వాడుకరి చర్చ:Madu19
వికీపీడియాకు స్వాగతం. చేరగానే ఉత్సాహంగా ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ పేజీని సృష్టించినందుకు మీకు అభినందనలు. యాంత్రిక అనువాదంలో వచ్చే "మరియు" వంటి పదాలను తీసేసి ప్రచురించినందుకు ధన్యవాదాలు. కొన్ని సూచనలు: అనువాదం లోపాలతో ఉన్నట్లుగా తోస్తోంది. కొన్ని వాక్యాలు అర్థం లేకుండా ఉన్నాయి, కొన్ని సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు (వ్యాసాన్ని ఒక పాఠకుడి దృష్టితో చదివితే మనకు లోపాలు వివరంగా తెలుస్తాయి). నేను ప్రవేశికను (విషయ సూచికకు పైన ఉండే భాగం) సవరించేందుకు ప్రయత్నించాను. కొంత చేసాను కూడా. కానీ ఇంకా అది కృతకంగానే ఉంది. మీరైతేనే సరిగ్గా చెయ్యగలరని భావిస్తున్నాను. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 14:51, 15 ఫిబ్రవరి 2020 (UTC)
మాంటిస్సోరి EM CBSE HS A క్యాంప్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]మాంటిస్సోరి EM CBSE HS A క్యాంప్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మూలాలు లేవు. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 15:17, 20 ఫిబ్రవరి 2020 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 15:17, 20 ఫిబ్రవరి 2020 (UTC)
ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- భాష కృతకంగా ఉంది. రెణ్ణెల్ల కిందట ప్రవేశికను కొంత సవరించాను గానీ, పూర్తిగా చెయ్యడం కష్టమనిపించింది. సవరించాలని మూస పెట్టాను. పేజీని సృష్టించిన వాడుకరి చర్చ పేజీలో కూడా రాసాను. ఎవరూ సవరించలేదు.తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 00:25, 1 మే 2020 (UTC) చదువరి (చర్చ • రచనలు) 00:25, 1 మే 2020 (UTC)
స్వాగతం
[మార్చు]Madu19 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --అర్జున (చర్చ) 00:45, 28 ఆగస్టు 2020 (UTC)