వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.
కాసుబాబు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా 172.142.230.149 లో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. 172.142.230.149 172.142.230.149 ,రచనలు)

రెండు పేరులు సమస్య

నమస్కారములు. - రామాయణము, రామాయణం - అనే రెండు శీర్షికలు ఉన్నాయి. నేను "రామాయణము" - లో కొంత వ్రాత మొదలు పెట్టినాను. కాని " రామాయణం" అనేది ఖాళీగా ఉన్నది. - దీనికి ఏమయినా పరిష్కారము ఉన్నదా? - సుధాకర బాబు

సుధాకర బాబు గారు, మీ కృషి అభినందనీయము. ఇలాంటి సమస్యలకు పరిష్కారము దారిమార్పు పేజీలు. వాటి గురించి Wikipedia:దారిమార్పు లో చదవండి. క్లుప్తంగా రామాయణం పేజీలో #redirect[[రామాయణము]] అని రాసి భద్రపరుస్తే సరిపోతుంది. --వైఙాసత్య 00:52, 2 ఆగష్టు 2006 (UTC)

సినిమా వ్యాసాలు

వైజా సత్య గారూ,

నమస్కారములు. నేను కొద్ది రోజుల క్రితమే వికీ లో భాగస్వామినయ్యాను. మీ, మీవంటి మిత్రుల దీక్ష పరిశీలిస్తే నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. తప్పకుండా ఈ కృషి విజయవంతం అవుతుంది.

సినిమాల వ్యాసాలపై మీరు రాత్రింబవళ్ళు పడుతున్న శ్రమ చూస్తున్నాను. రాష్ట్రంలో వందలాదిగా విస్తరిల్లిన అభిమాన సంఘాలను ఈ విషయంలో తగు పాత్ర తీసుకోమని ఆహ్వానించడం సరి అని నాకు అనిపిస్తుంది. సినిమా పేర్లతో సరిపెట్టకుండా దాని కథా, కమామిషూ సేకరించి ప్రచురించే శక్తి, ఉత్సాహం వారికుంటాయని నా అభిప్రాయము.

సభ్యుల అభిప్రాయాన్ని తెలిపితే, మనం అభిమాన సంఘాల వెబ్ సైటుల్లో ఆహ్వానాలు అందించవచ్చును

మీ ప్రోత్సాహక వ్యాఖ్యలకు చాలా కృతజ్ఞున్ని. ఇక సినిమా వ్యాసాలకు కధా కమామీషులు రాయడము ఈ ప్రాజెక్టులో భాగమే. మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. అయితే అభిమానా సంఘాలను ఒక ఫ్రేంవర్క్ తయారయిన తరువాత పిలిస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను బాటును ఉపయొగించి 3600 సినిమాలకు వ్యాసాలు ప్రారంభిస్తున్నాను. ఆ తరువాత వాటిని విస్తరించడానికి అభిమానులని పిలుద్దాము. నాకు ఈ వ్యాసాలను పూర్తి చెయ్యడానికి 2-3 వారాలు పట్టొచ్చు. పనంతా సినిమా పేరును అనువదించడామే. మిగిలిన వన్నీ బాటు చూసుకుంటుంది. --వైఙాసత్య 03:32, 21 ఆగష్టు 2006 (UTC)

తెలుగు సినిమా అనువాదాలు - కొన్ని జాగ్రత్తలు

సుధాకర్ గారు, తెలుగు సినిమా అనువాదాలు మొదలు పెట్టినందు చాలా సంతోషమండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

 • వ్యక్తులు, సంస్థల పేర్లకు వికి లింకులు [[ ]] తిసెయ్యకండి. ప్రస్తుతానికి వాటితో వ్యాసాలు లేకపోయినా. భవిష్యత్తులో ఆ పేరుతో వ్యాసము వచ్చినప్పుడు వెతికి వెతికి లింకులు తగిలించాల్సిన అవస్థ తప్పుతుంది.
 • చాలా వ్యాసాలలో అక్కినేని నాగేశ్వరరావు పేరు narayana rao అనో Adinarayana rao అనో ఉంది. ఈ విషయములో కొంత జాగ్రత్త వహించాలి

--వైఙాసత్య 01:11, 30 ఆగష్టు 2006 (UTC)

బొమ్మలు, తొలగింపు - సందేహాలు

వైజా సత్య గారూ, రెండు సందేహాలు

 1. 'తొలగింపు' ఎలా చేయాలి? అందరు సభ్యులకూ ఈ అనుమతి ఉంటుందా?
 2. సినిమాలకు సంబంధించిన వెబ్ సైటులలో వచ్చే వాల్ పేపర్లు (ఉచిత డౌనులోడులు), పోస్టరులు, తారల బొమ్మలు తెలుగు వికీలో వాడవచ్చా? వాటిని జతపరిస్తే వ్యాసాలకు కాస్త నిండుతనం వస్తుంది. కేవలం వ్యాసాల సంఖ్యను పెంచడానికే సినిమాలను మనం వికీలో పొదుపరస్తున్నామనే ఫీలింగు కాస్త పలచబడుతుంది.

కాసుబాబు 13:23, 10 సెప్టెంబర్ 2006 (UTC)

పేజీ తొలగించే అనుమతి కేవలము నిర్వాహకులకు మాత్రమే ఉన్నది. ప్రస్తుతము క్రియాశీల నిర్వాహకులను (చదువరి, చావాకిరణ్ మరియు నేను) కొరవచ్చు. సులభమైన పద్ధతి ఆ వ్యాసములో {{తొలగించు|ఇక్కడ కారణము రాయండి}} మూసను ఉంచడము.
పోస్టర్లు, డీవీడీ ముఖచిత్రాలు ఫెయిర్ యూజ్ అని సూచిస్తూ అప్లోడ్ చెయ్యొచ్చు. ఉదాహరణకు డీవీడీ ముఖచిత్రాన్ని అప్లోడ్ చేసేటప్పుడు {{డీవీడీ ముఖచిత్రము}} అన్న మూస తగిలించండి. కొన్ని సినిమా సైట్లలో ఉన్న బొమ్మలమీద ఆ సినిమా సైట్ల పేర్లు ఉంటాయి. కాపీహక్కుదారు ఫలానా అని... వారికి అలాంటి హక్కులు సాధారణంగా ఉండవు. కాబట్టి వాళ్ల బొమ్మలు వాడినందుకు మనమీద కేసు నిలవదు. వాళ్లూ మనలాగే ఫెయిర్ యూజ్ కింద వాడుకోవాలి. కానీ ఎందుకైనా మంచిది మిగిలిన బొమ్మలతో కొంత జాగ్రత్త వహించాలి. మనమే తయారు చేసుకున్న స్క్రీన్షాట్లు (తెరచాపలు) బేషుగ్గా ఫెయిర్ యూజ్ కింద వాడుకోవచ్చు.--వైఙాసత్య 13:42, 10 సెప్టెంబర్ 2006 (UTC)

మరో రెండు సందేహాలు

వైజా సత్య గారూ, మరో రెండు సందేహాలు.మీకు ఇబ్బంది కాదనుకొంటున్నాను.

 1. వ్యాసాల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతున్నది. ఈ రోజు 8,300 పైచిలుకు ఉన్నది. కాని "ఇటీవలి మార్పులు"లో క్రొత్త వ్యాసాలు అన్ని కనిపించడంలేదు. మరి ఈ వ్యాసాలు ఎక్కడ ఉంటున్నాయి?
 2. "తెలుగు సినిమా" అని ఒక వర్గమూ, "తెలుగు సినిమాలు" అని మరో వర్గమూ ఉన్నాయి.ఇలా యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే చేశామా? - దీనిని పునర్వ్యవస్థీకరిస్తే బాగుటుందనుకొంటున్నాను. కాసుబాబు 11:36, 20 సెప్టెంబర్ 2006 (UTC)
సుధాకర్ బాబు గారు,
 • నేను రచ్చబండలో వీవెన్ గారు చేసిన ప్రతిపాదన మేరకు బాట్ సహాయముతో అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేస్తున్నాను. బాట్ తో చేసిన మార్పులు సాధారణముగా కనిపించవు. కానీ చూడాలంటే ఇటివల మార్పులు లో పై భాగములో బాటు మార్పులు చూపించు నొక్కండి
 • ఇలా రెండు వర్గాలుండటము కావాలని చేసినది కాదు. తెలుగు సినిమా వర్గములో ఉన్నవన్నీ తెలుగు సినిమాలు వర్గానికి మార్చాలి. నేను బాటు సహాయముతో వీటిని మార్చేస్తా. తెలియజేసినందుకు కృతజ్ఞతలు --వైఙాసత్య 13:42, 20 సెప్టెంబర్ 2006 (UTC)

dear sudhakar garu కృతజ్ఞతలు. మీ సలహా పాటించేందుకై ప్రయత్నిస్తాను. vijayabhaskar

అభినందనలు

కాసుబాబు గారు! సినిమా పేజీల అనువాదాలను చకచక అవగొట్టేసినందుకు నా అభినందనలు కూడా అందుకోండి. __చదువరి (చర్చ, రచనలు) 18:31, 27 సెప్టెంబర్ 2006 (UTC) కాసుబాబు గారు, అనువాదాలు పూర్తి చేసినందుకు ధన్యవాదములు మరియు అభినందనలు --వైఙాసత్య 19:06, 27 సెప్టెంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు

నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)

Request for Help

Greetings Kajasudhakarababu!

I know that you are probably not a Christian, however can you just help me translate the introduction section of this article into the Telugu language? Please.

Any translation help at all would be very gratefully appreciated, Thankyou. --Jose77 04:19, 8 నవంబర్ 2006 (UTC)

Gratitude

THANKYOU SO MUCH Kajasudhakarababu for your excellent-quality Translation help and effort!

I am very very grateful and remain at your service for any translation help you might need. (In the future, if you ever need any articles to be translated into the Chinese or Taiwanese language, then I would gladly help you).

May you prosper and be successful in life!

Best Wishes, From --Jose77 01:22, 28 నవంబర్ 2006 (UTC)

ఎలా ఉన్నారు?

కాసుబాబు గారూ అంతా కుశలమా? ఈ మధ్య కనిపించలేదు. కొత్త ఇంటికి మారారా? ఈనాడులో వికిపీడియా గురించి వ్యాసం ప్రచురించారు దానితో సభ్యుల సంఖ్య 1400+ కి చేరింది. ఈ మధ్య కొత్త సభ్యుల్ని ఆహ్వానించడముతోనే సరిపోయింది. --వైఙాసత్య 07:32, 19 నవంబర్ 2006 (UTC)

రిఫరెంసులు

రిఫరెంసులు ఎలా పెట్టాలో ఇక్కడ వివరించబడింది. ఆ పేజీ చూస్తే మూలాలు ఎలా ఎందుకు పెట్టాలో అర్ధమవుతుంది. ఒక వేళ అర్ధం కాకపోతే, అదే పేజీ ఆంగ్ల వికిలో కూడా ఉంది, అక్కడ చదివి మన తెలుగులో ఉన్నదానికి తగిన మార్పులు చేయండి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:52, 6 డిసెంబర్ 2006 (UTC)

అభ్యర్ధన

క్షమించండి ! వికీ నీ సరిగా అర్థం చేసుకోలెకపోవడం వలన జరిగిన పొరాపటది! దయచేసి మన వికీ లో ఇలాంటి సాహితీ రచనలకు స్థానం ఉన్నదా? ఉంటే తెలుపగలరు! నమస్సులతో మీ భవదీయుడు,

ప్రమోద్ కుమార్

నిర్వాహక హోదా

కాసుబాబు గారూ, మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. మీ మద్దతు ఇక్కడ తెలియజేయండి. --వైఙాసత్య 17:38, 27 డిసెంబర్ 2006 (UTC)

కాసుబాబు గారు, నిర్వాహకులైన సందర్భంగా అభినందనలు --వైఙాసత్య 19:13, 3 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా ప్రాజెక్టు

తెలుగు సినిమా ప్రాజెక్టుని అభివృద్ది చేయాలని అనుకోవడం చాలా ఆహ్వానించదగినది. ఈ ప్రాజెక్టుని రెండు ప్రాజెక్టుల sub-ప్రాజెక్టుగా చూడవచు. అవి భారతీయ సినిమా ప్రాజెక్టు మరియు తెలుగు బాష ప్రాజెక్టు. ఆ రెండు ప్రాజెక్టులలో ఏమేం చేయాలనే సమాచారాన్ని ఇంకా చేర్చలేదు. మీరు ప్రస్తుతానికి చేయగలిగిన పనులు:

 • తెలుగుసినిమా ప్రాజెక్టులో ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నారో తెలుపుతూ కొంత ఉపోథ్ఘాతము రాయండి.
 • భారతీయ సినిమా ప్రాజెక్టు మరియు తెలుగు బాష ప్రాజెక్టులలో తెలుగు సినిమా ప్రాజెక్టు ఒక అంతర్భాగమని తెలుపుతూ తెలుగుసినిమా ప్రాజెక్టుకు లింకు చేర్చండి.
 • సభ్యత్వ పెట్టెలు తయారు చేయండి. ఉదాహరణ కోసం చరిత్ర ప్రాజెక్టు కోసం తయారు చేసిన పెద్ద, చిన్న పెట్టెలను చూడండి.
 • అటు తరువాత తెలుగు సినిమా ప్రాజెక్టులో నిర్వహించబడే ప్రతీ వ్యాసం యొక్క చెర్చాపేజీలో "{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}" అని చేరిస్తే తెలుగు సినిమా ప్రాజెక్టు జెండా ఆ చర్చా పేజీలలో చేరిపోతుంది.
 • ఇలా చేయటం వలన మొదట్లో కొంత గందరగోలంగా అనిపించినా, తరువాత నిర్వాహణాపరంగా చాలా సులువుగా ఉంటుంది.

మీకు ఇంకేమయినా సందేహాలుంటే అడగండి, నేను సంతోషంగా తీరుస్తాను. అంతేకాదు మీ ప్రతిపాదనను వంటనే రచ్చబండలో పెట్టండి, మీకు ఇతర సభ్యుల నుండి మరిన్ని సూచనలు లభించే అవకాశం ఉంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:44, 4 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రుద్రాక్షపల్లి సంఘటన

మీరు రుద్రాక్షపల్లి సంఘటన గురించి ఆ పేజీలో రాసి చాలా మంచి పని చేసారు. సమకాలీన సంఘటనలను వికీపీడియాలో క్రోడికరిస్తూ పోతే చక్కటి విజ్ఞానసర్వస్వం తయారవుతుంది, భావి రిఫరెన్సుకు ఇది చక్కని సాధనం అవుతుంది. మంచి పని చేసారు. నా అభినందనలు అందుకోండి! __చదువరి (చర్చ, రచనలు) 10:55, 9 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

సుధాకర్ బాబు గారు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ మాటలు నన్ను మరిన్ని వ్యాసాలు వ్రాయడానికి ఉద్యుక్తుణ్ణి చేసింది. నేను ప్రస్తుతం మదనపల్లె వ్యాసాన్ని ప్రతేక వ్యాసం చేసే పనిలో ఉన్నాను. అది అయిన తర్వాత మీ సలహాను తప్పక ఆచరణలో పెడతాను. మీ ప్రోత్సాహం, సహాయం నాకెప్పుడు ఉంటుందని ఆశిస్తాను. --నవీన్ 10:25, 12 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


గోరంట్ల పేజీ విషయం

గోరంట్ల పేజీ గురించిన మీ ప్రశ్నకు నా చర్చా పేజీలో సమాధానం రాసాను, చూడగలరు. __చదువరి (చర్చ, రచనలు) 12:52, 16 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

http://en.wikipedia.org/w/index.php?title=User_talk:Interiot&diff=66111192&oldid=65707630 మార్పుల సంఖ్య

చెట్టు

ధాక్యూ సుధాకర్ గారు .మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.నేను నాటిన చెట్టు నాకు వెంటనే మీ అభినందనలు అనే పండ్లను అందించాయి. t.sujatha

Babel boxes

Hi, I'm active at Wikimedia Commons and have been trying to update our Babel Boxes. I notice that your project doesn't use Babel boxes, so there's nothing that I may copy. The selections on en.wp for Babel boxes are very limited, which is surprising for a wiki with as many articles as Telugu has.

Basically, I'm including 5 levels of languages. Native speakers, non-native fluent speakers, advanced speakers, intermediate, and novice speakers. You can see the English templates at commons:Template:User en, commons:Template:User en-4, commons:Template:User en-3, commons:Template:User en-2, and commons:Template:User en-1. I would, of course, like to include Telugu, but don't have a translation available for level 4 or 2. Your assistance is appreciated. Bastique demandez 18:18, 2 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Telegu Wikipedia

Could you write some stub about Telegu Wikipedia in English Wikipedia? Now there is only redirect. I would like to write about it in Polish Wikipedia. Write when your wiki was founded, when it passed some milestone (f.e. 10 000 and 20 000), put logo. Thanks, Greg.

I wrote pl:Wikipedia w języku telugu,

and be:Тэлугская Вікіпэдыя, but there are incompleted. Milestones and logo are needed. Can you write it in English in article: en:Telugu Wikipedia? Greg.

Fine. I expanded articles in pl and be. Please only upload a logo into commons, like is for allmoast all any Wikipedia add it into article in English (in Polish and Belarusian you also can, use button). I wrote also to admin in Bishnupriya Manipuri Wikipedia, and she made it. Greetings, Greg.

Thanks from Bishnupriya Manipuri Wikipedia

Dear Kajasudhakarababu,

Namaskar. Thanks for your welcome message and nice comment about Bishnupriya Manipuri wikipedia. Please time to time visit BPY wiki, and give me any good advice to improve. BPY wiki is just 4 months old, and I am trying to do all my best. Thanks again.--ఉత్తమ సింహ 04:43, 9 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks

Thanks a lot for the warm welcome. Please consider joining the Nepal Bhasa embassy here for a better correspondance. I look forward to progress and development of Telegu and Nepal Bhasa wikipedia. Thanks again!--Eukesh 16:05, 15 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

సుధాకర్ గారు, మీరు పని చేసే శైలి చూసి నేను చాలా విషయాలు నేర్చుకొంటున్నాను. అందుకే ఈ సందేశం వ్రాయకుండా ఉండలేకపోయాను. పని పట్ల మీ అంకిత భావం నా లాంటి వందల ఔత్సాహికులకు స్పూర్తిని ఇస్తుంది. --199.64.0.252 04:48, 18 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు --కాసుబాబు 04:51, 18 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Request

KasuBabu garu,
Pesidents of Indian National Congress వ్యాసంలో జె.బి.కృపలాని కూడా చేర్చండి. I tried but couldn't do it.
Regards
Venu

ఎన్నెన్ని వూళ్ళు?

వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు కు మార్చాను.

"ర" - సినిమాల అనువాదం

సుధాకర్ గారు, నేను కొన్ని పేజీలు అనువదించాను. కానీ పొరపాటున ఆ ఫైలు డెలీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మొదటి నుండి వ్రాయాల్సిందే. నేను ఎన్ని పేజీలు అనువదించాలో మీరే నిర్ణయించి ఆ పేజీలు మాత్రం పంపండి చాలు. --నవీన్ 11:58, 3 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కుశలమే

నేను కుశలమే! చాలా రోజుల నుండి నాకు అసలు తీరికే దొరకలేదు. ఈ మధ్యనే కొంచెం తీరిక దొరుకుతుంది, అందుకే ఇక్కడ కనబడుతున్నాను. ఈ ఖాళీ సమయం ఎన్ని రోజులు ఉంటుందో మరి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 21:06, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల పేర్లలో బ్రాకెట్లు

వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు కు మార్చాను.

కృతఙ్ఞతలు

సుధాకర్ గారు, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. --నవీన్ 08:49, 23 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కరములు

ఆయ్యా మీది పెదవేగి గ్రామము అని తెలుసు కొని నాకు చాలా సంతొషం కలిగింది

కృతజ్ఞతలు

కాసు బాబు గారు, నేను వికి కి కొత్త తెలుగు టైపింగ్ కి కూడ, మీరు ఛదరంగం మూస వెసినందుకు కృతజ్ఞతలు.

పవన్(నవమోయిని)

కాసు బాబు గారు,

మీరు చేసిన సూచనలు అమలుపరుస్తాను, మీ ప్రొత్సాం నన్ను ఉత్సాహ పరుస్తోంది, నేను నా కాలేజి రొజుల్లొ ఛెస్ ఛాంపియన్ ని కాబట్టి సబ్జెక్ట్ తెలిసినవాడినే. నిదానంగా మార్చుకుంటూ పొతాను.

పవన్

బ్రహ్మా పుత్ర నది మూస

కాసు బాబు గారు, అదే చేత్తో బ్రహ్మ పుత్రా నది కి ఇంగ్లీషు వికి నుండి మూస పొసి ఇవ్వగలరా?

పవన్

కృతజ్ఞతలు, మూస ఎలా పోస్తరు? దీనికి ఎవైనా ప్రత్యెక అనుమతులు కావాలా?

మీరు చివరలొ చెసె మార్పులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నయు. వ్యాసానికి చాలా విలువను చేకూర్స్తున్నయి.


నా గురుంచి

 • మూసల గురుంచి అధ్యయనం చేస్తాను, నాకు అంతగా సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం లేదు. ప్రయత్నిస్తను.
 • మీ ప్రొత్సాహం తో నా గురించి సభ్యుని పేజిలో రాసుకున్నాను, ఈశాన్య భారత దేశం గురించి ఏది రాయాలన్న నాకు చాలా ఇష్టం.

పవన్

um....

వ్హత్ లన్గుఅగె ఇస్ థిస్? ఇ హవె నొ ఇదెఅ ఒఫ్ థిస్ చూల్ లొక్కిన్గ్ లన్గుఅగె.


This is Telugu Language. Spoken mostly in the State of Andhra Pradesh, India. (I tried to reverse transliterate your message as "What Language is this? I have no idea of this cool looking language).
To write in English, you can "Uncheck" the left box on the top of the edit page. If you need any information, please mail to teluguwiki@yahoo.co.in
--కాసుబాబు 08:34, 10 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీలకు దారిమార్పు పేజీలు

వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు కు మార్చాను.

మీ ప్రొత్సాహం

కాజ సుధాకర బాబు గారికి నమస్కారం మీ ప్రొత్సాహం తో నేను మెదత్లో విద్వంసం సృష్టించినా చిత్తూరు జిల్లాలొ మంచి మార్పులు చేశాను అని అనుకొటున్నాను. మీరు తెలుగు సిని ప్రాజెక్టు మేద చాలా పరిశోధన చేసినట్లు తెలిసింది. మీరు ఒకసారి లింకులు సరిగా ఉన్నయో లేదో చూడంది. ఇదే నాచివరి రాత--172.143.28.88 19:29, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిస్సందేహంగా చిత్తూరు జిల్లా వ్యాసంలో మీరు చేసిన మార్పులు బాగున్నాయి. లింకులు కూడా కరక్టే. కాని నాకు ఆసక్తి కలిగించిన విషయం - మీరు మీ జ్ఞాపకాలను మాత్రమే ఆధారంగా చేసుకొని ఒక్కదెబ్బకు షుమారు 15 వ్యాసాలు మొదలు పెట్టారు. అద్భుతం. కాని ఈ వ్యాసాలు నిదానంగా మరి కాస్త పొడిగించమని కోరుతున్నాను. అయితే "172.143.28.88" గా మాత్రమే ఇది మీ చివరి రాత కావాలి. సభ్యునిగా చేరి వికీ ప్రస్థానాన్ని కొనసాగించమని అర్ధిస్తున్నాను. --కాసుబాబు 20:11, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కష్టం

Kajasudhakarababuగారు, మీరు రోజుకు ఎన్ని గంటలు వికీపీడీయా కు కేటాయించి కష్టపడతారు. మీ కష్టం అనిర్వచనీయం--172.142.230.149 12:13, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు - ఒకోరోజు ఒకో విధంగా - 0 నుండి 4 గంటలు - --కాసుబాబు 12:31, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యదీక్ష

నేను బాగా వ్రాస్తున్నానా?? చెప్పండీ. నాకు ఒక సందేహం మీరు పేపరు మీద రాసుకొని తరువాత టైపు చేస్తారా!! లేక పోతే మనసులోఅనుకొని టైపు చేస్తారా?? మీ కార్యదీక్ష చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తోంది. అదీ నేనే 172.143.28.88 ఇదీ నేనే --172.142.230.149 12:09, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు. మీరు బాగా వ్రాయగలరు కాని మీ రాత ఒక విషయంపై 'ఫోకస్' కావడంలేదు. అటూ ఇటూ గెంతుతోంది. నేను మనసులో అనుకొనే టైపు చేస్తాను. "అదీ", "ఇదీ" గారూ! ఇంకా మీరు అకౌంటు తెరవలేదు? మీకు వేరే పేరు వాడడం అంత ఇష్టం లేకపోతే 1721432888 లాంటి పెర్మనెంటు సంఖ్య వాడవచ్చును గదా? మీ కంప్యూటర్ మారినప్పుడల్లా ఐ.పి.నెంబరు మారే ఇబ్బంది తప్పుతుంది. (Be a fixed variable than a dynamic variable!) --కాసుబాబు 13:42, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Bot status BotMultichill

Hi Kajasudhakarababu, thank you for the warm welcome. I do have one question; Do you know where can i apply for bot status? Multichill 13:37, 23 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

You can request bot status here వికీపీడియా:Bot/Requests for approvals --వైఙాసత్య 21:05, 23 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా బాటు అవుదామనుకొంటున్నాను. కుదురుతుందా!!! సహాయం చెయ్యండి. నేను కూడా బాటు నడిపి పది లక్షో మార్పు చేద్దామనుకొంటున్నాను, మాకినేని ప్రదీపు గారు చేసినట్లు. ఏమంటారు.--S172142230149 22:06, 23 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యసనం

తెవికీ నాకు ఒక వ్యసనం లా తయారైంది, రోజు వచ్చి ఏదోఒకటి కెలకకపోతే నిద్ర పట్టటం లేదు. అది కాక మీరందరు( కాసుబాబు,వైజాసత్య,చదువరి) నాపట్లచూపిన శ్రద్ధ..నన్ను తెవికీ నుండి దూరంగా ఉంచలేక పోతోంది. నాకు ఒకటే అర్ధం అవడం లేదు, !!!!--S172142230149 16:37, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]