రాస్తాము కాబట్టి పేరా కూర్పు సరిగా ఉండక పోవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:25, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఉద్యమ ప్రణాళిక

[మార్చు]

మీ పేజీలో మీరు వ్రాసుకొన్న ప్రణాళిక చూశాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ప్లానింగ్ లేకుండా పెద్ద ప్రాజెక్టులు సాధ్యం కావు. కాని ఇది దీర్ఘకాలిక కార్యక్రమం గనుక మీరు వ్రాసిన విషయాలు అధ్యయనం చేసి, అంచెలంచెలుగా అమలు చేద్దాము. ఒక వారంలో నా వ్యాఖ్యలు వ్రాస్తాను. తరువాత రచ్చబండలో పెడదాము. (మీ చర్చా పేజీ బాగా పెద్దదైనందున పాత చర్చలను నిక్షిప్తం చేశాను) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:33, 15 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

A little help: Ecser

[మార్చు]

Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages, but I can't speak Telugu. Could you help me. My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile. Or my e-mail is: eino@freemail.hu

Thank you! Norbert

Thank you fot the translation :) It looks great! Norbert

దారి మార్పులు

[మార్చు]

నిస్సార్ గారూ! చర్చ:హిందూస్థానీ సంగీతము లో మీరు దారి మార్పు సూచించారు. దారి మార్పులు చాలా చీపు (అని వైజా సత్య అన్నాడనుకొంటాను). మీకు అవసరమనిపించినపుడు పేజీ పైన "తరలింపు" ట్యాబ్ ద్వారా దారి మళ్ళించేయండి. కేవలం భిన్నాభిప్రాయాలుండవచ్చునని అనుకుంటే చర్చకు పెట్టండి. మీ పేజీలో ఒక హంగెరీ వికీపీడియన్ తన వూరు ఏచర్ గురించి వ్రాయమని కోరాడు అని ఇప్పుడే చూశాను. ఆ పేజీ నేను మొదలు పెడతాను. వీలయితే మీరు అనువాదం చేయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:59, 24 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాసాల నుండి కాపీ

[మార్చు]

చంద్రకాంతరావు గారూ, నాకు పట్టికలు, మూసలు తయారుచేయడం రాదు, కావున, మీవ్యాసాల నుండి కొన్ని పట్టికలు మూసలు కాపీచేసి వాడాను. నేనింతవరకు వ్యాసాలలో ఉపయోగించిన పట్టికలు, మీవ్యాసాల నుండి 'మాడల్' గా తీసుకున్నవే. అలాగే 'మూస:ఒలంపిక్ క్రీడలు' ఉపయోగించి, 'మూస:ఆసియా క్రీడలు' గా మార్చాను. అలాగే 'జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు' మూసను కూడా కాపీ చేసుకుంటున్నాను, అన్యదా భావించకండి ప్లీజ్, మిత్రుడు నిసార్ అహ్మద్ 20:36, 28 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు, ఇందులో అన్యధా భావించడానికేమీ లేదు పైగా నాకు సంతోషమే. మనం రచిస్తున్న వ్యాసాలు కూడా స్వేచ్చగా ఎవరైనా ఉపయోగించడానికే కదా. మీకు ఇంకనూ ఏదైనా అవసరమైతే అడగండి నా వంతు సహాయపడతాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:41, 28 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కుల నిర్మూలనపై చర్చ

[మార్చు]
కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మరియు కులనిర్మూలన, ఈ మూడు వ్యాసాలలో దాదాపు ఒకే రకమైన విషయాలున్నవి (ఉదాహరణలు అన్నిట్లోనా ఒకటే).
  • కులాంతర వివాహం అనగా, ఒకే మతంలోని విభిన్న కులాలవారి మధ్య వివాహం.
  • మతాంతర వివాహం అనగా, రెండు వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య వివాహం.
  • మతం అంటే మార్గం, కులం అంటే సమాజంలో వృత్తి పరమైన గుర్తింపు. వీటి సహకారంతో మనిషి ఇప్పటివరకూ జీవిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, ఇతరులకు హాని లేకుండా జీవనం సాగిస్తే ఏ బాదరబందీ వుండదు. ఉన్మాదం లేదా 'fanaticism' బయలుదేరకూడదు. మతాంతర వివాహాలు చేసుకున్న పెద్ద పెద్ద వారికి పెద్ద సమస్యలుండవేమో, చిన్నా చితకా మనుషులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇంకనూ సమస్యల సుడిగుండమేమో, సంకర మతాలు, సంకర కులాలు అనే విభాగాలు జనియించే ప్రమాదం వున్నదేమో?. కులం అనేది సామాజిక గుర్తింపు అయితే, కులం లేకుండా పోవడం అనేది కూడా ఓ గుర్తింపేకదా! ప్రతి మనిషి తన గుర్తింపు తన సమూహపు గుర్తింపు ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు. అలాగే పైనుదహరింపబడిన వ్యాసాల రచయిత గారు, కులనిర్మూలన గురించి వ్రాస్తూనే, దూదేకుల అనే వ్యాసం సృష్టించారు. (వారి మనసు నొప్పించియుంటే క్షమాపణలు కోరుతున్నాను). కులాలు ఉండకూడదు అని కోరుకోవడంలో ఎంత ఔచిత్యముందో, కులాలుండాలి అని కోరుకోవడంలోనూ అంతే ఔచిత్యమున్నదేమో?. కానీ ఇక్కడ కులాలు 'తక్కువ' 'ఎక్కువ' అనే ధోరణి వుండకూడదు. ఇక్కడ నిర్మూలించాల్సింది, కులాల మధ్య తారతమ్యతను, వాటి పోలికలను, మరియు అస్పృశ్యతను. ప్రతి కులస్తుడూ తాను సరి, అని అనుకుంటాడు. అలాంటి సమయంలో ఇతరులు సరి కారు అనే అర్థం స్ఫురిస్తుంది. దూదేకుల అనే వ్యాసంలో రచయతగారు, దూదేకులు మాత్రమే 'సెక్యులర్'లు అనే అర్థం వచ్చేలా వ్రాశారు. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ఉదాత్తులు ఉన్నారు. సర్వజ్ఞానులూ ఉన్నారు. రచయిత గారికి ఓ సూచన, వాస్తవాలను సోదాహరణంగా వివరిస్తూ వ్రాస్తే అందరూ సంతోషంగా స్వీకరిస్తారు. మీ సొంత అభిప్రాయాలు గౌరవనీయమే, సమాజంలోని సత్యాలూ గౌరవనీయమే గదా. పరస్పర గౌరవాలే మంచి భవిష్యత్తుకు నాంది. నిసార్ అహ్మద్ 12:52, 29 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది అసలైన సెక్యులర్ కులం అనటానికి కారణం వీరిలో హిందూ, ముస్లిం,క్రైస్తవ ఆచారాలు మూడూ కనిపిస్తాయి కాబట్టి.అంతేకానీ దూదేకుల కులం మరో కులాని కంటే ఎక్కువని చెప్పలేదు.ఆకులాన్ని సమర్ధిస్తే కలిగే ప్రయోజనమూ లేదు.ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులాన్ని గురించి ఉన్న నిజాలు తెలిసిన విషయాలు చెప్పినట్లే ఈ వ్రాతలు కూడా.సెక్యులర్ గాఇలాగే ఇంకా ఏవైనా కులాలుంటే వాటిని గురించి తెలియ జేయండి.కులనిర్మూలనకే మన ఓటు.ఈకులాలు మనకు కూడు పెట్టవు.మనము కులాల బందీఖానాలో ఉన్నాము.కులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐఖ్యత వస్తుంది.తెలుగు భాషపట్ల మీఅపార ప్రేమను వికీలో అనేక అంశాలపై మీరు చేసిన కృషిని చూశాను. అభినందనలు. రహంతుల్లా.

  • నిసార్ గారూ,సలామ్.ముస్లిముల్లోని అపవిశ్వాసాల జాబితా పట్టిక రూపంలో పెట్టడంతో పాటు ఆయా నమ్మకాలు ఏ ఏ లేఖనాల ప్రకారం తప్పో తెలిసినంతవరకు పూరించండి.ఎక్సెల్ షీట్ ను యధాతదంగా పేష్ట్ చేసే విధానం ఎవరో రూపొందించారని అవసరమైతే పంపిస్తానని కాసుబాబు గారు చెప్పారు.వీలైతే పంపండి.--Nrahamthulla 12:43, 22 నవంబర్ 2008 (UTC)
అవును. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, కులనిర్మూలన -- ఈ మూడు వ్యాసాలలోని విషయాలను లాజికల్‌గా పునర్వ్యవస్థీకరించాలి. సమయం దొరికినపుడు ప్రయత్నిస్తాను. ఇందుకు కులం, మతం, వివాహం అనే వ్యాసాలను పరిశీలించి తరువాత వ్యాసాలను సరిచూడాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:38, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా

[మార్చు]

నిస్సార్ గారూ! ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా ను మరింత సంపూర్ణంగా చేయగలరా? మీ పేజీలో ఉన్న వ్యాసాలన్నింటినీ ఏదో ఒక సెక్షన్‌లో ఉంచవచ్చును. కావాలంటే క్రొత్త సెక్షన్‌లు సృష్టించవచ్చును. {{ఇస్లాం}} మూసను ఈ జాబితా ఆధారంగా మళ్ళీ డిజైన్ చేయాలనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:03, 1 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ, నమస్తే, ఈదుల్-అజ్ హా అనే పేజీని 'తరలింపు' బక్రీదు లేదా బక్రీద్ పేజీతో చేస్తే, తరలింపు జరిగి, బక్రీదు లేదా బక్రీద్ పేరుతో పేజీ వస్తుంది. కానీ పేజీ పేరు ఈదుల్-అజ్ హా గానే వుండాలి, బక్రీదు లేదా బక్రీద్ పేరులతో తరలింపు జరగాలి, అంటే యేమి చేయాలి కొంచెం తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 20:49, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


బక్రీదు లేదా బక్రీద్ అనే (క్రొత్త) వ్యాసాలు తెరిచి, వాటిలో #REDIRECT [[ఈదుల్-అజ్ హా]] అని వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 03:50, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిసార్ గారూ సయ్యద్ నశీర్ అహ్మద్ తెలుగులో రచనలు చేసిన ఇంచుమించు 500 మంది ముస్లిం రచయితలు కవుల వివరాలతో డైరెక్టరీ ముద్రించే పనిలో ఉన్నాడు.మీవివరాలు మీకు తెలిసిన వారివివరాలు అందజేయగలరు--Nrahamthulla 16:13, 28 నవంబర్ 2008 (UTC)

3వ లక్ష దిద్దుబాటు

[మార్చు]
  • నిస్సార్ గారూ వీకీపీడియా మైలురాయి అయిన 3వ లక్ష దిద్దుబాటు చేసినందుకు అభినందనలు.

--t.sujatha 04:06, 4 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

మీ అభిమానానికి ధన్యవాదాలు నిస్సార్ గారూ! δευ దేవా 08:45, 21 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఖ + ఒ ; క్ష సమస్య

[మార్చు]

ప్రదీపు గారూ నమస్తే, ఖ్+ఒ= ఒత్వముతో ఖ రావలెను, కానీ 'ఓత్వము' తో అనగా దీర్ఘముతో వస్తున్నది. ఉదాహరణకు, ఖోరాన్, ఖోరానా, ఖోరాసాన్ లాంటి పదాలలో "ఒత్వము" బదులు దీర్ఘముతో ("ఓత్వము") తో వస్తున్నది. ఇది కేవలం "ఖ" అక్షరానికే వస్తున్నది. అలాగే క్+ష= క్‌ష్+అ రావాలి, కాని 'క్ష' వస్తున్నది. ఉదాహరణకు, ఆక్షన్ action, రియాక్షన్ reaction, ప్రొడక్షన్ production, ఇంట్రోడక్షన్ introduction లాంటి పదాలు. మొదటి ఉదాహరణలో 'అచ్చు' రెండవ దానిలో 'హల్లు' యొక్క ఉచ్ఛారణ మారిపోతున్నది. దీనికి విరుగుడు ఏమైనా వున్నదా? ఉంటే కాస్త తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 15:08, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఖ+ఒ సమస్యను సరి చేసాను మీ కాషేను ఒక సారి రిఫ్రెష్ చేసుకుని మళ్లీ ఒక సారి ప్రయత్నించండి. ksha కి 'క్ష' కాకుండా క్‌ష్ రాయటం కుదరటం లేదు, అది ఫాంటులో ఉన్న సమస్య అనుకుంటా!! దానిని ఇంకో సారి పరీశీలించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:01, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుసుకోవాలనుకుంటున్నాను

[మార్చు]

కాసుబాబు గారూ, నమస్తే, నేను చిన్నప్పుడు కొన్ని లోకాలగూర్చి చదివాను, సరిగా గుర్తుకు రావడంలేదు, చూచాయగా మాత్రం చెప్పగలను, ఉదాహరణకు; అతలము, తలాతలము, రసాతలము, పాతాళము మున్నగునవి (బహుశా సప్తలోకాలు గావచ్చు, నాకు సరిగా తెలియదు, పౌరాణిక చిత్రాల్లో కూడా విన్నట్టు గుర్తు). ఇవి ఉన్నాయా? ఉంటే వాటి విషయాలు ఎక్కడనుండి గ్రహించవచ్చునో తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 17:31, 27 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చతుర్దశభువనాలు చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:08, 27 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలు

[మార్చు]

నిసార్ గారు మీ అలుపెరుగని కార్యదీక్షకు నా ధన్యవాదాలు. వ్యాసాలను వర్గీకరించడంలో కొంచెం జాగ్రత్త అవసరం. వికీపీడియా పాలసీలలో వర్గాలను వీలైనన్ని తక్కువగా ఉంచితే మంచిది. లేకపోతే ప్రతీ వర్గంలో ఒకటి రెండు కంటే వ్యాసాలుండవు. మీరు ఒక్కసారి వర్గాలన్నింటిని పరిశీలిస్తే అర్ధం అవుతుంది. అంతర్జాతీయ ప్రముఖుల గురించి ఒక వర్గం కంటే ఎక్కువగా వర్గాలలో చేర్చడం అనవసరం. అది ఆ దేశానికి చెందినదైతే మంచిదని నా అభిప్రాయం. ఆ దేశానికి చెందిన విషయాలు ఎక్కువయినప్పుడు కొత్తవర్గాలు చేర్చవచ్చును. ఇంగ్లీషు వికీలోని వర్గాలన్నింటిని తెలుగులో తర్జుమా చేసి కొత్తగా చాలా వర్గాలు తయారుచేయడం మూలంగా మొత్తం వర్గీకరణ పద్దతే కన్ఫ్యుజింగ్ గా మరిపోతుంది. కొంచెం అర్ధం చేసుకొండి.Rajasekhar1961 05:22, 3 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనకు ధన్యవాదాలు రాజశేఖర్ గారూ, మీ సూచన చాలా సమంజసమైనది, అలాగే చూస్తాను. నిసార్ అహ్మద్ 05:26, 3 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లవికీలో శాసన సభ నియోజక వర్గాల పేజీ

[మార్చు]

కాసుబాబు గారూ నమస్తే! ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు అనే పేజీ 'ఇవికీ'లో లేదు. ఈ పేజీని 'తర్జుమా' చేయకముందు ఇవికీలో పెడదామా? మూడు జిల్లాల సమాచారం తెలుగులో తర్జుమా చేసాను, దాని తరువాత నాకు తట్టింది, ఆంగ్లంలో వున్న విషయాన్ని 'ఇవికీ' పెడదామని. తెలుగులో వున్న కొద్ది భాగాన్ని, లింకునుండి సేకరించి అలాగే పెట్టవచ్చు. మీ అభిప్రాయం తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 15:13, 7 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అది మీ అభిరుచి ప్రకారం చేయవచ్చును. అంటే నా ఉద్దేశ్యం తెలుగు వికీలో వ్రాసిన దానికి ఆంగ్లంలో వ్యాసం ఉండి తీరాలని లేదు. నాకేమనిపిస్తుందంటే ఏ లింకునుండయినా కాపీ చేసి ఆంగ్లంలో పెట్టడం చాలా తేలిక. కనుక ఆంగ్ల వికీలో వ్యాసం పెట్టినందువల్ల పెద్దగా ప్రయోజనం రాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:42, 7 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాల వ్యాసాలు

[మార్చు]

నిస్సార్ గారు, నియోజకవర్గాల వ్యాసాల గురించి మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నచిన్న తప్పులున్నా సరిదిద్దుకోవచ్చు. లోకసభ నియోజకవర్గాల వ్యాసాలలో ఇచ్చిన శాసనసభ నియోజకవర్గాల పేర్లకు ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల వ్యాసాల కోసం సృష్టిస్తున్న పేర్లకు కొద్ది తేడా ఉన్నమాట వాస్తవమే. లోకసభ నియోజకవర్గాల వ్యాసాలను సృష్టించేటప్పుడు నేను వార్తాపత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా పేర్లు ఇచ్చాను. ఆ తరువాత కొన్ని స్వల్ప మార్పులు, చేర్పులు జరిగాయి దీన్ని సరిదిద్దుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. అలాగే మనం నియోజకవర్గాలలో చేర్చవలసిన సమాచారం ఇంకనూ చాలా ఉంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:35, 7 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


నిస్సార్ గారూ! నియోజక వర్గాల వ్యాసాల మీద మీరు, చంద్రకాంత్, రాజశేఖర్ చేస్తున్న కృషి అద్భుతం. అభినందనలు. మీకు టేబుల్స్ వాడడం బాగా అలవాటయ్యినట్లనిపిస్తున్నది. నాకు ఇప్పటికీ ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. నా (పూర్తిగా వ్యక్తిగత) అభిప్రాయంలో పట్టికలను పరిమితంగా వాడడం మంచిది. ఎందుకంటే ఇతరులు దిద్దుబాట్లు చేసేటపుడు చిన్న పొరపాటు వల్ల పట్టిక చెడిపోయే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు వ్యాసంలో సమాచారాన్ని ఇలా కూడా వ్రాయవచ్చును

జిల్లా పేరు (హెడింగ్)
  • (క్రమ సంఖ్య), నియోజక వర్గం-1
    • మండలం-1, మండలం-2, మండలం-3
  • (క్రమ సంఖ్య), నియోజక వర్గం-2
    • మండలం-4, మండలం-5, మండలం-6

అలా..

ఇప్పటికి వ్రాసినవి మార్చవద్దు. ఇక ముందు వ్రాసే వ్యాసాలలో నా సూచనను కూడా పరిగణించ గలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:23, 9 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ! మీ సూచనకు ధన్యవాదాలు, మీరిచ్చిన కూర్పు సులభంగానూ, దిద్దుబాట్లు చేయడానికి ఈజీగాను వున్నది. చిన్న చిన్న పట్టికలకైతే మీరు సూచించినది సరైనదిగా తోచుచున్నది. కానీ కొంచె పెద్ద పట్టికల విషయాలలో మాత్రం, "స్పష్టత" చాలా ముఖ్యం, దానికొరకు పట్టీలే సరైన సాధనాలు. కొంచెం గమనించగలరు. అయినా రాస్తూ పోదాం, సరైన కూర్పులు అనసరానుగుణంగా మన వికీపీడియనులు చేపడుతారని నా ఆశ మరియు నమ్మకం. మిత్రుడు. నిసార్ అహ్మద్ 14:36, 9 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఐతే ఓకే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:43, 9 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా సభ్యనామం తెలుగులో

[మార్చు]

వైజాసత్య గారూ నమస్తే, నా సభ్యనామం ఆంగ్లంలో "Ahmadnisar" అని యున్నది, దానిని 'తెలుగు' లో "అహ్మద్ నిసార్" గా చూడదలచుకున్నాను. దానిని మార్చాలంటే తెవికీ అధికార్లకు తెలియజేయాలని గమనించాను, మీరు నా సభ్యనామాన్ని తెలుగులో మార్పు చేయాలని కోరుకుంటున్నాను. మిత్రుడు నిసార్ అహ్మద్ 14:09, 11 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ పేరును తెలుగులోకి మార్చాను. లాగిన్ అయ్యి చూసుకోండి :-) --వైజాసత్య 23:33, 11 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు కనుక మోజిల్లా ఫైర్ ఫాక్స్ ను వాడుతున్నట్లయితే అందులో ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ అని ఒక addon ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఎలా వాడాలో మోజిల్లా సైట్ లోనే ఉంటుంది. ఒక సారి సందర్శించండి. (గూగుల్ లో indic input extension ని వెతకండి). రవిచంద్ర(చర్చ) 03:46, 18 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం తొలగింపు గురించి

[మార్చు]

కాసుబాబుగారూ, నమస్తే, పేజీని ఎలా తొలగిస్తారు? దీని విధానం కొంచెం తెలుపగరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 08:44, 23 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాన్ని తొలగించడానికి నిర్వాహకులకు మాత్రమే సదుపాయం ఉంది. కనుక మీరు వ్రాసినట్లే {{తొలగించు|కారణం}} అని వ్రాసి వదిలేయండి. నిర్వాహకులు ఎవరో ఒకరు తొలగిస్తారు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:52, 23 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారితో చర్చించిన విషయం

[మార్చు]

చంద్రకాంతరావు గారూ నమస్తే, మీ చర్చాపేజీ (ఈ పేజీ) ఇప్పుడే చూసాను. చాలా కంగారుపడుతూ వ్రాస్తున్నాను. చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల గురించి వ్రాసేటపుడు నేను అసెంబ్లీ నియోజకవర్గం అని వ్రాయడం మొదలు పెట్టాను. తరువాత సభ్యులు 'శాసనసభ' అంటూ వ్రాస్తున్నపుడు, నేను కూడా శాసనసభ అంటూ వ్రాస్తూ పోతున్నాను. మీరు ఈ విషయం గురించి బాధపడుతూవుంటే, నేను చాలా మధనపడుతూ వ్రాస్తున్నాను. సత్యమేమంటే, తెవికీలో వ్యాసాల తరలింపులు వగైరాల గూర్చి నాకు అవగాహన తక్కువ. బహుశా దీనివలనే ఈ స్థితి వచ్చిందనుకుంటాను. మీరు నిస్సందేహంగా, నాచర్చా పేజీలో నాకు గైడ్ లైన్స్ వ్రాయండి, నేను దాన్ని అర్థం చేసుకుంటూ వ్రాస్తూ పోతాను. మీకు నొప్పించాలని నాకు ఆలోచనలో సైతం భావన లేదు. నేను అమితంగా అభిమానించే మరియు గౌరవించేవారిలో మీరూ ఒకరు. మీరు ఇలా మధనపడుతూవుంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను గ్రహించినది ఏమంటే మీరు ఒక 'వికీ ఋషి' మరియు 'వికీ తపస్వి', మీరు ఏకొంచెం ఢీలా పడినా తెవికీ కి, తీరని నష్టం కలుగుతుంది. దీనిని నేనేకాదు, ఎవరూ కోరుకోరు. మీరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను.

  • ఈ గందరగోళానికి తెరదించాలంటే ఒకే ఒక నివారణోపాయం: రాజకీయశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, క్రీడలు (మరియు మీకిష్టమైనవి) మొదలగు విషయాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా మీరే వ్యవహరించండి. వీటిపై పర్యవేక్షణ మరియు సూత్రీకరణ బాధ్యతలు మీరే చేపట్టండి, అవి ఇతరులకు మార్గదర్శకాలుగా ప్రామాణికతను కలిగివుంటాయి. ఆతురతతో మిత్రుడు. నిసార్ అహ్మద్ 13:09, 30 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీకు తెలియక పేజీలు తరలించినారని చెబుతున్నారు కాని ఒకటి కాదు రెండు కాదు పెద్ద సంఖ్యలో పేజీలను ఎలాంటి కారణం లేకుండా తరలించారు. కనీసం చర్చా పేజీలో వ్రాయవలసింది. నాలుగు మాసాల క్రితమే ఇదే విషయంపై చర్చ జరిగింది. ముగ్గురు మూడు రకాలు అభిప్రాయాలు వెలిబుచ్చడంతో ఎటూ నిర్ణయం కాలేదు కాబట్టి నేను అసెంబ్లీ అనే వాడటం కొనసాగించాను. ఇది కూడా కొన్ని జిల్లాలకే పరిమితం చేశాను. ఇతర జిల్లాకు చెందిన నియోజకవర్గాలకు శాసనసభ అనే టైటిల్ పెట్టి అసెంబ్లీ దారిమార్పులు ఇచ్చాను. మీరు పేజీలను తరలించడం కాకుండా దారిమార్పు ఇచ్చేస్తే సరిపోయేది. మీరు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు వ్యాసంపై చర్చ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది, వ్యాసం పేరుపై సందేహం వచ్చిననూ దాన్ని ఏకపక్షంగా ఎవరూ తరలించలేరు, అంతేకాకుండా చర్చలో మీ అభిప్రాయం వెలిబుచ్చిన పిదపే దాన్ని నేను కొత్త పేరుకు తరలించాను. ఎవరో కొత్త సభ్యులు సృష్టించిన పనికి రాని వ్యాసాలు తొలిగించినా ఎవరూ అభ్యంతరపర్చరు పైగా అది నిర్వహణలో భాగం. ఉన్న కొద్ది చురుకైన సభ్యుల వ్యాసాలలో ఉన్న వాటికి భిన్నంగా పెద్ద మార్పులు, చేర్పులు చేయాల్సినప్పుడు, పేర్లు తరలించేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించాలి, వారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆషామాషీగా పేర్లు పెట్టడం, వ్యాసాలు వ్రాయడం మనం చేయం. అలా అనిపించిననూ దానికీ కారణముంటుంది. కొన్ని మాసాల క్రితం నిర్వహణలో భాగంగా వ్యాసాలలోని ఆంగ్ల భాగాలు తొలిగించేటప్పుడు మీకు ముందే తెలియజేశాను. మీరు వాటిని అనువదించి పూర్తిచేశారు. అంతేకాని నేను ఏకపక్షంగా మీకు చెప్పాపెట్టకుండా ఆ భాగాలను తుడిచివేయలేను. మీరు వ్రాసిన కొన్ని వ్యాసాలలో తప్పులుంటే నేను చర్చా పేజీలలోనే తెలియజేశాను కాని వ్యాసం జోలికి పోలేను. అలా వ్యాసంలో దూరి నేను కనుక మార్పులు చేయడం ప్రారంభిస్తే వ్యాసం స్వరూపమే మారిపోతుంది. అప్పుడు మీకూ భాధకల్గవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక మీరు మీ పని కానిచ్చేయండి, తెవికీ వృద్ధికి తోడ్పడండి. మీ లాగే నాది కూడా తెలుగు మాతృభాష కాదు. అయినా తెలుగు భాషపై ఉన్న మమకారంతో, అభిమానంతో, తెలుగు ప్రజలకు నా వంతు తోడ్పడాలనే ఉత్సుకతలో ఇక్కడ పనిచేస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:34, 31 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పేజీలు వ్రాసేసమయంలో, అసెంబ్లీ నియోజకవర్గాలు అని ప్రారంభించాను.

తరువాత సభ్యులు శాసనసభ నియోజకవర్గాలు అని వ్రాయడం చూసి, మరో ఆలోచన లేకుండా వ్యాసం పేరు శాసనసభ వచ్చేటట్లుగా తరలించడం ప్రారంభించాను. ఇలా తరలించడానికి నేను భావించిన కారణాలు, శాసనసభ పేరుతో ఉండాలి, మరియు పని తొందరగా జరగాలి.

  • ఇది నేను అవగాహన లేని కారణంగా చేసిన పని.
  • నేను చేయవలసియుండినది : సభ్యులతో సంప్రదించి, వారి అభిప్రాయాలు తెలుసుకొని మరీ తరలింపులు గావించవలసిది.
  • అలా చేయని కారణంగా జరిగినది: నాకు తెలియకుండానే, ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే, గౌరవనీయ సభ్యులను బాధపడేలా చేశాను. దీనికి నేను చింతిస్తున్నాను. నిసార్ అహ్మద్ 09:14, 1 ఆగష్టు 2008 (UTC)

సోక్రటీసు వ్యాసం గురించి

[మార్చు]

నిసార్ గారూ నేను ఆ రెండింటినీ విలీనం చేస్తాను. ఒక వ్యాసం ప్రారంభించేటపుడు ఒకవేళ ఆ వ్యాసం ఇదివరకే ఉండవచ్చునన్న అనుమానం వస్తే సర్చ్ బాక్స్ లో ఒకసారి టైపు చేసి చూడండి. తరువాతనే వ్యాసాన్ని ప్రారంభించండి.లేక పోతే మీ శ్రమ వృధా కావచ్చు. రవిచంద్ర(చర్చ) 12:28, 11 నవంబర్ 2008 (UTC)

రవిచంద్రగారూ, ధన్యవాదాలండి. నాకు ఇలా చాలాసార్లు జరిగింది. నిజంగానే శ్రమ వృధా అయిందండి. ఆ సమయాన్ని ఇతర వ్యాసాలమీద ఉపయోగించియుండవచ్చు. మీ సూచన తప్పకుండా పాటిస్తాను. నిసార్ అహ్మద్ 12:58, 11 నవంబర్ 2008 (UTC)

తెవికీలో తప్పకుండా వుండవలసిన వ్యాసాల జాబితా

[మార్చు]

కాసుబాబు గారూ నమస్తే, "తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు" జాబితా తయారుకు ప్రారంభం శుభసూచకం. సభ్యులందరికీ అభినందనలు. మీరు దీనికి మార్గ దర్శకాలు ఇస్తున్నారు, దీనికీ అభినందనలు అందుకోండి. అలాగే, నాపేజీలో చివరిభాగాన ఓ నమూనా జాబితా తయారీకి శ్రీకారం చుట్టాను. దీనికి మూలం వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు. ఈ రూపేణా జాబితా తయారీకి అనుకూలమా కాదా, ఓ మోస్తరులా వున్నది అని తోచితే, సవరణలు చేసి జాబితా తయారు చేయండి, లేదా తగు సూచనలివ్వండి. సోదరుడు నిసార్ అహ్మద్ 19:21, 19 నవంబర్ 2008 (UTC)

అలాగే చేస్తాను. ఇది కొంత సమయం పట్టేలా ఉంది. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:52, 20 నవంబర్ 2008 (UTC)
ధన్యవాదాలు, అందరూ పాల్గొనాల్సిందే, శుభం నిసార్ అహ్మద్ 06:01, 20 నవంబర్ 2008 (UTC)
జాబితా ఇప్పటికి ఒక షేపుకు వచ్చిందనుకొంటాను. మీ సభ్యుని పేజీనుండి ఇతర వ్యాసాలను ఈ జాబితాలో వ్రాయండి. ఇప్పటికి ఎన్ని అయ్యాయో ఒకసారి లెక్కబెట్టగలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:30, 23 నవంబర్ 2008 (UTC)

కూర్పులు కనబడకపోవడానికి కారణం

[మార్చు]

కాసుబాబు గారూ, నమస్తే, నేను వ్రాసిన చాలా వ్యాసాలకు కూర్పుల చరిత్ర కనబడుటలేదు, కారణం తెలియదు. ఉదాహరణకు, ఊపిరి తిత్తులు, కలువ పువ్వు మొ. (ఇంకనూ ఇలా చాలా వున్నవి). వ్యాసాలు మొదలెడితే వాటి చరిత్ర నిక్షిప్తమై యుంటుందని అంటారు, కానీ, ఇలా ఎందుకు కనబడుటలేదో కారణం కొంచెం తెలుపగలరా. తెలుసుకోగోరుచున్నాను. ధన్యవాదములు. నిసార్ అహ్మద్ 16:09, 27 నవంబర్ 2008 (UTC)

ఆ వ్యాసాలు దారిమార్పు జరిగినట్లున్నాయి. మీరు సృష్టించి పేజీ ఊపిరి తిత్తులు . ఆ పేజీ చరిత్రలో మీరు వ్రాసిన చరిత్ర ఉంది. దారిమార్పు సమయంలో "తరలింపు" బదులు పాత పేజీనుండి కట్ చేసి, క్రొత్త పేజీలో పేస్ట్ చేసినట్లయితే పాత పేజీ చరిత్ర క్రొత్త పేజీలో చేరదు. అనుభవం ఉన్న సభ్యులు ఇలాంటి దారిమార్పులో జాగ్రత్త వహిస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:37, 27 నవంబర్ 2008 (UTC)

సంయనం

[మార్చు]

నిసార్ గారూ, వెంటనే ప్రతిస్పందించకుండా కాస్త సంయమనం పాటించండి ప్లీజ్. సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకుందాం --వైజాసత్య 15:56, 5 డిసెంబర్ 2008 (UTC)

మీ మాటకు గౌరవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిసార్ అహ్మద్ 17:18, 5 డిసెంబర్ 2008 (UTC)

అభినందనలు

[మార్చు]

గత కొన్నిరోజులుగా తెవికీలో నెలకొనివున్న అయోమయాన్ని తొలగించుటకు, తెవికీని తీర్చిదిద్దుటలో మీరు తీసుకున్న చర్యలకు అభినందనలు. సోదరుడు. నిసార్ అహ్మద్ 05:08, 14 డిసెంబర్ 2008 (UTC)

నిసార్ భాయ్! మీ అభిమానానికి, నా మీద ఉంచిన గౌరవానికి కృతజ్ఞతలు. ఆ గౌరవానికి తగ్గట్టుగా నడుచుకొనేందుకు సర్వదా కృషిచేస్తాను --వైజాసత్య 05:15, 14 డిసెంబర్ 2008 (UTC)
మీ అభిమానానికి కృతజ్ఞున్ణి. నాకు తగినంతలో నా భాధ్యత నెరవేర్చానంతే. వ్యాసాలపై వివాదాలు చెలరేగినపుడు, కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని రావడం చాలా మేలైన పద్దతి. ఇది కోపం వచ్చినపుడు అంకెలు లెక్కపెట్టడం లాంటి పద్దతన్న మాట. దాన్ని పాటించి మీరు సరైన పని చేశారు. మీ సంయమనం హర్షించదగ్గది. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు మనమందరం బెదరకుండా, తొణక్కుండా తెవికీని, అందరికీ విజ్ఞానం అనే మహోన్నత లక్ష్యం వైపు నడిపించడానికి ఆ సర్వాంతర్యామి మనందరికీ శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. రవిచంద్ర(చర్చ) 11:58, 14 డిసెంబర్ 2008 (UTC)

పునః స్వాగతం

[మార్చు]

నిసార్ గారు, పునః స్వాగతం. శ్రుతిమించిన వివాదాస్పద వ్యాసాలు తయరవుతున్నాయి అనిపిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇప్పుడు రోజు రోజుకూ ఇటువంటివి మరిన్ని తయారవుతున్నాయి అనిపిస్తున్నది. పనిగట్టుకొని మరీ విరుద్దభావాలతో వ్యాసాలు రాస్తున్నారు. అవి నిజాలే కావచ్చు, కానీ రహంతుల్లాగారు చెప్పినట్టు అందులోని మంచి గురించి రాస్తే బాగుండేది. ఎవరి ఆనందం వారిది!! --Svrangarao 05:44, 15 డిసెంబర్ 2008 (UTC)

చర్చా పేజీల తరలింపు

[మార్చు]

నిసార్ గారు, మీరు నాయకురాలు చర్చా పేజీ సమాచారంను కత్తిరించి నాయకురాలు (సినిమా) చర్చా పేజీకి అతికించినట్లు గమనించాను. ఇలా చేసే అవసరం లేదు, వ్యాసపు పేజీలను తరలించినట్లుగానే చర్చా పేజీలకు కూడా తరలించవచ్చు. (అసలు వ్యాసం పేజీని తరలించేటప్పుడే చర్చా పేజీని తరలించాలా వద్దా నిర్ణయించవచ్చు). కట్ పేస్ట్ చేయడం వలన ఇంతకు క్రితం చర్చా పేజీలలో కృషిచేసిన వారి పేర్లు కొత్త పేజీ చరితంలోకి రావు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:06, 25 డిసెంబర్ 2008 (UTC)

చాలా థ్యాంక్స్ చంద్రకాంతరావు గారు, ఈ విషయం నాకు తెలీదు. ఇప్పుడే మీద్వారా తెలుసుకున్నాను. తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ సారికి దానిని మీరు సరిద్దండి. ఇక తరువాత ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటాను నిసార్ అహ్మద్ 17:10, 25 డిసెంబర్ 2008 (UTC)
చంద్రకాంతరావుగారూ, యువరాజు చర్చాపేజీలో యువరాజు (1982 సినిమా) చర్చ వుండినది. పైన మీరు తెలిపిన విధంగా చర్చాపేజీని తరలిద్దామంటే యువరాజు మెయిన్ పేజీ మరియు చర్చాపేజీ రెండింటికీ తరలింపు పేజీ కనబడలేదు. అందుకే రచ్చబండలో వ్రాసాను. ఇపుడు తరలింపు పేజీ కనబడుతోంది. కారణం తెలీదు. నిసార్ అహ్మద్ 19:06, 30 డిసెంబర్ 2008 (UTC)
నిసార్ గారు, అసలు యువరాజు పేజీకి చర్చ లేదు. అది కేవలం దారిమార్పు వల్ల సినిమా చర్చా పేజీ వచ్చింది. ఇది వరకు యువరాజు పేజీతో సినిమా వ్యాసం ఉండేది. తరువాత దాన్ని యువరాజు (1982 సినిమా) వ్యాసానికి తరలించేటప్పుడు ఆటోమేటిక్‌గా చర్చా పేజీ కూడా తరలించబడింది. వ్యాసంలో దారి మార్పు తొల్గించి యువరాజు సమాచారం చేర్చబడింది కాని యువరాజు వ్యాసపు చర్చా పేజీలో మాత్రం #REDIRECT [[యువరాజు (1982 సినిమా)]] అలాగే ఉంది. మీకు ఇదివరకు తరలింపు కనబడకపోవుటకు కారణం కూడా ఇదే కావచ్చు. కాబట్టి అది తొలిగించాక తరలింపు కనపడుతోంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:20, 30 డిసెంబర్ 2008 (UTC)

పైజాసత్య గారు

[మార్చు]

ఈ మధ్య తెవికీకి ఓ జాడ్యం దాపురించింది, ఈ జాడ్యాన్ని దూరం చేయుటకు, తెవికీ సభ్యులు చేపట్టిన పనులు అపూర్వం. ప్రత్యేకంగా 'పైజాసత్య'గారు, మహాభారత యుద్ధంలో అర్జునునిలా కృషి సల్పుతున్నారు. వీరికి మన॰పూర్వక అభినందనలు. తెవికీ సభ్యులంతా వీరివెంట ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. పైజాసత్యగారూ, మీరు నిర్భయంగా అప్రతిహతంగా మీ నిర్వాహక కార్యక్రమాలు నిర్వహించండి. మీవెంట మేమున్నాం. నిసార్ అహ్మద్ 09:11, 28 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

[మార్చు]

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:13, 28 డిసెంబర్ 2008 (UTC)

ఆభినందనలు

[మార్చు]

తెలుగు వికీ కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. Chavakiran 05:46, 7 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభిమానానికి, ధన్యవాదాలు కిరణ్‌గారూ. ఇలాగే శ్రమించి మన భాషకు సేవలందిద్దాం. నిసార్ అహ్మద్ 08:59, 7 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకులైన సందర్భంగా నిసార్ గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు --వైజాసత్య 21:24, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారూ, నాకు నిర్వాహకునిగా ప్రకటించి మరింత బాధ్యతాయుతుడిణ్ణి చేసినందుకు, మనఃపూర్వక కృతజ్ఞతలు, తెవికీ అభివృద్ధికి నా శాయశక్తులా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. సోదరుడు అహ్మద్ నిసార్ 05:38, 29 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

నిసార్ గారు తెలుగు వికి కి ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు Raghuvardhan 13:17, 18 జనవరి 2009 (UTC)

హై, థన్క్స్ ఫొర్ థె నొతె

[మార్చు]

ఆఉతొమతిచ్ త్రన్స్లితెర్తిఒన్? ఛూల్. ఈ లికె హ్ప్వ్ థె ఛరెచ్తెర్స్ ఛన్గె బసెద్ ఒన్ వ్హత్ లెత్తెర్స్ చొమె ఒన్ వ్హత్ పొసితిఒన్. ఠె ఒన్ల్య్ ప్రొబ్లెమ్ ఇస్ థత్ ఇత్ దొఎస్ అన్ ఎక్ష్త్రెమె లగ్ గిగ్ ఒన్ మ్య్ చొమ్పుతెర్. బ్య్ థె వయ్, ఇత్ వస్ అన్ ఔతొమతిచల్ల్య్ చ్రెఅతెద్ అచ్చ్చొఉన్త్, బ్య్ "ఆఉతొమతె" హమ్మ్మ్మ్... మయ్బె ఈ షొఉల్ద్ త్ర్య్ ఔర్ థిస్ ఇన్ ఫొరెఇగ్న్ ళన్గుఅగె. ఈత్'స అ లొత్ చూలెర్ థెన్ శ్పనిష్, ఫొర్ సురె. వ్హత్'స్ థె రులె ఫొర్ థె ఛన్గ్ిన్గ్ ఛరెచ్తెర్స్? ఈ నెవెర్ క్నఎవ్ ఒఫ్ సొ చూల్ అ లన్గ్. వైత్, యొఉరె సయిన్గ్ థెరె అరె ములతిప్లె ఈన్దీన్ లన్గుఅగెస్? ళికె ంఅన్దెరిన్ వ్స్. ఛినెసె? ఆహ్, ఇత్'స్ తూబ బద్ ఇత్ దొఎస్ సొమ ముఛ్ లగ్గిన్గ్ ఒన్ మ్య్ చొమ్పుతెర్. Resident Mario 00:50, 26 ఫిబ్రవరి 2009 (UTC) ణొ ఉన్ద్దెర్స్తన్ద్ ఎమైల్ సెన్త్. శొ ఈ వ్రితె ఇన్ షొర్త్. హఎల్లొ. ఠన్క్ యొఉ ఫొర్ వెల్చొమిన్గ్. వెర్య్ చూల్[ప్రత్యుత్తరం]

శివ ధన్యవాదములు

[మార్చు]

నిసార్ భాయ్! మీ అభినందనలకు ధన్యవాదములు. తెలుగు కార్టూన్ చరిత్ర గురుంచి సమగ్రంగా వ్రాద్దామని కొంత పథక రచన చేశాను. కానీ ఈలోగా బెంగుళూరు బదిలీ అయ్యింది. ఈరోజున బయలుదేరి వెళ్ళి రేపు అక్కడ పదవీ బాధ్యతలు స్వీకరిస్తాను. అక్కడ స్థిరపడిన తరువాత మళ్ళీ వికీలో చురుకుగా పాల్గొనగలను. నా పూర్తికాని ప్రాజెక్ట్ అమరావతి కథా సంగ్రహం. నూరు కథలలో, ఇప్పటికి ఒక 40 కథల గురించి వ్రాశాననుకుంటాను. మిగిలినవి కూడ పూర్తి చెయ్యాలి. మీ వంటి మిత్రుల సహాయ సహకారాలతో అనుకున్నది సాధించగలననే అనుకుంటున్నాను. మీకు వీలయితే కొన్ని కథలగురుంచి వ్రాయగలరు.--S I V A 22:54, 7 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని సూచనలు

[మార్చు]

నిసార్ గారు! మీరు ఇటీవల చాలా వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి కాపీ చేస్తున్నారు. మీ ఉత్సాహాన్ని కాదనలేను కాని కొన్ని విషయాలు గమనించండి.

  1. విశేష వ్యాసాలుగా మారవలసిన ముఖ్యమైన వ్యాసాలను ప్రారంభిస్తున్నారు. కాని వాటిని ఒక దశకు రాకుండానే మళ్ళీ కొత్త వ్యాసం ప్రారంభిస్తున్నారు. ఎవరికైనా కొత్త వ్యాసం ప్రారంభించుటలో ఉన్న ఉత్సాహం ఉన్న వ్యాసాన్ని పొడగించడంలో ఉండదు. ఇది తెవికీలో మనం ప్రారంభం నుండి గమనిస్తున్నదే. ప్రారంభించిన వ్యాసాన్ని మరీ పెద్దగా ఒక్కరే చేయడం కష్టమే కాని అవసరమైన కొంత సమాచారమైనా ఉండటం ముఖ్యం కదా! వ్యాసం పరిమాణం ప్రకారం చూస్తే పెద్దగా కనిపించిననూ అందులో చదవడానికి వీలైన సమాచారం మాత్రం అతి తక్కువగా ఉంది.
  2. వ్యాసాలలో చాలా అధిక సంఖ్యలో ఆంగ్ల లింకులను ఇస్తున్నట్లు గమనించాను. కానీ ఇలా అధిక సంఖ్యలో ఆంగ్ల లింకులు ఇచ్చే అవసరం లేదు. లింకుల యొక్క అవసరం మరీ ముఖ్యమై సమీప భవిషత్తులో తెవికీలో వాటిపై వ్యాసాలు ఏర్పడని వాటికే మాత్రమే ఆంగ్ల లింకులు ఇవ్వవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఎవరైనా తెవికిలో ప్రవేశిస్తే వారిని ఇక్కడే తిరగనివ్వాలి, అంతేకాని ఇతర లింకులపై నొక్కి బయటకు పంపడం మనమే వారిని వెళ్ళగొట్టినట్లవుతుంది.
  3. ఇన్పోబాక్స్‌లలో అధినేతల పేర్లు ఇచ్చే అవసరం అంతగా లేదు. ఒకసారి ఇవ్వడంతోనే సరిపోదు, వాటిని ఎప్పటికప్పుడు తాజాకరించవలసి ఉంటుంది. మన రాష్ట్రాల వ్యాసాలలోనే ముఖ్యమంత్రులు, గవర్నర్లు మారినప్పుడు తాజాకరించడం మనకు కష్టమౌతోంది. ఎందుకంటే తెవికీలో చురుకైన మానవ వనరులకు కొరత ఉంది. ఇంకో విషయం విజ్ఞాన సర్వస్వంలో ఒక విషయం లేకపోవడం కంటే తప్పుగా ఉండటమే ప్రమాదం.
  4. వ్యాసంలో బయటి లింకులు అధిక సంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా తెలుగు వారికి అందుబాటులో ఉన్న లింకులు ఇవ్వడం సముచితం. ఆంగ్ల బాషలో ఏదో ఒక దేశం, ప్రాంతం లేదా వ్యక్తి గురించి వారికి అందుబాటులో ఉన్న బయటి లింకు ఇస్తే తెవికీలో మనబాషకు సంబంధించిన బయటి లింకులు ఇవ్వడం బాగుంటుంది. అవి లేనప్పుడు, అవసరమైతే ఆంగ్ల వికీలో ఉన్న లింకులు ఇవ్వవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:50, 8 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారం లేని ప్రొపార్మాలు, టేబుల్స్ వద్దు

[మార్చు]

నిసార్ గారు, మీరు అసెంబ్లీ నియోజకవర్గాలలో చేరుస్తున్న సమాచారం లేని ఖాళీ ప్రొపార్మాలు మరియు ఖాళీ టేబుల్స్ వద్దు. రేపు వాటిని భర్తీ చేయడంలో కష్టమౌతుంది. సమాచారం మాత్రమే చేర్చండి. -- C.Chandra Kanth Rao-చర్చ 16:50, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు, ఖాళీ టేబుల్స్ కూడా వద్దు. దీని వల్ల చూసే వారికి బాగనిపించదు. అంతేకాకుండా ఎన్నికల తర్వాత ఈ టేబుల్స్‌లో పేర్కొన్న పార్టీల ప్రకారమే ఓట్లు రావు. టేబుల్స్‌లో ఓట్ల ప్రకారము పేర్లు ఇవ్వవలసి ఉంటుంది. దానికింకనూ సమయముంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:16, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారు, నియోజకవర్గాలలో సమాచారం చేర్చడానికి మనకు చాలా పని ఉంది. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాదు జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు మాత్రమే ఒక దశకు వచ్చాయి. రంగారెడ్డి, నల్గొండలలో కొన్ని నియోజకవర్గాలు మాత్రమే తుది రూపానికి వచ్చాయి. మొత్తం 294 నియోజకవర్గాలలో మనం ఇంకనూ చేర్చవలసింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతం పోటి పడుతున్న అభ్యర్థుల వివరాలు చేర్చి మళ్ళీ నియోజకవర్గాల వ్యాసాలను మెరుగు పర్చడానికి ప్రయత్నిస్తాను. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి కొత్త సమాచారాన్ని చేర్చవలసి ఉంటుంది. ఇందుకు మీతో పాటు మిగితా సభ్యుల సహకారం కూడా అవసరం. దేవా గారు బొమ్మలను మరియు ఇన్ఫోబాక్స్ లను చేరుస్తున్నారు. ఇది నియోజకవర్గాల వ్యాసాలకే అందం చేకూరుస్తుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:32, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫార్మాట్

[మార్చు]

చంద్రకాంతరావుగారూ నమస్తే, తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం లో వుండే రీతి సరిపోతుందో కాదో కాస్త చూసి చెప్పండి. అహ్మద్ నిసార్ 17:26, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది ఒకదాని కిందుగా మరొకటి కాకుండా పేరాగ్రాఫ్ టైపులో వరుసగా వ్రాయండి. ఎందుకంటే ఇది ఎన్నికలయ్యే వరకు మాత్రమే పనికి వస్తుంది. ఆ తర్వాత పోటీ చేస్తున్నాడు లాంటి వాక్యాలను తొలిగించి పోటీ చేశాడు గా మార్చవలసి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి టేబుల్స్ మరియు గణాంకాల గ్రాఫ్ చేర్చవలసి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:40, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

దేవాగారూ నమస్తే, నియోజకవర్గాలలో మీరు కూరుస్తున్న, ఇన్ఫోబాక్సులు, బొమ్మలు అత్భుతం, అభినందనలు అందుకోండి. "మీ టెక్నికల్ ఎక్సలెన్సీ" ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అహ్మద్ నిసార్ 17:40, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే సార్! మీరడిగిన బొమ్మ రెడీ అయ్యింది. మీ అభిమానానికి ధన్యవాదాలు. చంద్రకాంత్ గారు, మీరు, ఇంకా ఇతర సభ్యులు చేస్తున్న విషయ సంగ్రహణ చాలా విలువైనది. ఈ నియోజకవర్గాల వ్యాసాలకు నేను ఈ రకంగానైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. చాలా సేపటినుంచి ఈ బొమ్మలమీదే పని చేస్తున్నాను, కొంత సేపు బ్రేక్ తీసుకోవాలి. δευ దేవా 17:45, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పతకం

[మార్చు]

రెండవ తెలుగు పతకం పొందిన చంద్రకాంతరావు గారూ, హార్థిక శుభాకాంక్షలు అందుకోండి. అహ్మద్ నిసార్ 18:25, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారూ, మీ అభిమానానికి మరో సారి నా కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:31, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిసార్ గారు, మీ చర్చా పేజీ చాలా పెద్దదైంది. పాత చర్చలలో నిక్షిప్తం చేస్తే బాగుంటుందేమో. -- C.Chandra Kanth Rao-చర్చ 18:33, 1 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సైతాను సందేశాలు

[మార్చు]

మీరు నిరాకరించిన "సైతాను సందేశాలు" గురించి వెబ్ పత్రికలో వ్యాసం వ్రాయడం కూడా జరిగింది. http://viplavatarangam.net/?p=18 దీనికి సమాధానం వ్రాయగలరా?

సమాచారానికి ధన్యవాదాలు --వైజాసత్య 01:59, 24 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]