వాడుకరి చర్చ:Vu3ktb/పాత చర్చ 1
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
బొమ్మల కాపీ హక్కులు
[మార్చు]Vu3ktb గారూ! మీరు రెండు బొమ్మలు అప్‌లోడ్ చేశారు. కృతజ్ఞతలు. కాని
- వాటి కాపీ హక్కులు గురించి వ్రాయలేదు. ఈ ఫొటోలను మీరే తయారు చేస్తే, వాటిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికైనా వాడుకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.
- ఊరి పేరు "వెన్నొతల" అని వ్రాశారు. ఆ వూరు ఏ జిల్లా ఏ మండలంలో ఉందో తెలియలేదు. ఒకవేళ వ్రాయడంలో ఏమైనా అచ్చుతప్పులున్నాయేమో తెలియదు. (బొమ్మల వ్యాఖ్యలను ఆంగ్లంలో కూడా వ్రాస్తే ఉపయోగకరంగా ఉంటుంది.) వూరి పేరు సరిగ్గా తెలిస్తే ఆ బొమ్మలను తగు వ్యాసంలో పెట్టవచ్చును.
- మీ వూరి గురించీ, మీకు తెలిసిన ఇతర వూళ్ళగురించీ కూడా వీలైనంత సమాచారం వ్రాయమని అభ్యర్ధన.
మరేమైనా సమాచారం కావలసివస్తే నా చర్చాపేజీలో వ్రాయగలరు.
--కాసుబాబు 05:55, 2 మార్చి 2008 (UTC)
- బొమ్మ:IMG 1177a.JPG - ఈ ఫొటోను తీసిన సభ్యులు:Vu3ktb స్వయంగా దీనిని అప్‌లోడ్ చేశారు. కాని లైసెన్సు వివరాలు ఇవ్వడం మరచారు. కనుక వారికి అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో {{GFDL}} లైసెన్సు పట్టీని ఉంచుతున్నాను. --కాసుబాబు
వెన్నూతల, శాయపురం
[మార్చు]వూరి సరైన పేరు - వెలెనుతల? వెన్నూతల? మరేదైనానా? తెలుపగలరు.
- మీ ఊరిని గురించిన చరిత్రను ఇలా రాయండి. ఊరి పెద్దల కధనం ప్రకారం ఊరి చరిత్ర ఇలా ఉన్నది. ఇలా మొదలెట్టి మీ ఊరిని గురించి వ్రాయండి. వీడియో అప్లోడు చెయ్యవలసిన అవసరం ఉమ్డదు. అభినంధనలతో .--విశ్వనాధ్. 13:16, 6 మార్చి 2008 (UTC)
- వెన్నూతల సరయిన పెరు. నెను అప్ లొడ్ ఛెసిన మెలు రాయి మీద కూద ప్రభుత్వము వారు కూడ వెన్నూతల అని మాత్రమె వ్రాయింఛినారు.
- ఒక పురాతన గ్రుహమునకు సంబంధింఛిన ఛిత్రము అప్ లొడ్ ఛెసాను. దయఛెసి అది కూడ వెన్నూతల పుటకు అనుసంధింఛగలరు.
- వెన్నూతల సరయిన పెరు. నెను అప్ లొడ్ ఛెసిన మెలు రాయి మీద కూద ప్రభుత్వము వారు కూడ వెన్నూతల అని మాత్రమె వ్రాయింఛినారు.
--శివరామప్రసాదు కప్పగంతు - వియు3కెటిబి
కాసుబాబుగారు, వెన్నొతల (ఉన్గుతురు మండలము) శాయపురం పెజీలలొ ఫొటొలు కనపదటమ్లెదు. దయఛెసి ఛుదగలరు. - శీవారామప్రసాదు కప్పగంతు.
శివరామ ప్రసాదు గారూ! దయచేసి ఈ విషయాలు గమనించండి.
- పరిశీలిస్తాను. ఇప్పుడు నేను చూస్తే ఫొటోలు బాగానె కనిపించినాయి. బహుశా ఫొటోలు ఎక్కువ కావడం వలన లోడింగ్ సమయం ఎక్కువై డౌన్‌లోడ్ ప్రక్రియ మొరాయిస్తూ ఉండవచ్చును.
- సంబంధించిన విషయమే. ఇప్పటికి మీరు చాలా ఫొటోలు అప్‌లోడ్ చేశారు. ఒక వ్యాసానికి నాలుగైదు ఫొటోల కంటే ఎక్కువ సబబు కాదనుకొంటాను (అలాగని నియమం మాత్రం ఏమీ లేదు). కనుక ముఖ్యమైన కొన్ని ఫొటోలు ఉంచి మిగిలినవి తొలగిస్తాను. మీరు అన్యధా భావించరనుకొంటాను.దయఛెసి ఇప్పుదు ఉన్న ఫొటొలు ఉంఛండి యిక అప్ లొడ్ ఆపుతాను. Vu3ktb 17:17, 7 మార్చి 2008 (UTC)
- నాకు ఏవైనా సందేశాలు పంపాలంటే నా ఆటోగ్రాఫ్ పేజీ కంటే నా చర్చా పేజీలో వ్రాయడం మంచిది.
- మీరు ఏదైనా సందేశం ఎక్కడైనా వ్రాసినపుడు మీ పేరు టైపు చేయకుండా ఇలా ~~~~ నాలుగు టిల్డెలు పెడితే చాలు. మీ సభ్యనామం, సమయం ఆటోమాటిక్‌గా వస్తాయి. ఇది సులభం. లేదా ఎడిట్ పేజీ పైన ఉన్న బటన్లలో సంతకం లాగా కనిపించే బటన్ ("టైమ్ స్టాంపుతో సహా మీ సంతకం" - ఎడమవైపునుండి 10వ బటన్) నొక్క వచ్చు. ఇది ఇంకా సులభం.
- నా పేజీలో మీరు వ్రాసిన మీ మెయిల్ ఐ.డి. తొలగిస్తాను (స్పాముకు అవకాశాలు లేకుండా ఉండడానికి)
మీ వికీ కృషిని మాత్రం కొనసాగించండి. --కాసుబాబు 17:03, 7 మార్చి 2008 (UTC)
- మైలు రాయి ఫొటోను సవరించాను. ఇది పెద్ద కష్టమేమీ కాదు. నిదానంగా ప్రాక్టీసు చేయండి. మరో ముఖ్యమైన మాట. వికీ వ్యాసాలలో ఏనైనా పొరపాట్లు జరిగినా నిర్వాహకులు పాత కూర్పులను సులభంగా పునరుద్ధరించ గలరు. కనుక క్రొత్త విషయాలు ప్రయోగించడానికి మీరు అస్సలు తటపటాయించనవసరం లేదు. ఏవైనా పొరపాట్లు జరిగినా, లేక సందేహాలున్నా ఎవరైనా సభ్యులను సలహా కోరడానికి కూడా మొహమాటం అసలు పనికిరాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:21, 10 మార్చి 2008 (UTC)
కొన్ని అక్షరదోషాలు
[మార్చు]శివరామ ప్రసాదు గారూ! మీరు రాసే వ్యాసాలు మంచి ఆసక్తిని కలగజేస్తున్నాయండీ!. ఈ చిన్న దోషాలు దొర్లకుండా చూసుకోండి. చ అనే అక్షరం రావాలంటే ca అని వ్రాయాలి కానీ cha అని వ్రాయకూడదు. అలాగే ఎందుకు అని వ్రాయాలంటే eMduku అని రాయగలరు. ఓత్వం రావాలంటే కో(kO),గో(gO) ఇలా వాడండి.—రవిచంద్ర 13:00, 8 మార్చి 2008 (UTC)
ధన్యవాదములు
[మార్చు]చాలా ధన్యవాదములు రవి చంద్ర గారు. నెను ఈ తెలుగు వికిపెడియాలొ వ్రాయటము గత 5-6 రోజులు మాత్రమె అయినది. ఛాలావరకు నెర్ఛుకున్నాను. మీ లాంటి మిత్రులు సహాయంతొను మరియు నా అంతట నెను కొన్ని నెర్ఛుకొంటున్నాను.--Vu3ktb 14:00, 8 మార్చి 2008 (UTC)
చందమామ
[మార్చు]- కాసుబాబుగారూ! నమస్తే. నేను చందమామ పుటలొ చాలా విషయాలు వ్రాసాను, కొన్ని మార్పులు కూడా చేసాను. దయచేసి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు.--SIVA 09:43, 16 మార్చి 2008 (UTC)
శివా!
- చందమామ గురించి మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనిపిస్తుంది. ఏమయినా మీ రచన మాత్రం సూపర్. ఇంతకు ముందే చందమామ మనకున్న విశేష వ్యాసాలలో ఒకటి. ఇప్పుడు మీరు దానిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళుతున్నారు.
- మీరు వ్రాసేటప్పుడు కామా, ఫుల్‌స్టాప్‌ల తరువాత ఖాళీ (స్పేస్) ఇవ్వడం తరచు మరచిపోతున్నారు. గమనించగలరు.
- మీ పరిచయం క్లుప్తంగానైనా మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది.
- గారు, శ్రీ వంటి గౌరవ వాచకాలు వికీ శైలికి తగవు అని ఇంతకు ముందు చర్చించి నిర్ణయించారు. 'వచ్చాడు, వెళ్ళాడు, గీశాడు' వంటివే ఉత్తమం అనుకొన్నారు. కాని ఇలా వ్రాయడం చాలా మందికి (మన సంస్కృతి పరంగా) ఇబ్బందిగా ఉంటున్నది. అయినా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వీలయినంత వరకు బహువచనాలు, గౌరవ వాచకాలు వాడవద్దని మనవి.
- ఈ సీరియల్ చాలా అద్భుతం వంటి వాక్యాలు అభిప్రాయాల క్రిందికి వస్తాయి. అలాగని ఫలానా వారన్నారు అనేది రిపోర్టింగ్‌గా పరిగణించబడుతుంది. గమనించండి.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:58, 16 మార్చి 2008 (UTC)
ధన్యవాదములు కాసుబాబుగారూ. చందమామ నా చిన్నప్పటి నుండి నా నేస్తం. అటువంటి చక్కటి పత్రిక మళ్ళీ ఇంతవరకు చూడలేదు. కానీ అటువంటి పత్రికయేక్క ప్రస్తుత పరిస్తితి చూస్తె చాలా బాధగా ఉన్నది. ఇద్దరు, ముగ్గురు కలసి చందమామను చక్కటి స్తాయికి తీసుకుని వెళ్ళారు(1950-1970 ల మధ్య). అలాగే చందమామ మీద ఆసక్తి తో మనస్సు పెట్టి ఆ పత్రిక ప్రాభవాన్ని తిరిగి తేగలిగే వారు ఆ సంస్తకు దొరికితే మన అద్రుష్టం. మీ సూచనలకు ధన్యవాదములు. చందమామ పేజీ విస్తారమయిందని హెచ్చరిక వస్తున్నది, 2వ పేజీకి తీసుకుని వెళ్ళమని సూచన కూడ ఉన్నది. దయచేసి, వ్యాసమును 1 పేజీ నుండి 2 పేజీలకు చెయ్యటం ఎలాగొ చెప్పగలరు.ధారావాహికల జాబితా కు ఒక లింక్ పెట్టి జాబితాను ప్రత్యేక పుటలో ఉంచాను, అక్కడనుండి ప్రతి ధారావాహికకు ఒక్కొక్క ప్రత్యేక పుటకు లింక్ ఏర్పరిచాను. చూసి మీ సూఛనలు ఇవ్వగలరు.నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు నాకేమీ అనిపించట్లేదు. నేను వ్రాసిన మార్పులు, వ్యాస భాగలలొ అక్కడయినా ఎమోషనల్ అయ్యి వ్రాయబడినట్లు అనిపిస్తే తెలియచేయగలరు. తగిన మార్పు తప్పకుండా మీ సూచన అనుసరించి చెయ్యగలను.చందమామ పుట పూర్తి సమగ్రంగా తయారు కావాలన్నదే నా అకాంక్ష.చందమామ ధారవాహికలన్నిటికి(నాకు గుర్తున్నంతవరకు)ప్రత్యేక పుటలు ఎర్పరిచాను(ముఖ్య పుటనుండి లింక్ లతొ).అభిరుచిగల సభ్యులకు ఈ ధారావాహికల గురించి వ్రాయుటకు ఒక ఆహ్వానము, వికీపీడియా ద్వారా పంపగలమా??--SIVA 01:26, 17 మార్చి 2008 (UTC)
- బేతాళ కథ అసలు ఎవరు వ్రాసారు,
- ఏ కాలంలో వ్రాయబడినది,
- బేతాళకథలు ఎన్ని ఉన్నాయి,
- బేతాళకథలకు చివరి కథ ఉన్నదా. ఉంటే ఆ కథ ఏమిటి.
- చందమామలో వేసిన బేతాళకథలలో అత్యున్నతమయినవి ఎంచి, వాటి గురించి క్లుప్తంగా వ్యాసంలో వ్రాయగలమా
పైన ఉదహరించిన విషయాల గురించి సభ్యులు అలూచించ ప్రార్థన--SIVA 20:18, 19 మార్చి 2008 (UTC)
- తప్పకుండా వ్రాయవచ్చును. మీకు తెలిసినంత వరకు వ్రాయండి. మిగిలినవి ఎవరో ఒకరు వ్రాస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)
- బేతాళ కథల గురించి వ్యాసం కొంతవరకు పూర్తి చేసాను. నా దగ్గర ఉన్న బొమ్మలు జత పరిచాను.చందమామ పుటనుండి లింక్ ఉన్నది. దయచేసి చూసి, మీ అభిప్రాయం, సూచనలు చెప్పగలరు.--SIVA 20:04, 19 మార్చి 2008 (UTC)
- శివా! బేతాళ కథలు లేదా భేతాళ కధలు - ఏది సరైన పేరు? ఒకమారు చందమామలో ఉన్న సరైన స్పెల్లింగ్ చూసి చెప్పండి. కధలలో చివర ఉండే బొమ్మగా అన్ని బొమ్మలు ఉండడం (నాకు) బాగులేదు. అన్ని బొమ్మలనూ కలిపి ఒక చిత్రంగా తిరి త్వరలో లోడ్ చేస్తాను. పోల్చి చూసి నిర్ణయం తీసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)
- కాసుబాబుగారూ! బేతాళ కథలు సరైన పేరు. అందులో బే కు వత్తు లేదు.
- కథ చివర బొమ్మలను కలిపి ఒకటిగా చేసి ఒకే చిత్రం చెయ్యటం మంచి ఆలోచన. నేనుకూడా పయత్నింస్తున్నాను,--SIVA 12:03, 20 మార్చి 2008 (UTC)
మీ వ్యాసాలు
[మార్చు]Vu3ktb గారు, మీరు రాస్తున్న వ్యాసాలన్నింటినీ ఒకచోట అమర్చుకుంటే మీకు, పాఠకులకు మున్ముందు చాలా ఉపయోగకరంగా ఉండగలదు. ఉదాహరణకు మీరొక వ్యాసం మొదలు పెట్టినపుడు లేదా పూర్తి చేసినపుడు ఆ వ్యాసనామాన్ని మీ పేజీలో, అంటే Vu3ktb పేజీలో భద్రపరచండి. --Svrangarao 22:20, 17 మార్చి 2008 (UTC)
చలం - వ్యాసం
[మార్చు]శివా! చలం పేరుతో ఉన్న రెండు వ్యాసాలు విలీనం చేశాను. గమనించ గలరు. నేను ఇతర పనుల వలన గుడిపాటి వెంకట చలం, చందమామ వ్యాసాల గురించి మీరు అడిగిన ప్రశ్నలకు స్పందించలేక పోయాను. ఇప్పటికే కొన్ని సందేహాలు తీరిపోయి ఉంటాయనుకొంటాను. మరేమైనా వివరాలు కావాలంటే నా చర్చా పేజీలో అడగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:56, 18 మార్చి 2008 (UTC)
చందమామ పేజీ
[మార్చు]గురువుగారూ! చందమామ వ్యాస వ్యాస పుటలో, అన్నిటికన్న ప్రస్తుతపు సంపాదకుల బొమ్మ చాలా పెద్దది అయిపోయి వషయ-బొమ్మల నిష్పత్తి మీద ప్రభావం చూపుతున్నది.అందుకని బొమ్మను మెగిలిన బొమ్మల సైజుకు మార్చాను,దయచేసి గమనించగలరు.--SIVA 02:53, 20 మార్చి 2008 (UTC)
బొమ్మ
[మార్చు]శివగారు, ఒకే బొమ్మను పలుమార్లు అప్‌లోడ్ చేస్తున్నట్టున్నారు.. బొమ్మతో ఏదయినా సమస్య ఎదురవుతున్నదా? --Svrangarao 02:33, 23 మార్చి 2008 (UTC)
రంగారావుగారూ! సహాయానికి వచ్చినందుకు ధన్యవాదములు. గాడ్సే బొమ్మ చిన్నది చెయ్యలని నా ప్రయత్నం. అందుకని 1కి 2సార్లు అప్లోడ్ ప్రయత్నించాను. దయచేసి గాంధీ పుటలో గాడ్సే చిత్రాన్ని ఇంకా చిన్నది చేసి అంతవరకూ సిమెట్రికల్ గా ఉందేటట్లు చెయ్యగలరా.--SIVA 03:07, 23 మార్చి 2008 (UTC)
- మీరు px బదులు pix టైపు చేయడంవలన అనుకున్న సైజులో కనిపించలేదు అనుకుంటాను. మరొకసారి ప్రయత్నించి చూడండి. --Svrangarao 05:06, 23 మార్చి 2008 (UTC)
ధన్యవాదములు రంగారావుగారూ. మీరు తగిన సమయం లో సరైన సలహా ఇచ్చారు మరియు నేను తెలియకుండా చేసిన తప్పు తెలియచేసారు.--SIVA 05:53, 23 మార్చి 2008 (UTC)
కమ్యూనిజం చిహ్నం గురించి
[మార్చు]శివ గారూ! నా పొరపాటుకు చింతిస్తున్నాను.నేను ప్రివ్యూ లో సింబల్ అనే పదం కనపడకపోవటం గమనించాను.అది ఏదైనా సాంకేతిక లోపం కారణంగా అని అనుకున్నాను.మరలా ఎడిట్ లోకి వెళ్ళి చూస్తే ఆ పదం ఉన్నది.దానితో సాంకేతిక లోపమే అనుకున్నాను.నాకు కూడా ఆ పదం సంతృప్తికరంగా అనిపించలేదు.కానీ బొమ్మ వివరం రాయాలి కనుక అలారాసాను.వికీ కామన్స్ లో ఈ బొమ్మకు వివరం సింబల్ ఆఫ్ కమ్యూనిజం అని ఉన్నది.మొదట ఎంబ్లం అని రాసాను.దానిని మార్చి మరలా సింబల్ అని రాసాను.దానిని కూడా మార్చి తెలుగులో చిహ్నం అని రాద్దామని అనుకుంటుండగా మీ సందేశం చూచాను.వ్యాసం చర్చాపేజీలో కూడా మీసందేశం చూచాను.సింబల్ అనే పదాన్ని తొలగిస్తున్నాను. వట్టి కమ్యూనిజం అనే పదం కూడా సరిపోదేమో!బొమ్మకు వివరాన్ని తెలిపేదిగా మరింత అర్థవంతమైన పదం మరోటి ఉంటుందేమో సూచించగలరు.
కొన్ని మార్పులు అని రాసారు.నేను ఇది తప్ప మరేదీ గుర్తించలేక పోయాను.ఇది కూడా వ్యాసం చర్చాపేజీ లోని చర్చ ద్వారా మాత్రమే తెలిసినది.నేను విస్తరణ మూసను తొలగించటం తప్ప ఉద్దేశ్యపూర్వకంగా మరి దేనినీ తొలగించలేదు.ఆ మిగతా మార్పులేమిటో దయచేసి తెలియచేయండి. Saraswathi Kumar 03:58, 23 మార్చి 2008 (UTC)
కుమార్ గారూ! పైన నేను చేసిన వాఖ్య ఉద్దేశ్యమిది. మనం వ్రాసే వ్యాసం కమ్యూనిజం గురించి మాత్రమే. కమ్యూనిజం అనేది ఒక జీవన విధానం అనుకుంటే, జీవన విధానానికి చిహ్నం (సింబల్) మనం ఉంచాలంటారా. వ్యాసంలో ఉంచిన చిహ్నం సుత్తీ, కొడవలి అనేక కమ్యూనిస్ట్ పార్టీలలో ఏదో ఒక దానిదయి ఉంటుంది.ఈ వ్యాసం కమ్యూనిస్ట్ పార్టీ గురించి కాక, కమ్యూనిస్ట్ జీవన విధానం గురించి కదా, చిహ్నం ఉంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏమంటారు--SIVA 10:56, 23 మార్చి 2008 (UTC)
చేసిన మార్పులగురించి కుమార్ గారూ! నేను 22 03 2008 న కమ్యూనిజం వ్యాసంలో కొన్ని మార్పులు చేసాను. వ్యాసం ఒక పద్దతి ప్రకారం సాఫీగా నడవటానికి ఈ మార్పులు దోహదపడతాయని తలచి చేసాను. ఆ మార్పులన్నీ మీరు రద్దుచేశారు. దయచేసి దీని గురించి చర్చించగలరు.--SIVA 16:58, 22 మార్చి 2008 (UTC)
22 03 2008 న నేను చేసిన మార్పులు
[మార్చు]కుమార్ గారూ! నేను 22 03 2008 న వ్యాసంలో విస్తారమయిన మార్పులు చేసాను. ఈ మార్పులు చేయటంలో నా ఉద్దేశ్యం కిందా, మీదా అయిన విషయాలను ఒకచోట క్రొడీకరించి, వ్యాస పఠన సాఫీగా జరగాలని. కానీ, కొంతసేపటీ తరువాత చూస్తే, నేను చేసిన మార్పులన్నీ, రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినది మీ లాగ్ ఇన్ నామముతో. ఒకసారి కమ్యూనిజం వ్యాసం చరితం చూదండి. నేచేసిన మార్పులు పొరబాటున రద్దు చేయటం జరిగితే, దయచేసి సరిచేయండి. నేను చేసిన మార్పుల మీద మీకైమైనా అభ్యంతరాలుంటే, మనం చర్చింకుందాము.--SIVA 10:59, 23 మార్చి 2008 (UTC)
[1] నుండి వెలికితీశారు
22-3-08 న చేసిన మార్పుల గురించి
[మార్చు]శివ గారూ!వ్యాసం చరితం లో నేనేమీ గుర్తించ లేక పోయాను.కొద్ది రోజుల క్రితం వ్యాస విస్తరణ తప్ప మీ పేరుతో మరే మార్పులూ చరితంలో లేవు.మార్పుల రద్దు పొరపాటున జరిగి ఉండవచ్చని మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు. నేను వికీపీడియాకు కొత్త. వాటిని ఎలా పునరుద్దరించాలో నాకు తెలియదు.వీలైతే మీరే పునరుద్దరించండి.రద్దు చేసినవారే పునరుద్దరించాలనే నియమమేదైనా ఉంటే విధానాన్ని తెలుసుకుని నేనే పునరుద్దరిస్తాను.మీరు చేసిన మార్పులను గుర్తించలేకపోయిన నేను వాటి గురించి ఎటువంటి అభ్యంతరాలనూ కలిగిలేను.ముందు ముందు ఏవైనా అభ్యంతరాలున్నా కూడా ముందుగా చర్చిస్తాను.వ్యాసాన్ని సరిచేస్తున్నందుకు ధన్యవాదాలు.Saraswathi Kumar 12:03, 23 మార్చి 2008 (UTC)
చిహ్నం గురించి
[మార్చు]శివగారూ!బొమ్మ వివరణను శ్రామిక వర్గానికి ప్రతీక అని మార్చాను. ఇప్పుడు బొమ్మ జస్టిఫై అయిందనుకుంటున్నాను.Saraswathi Kumar 12:04, 23 మార్చి 2008 (UTC)
కాసుబాబుగారూ! కమ్యూనిజంకూ కమ్యూనిస్ట్ పార్టీకి చాలా తేడా ఉన్నదని నా ఉద్దేశ్యం. ఒకటి జీవన విధానంగా ప్రతిపాదించబడినది, రెండవది, ఆ పేరుమీద అధికారం కొరకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు. జీవన విధానానికి చిహ్నం ఏమి పెట్టగలం. సుత్తీ కొడవలి కమ్యూనిజంకు గుర్తయితే, కాపిటలిజంకు చిహ్నం ఏమిటి?? అందుకని నా ఉద్దేశ్యంలో కమ్యూనిజం వ్యాసంలో, కమ్యూనిస్ట్ పార్టీ/లకు చేందిన చిహ్నాలు చేర్చటం సముచితం కాదేమోనని.--SIVA 16:24, 23 మార్చి 2008 (UTC)
కుమార్ కు జవాబు
[మార్చు]మీ జవాబు చాలా తొందరహగా ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు వికీపీడియాకు కొత్త అంటున్నారు. నేనూ అంతే. గట్టిగా ఒక 15-20 రోజులబట్టి అనుకుంటాను, అక్కడక్కడ వ్యాసాలు వ్రాయటం మరియు వ్యాసాలకు కొంత కొత్త సమాచారం జతపరచటం చేస్తున్నను. మీకు ఒక సూచన. మీ గురించి మీ పేజీలో క్లుప్తంగా వ్రాయండీ. నా గురించి నా పేజీలో ఉన్నది. అల్లాగే మీరు తయారు చేసిన లేదా కొత్త సమాచారం జత పరచిన పేజీల వివరాలు మీ పుటలో ఉంచండీ. మీకు మరియు ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కమ్యూనిజం వ్యాసం గురించి, ఈ రొజు కాని రేపు కాని మరల మార్పు చెయ్యటానికి ప్రయత్నిస్తాను.--SIVA 13:21, 23 మార్చి 2008 (UTC)
చలం వ్యాసంలో మార్పులు
[మార్చు]రంగారావుగారూ! నమస్కారం.
మీరు చలం వ్యాసంలో చేసిన మార్పులు జత పరచిన విషయాలు చూసాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాని, ...."చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది' వ్రాసిన దాంట్లో నాకెందుకో పూర్తి సబబుగా లేదనిపిస్తున్నది. చలం తన విమర్శలలో ఎప్పుడూ కూడా కుటంబ జీవితంలో స్త్రీలను ఎంత తక్కువగా, ఒక వస్తువను చూసినట్లుగా చూస్తారో, ఎంత తమ అవసరాలకు వాడుకుంటారో వ్రాశారేకాని, కుటంబ జీవితం మీద వేరే విమర్శలు వ్రాసినట్లు నాకు తెలియదు. ఆయన కుటుంబ జీవనాన్ని ఏ కథలో/నవలలో విమర్శించారో చెప్తే బాగుంటుంది.
తరువాత "....తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో....." తన కుటుంబ సభ్యులు మాత్రమే రమణ మహర్షి శిష్యులుగా మారితే, చలం గతిలేక తనూ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ కథ ప్రకారం, దీక్షితులుగారు (అప్పటి తరం మరో రచయిత, చల స్నేహితులు)మొదటిసారి చలాన్ని రమణమహర్షి దగ్గరకు ఎప్పుడో తీసుకొని వెళ్ళారు. క్రమంగా చలం రమణ మహర్షి పట్ల ఆకర్షితులయినట్లు ఆయన ఆత్మ కథలో తెలుస్తుంది. "వొయ్యి" అని పిలుచుకునే ఆయన వదినగారు, విజయవాడలో పేరొందిన వైద్యురాలు. ఆవిడ మరణం తరువాత, సమాజం తన పట్ల చూపుతున్న శతృ వైఖరిని భరించలేక తన కుటుంబంతో సహా చలం విజయవాడ వదలి అరుణాచలం వెళ్ళిపొయ్యరు.ఈ విషయం ఆయన ఆత్మ కథలో స్పష్టంగా ఉన్నది. దయచేసి మీరు మరొక్కసారి verify చెయ్యమని మనవి.--SIVA 17:09, 24 మార్చి 2008 (UTC)
- శివ గారు, చలం కారణంగా ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమయినది అన్నదానిలో మీకు కూడా సందేహం లేదు అనుకుంటాను. 'ఆయన వల్లే ఆ కుటుంబం అలా అయింది ' అన్న విషయమే మరో విధంగా అలా చెప్పబడింది. రెండవదానికోసం ఆయన మనవరాలు రాసిన పుస్తకం చూడవలెను.--Svrangarao 03:27, 30 మార్చి 2008 (UTC)
- శివగారు, ప్రత్యుత్తరము ఇచ్చాను, చూడగలరు --Svrangarao 04:36, 30 మార్చి 2008 (UTC)
- రంగారావుగారూ! నమస్తే. మీరు చలం గారు కుటుంబ వ్యవస్తను విమర్శించారని వ్యాసంలో వ్రాశారు. అట్లా విమర్శించిన చలం కుటుంబం అలా అయిందని వ్రాశారు.కానీ మీ జవాబులో నేను కోరినది చలం ఎక్కడ ఏ నవలలో/కథలో కుటుంబ వ్యవస్తను విమర్శించారో తెలియ చేయమని. మరొక్క సారి మీరు వ్యాసంలో వ్రాసిన వాక్యాలు, నా స్పందన చూడమని నా మనవి. తరువాత అరుణాచలం వెళ్ళటం గురించి. ఆయన సొంత ఆత్మ కథ చదివి నేను నా స్పందన వ్రాశాను. ఆయన మనుమరాలు వేరే విధంగా వ్రాసినా, చలం గారు తన గురించి తాను తన ఆత్మ కథలో వ్రాసుకున్నదే ప్రామణికం అని నా అభిప్రాయం. ఏమంటారు.--SIVA 19:54, 30 మార్చి 2008 (UTC)
- శివగారు, చలం తన పుస్తకంలో తనను విమర్శ చేసుకోడు కదా? ఒక వ్యక్తిగురించి చెపుతున్నపుడు మరొకరు చెప్పిన విమర్శలు కూడా చెప్పాలి! - --Svrangarao 23:19, 31 మార్చి 2008 (UTC)
శివా గారు లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు లభించలేదనే అనపిస్తున్నది. రచయిత చెప్పదలచుకొన్నదానికంటే అధికంగా అర్ధాలకు దారి తీసే వాక్యాలు ఉన్నాయనిపిస్తంది. ఉదాహరణకు -
భార్య చలం ప్రవర్తనతో విసిగి వేసారి .... గుండెపగిలి చనిపోయింది. - ఇక్కడ "గుండె పగిలి" అన్న పదం ఎమోషన్ కోసం వాడిందే. ఆమె అనారోగ్యంతోనో, మానసికంగా కృంగిపోయో మరణించి ఉండాలి. పెద్దకొడుకు చిన్నవసులోనే రోగగ్రస్థుడై మరణించాడు. - ఇది factual కావచ్చును. కాని ఇది వ్రాసిన సందర్భం, మరియు పేరాలో ఇతర వాక్యాలతో కలిపి చదివితే అందుకు కూడా చలం బాధ్యుడు అన్న విపరీతార్ధం ధ్వనిస్తుంది. చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆ కుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది. - చలం కుటుంబ జీవితాన్ని ఎక్కడ విమర్శించాడో చెప్పలేదు. "స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు" - అన్న పదాలు కూడా ఎమోషన్‌ను మూటగడుతున్నాయి. "చలం కుటుంబం ఇలా ఛిన్నాభిన్నమయింది" - అంటే చాలు. చలం విమర్శించింది "తన కుటుంబాన్ని కాదు"(అవును తన కుటుంబాన్ని కాదు! వ్యాసంలో కూడా తన కుటుంబాన్ని అని లేదుకాని, "కుటుంబ వ్యవస్త" గురించి అని రంగారావుగారి అభిప్రాయం--SIVA 16:25, 14 ఏప్రిల్ 2008 (UTC)) ఈవిధంగా మానసికంగా దుర్బలుడైన చలం - ఈ పదాలు వేరెవరైనా వాడి ఉంటే వాటిని ఉట్టంకించవచ్చును. వికీ రచయిత స్వయంగా వ్రాయదగిన పదాలు కాదు. తనను, తన కుటుంబాన్ని బలి ఇచ్చాడు. - ఇది కూడా అంతే. ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్ర దేశం వదలి - చలం కలం పట్టిననాటినుండీ విమర్శలకు కొదువ లేదు. అంతేనా? లేక "వెలి" అనే తతంగం ఏమయినా జరిగిందా ఈ వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు నేను పాటించిన నియమం. - contested or questioned or controversial వ్రాతలకు నమ్మ దగిన ఆధారాలు చూపాలి.
(నా స్వంత అభిప్రాయం - ఎందరో అసమర్ధుల, దొంగ వెధవల, మూర్ఖుల, విధివంచితుల కుటుంబాలు కూడా సలక్షణంగా నిలదొక్కుకోవడం జరుగుతూ వుంటుంది. vice vesra కూడాను. కనుక కుటుంబం ఛిన్నాభిన్నమవడానికి, చలం రచనలకూ, వ్యక్తిత్వానికీ లంకె కట్టడం అసంబద్ధం)
ఈ పై వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాసాన్ని పునఃపరిశీలించవలసినదిగా రంగారావుకు సూచిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:49, 11 ఏప్రిల్ 2008 (UTC)
శివ అభిప్రాయం
[మార్చు]ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్ర దేశం వదలి - చలం కలం పట్టిననాటినుండీ విమర్శలకు కొదువ లేదు. అంతేనా? లేక "వెలి" అనే తతంగం ఏమయినా జరిగిందా?
ఈ వ్యాక్యం మాత్రం నేను వ్రాసినదే. నేను చలం ఆత్మ కథ "చలం" చదివి వ్రాశాను. అందులో వ్రాసిన ప్రకారం అనేక ఊళ్ళలో ఆయనకు ఆయన కుటుంబానికి ఉండటానికి ఇల్లు దొరికేది కాదట. బెజవాడలో మాత్రం సొంత ఇల్లు. సొంత ఇంటిని కూడా అమ్మేసి, అరుణాచలం కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపొయాడు చలం. దానికి బలమయిన కారంణం చలం తన ఉత్తరాలలో వీరేశలింగం(కందుకూరి కాదు)కు వ్రాసిన వాటిలో స్పష్టంగా ఉన్నది.కాని, రంగారావు గారు, చలం తన కుటుంబ సభ్యులు రమణ భక్తులవటంవల్లన గతిలేక తను కూడా అరుణాచలం వెళ్ళిపొయ్యాడు అని వ్రాశారు. ఇది సత్య దూరం. రమణ మహర్షి గురించి చలంకు పరిచయం చేసినది ఆయన సయాధ్యాయి, రఛయిత,దీక్షితులుగారు. 1936 నుండి వీరిద్దరు రమణ మహర్షి ఆశ్రమంకు వెళ్ళి వస్తుండేవారట. ఈ విషయం, చలం ఆత్మ కథలోనూ ఆయన ఉత్తరాలలోనూ ఉన్నది.చలంవల్ల రమణ మహర్షి గురించి ఆయన కుటుంబ సభ్యులకు తెలిసి తద్వారా వారు కూడా రమణ భక్తులయ్యారు కాని, వారివల్ల, చలం ప్రభావితం కాలేదు.--SIVA 16:25, 14 ఏప్రిల్ 2008 (UTC))చలాన్ని ఎందుకు వెలి వేశారు ఈ తతంగం ఎలా జరిగింది అన్న విషయం మీద ఇంకా వివరాలు సేకరించవలసి ఉన్నది. అందుకనే, నేను సభ్యుల సహాయం కోరడం జరిగినది.--SIVA 16:25, 14 ఏప్రిల్ 2008 (UTC)
శివ సమాధానం
[మార్చు]కాసుబాబుగారూ,
ఏదయినా వ్యాసం చదువుతున్నప్పుడు, ముఖ్యంగా ఒక తెలియని వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఫొటోలు వ్యాసంలో ఉంటే చదువరుల ఆసక్తిని పెంచుతాయి. అంటే ఆ వ్యక్తి చిన్నతనంలో,యవ్వనంలో మరియి వృద్ధాప్యంలో ఎలా ఉండేవాడు చూడగలిగితే(కనీసం ఫొటొలో నయినా)ఒకప్పుడు మనలాగానే జీవించిన వ్యక్తి అనిపుస్తుంది, సహజత్వానికి దగ్గరగా ఉంటుంది తద్వారా వ్యాసంయెక్క పరిణితి పెరుగుతుందని నాఅభిప్రాయం.అలా ఓక్క ఆసక్తి మాత్రమే కాకుండా, వ్యాసంలో మాటలలో వ్యక్తమవ్వని, వ్యక్తపరచలేని ఆ వ్యక్తియెక్క వ్యక్తిత్వం చదువరులకు ఫొటోల ద్వారా తప్పకుండా తెలియ చేయటం జరుగుతుంది. ఫొటొలు "అరుదయినవి" కాబట్టే వ్యాసంలో జతపరచలేదు. సందర్భానుసారం చలం, అతని భార్య ఫొటోలను జత పరిచాను. తన శైలి మీద చలం వ్యక్త పరిచిన అభిప్రాయం వ్యాస భాగంలో, చలం వ్రాసుకుంటున్న ఫొటొ ఉంచటం జరిగింది. అలాగే, చలం ఇతర రచయితల మీద వ్యక్తపరిచిన అభిప్రాయాలవద్ద కూడా,చలం ఫొటో అతని వైఖరి చెప్పకనే చెపుతున్నది. జిళ్ళెల్లమూడి అమ్మతో చలం చిత్రం పొందుపరచిన కారణం, చలం వ్యక్తిత్వంలోని వైరుధ్యం తెలియ చెప్పటంకోసమే-అంటే ఒకప్పుడు దేవుడి మీద, మతవిషయాలమీద వైముఖ్యం చూపిన చలం, ఈ ఫొటోలో ధార్మిక విషయాలలో ఒక ప్రముఖమైన వ్యక్తిని ఎంత ఆర్తిగా కలుసుకుంటున్నాడు అన్న విషయం స్పుటంగా కనపడుతుంది. ఈ విషయం తెలియచేయటానికి వ్యాసంలొఎన్ని వ్యాక్యాలు వ్రాస్తే సరిపోతుంది? చలంగురించి తెలిసినవారుకూడా, కొంత ప్రయత్నం చేస్తేగాని ఈ ఫొటోలు చూడటం తటస్తించదు. వికీలోకి వచ్చి ఈ వ్యాసం చదివేవారికి సమగ్రంగా తెలియచెప్పటమే నాఉద్దేశ్యం.
ఇక లైసెన్సు గురించి,దాదాపు అన్ని ఫొటోలు, 1 ,2 మినహాయించి అనేక దశాబ్దాల ముందు తీసినవే, కాపీ రైటు కాలదోషం పట్టినవె. అన్ని ఫొటోలకు అప్-లోడ్ చేసేసమయంలో, లైసెన్సు వివరాలు తెలిసినంతవరకు పొందుపరచాను, దయచేసి గమనించి, నేనెమన్నా తప్పుగా లైసెన్సు వివరాలు వ్రాశానేమో చూడగలరు. ఈ బొమ్మలన్నీకూడా, శ్రీ పురాణం సుబ్రమణ్య శర్మ "తెలుగు-వెలుగు" అన్నపుస్తకంలోనివి. ఆపుస్తకం ఈ క్రింద ఉదహరించిన లింక్ నందు ఉచితంగా డౌన్-లోడ్ కు దొరుకుతున్నది. [2]
ఏకవచన ప్రయోగం గురించి
[మార్చు]శివా! మీరు వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంలో వ్రాసిన వ్యాఖ్యను వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం లోకి మార్చాను. ఆ పేజీ, మరియు వికీపీడియా:ఏకవచన ప్రయోగం, వికీపీడియా:శైలి, వికీపీడియా చర్చ:శైలి ఒక మారు చూడండి. ఏమయినా ఈ విషయంపై ఇప్పటికి ఏకాభిప్రాయం కుదరలేదు. సమయం చూసుకొని చర్చ కొనసాగించాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:09, 28 మార్చి 2008 (UTC)
ఏక వచన ప్రయోగం
[మార్చు]అవునండీ, ఈ విషయం గురించి తప్పకుండా మరికొంత చర్చ కొనసాగాలి. మనకున్న మహా నాయకులు, రచయితలు, నటులగురించి వ్రాసేటప్పుడు, "అతను" వచ్చాడు" అని వ్రాయటం ఎబ్బెట్టుగా ఉన్నది. దిన పత్రికలలో కూడా చూస్తుంటాము, ఏ విశ్వనాధ సత్యనారయణగారి గురించో వ్రాసేటప్పుడు "అతను" అని, ఏ నక్సలైటు నాయకుడి గురించి వ్రాసేటప్పుడు "ఆయన" అని వ్రాస్తుంటారు. ఇలా వ్ర్రాయటం ఆ పత్రికల సంపాదకీయ విధానమో లేక ఆ వ్రాసిన విలేఖరి యెక్క సొంత ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంటుందో తెలెయదు. ఆంగ్ల భాషలో వ్యక్తుల గురించి, ఏకవచన ప్రయోగం మానేసి శతాబ్దాలవుతోంది( thou art లాంటివి). దీని వల్ల ఇప్పుడు ఆంగ్ల భాషలో అసలు ఏక వచన ప్రయోగం లేదనుకొంటున్నారు. మన తెలుగులో అలా వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఏకవచన ప్రయోగం కాకుండా (రాముడు వచ్చాడు అంటామా లేక రాముడు వచ్చారు అంటామా అనే వితండవాదనకు దిగకుండా{ఎందుకంటే రాములవారు వచ్చారు అనేవారు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు})బహువచనంలో వ్రాస్తే (వారు జీవించి ఉన్నాలేక స్వర్గస్తులయినాకూడా)మన సొమ్ము ఏమి పోయింది??? మనం ఇతరులను గౌరవిస్తున్నాము కదా అంతకన్నా ఇంకా ఏమీ చేయటంలేదుకదా!! తక్కువలో తక్కువ, బహువచనంలో ఎవరయినా వ్రాస్తే పట్టుబట్టి అన్నీ మార్చకుండా ఉంటే చాలు.--SIVA 18:46, 28 మార్చి 2008 (UTC)
చలం గురించి
[మార్చు]ఈ క్రింద తెలిపిన విధంగా నేను రంగారావు గారికి ఒక మనవి చేసాను, ఆయన వ్రాసిన విషయాలు చదివి. కొంత సమయం గడచినా ఆయన దగ్గరనుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. మీరు ఒక్కసారి ఆయన వ్రాసిన విషయాలు, నేను వ్రాసిన మనవి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు--SIVA 18:46, 28 మార్చి 2008 (UTC) "చలం వ్యాసంలో మార్పులు రంగారావుగారూ! నమస్కారం.
మీరు చలం వ్యాసంలో చేసిన మార్పులు జత పరచిన విషయాలు చూసాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. కాని, ...."చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది' వ్రాసిన దాంట్లో నాకెందుకో పూర్తి సబబుగా లేదనిపిస్తున్నది. చలం తన విమర్శలలో ఎప్పుడూ కూడా కుటంబ జీవితంలో స్త్రీలను ఎంత తక్కువగా, ఒక వస్తువను చూసినట్లుగా చూస్తారో, ఎంత తమ అవసరాలకు వాడుకుంటారో వ్రాశారేకాని, కుటంబ జీవితం మీద వేరే విమర్శలు వ్రాసినట్లు నాకు తెలియదు. ఆయన కుటుంబ జీవనాన్ని ఏ కథలో/నవలలో విమర్శించారో చెప్తే బాగుంటుంది.
తరువాత "....తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో....." తన కుటుంబ సభ్యులు మాత్రమే రమణ మహర్షి శిష్యులుగా మారితే, చలం గతిలేక తనూ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ కథ ప్రకారం, దీక్షితులుగారు (అప్పటి తరం మరో రచయిత, చల స్నేహితులు)మొదటిసారి చలాన్ని రమణమహర్షి దగ్గరకు ఎప్పుడో తీసుకొని వెళ్ళారు. క్రమంగా చలం రమణ మహర్షి పట్ల ఆకర్షితులయినట్లు ఆయన ఆత్మ కథలో తెలుస్తుంది. "వొయ్యి" అని పిలుచుకునే ఆయన వదినగారు, విజయవాడలో పేరొందిన వైద్యురాలు. ఆవిడ మరణం తరువాత, సమాజం తన పట్ల చూపుతున్న శతృ వైఖరిని భరించలేక తన కుటుంబంతో సహా చలం విజయవాడ వదలి అరుణాచలం వెళ్ళిపొయ్యరు.ఈ విషయం ఆయన ఆత్మ కథలో స్పష్టంగా ఉన్నది. దయచేసి మీరు మరొక్కసారి verify చెయ్యమని మనవి.--SIVA 17:09, 24 మార్చి 2008 (UTC)"
కమ్యూనిజం వ్యాసం
[మార్చు]కమ్యూనిజం వ్యాసంలో కమ్యూనిస్ట్ పార్టీ చిహ్నం గురించి నా వాఖ్యలు మీ పేజీలో వ్రాసినవి చూసి తెలుప గలరు.--SIVA 18:46, 28 మార్చి 2008 (UTC)
బొమ్మ వివరాలు
[మార్చు]బొమ్మ:CHALAM WITH JILLELLAMUDI AMMA.jpg కు {{Non-free fair use in|గుడిపాటి వెంకటచలం}} అన్న కాపీ హక్కుల ట్యాగ్ తగిలించాను. ఆ బొమ్మ సారాంశంలో అది ఎక్కడ లభించింది, ఆ సైటులో దాని కాపీ హక్కుల గురించి ఏమి చెప్పబడింది - వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:37, 29 మార్చి 2008 (UTC)
చలం రచనలు
[మార్చు]చలం రచనల జాబితా చూడండి. ఎప్పుడో నేణు చదివిన వాటి ఆధారంగా వ్రాసాను. ఇలా మీరు ఒకో రచన గురించి ఒకటి రెండు వాక్యాలు వ్రాయగలిగితే ఈ వ్యాసం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:47, 29 మార్చి 2008 (UTC)
తెలుగులో వ్రాయటంలో ఎదురయ్యే కష్టాలు-ఒక సలహా
[మార్చు]కాసుబాబుగారూ! నమస్తే. వ్యాసాలు వ్రాసేటప్పుడు చాలాసార్లు ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాను. అదేమిటంటే, వాడవలసిన పదం ఆంగ్ల భాషలో స్పురిస్తుంది. ఆ పదానికి సరయిన తెలుగు పదం ఎంత గింజుకున్నా గుర్తుకురాదు. అతి సామాన్యమైన మాటలు "verify" "allotted" వంటి మాటలకు మంచి నాణ్యమైన తెలుగు మాటలు (ధూమ శకటము లాంటి భయం పుట్టించే మాటలు కాకుండా)దొరికితే బాగుంటుంది. "FREQUENCY" అనే ఆంగ్ల పదానికి తెలుగులో ఒక కంకర్రాయి లాంటి మాట "దైర్ఘ్యమానము" అనుకుంటాను ఉన్నది. ఇటువంటి ఉచ్చరించటానికి కూడా శ్రమ పడవలసిన పదానికి బదులు, ఆంగ్ల పదమే తెలుగులో ఫ్రీక్వెన్సీ అని వ్రాస్తే అందరికీ సులభంగా ఉండగలదు. ఈ సమస్య నాలా చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.ఈ మాట నామవాచకము కాబట్టి, ఆంగ్ల పదమే తెచ్చి తెలుగు లిపిలో వ్రాస్తే, మన భాషలోకి సులభంగా కలిసిపోతుంది-రైలు రోడ్డు వంటి పదాలలాగా. కానీ, ఇతర నామవాచకములు (verb, pronoun మొదలగునవి)విషయంలో ఇలా చేస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. నా సలహా లేక వినతి ఏమంటే, మన తెలుగు వికీపీడియాలో ఒక ప్రత్యేక పుట ఏర్పరిచి, అందులో ఎవరికైనా ఏ పదానికైనా సరయిన తెలుగు పదం దొరకకపోతే, సహాయం పొందటానికి వీలుగా ఏర్పరిస్తే బాగుంటుంది. ఇతర సభ్యులు తమ అనుభవంద్వారా ఆ మాటకు సరయిన తెలుగు పదం సూచించవచ్చు, కొంత చర్చ (అవసరమైతే) జరిగిన తరువాత దాదాపు అందరికీ అమోదయోగ్యమైన చక్కటి తెలుగు మాట తయారు అవుతుంది. నిఘంటువులలోని పదాలకన్నా, నలుగురూ చర్చించి ఒక పదానికి రూపకల్పన చేస్తే మంచి ఫలితాల్నిస్తుందని నా ఉద్దేశ్యం. దయచేసి పరిశీలించి, మీ అభిప్రాయం తెలియచెయ్యండి. ఇప్పటికే, ఇటువంటి సౌలభ్యం లభిస్తున్నట్లయితే, వివరాలు తెలుపగలరు.--SIVA 02:33, 30 మార్చి 2008 (UTC)
- శివగారు, మీరు సరి అయినదే చెబుతున్నారు. కొందరు 'ఇంటర్నెట్' ను కూడా 'అంతర్జాలం' అని అనువదిస్తున్నారు. తెలుగు తెలిసిన ఎంతమందికి ఆ పదం అర్థమవుతుంది! కాబట్టి వీలయినంతవరకు అందరికీ తెలిసిన తెలుగు పదాలను ఉపయోగిస్తూ అవసరమయిన చోట వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను ఉపయోగించడం మంచిది.--Svrangarao 03:29, 30 మార్చి 2008 (UTC)
- ఈ విషయంలో అనువాదకులకు సహకారం కోసం ఇంతకు ముందు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కాని ముందుకు వెళ్ళలేదు. 'ఎవరొ ఒకరు చేస్తారులే' అని. ఇటువంటి లోపాలను సవరించడానికే నేను ప్రత్యేక దళాలు ఏర్పరచాలని రచ్చబండ - ప్రతిపాదనలలో ప్రతిపాదించాను. ఒకసారి చూడండి. త్వరలో అటువంటి దళం ఏర్పాటు చేద్దాము. అనువాదాలకు తరచు పనికొచ్చే పదాల పట్టికను వారు కూర్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:51, 30 మార్చి 2008 (UTC)
ప్రపంచ లిపి
[మార్చు]ayyalaarraa ammalaaraa, mana telugu bhaasha teta bhaasha. kaani prathi bhaahsa vaadoo athani bhaashe melu ani vaadishaadu kadaa? nenu orissa kelithe akkada lipi, madura vellithe akkada lipi, naapillalu english badi, naa bandhuvulu ithra vaalu. ilaaanti parishthith sandharbhaallalo, bhaashalannitiki roman lipi konnikonni sardhi vraasthe, prathi bhaasha oke lipilo untundi kaabatti chadavadam raayadam enta sulabhamo sukhamo aaalochinchandi. emo telugu raathe undaali ani enduku ee pattu? MODOFIED ROMAN SCRIPT FOR ALL ALL LANGUAGES ane aaalochana manaku raavaali. naa vinnapamu. aaalochana. salahaaa.<pradhangeorge@yahoo.com> dr mbbs 1950.
స్పందనలు
[మార్చు]వైఙాసత్య అంతదానికి రోమన్ లిపితో కూడా కుస్తీ ఎందుకూ? ఎలాగూ ఇప్పటికే చాలా మంది చదువుకున్నవాళ్లు రాతకోతలకు ఇంగ్లీషు వాడుతున్నారు. ఇంకొక తరముకల్లా అందరూ ఇంగ్లీషులో చదువుకొని అదే ఉపయోగిస్తారు. ఇంక తెలుగు రాయడము అవసరము అంటారా? మీ తర్కాన్ని బట్టి ?--వైఙాసత్య 23:51, 17 మార్చి 2006 (UTC)
శివ
లిపి అనేది ప్రతి భాష యొక్క ప్రత్యేకత. ఉదాహరణకి, తెలుగులో "ణ" "ళ" "క్ష"(ఉదాహరణకు ఇవి కొన్ని మాత్రమే) వంటి అక్షరాలను ఏ లిపిలోనైనా వ్రాయగలరా?? రోమన్ లిపిలో అస్సలు వ్రాయలేరు."త" "ట" కు రోమన్ లిపిలోతేడానే లేదు. మరి ఆ అక్షరాలు గల పదాల మాటేమిటి?? వాటిని అపభ్రంశంగా రోమన్ లిపిలో వ్రాయవలసిందే?? ఇదేమి వింత వాదన!! ప్రపంచం మొత్తనికి ఒక లిపి నిజంగా ఉండాలంటారా?? ఉండవలసి వస్తే అది ఏ లిపి అయ్యి ఉండాలి?? అన్న విషయాల మీద చాలా పెద్ద చర్చ జరగాలి. ఇటువంటి విషయాలలో, ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. రోమన్ లిపి ఇప్పటికే "చదువుకున్నాం మనం" అనుకునే కొద్దిమందికి వచ్చి ఉండవచ్చు. కానీ ఆ రోమన్ లిపినే ప్రపంచ లిపి చెయ్యబూనటం సులభం కాదు, సమబు కాదు అంతకంటే అవసరం లేదని నా అభిప్రాయం. ముఖ్యంగా, నేను తెలుగులో మాట్లాడగలను గానీ, వ్రాయలేను అని (గొప్పగా) చెప్పుకోవటం తగ్గించి, ప్రయత్నిస్తే మాతృభాషలో వ్రాయగలగటం కష్టమేమీ కాదు, పిల్లలకు నేర్పటం పెద్ద కష్టం కాదని నా భావన. భారత దేశంలో పుట్టి ప్రాధమిక విద్య ఇక్కడే అభ్యసించగలిగిన అదృష్టం గలిగిన పిల్లలకు మూడు భాషలు (మాతృభాష, ఆంగ్లము, హిందీ లేక సంస్కృతము)లిపితో సహా నేర్చుకొనే ఉంటారు.--SIVA 03:20, 30 మార్చి 2008 (UTC)
SVR చిత్రాలు
[మార్చు]మీరు వ్యాసాల పేర్లలో "చిత్రాలు" వంటివి వాడకండి. ఆ వ్యాసం పేరుకి అందులో ఉన్న విషాయానికి సంబంధమే లేదు. సాయీ(చర్చ) 05:33, 30 మార్చి 2008 (UTC)
ఖాళి పేజి ని తుడిపేయక ఇంకేం చేస్తారు? సాయీ(చర్చ) 12:39, 30 మార్చి 2008 (UTC)
మీరు తయారు చేసిన పేజి ఇక్కడఉంది. సాయీ(చర్చ) 13:02, 30 మార్చి 2008 (UTC)
ఈరోజునే నేను రంగారావు వ్యాసం మార్చి ఆయన నటించిన చిత్రాలను వేరే పేజీకి మార్చాను. కాసేపటీకి అది తొలగించబడినదని సందేశం చూశాను. అక్కడ నేను ఉంచిన చిత్రాల జాబితా పోయిందేమో అని కంగారులో చరితంలోకి వెళ్ళి రద్దుపరిచాను. కాని చూస్తే,అక్కడ ఆ జాబితా వేరే పుటకు జాబితాను మార్చినట్లు కనబడింది.ఇప్పుడు మళ్ళీ ఆ జాబితాను రంగారావు వ్యాసంలో ఉప పేజీ ఉంచాను. దయచేసి ఒక సారి చూడండీ. ఈలింక్ లు ఇవ్వటం నాకు కొత్త. సరిచేస్తో మరో పొరపాటు ఏమన్నా చేసి ఉంటే సరిదిద్దగలరు.--SIVA 12:55, 30 మార్చి 2008 (UTC)
ధన్యవాదములు సాయీ గారూ. చిత్రాలు పేజి తొలగించేముందు, ఆ పేజీకి ఎస్వి రంగారావు పుటకు ఉన్న లింక్ గమనించి చిత్రాల జాబితాను, ఉప పుటలో జత పరచి ఉంటే నా కంగారు తప్పేదనుకుంటాను.కాని ఒక కొత్త విషయం ఈ సంఘటన వల్ల తెలుసుకున్నాను. మరొక్కసారి ధన్యవాదములు--SIVA 13:38, 30 మార్చి 2008 (UTC)
Hello, incidentally I saw that You tried to use an image here that is on the English Wikipedia. To make the images work on every wiki everyone should upload to commons: (all free licences can be uploaded there).
Please could You upload the images to commons, please don't forget to give the correct licences.
Many thanks, please be welcomed to contact me if You have any questions, best regards, --Spacebirdy 19:36, 30 మార్చి 2008 (UTC)