వాడుకరి చర్చ:Rapkal

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Rapkal గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Rapkal గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 15:23, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipediaలో ఆంగ్ల భాషలో ఉన్న అపారమైన విజ్ణాన సర్వస్వాన్ని తెలుగువారికి సులభ శైలిలో అందించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాను. మీ ఆహ్వానం నాకు చాలా సంతోషదాయకం. ధన్యవాదాలు. Rapkal (చర్చ) 17:26, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం యాగంటి పరిస్థితి మునుపటి లాగ లేవు. దీనిపై ఒక విమర్శ చేయవచ్చా? Rapkal (చర్చ) 17:30, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యాగంటి వ్యాసం చర్చాపేజీలో రాయండి.[మార్చు]

యాగంటి పై మీరు రాయదలుచుకున్న యాగంటి వ్యాసం చర్చాపేజీలో రాయండి. యర్రా రామారావు (చర్చ) 16:11, 20 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యాగంటి మునుపటిలా లేదు. గతంలో భక్తులతో పాటు సందర్శకులు కూడా ఎక్కువగా వచ్చేవారు. అభివృద్ధి పేరిట బయటి కొలను దాదాపు మూసివేశారు. స్నానం చేయలేక చాలా నిరాశ చెందాం. పుష్కరిణి మూసివేశారు. గుహలు పూర్తిగా సాధువుల వశమయ్యాయి. బిక్షకుల తాకిడి ఎక్కువగా వుంది. ఈ అభివృద్ధికి ఏం పేరు పెట్టాలో సార్!? Rapkal (చర్చ) 18:41, 20 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

KALLUR 516355 పేజీ సృష్టింపు[మార్చు]

రాపకల్ గారూ తెలుగు వికీపీడియాలో నిన్న చేరి ఈరోజు KALLUR 516355 పేజీ సృష్టింపు పేజీ సృష్టించి వ్యాసం రాయటానికి మీరు చూపుతున్న ఉత్సాహానికి అభినందనలు.మీరు ముందుగా స్వాగతం పేజీలో తెలిపిన విషయాలు ఒకసారి చదివితే మంచిదనుకుంటున్నాను.సరే పోనిండి.KALLUR 516355 పేజీ సృష్టింపు పేజీ మీద కొన్ని అభిప్రాయాలు మీ ముందుంచుతున్నాను.

1. శీర్షిక ఆంగ్లంలో ఉండకూడదు.

2. శీర్షిక పిన్ కోడ్ అవసరంలేదు.వ్యాసంలో రాయవచ్చు.

3. ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరుతో చాలా గ్రామాలు ఉన్నాయి.ఏ జిల్లాకు చెందినది, ఏ మండలానికి చెందినది అనే వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

4. బహశా ఈ పేజీ తెలుగు వికీపీడియాలో ఇదివరకే ఉండటానికి అవకాశం ఉంది.పరిశీలించి లేదని నిర్థారించుకుని మాత్రమే సృష్టించాలి.

గమనించగలరు. ధన్యవాదాలు.యర్రా రామారావు (చర్చ) 16:33, 20 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావుగారు మా ఊరి గురించి వ్యాసం చేసిన మీకు కృతజ్ఞతలు. ఇందులో చాలా అంశాలు, ఫోటోలు పెట్టవలసి వుంది. అధికారుల నుండి సమాచారం సేకరించి అధికారిక పత్రం రూపొందించాలని నా తాపత్రయం. మీరు నొచ్చుకుంటారని మరో వ్యాసం రాస్తున్నాను. మా ఊరి పేరిట పూర్తి సమాచారం లేదు. మీరు అనుమతిస్తే అదనపు సమాచారం మాత్రమే చేర్చగలను. మా ఊరి గురించి రాసిన మీకు మరోసారి కృతజ్ఞతలు. -RAghuPrasadKALluru. Rapkal (చర్చ) 18:22, 20 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]