గ్లోబల్ వార్మింగ్

వికీపీడియా నుండి
(వాతావరణ మార్పు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాసా వారి గొడ్దార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ ప్రకారం, 1951 నుండి 1980 వరకు బేస్‌లైన్ సగటుతో పోలిస్తే 2015 నుండి 2019 వరకు సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు
1800 ల చివరి నుండి భూమి ఉపరితలం వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత పెరిగింది, సాధారణ తాపం. ఏటా జరిగే మార్పులు (నలుపు రంగులో), సవరించినవి (ఎరుపు రంగులో).
గ్లోబల్ వార్మింగ్‌కు ప్రాధమిక కారణాలు [1] విస్తృత- ప్రభావాలను [2] [3] . కొన్ని ప్రభావాలు శీతోష్ణస్థితి మార్పులను తీవ్రతరం చేసే ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్ కలిగి ఉంటాయి. [4]

గ్లోబల్ వార్మింగ్ (global warming; "భూగోళ/ప్రపంచ కవోష్ణత"[5]) అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు[6] (climate change; క్త్లెమేట్ చేంజ్) లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.[7] గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పు అనే మాటలను తరచూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. శీతోష్ణస్థితిలో మార్పు అంటే గ్లోబల్ వార్మింగ్‌తో పాటు, దాని వలన అవపాతంలో (వర్షం, మంచు కురవడం వంటివి) ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర-పూర్వ కాలాల్లో కూడా జరిగినప్పటికీ, 20 వ శతాబ్దం మధ్యకాలం నుండి జరిగిన ఉష్ణోగ్రతల పెరుగుదల, అంతకు ముందెన్నడూ జరగనివి.

శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ పానెల్ (IPCC) ఐదవ మదింపు నివేదికలో "20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఏర్పడిన ఉషోగ్రతల పెరుగుదలకు అతి ముఖ్యమైన కారణం మానవుడే అనడానికి ఎంతో అవకాశం ఉంది" అని చెప్పింది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం. నివేదికలో సంగ్రహించిన శీతోష్ణస్థితి నమూనా అంచనాలు, భవిష్యత్తు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల రేటు, శీతోష్ణస్థితి ప్రతిస్పందనలపై ఆధారపడి, 21 వ శతాబ్దంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 0.3 నుండి 1.7 °C (0.5 నుండి 3.1 °F) వరకూ, అత్యధికంగా 2.6 నుండి 4.8 °C (4.7 నుండి 8.6 °F) వరకూ పెరిగే అవకాశం ఉందని సూచించాయి. ఈ పరిశోధనలను ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ సైన్స్ అకాడమీలు గుర్తించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చెందిన ఏ శాస్త్రీయ సంస్థ కూడా ఈ సూచనలపై విభేదించలేదు.[8][9]

గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలలో సముద్ర మట్టాలు పెరగడం, అవపాతంలో ప్రాంతీయ మార్పులు, వేడి తరంగాల వంటి తీవ్ర శీతోష్ణస్థితి సంఘటనలు, ఎడారుల విస్తరణ ఉన్నాయి. మహాసముద్రాల ఆమ్లీకరణ కూడా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వల్ల సంభవిస్తుంది. ఇది ఉష్ణోగ్రతల వలన జరగనప్పటికీ సాధారణంగా ఆ ప్రభావాలతోటే దీన్నీ కలిపి చూస్తారు. ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల ఆర్కిటిక్‌లో అత్యధికంగా ఉంది. ఇది హిమానీనదాలు, శాశ్వత మంచు, సముద్రపు మంచుల తిరోగమనానికి కారణమౌతోంది. మొత్తంమీద, అధిక ఉష్ణోగ్రతల వలన ఎక్కువ వర్షం, హిమపాతం కలుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో కరువు, అడవి మంటలు పెరుగుతాయి. శీతోష్ణస్థితి మార్పు వలన పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంత మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి. అనేక సముద్ర తీర నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థలు మారిపోవడంతో అనేక జాతుల జీవులు అంతరించిపోవడం లేదా వలసపోవడం జరుగుతుంది. తక్షణమే ప్రభావితమయ్యే పర్యావరణ వ్యవస్థల్లో పగడపు దిబ్బలు, పర్వతాలు, ఆర్కిటిక్‌ లు ఉన్నాయి.[10]

గ్లోబల్ వార్మింగ్‌కు సమాజం ప్రతిస్పందించాల్సిన అంశాలలో ఉద్గారాల తగ్గింపు, దాని ప్రభావాలకు అనుగుణంగా మారడం, క్లైమేట్ ఇంజనీరింగ్ మొదలైనవి ఉన్నాయి. శీతోష్ణస్థితి మార్పులపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా కన్వెన్షన్ (యుఎన్‌ఎఫ్‌సిసి) ఛత్రం కింద వివిధ దేశాలు కలిసి పనిచేస్తాయి. 1994 లో అమల్లోకి వచ్చిన ఈ కూటమిలో దాదాపుగా ప్రపంచవ్యాప్త దేశాలన్నీ సభ్యులే. ఈ కూటమి అంతిమ లక్ష్యం "శీతోష్ణస్థితి వ్యవస్థలో ప్రమాదకరమైన మానవజనిత జోక్యాన్ని నిరోధించడం". ఉద్గారాలలో పెద్దయెత్తున కోతలు అవసరమని యుఎన్‌ఎఫ్‌సిసికి చెందిన సభ్యులంతా అంగీకరించినప్పటికీ, గ్లోబల్ వార్మింగ్‌ను 2 °C (3.6 °F) కన్నా తక్కువకు పరిమితం చెయ్యాలని 2016 పారిస్ ఒప్పందంలో తలపెట్టినప్పటికీ, భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పరిమితిలో ఇప్పటికే సగం వరకూ పెరిగింది. ఉద్గారాలను తగ్గిస్తామంటూ వివిధ దేశాలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలు భవిష్యత్తులో పెరిగే తాపాన్ని నియంత్రించడానికి సరిపోవు.

గమనించిన ఉష్ణోగ్రత పెరుగుదల

[మార్చు]

పారిశ్రామిక విప్లవపు ప్రారంభ ప్రభావాలను ప్రకృతి సహజమైన వైవిధ్యాలు భర్తీ చేశాయని శీతోష్ణస్థితి ప్రాక్సీ రికార్డులు చూపిస్తున్నాయి. కాబట్టి 18 వ శతాబ్దం, 19 వ శతాబ్దం మధ్యకాలంలో, థర్మామీటర్ రికార్డులు ప్రపంచవ్యాప్తంగా అందడం మొదలైనప్పుడు, తాపం తక్కువగా ఉండేది. పారిశ్రామిక విప్లవానికి పూర్వపు ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత అంచనాగా బేస్‌లైన్ రిఫరెన్స్ కాలాన్ని 1850-1900 గా IPCC స్వీకరించింది.

2009–2018 దశాబ్దం పారిశ్రామిక-పూర్వ బేస్‌లైన్ (1850-1900) కంటే 0.93 ± 0.07 °C వేడిగా ఉందని ఉష్ణోగ్రతలు కొలిచే అనేక పరికరాల ద్వారా పొందిన వివిధ డేటాసెట్‌లు నిర్ధారించాయి. ప్రస్తుతం, ఉపరితల ఉష్ణోగ్రతలు దశాబ్దానికి సుమారు 0.2 °C చొప్పున పెరుగుతున్నాయి. 1950 నుండి, చల్లని పగళ్ళు, చల్లని రాత్రుల సంఖ్య తగ్గగా, వెచ్చని పగళ్ళు, వెచ్చని రాత్రుల సంఖ్య పెరిగింది. మధ్యయుగం నాటి శీతోష్ణస్థితి వైపరీత్యం, చిరు మంచుయుగం వంటి వేడెక్కుతూ, చల్లబడుతూ ఉండే నమూనాలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న భూతాపం పెరుగుదల వలె లేదు. కొన్ని ప్రాంతాలలో 20 వ శతాబ్దం చివరిలో ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండవచ్చు. శీతోష్ణస్థితి మార్పుకు ఉన్న గత ఉదాహరణలు ఆధునిక శీతోష్ణస్థితి మార్పులపై అవగాహన కలిగిస్తాయి.

గ్లోబల్ వార్మింగ్‌కు అత్యంత సాధారణ కొలత ఉపరితల వాతావరణ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అయినప్పటికీ, గత 50 సంవత్సరాల్లో శీతోష్ణస్థితి వ్యవస్థలో పేరుకుపోయిన అదనపు శక్తిలో 90 శాతానికి పైగా సముద్రపు నీటిని వేడెక్కించడానికే ఉపయోగపడింది. [11] మిగిలిన భాగం, మంచును కరిగించి ఖండాలను, వాతావరణాన్నీ వేడెక్కించింది.

పరికరాలతో చేసిన ఉష్ణోగ్రత రికార్డుల్లో వేడెక్కడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది, వివిధ స్వతంత్ర శాస్త్రీయ సమూహాలు చేసిన విస్తృత పరిశీలనలకు అనుగుణంగానే ఉంది. ఉదాహరణకు, చాలా ఖండాంతర ప్రాంతాలలో భారీ అవపాతాలు (వర్షం, మంచు కురవడం) జరిగే తరచుదనమూ పెరిగింది, వాటి తీవ్రతా పెరిగింది. సముద్ర మట్టం పెరగడం, మంచు, భూమిపైనున్న మంచు విస్తృతంగా కరగడం, మహాసముద్రాల్లో ఉష్ణం పెరగడం, పెరిగిన తేమ, వసంతకాలంలో పుష్పించాల్సిన మొక్కలు ముందుగానే పుష్పించడం వంటివి ఉష్ణోగ్రత పెరుగుతోందనడానికి ఇతర ఉదాహరణలు.

ప్రాంతీయ పోకడలు

[మార్చు]

గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సగటులను సూచిస్తుంది. అయితే వేడెక్కడం లోని తీవ్రత, ప్రాంతాల వారీగా మారుతూంటుంది. పారిశ్రామిక-పూర్వ కాలం నుండి, ప్రపంచ సగటు నేల ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా పెరిగాయి. మహాసముద్రాల ఉష్ణ సామర్థ్యం ఎక్కువగా ఉండడం, ఇవి బాష్పీభవనం ద్వారా వేడిని ఎక్కువగా కోల్పోవడం దీనికి కారణం. వేడెక్కడం, గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడే ప్రదేశాలపై ఆధారపడదు. ఎందుకంటే, గ్రహం అంతటా వ్యాపించేంత కాలమూ, ఈ వాయువులు వాతావరణంలో నిలబడే ఉంటాయి; అయితే, మంచుపై, ఐసుపై ఏర్పడే బ్లాక్ కార్బన్ నిక్షేపాలు ఆర్కిటిక్ వేడెక్కడానికి దోహదం చేస్తున్నాయి.

ఉత్తరార్ధగోళం, ఉత్తర ధ్రువాలు దక్షిణార్ధగోళం, దక్షిణ ధ్రువాల కంటే చాలా వేగంగా వేడెక్కాయి. ఉత్తరార్ధగోళంలో నేల ఎక్కువగా ఉండడమే కాదు, ఆర్కిటిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న భూభాగాల అమరిక ఫలితంగా మంచు, ఐసు దుప్పటి నుండి ప్రతిబింబించే సూర్యరశ్మి సముద్ర, భూ ఉపరితలాలకు ఎక్కువ వేడిని అందిస్తుంది. ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగాయి. అంతేకాదు, 21 వ శతాబ్దంలో ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే రెండు రెట్లు అధికంగా పెరుగుతాయని కూడా అంచనా వేసారు. ఆర్కిటిక్, భూమధ్యరేఖల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం తగ్గినప్పుడు, ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం వలన ఏర్పడే గల్ఫ్ స్ట్రీమ్ వంటి సముద్ర ప్రవాహాలు బలహీనపడతాయి.

స్వల్పకాలిక మందగమనం, పెరుగుదల

[మార్చు]

శీతోష్ణస్థితి వ్యవస్థలో పెద్ద యెత్తున ఉష్ణ జడత్వం ఉన్నందున, శీతోష్ణస్థితి పూర్తిగా సర్దుబాటు కావడానికి శతాబ్దాలు పడుతుంది. రికార్డ్-బ్రేకింగ్ సంవత్సరాలు ప్రజలను పెద్దయెత్తున ఆకర్షిస్తాయి గానీ, ఒక్కో ఏడాదిలో ఏర్పడే మార్పుల ప్రాముఖ్యత కంటే మొత్తంపై జరిగే మార్పుల పోకడకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. గ్లోబల్ ఉపరితల ఉష్ణోగ్రతల్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఉంటూంటాయి. ఇవి దీర్ఘకాలిక పోకడల కంటే తీవ్రంగా కనిపిస్తూ, వాటిని తాత్కాలికంగా మరుగుపరుస్తాయి. దానికి ఉదాహరణ 1998 నుండి 2012 వరకు నెమ్మదించిన ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల. దీనిని గ్లోబల్ వార్మింగ్ విరామం అని పిలుస్తారు. ఈ కాలమంతా, సముద్రపు ఉష్ణ నిల్వ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆ తరువాతి సంవత్సరాల్లో, ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రకృతి సహజమైన హెచ్చుతగ్గులు, సౌర కార్యకలాపాలు తగ్గడం, అగ్నిపర్వత కార్యకలాపాలు పెరగడం వంటివి తాపం మందగించడానికి కారణాలు.

ఇటీవలి శీతోష్ణస్థితిలో మార్పుకు భౌతిక కారణాలు

[మార్చు]
ఐదవ ఐపిసిసి అసెస్‌మెంట్ రిపోర్టులో నివేదించినట్లుగా, 2011 లో శీతోష్ణస్థితి మార్పులకు వివిధ కారణాలున్నాయి. వాయువులు, ఏరోసోల్స్ నేరుగా చూపే ప్రభావమే కాక, వాతావరణంలో రసాయనిక చర్య ద్వారా రూపాంతరం చెంది ఏర్పడే సమ్మేళనాల ప్రభావాన్ని సూచిస్తాయి.

శీతోష్ణస్థితి వ్యవస్థ వివిధ ఆవర్తనాలకు లోనౌతుంది. ఈ ఆవర్తనాలు సంవత్సరాలు (ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్ వంటివి), దశాబ్దాలు , శతాబ్దాల పాటు ఉంటాయి. ఇతర మార్పులు బయటి వత్తిళ్ళ వల్ల సంభవిస్తాయి. ఈ వత్తిళ్ళు శీతోష్ణస్థితి వ్యవస్థకు "బయటివే" గాని, భూమికి బయటివి కావు. వాతావరణ కూర్పులో మార్పులు (ఉదా. గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు), సౌర ప్రకాశం, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించే కక్ష్యలో ఏర్పడే మార్పులు మొదలైనవి బయటి వత్తిళ్ళకు ఉదాహరణలు.

ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పులు మానవ జనిత గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదల వల్లనే జరిగాయని నిర్ధారించాలంటే, ముందు అంతర్గత వాతావరణ వైవిధ్యాలు, ప్రకృతి సహజమైన బయటి వత్తిళ్ళూ అందుకు కారణం కాదని తేల్చుకోవాలి. దీని కోసం, భౌతిక, గణాంకాధారిత కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించి అన్ని సంభావ్య కారణాలకూ వాటి వాటి ప్రత్యేక ముద్రలను గుర్తించాలి. ఈ ముద్రలను, గమనించిన నమూనాల తోటీ శీతోష్ణస్థితి మార్పు పరిణామం తోటీ వత్తిళ్ళ పరిణామం తోటీ పోల్చడం ద్వారా, ఈ మార్పుల కారణాలను నిర్ణయించవచ్చు. గ్రీన్‌హౌస్ వాయువులు, భూ వినియోగంలో చోటు చేసుకున్న మార్పులు, ఏరోసోల్స్, మసి (సూట్) ప్రస్తుత శీతోష్ణస్థితి మార్పులకు ప్రధాన కారకాలు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

గ్రీన్‌హౌస్ వాయువులు

[మార్చు]
గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ స్కీమాటిక్ - అంతరిక్షం, వాతావరణం, భూ ఉపరితలాల మధ్య శక్తి ప్రవాహాలను చూపిస్తుంది. శక్తి మార్పిడులు, చదరపు మీటరుకు వాట్స్‌లో (W / m 2 ).
ఐసు కోర్‌ల (నీలం / ఆకుపచ్చ) లోను, నేరుగానూ (నలుపు) కొలిచిన CO2 సాంద్రతలు - గత 800,000 సంవత్సరాల్లో
1750 నుండి ప్రపంచ ప్రాంతాల వారీగా గ్లోబల్ CO2 ఉద్గారాలు

గ్రీన్‌హౌస్ వాయువులు భూమి నుండి అంతరిక్షంలోకి వెలువడే వేడిని పట్టేస్తాయి. పరారుణ వికిరణం రూపంలో ఉన్న ఈ వేడిని వాతావరణంలోని ఈ వాయువులు గ్రహించి, మళ్ళీ విడుదల చేస్తాయి. తద్వారా దిగువ వాతావరణం, భూ ఉపరితలం వేడెక్కుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందు, వాతావరణంలో సహజంగా ఉండే గ్రీన్‌హౌస్ వాయువుల కారణంగా ఉపరితలం వద్ద గాలి ఉష్ణోగ్రత, అవి లేకపోయి ఉంటే ఎంత ఉండేదో, అంత కంటే సుమారు 33 °C (59 °F) ఎక్కువగా ఉంది. [12][13] భూమిపై అసలు వాతావరణమే లేకపోతే, భూమి సగటు ఉష్ణోగ్రత నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉండేది. గ్రీన్‌హౌస్ ప్రభావానికి అతి పెద్ద దోహదకారులు నీటి ఆవిరి (~ 50%), మేఘాలు (~ 25%). ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతాయి. అందువల్ల వాటిని ఫీడ్‌బ్యాక్‌గా పరిగణిస్తారు. CO2, ఓజోన్, N2O వంటి వాయువులను బయటి వత్తిళ్ళుగా పరిగణిస్తారు.

పారిశ్రామిక విప్లవం తరువాత మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణం పెరిగింది. దీని వలన CO2, మీథేన్, ట్రోపోస్ఫియర్ లోని ఓజోన్, CFC లు, నైట్రస్ ఆక్సైడ్ ల నుండి రేడియేటివ్ వత్తిడి పెరిగింది. 2011 నాటికి, CO2, మీథేన్ ల సాంద్రతలు పారిశ్రామిక పూర్వ కాలం నాటి కంటే 40%, 150% పెరిగాయి. 2013 లో, ప్రపంచ ప్రాధమిక బెంచిమార్కుగా భావించే మౌనా లోవాలో CO 2 రీడింగు 400 పిపిఎమ్ ను మొదటిసారిగా దాటింది. ఈ స్థాయిలు గత 800,000 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత ఎక్కువ. ఐసు కోర్‌ల నుండి విశ్వసనీయమైన డేటా లభించిన కాలం ఇది. అప్రత్యక్ష భౌగోళిక ఆధారాల ప్రకారం చూస్తే ఈ CO 2 స్థాయి కోట్ల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదని తెలుస్తోంది.

2018 లో ప్రపంచ వ్యాప్త మానవ జనిత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, భూవినియోగం లోని మార్పు అంశాన్ని పరిగణించకుండా చూస్తే, 5,200 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడుకు సమానం. వీటిలో, 72% నేరుగా CO2 కాగా, 19% మీథేన్, 6% నైట్రస్ ఆక్సైడ్, 3% ఫ్లోరిన్ కూడిన వాయువులూ ఉన్నాయి.[14] 2010 లో ఇది, భూవినియోగం లోని మార్పును కూడా కలుపుకుని, 4,900 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడుకు సమానంగ ఉంది (AR5 నివేదిక నుండి). అందులో, 65% శిలాజ ఇంధన దహనం, పరిశ్రమల నుండి వచ్చే కార్బన్ డయాక్సైడ్ కాగా, 11% భూ వినియోగ మార్పు నుండి వెలువడే (ఇది ప్రధానంగా అటవీ నిర్మూలన కారణంగా) కార్బన్ డయాక్సైడ్, 16% మీథేన్ నుండి, 6.2% నైట్రస్ ఆక్సైడ్ నుండి, 2.0% ఫ్లోరినేటెడ్ వాయువుల నుండి వచ్చాయి. తుది వినియోగానికి సంబంధించిన ఉద్గారాల అంచనా 2010 లో ఇలా ఉంది: ఆహారం (ఉద్గారాలలో 26-30%); వాషింగు, హీటింగు, లైటింగు (26%); వ్యక్తిగత రవాణా, సరుకు రవాణా (20%); భవన నిర్మాణం (15%).

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) జారీ చేసిన 10 వ ఉద్గార గ్యాప్ నివేదిక 2010-2020లో, ఉద్గారాలు అదే తీరుగా పెరుగుతూ ఉంటే, ప్రపంచ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 4 °C వరకు పెరుగుతాయని అంచనా వేసింది. [15]

భూ వినియోగంలో మార్పు

[మార్చు]

మానవులు భూ ఉపరితలాన్ని వ్యవసాయ భూమిగా మార్చడం, భూవినియోగ మార్పుకు ప్రధాన కారణం. ప్రపంచంలోని నివాస యోగ్యమైన భూమిలో 50% వ్యవసాయానికి పోగా, 37% అడవులు ఉన్నాయి. అటవీ భూమి తగ్గుతూ పోతోంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అటవీ నష్టం కారణంగా భూవినియోగం ప్రభావితమౌతోంది. భూతాపాన్ని ప్రభావితం చేసే భూ వినియోగ మార్పులో ఈ అటవీ నిర్మూలన చాలా ముఖ్యమైన అంశం. అటవీ నిర్మూలనకు ప్రధాన కారణాలు: గొడ్డు మాంసం, పామాయిల్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు (27%), అటవీ ఉత్పత్తులు (26%), స్వల్పకాలిక వ్యవసాయం (24%), అడవుల్లో మంటలు (23%).[16]

భూ వినియోగపు ప్రస్తుత ధోరణులు గ్లోబల్ వార్మింగ్‌ను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని అంశాలు గణనీయస్థాయిలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుండగా, మట్టిలో కార్బన్ స్థిరీకరణ, కిరణజన్యు సంయోగక్రియ వంటివి CO2 ను కలిపేసుకుంటాయి. ఈ గ్రీన్‌హౌస్ వాయు మూలాల కంటే ఇది ఎక్కువ కాబట్టి, నికరంగా సంవత్సరానికి 600 కోట్ల టన్నుల CO2 ను ఇవి తొలగిస్తాయి. ఇది మొత్తం CO2 ఉద్గారాల్లో 15%.

భూ వినియోగ మార్పులు వివిధ రకాల రసాయనిక, భౌతిక డైనమిక్స్ ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ఒక ప్రాంతంలో వృక్షసంపద రకాలను మార్చడం వలన సూర్యరశ్మిని అంతరిక్షంలోకి ప్రతిబింబించడం లోను (దీనిని ఆల్బెడో అని పిలుస్తారు), బాష్పీభవనం ద్వారా పోయే ఉష్ణంలోను మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో స్థానిక ఉష్ణోగ్రత ప్రభావిత మౌతుంది. ఉదాహరణకు, దట్తమైన, అంధకారంగా ఉండే అడవి ప్రాంతం గడ్డి భూములుగా మారితే, ఉపరితలంపై వెలుతురు ఎక్కువై, సూర్యరశ్మిని ప్రతిబింబించడం ఎక్కువౌతుంది. అటవీ నిర్మూలన వలన, మేఘాలను ప్రభావితం చేసే ఏరోసోల్స్, ఇతర రసాయన సమ్మేళనాల విడుదలపై ప్రభావం పడి, ఉష్ణోగ్రతల మార్పుకు దోహదం చేస్తుంది; భూమి ఉపరితలంపై గాలి ప్రవాహాలకు ఉండే అడ్డంకులు మారడం వలన కూడా ఉష్ణోగ్రతలు ప్రభావితమౌతాయి. ముఖ్యంగా ఉపరితల ఆల్బెడో పెరుగడం వలన ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా చల్లబడిందని అంచనా వేసారు. కానీ ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై భౌగోళికంగా గణనీయమైన తారతమ్యాలున్నాయి. ఉష్ణమండలంలో నికర ప్రభావం గణనీయమైన వేడెక్కడం కాగా, ధ్రువాలకు దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఆల్బెడో తగ్గడం ఉష్ణోగ్రతలు తగ్గడానికి దారితీస్తుంది.[17]

ఏరోసోల్స్, మసి

[మార్చు]
Refer to caption
ఏరోసోల్స్ ప్రభావంగా అమెరికా తూర్పు తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఉన్న ఈ మేఘాల మాటున ఓడల దారులను చూడవచ్చు.

అగ్నిపర్వతాలు, పాచి, మానవ జనిత కాలుష్య కారకాల నుండి వెలువడే ఘన, ద్రవ కణాలను ఏరోసోల్స్ అంటారు. ఇవి భూమ్మీదికి వచ్చే సూర్యరశ్మిని వెనక్కి ప్రతిబింబించి, శీతోష్ణస్థితిని చల్లబరుస్తాయి. 1961 నుండి 1990 వరకు, భూమి పైకి వచ్చే సూర్యకాంతి పరిమాణంలో క్రమంగా తగ్గడం గమనించారు. దీనిని గ్లోబల్ డిమ్మింగ్ [18] అని పిలుస్తారు. సాధారణంగా జీవ ఇంధనం, శిలాజ ఇంధనాల దహనం నుండి ఈ ఏరోసోల్‌లు జనిస్తాయి.[19] అవపాతం (వర్షం, మంచు) వలన వాతావరణం లోని ఏరోసోల్‌లు ఒక వారం లోపే తొలగిపోతాయి. ట్రోపోస్ఫియరులో ఉండే ఏరోసోల్స్‌ మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి.[20] ప్రపంచవ్యాప్తంగా, ఏరోసోల్స్ 1990 నుండి క్షీణిస్తూ ఉండడంతో, అవి గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గిస్తూ ఉండడం తగ్గింది.[21]

సౌర వికిరణాన్ని చెదరగొట్టడం ద్వారా, దాన్ని గ్రహించడం ద్వారా ప్రత్యక్ష ప్రభావం కలిగించడంతో పాటు, ఏరోసోల్స్ భూమి రేడియేషన్ బడ్జెట్‌పై పరోక్ష ప్రభావం కూడా చూపిస్తాయి. సల్ఫేట్ ఏరోసోల్‌లు క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియైగా పనిచేస్తాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలోను, తక్కువ పరిమాణంలోనూ ఉండే నీటి బిందువులతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. ఇవి, ఎక్కువ సంఖ్యలోను, తక్కువ పరిమాణంలోనూ ఉండే నీటి బిందువులతో కూడిన మేఘాల కంటే సౌర వికిరణాన్ని మరింత సమర్థవంతంగా ప్రతిబింబిస్తాయి.[22] ఈ ప్రభావం బిందువులు మరింతగా ఏకరీతి పరిమాణంలో ఉండటానికి కారణమవుతుంది. వాన చినుకుల పరిమాణపు పెరుగుదలను తగ్గిస్తుంది. మేఘాలు సూర్యకాంతిని మరింతగా ప్రతిబింబించేలా చేస్తుంది.[23] ఏరోసోల్‌ల పరోక్ష ప్రభావాలు రేడియేటివ్ వత్తిడికి సంబంధించినంత వరకూ ప్రస్తుతం ఉన్న అతిపెద్ద అనిశ్చితి.[24]

ఏరోసోల్స్ సాధారణంగా సూర్యరశ్మిని ప్రతిబింబించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రిస్తాయి. మంచు లేదా ఐసు మీద పడే మసిలో ఉన్న నల్ల కార్బన్ గ్లోబల్ వార్మింగ్‌కు దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మిని పీల్చుకోవడమే కాదు, ద్రవీభవనాన్ని పెంచి, సముద్ర మట్టం పెరుగడానికి కారణమౌతుంది. ఆర్కిటిక్‌లో కొత్త బ్లాక్ కార్బన్ పేరుకోవడాన్ని నియంత్రిస్తే 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్ 0.2 °C తగ్గుతుంది.[25] వాతావరణంలో వేలాడుతూ ఉండే మసి నేరుగా సౌర వికిరణాన్ని గ్రహిస్తుంది, వాతావరణాన్ని వేడెక్కించి, ఉపరితలాన్ని చల్లబరుస్తుంది. అధికంగా మసి ఉత్పత్తి చేసే గ్రామీణ భారతదేశం వంటి ప్రాంతాల్లో, గ్రీన్‌హౌస్ వాయువుల కారణంగా వేడెక్కే ఉపరితలాన్నివాతావరణం లోని గోధుమ రంగు మేఘాలు 50% వరకూ ఆపుతాయి.

చిన్నపాటి వత్తిళ్ళు: సూర్యుడు, స్వల్పకాలిక గ్రీన్‌హౌస్ వాయువులు

[మార్చు]

భూమికి సూర్యుడే ప్రాథమిక శక్తి వనరు కాబట్టి, సూర్యకాంతిలో ఏర్పడే మార్పులు శీతోష్ణస్థితి వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తాయి. సౌర వికిరణాన్ని నేరుగా ఉపగ్రహాల ద్వారా కొలుస్తారు. 1600 ల ప్రారంభ కాలం నాటి నుండీ పరోక్ష కొలతలు లభిస్తున్నాయి. సూర్యుడి నుండి భూమికి చేరే శక్తిలో పెరుగుతున్న ధోరణి ఏమీ లేదు కాబట్టి ప్రస్తుత తాపానికి ఇది కారణం కాదు.[26] సౌర ఉత్పత్తి, అగ్నిపర్వత కార్యకలాపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే భౌతిక శీతోష్ణస్థితి నమూనాలు ఇటీవలి దశాబ్దాలలో గమనించిన వేగవంతమైన తాపాన్ని వివరించలేక పోతున్నాయి. సూర్యుడి కారణంగా వేడెక్కడం లేదనడానికి మరొక సాక్ష్యం ఏమిటంటే, భూ వాతావరణంలో వివిధ స్థాయిలలో ఉష్ణోగ్రతలు వివిధ స్థాయిల్లో ఉండడం. ప్రాథమిక భౌతిక సూత్రాల ప్రకారం, గ్రీన్‌హౌస్ ప్రభావం దిగువ వాతావరణాన్ని (ట్రోపోస్పియర్) వేడెక్కించి, ఎగువ వాతావరణాన్ని(స్ట్రాటో ఆవరణ) చల్లబరచాలి. వేడెక్కడానికి సౌర మార్పులే కారణమైతే, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్ఫియర్లు రెండూ వేడెక్కాలి. కానీ అలా జరగలేదు.

వాతావరణపు కింది పొరయైన ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్ కూడా గ్రీన్‌హౌస్ వాయువే. పైగా ఇది చాలా చురుకైన వాయువు, ఇతర గ్రీన్‌హౌస్ వాయువులూ, ఏరోసోల్‌లతో చర్యలో పాల్గొంటుంది.

శీతీష్ణస్థితి మార్పుల ఫీడ్‌బ్యాక్

[మార్చు]
నల్లటి సముద్ర ఉపరితలం సౌర వికిరణంలో 6 శాతాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది, అదే సముద్రపు ఐసు 50 నుండి 70 శాతం వరకూ ప్రతిబింబిస్తుంది.[27]

శీతోష్ణస్థితిపై వచ్చే ప్రారంభ వత్తిళ్ళకు శీతోష్ణస్థితి వ్యవస్థ ప్రతిస్పందన, స్వీయ-బలోపేత ఫీడ్‌బ్యాక్‌ల వలన పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ ఫీడ్‌బ్యాక్‌ల వలన తగ్గుతుంది.[28] ప్రపంచ ఉష్ణోగ్రత మార్పుకు ప్రధాన బ్యాలెన్సింగ్ ఫీడ్‌బ్యాక్ పరారుణ వికిరణం రూపంలో అంతరిక్షానికి వెళ్ళే రేడియేటివ్ శీతలీకరణం. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఇది బలంగా పెరుగుతుంది.[29] నీటి ఆవిరి ఫీడ్‌బ్యాక్, ఐస్-ఆల్బెడో ఫీడ్‌బ్యాక్, మేఘాల నికర ప్రభావం ప్రధానమైన బలోపేత ఫీడ్‌బ్యాక్‌లు. ఫీడ్‌బ్యాక్‌లపై ఉన్న అనిశ్చితి కారణంగా, వేర్వేరు శీతోష్ణస్థితి నమూనాలు వివిధ పరిమాణాల్లో తాపాన్ని అంచనా వేస్తాయి.

వేడెక్కిన గాలి ఎక్కువ తేమను గ్రహించగలుగుతుంది. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల కారణంగా తొలుత వేడెక్కిన తరువాత, వాతావరణంలో ఎక్కువ నీరు ఉంటుంది. నీరు శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు కాబట్టి, ఇది శీతోష్ణస్థితిని మరింత వేడెక్కిస్తుంది. [30] ఇదే నీటి ఆవిరి ఫీడ్‌బ్యాక్. ఆర్కిటిక్‌లోని మంచు దుప్పటి, సముద్రపు ఐస్‌లు తగ్గడం వలన భూమి ఉపరితల ఆల్బెడో తగ్గుతుంది.[31] ఈ ప్రాంతాలు మరింత సౌరశక్తిని గ్రహించి, ఆర్కిటిక్ యాంప్లిఫికేషనుకు దోహదపడతాయి. దీనివలన ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ వలన పెర్మాఫ్రాస్ట్ కరిగి, మీథేన్ విడుదలవుతుంది.[32][33] ఈ శతాబ్దాంతానికి గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలకు కారణాల్లో మానవ జనిత కారణాల్లో భూ వినియోగ మార్పులను ఇది మించిపోతుందని భావిస్తున్నారు.

భవిష్యత్తులో మేఘాల కప్పు (క్లౌడ్ కవర్) మారవచ్చు. మేఘాల కప్పు పెరిగితే, ఎక్కువ సూర్యరశ్మి తిరిగి అంతరిక్షంలోకి పోతుంది, గ్రహం చల్లబడుతుంది. అదే సమయంలో, మేఘాలు గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని పెంచుతాయి, గ్రహం వేడెక్కుతుంది. మేఘాల కప్పు తగ్గితే దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇది మేఘాల రకం, వాటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. మొత్తంమీద, పారిశ్రామిక యుగంలో నికర ఫీడ్‌బ్యాక్ మాత్రం బహుశా స్వీయ-బలోపేతమే.

మానవ కార్యకలాపాల జనిత CO2 ఉద్గారాలలో సగాన్ని మహాసముద్రాలూ, నేలపై ఉండే మొక్కలూ సంగ్రహిస్తాయి.[34] కార్బన్ డయాక్సైడ్ వలన, సాగు కాలం పెరుగడం వలనా మొక్కల పెరుగుదల ఉత్తేజితమైంది. దీనివలన భూమి కార్బన్ చక్రం బాలెన్సింగ్ ఫీడ్‌బ్యాక్‌గా మారింది. శీతోష్ణస్థితి మార్పు వలన మొక్కల పెరుగుదలను నిరోధించే వేడి గాలులు, కరువులూ కూడా పెరుగుతాయి. ఈ కారణంగా ఈ బ్యాలెన్సింగ్ ఫీడ్‌బ్యాక్ అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా అనేది అనిశ్చితంగా ఉంది.[35] నేలల్లో పెద్ద మొత్తంలో కార్బన్ ఉంటుంది. అవి వేడెక్కినప్పుడు ఈ కార్బన్‌ను కొంత విడుదల చేస్తాయి.[36] సముద్రం ఎక్కువ CO2 ను, వేడినీ పీల్చుకుంటున్నందున, అది ఆమ్లీకరణం చెందుతుంది. దీనివలన సముద్ర ప్రవాహాలు మారవచ్చు, అది వాతావరణం లోని కార్బన్‌ను పీల్చుకునే రేటు మారవచ్చు.[37]

భవిష్యత్తులో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించినా లేదా పూర్తిగా తొలగించినా కూడా, స్వీయ-బలోపేత ఫీడ్‌బ్యాక్‌ల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి శిఖర స్థాయికి చేరి హాట్-హౌస్ క్లైమేట్ పరిస్థితికి దారి తీస్తాయేమోననే ఆందోళన ఉంది.[38] 2018 అధ్యయనం అటువంటి గ్రహ పరిమితిని ఎంతో గుర్తించడానికి ప్రయత్నించింది. అందులో పారిశ్రామిక-పూర్వ స్థాయి కంటే 2 °C (3.6 °F) ఉష్ణోగ్రత పెరిగితే, అటువంటి హాట్‌-హౌస్ ఎర్త్ ఏర్పడవచ్చని తెలిసింది.

ప్రభావాలు

[మార్చు]
నాల్గవ జాతీయ శీతోష్ణస్థితి అంచనా కోసం యుఎస్ గ్లోబల్ చేంజ్ రీసెర్చ్ ప్రోగ్రాం జనవరి 2017 లో ప్రచురించిన చారిత్రక సముద్ర మట్టాల పునర్నిర్మాణం, 2100 వరకూ అంచనాలు.

భౌతిక పర్యావరణం

[మార్చు]

పర్యావరణంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు విస్తృతమైనవి, చాలా ముఖ్యమైనవి. మహాసముద్రాలు, మంచు, శీతోష్ణస్థితిపై ఈ ప్రభావాలుంటాయి. ఈ ప్రభావాలు క్రమంగా గాని, వేగంగా గానీ సంభవించవచ్చు.

1993, 2017 ల మధ్య, ప్రపంచ సముద్ర మట్టం ఏడాదికి సగటున 3.1 ± 0.3 మి.మీ. పెరిగింది. ఈ పెరిగే వేగం (త్వరణం) కూడా ఎక్కువగా ఉంది. 21 వ శతాబ్దంలో, చాలా ఎక్కువ ఉద్గారాలు విడుదలైతే, సముద్ర మట్టం 61-110 సెం.మీ. వరకూ పెరగవచ్చని IPCC చెప్పింది. అంటార్కిటిక్‌లోని హిమానీనదాలు, మంచు పలకలు కరగడం వలన కలుగుతున్న మంచు నష్టం రేటు అనిశ్చితంగా ఉంది. ఎందుకంటే సముద్ర మట్టంలో పెరుగుదలకు ఇదే 90% కారణం: సముద్రాల్లో పెరిగిన వేడి, అంటార్కిటిక్ హిమానీనదాలను కరిగించి వేసే ప్రమాదం ఉండడాన, సముద్ర మట్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. ధ్రువేతర ప్రాంతాల్లోని హిమానీనదాల తిరోగమనం కూడా సముద్ర మట్టం పెరగడానికి దోహదం చేస్తుంది.

దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ ఆర్కిటిక్ సముద్రపు ఐసు తగ్గిపోవడానికి దారితీసింది. దీంతో ఇది వాతావరణ వైపరీత్యాలకు తేలిగ్గా ప్రభావితమౌతుంది. ఆర్కిటిక్ సముద్రపు మంచు క్షీణతపై అంచనాలు మారుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత 1.5 °C పెరిగితే, మంచు లేని వేసవి కాలాలు అరుదుగా ఉంటాయి. అదే 2.0 °C డిగ్రీల పెరిగితే, అవి ప్రతి మూడు నుండి పది సంవత్సరాలకు ఒకసారి మంచు లేని వేసవులు వస్తూంటాయి.[39] దీంతో ఐసు-ఆల్బెడో ఫీడ్‌బ్యాక్ పెరుగుతుంది. వాతావరణంలో CO2 సాంద్రతలు పెరగడం సముద్రాల్లో కరిగిన CO2 పెరుగుదలకు దారితీస్తాయి. ఇది సముద్ర ఆమ్లీకరణకు కారణమవుతుంది.[40] దీనికితోడు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి - ఎందుకంటే వెచ్చని నీటిలో ఆక్సిజన్ తక్కువగా కరుగుతుంది.[41] దీనిని ఓషన్ డీఆక్సిజనేషన్ అంటారు.

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేడిగా ఉండే కాలాలు, వడగాడ్పులూ పెరిగాయి. ఈ మార్పులు 21 వ శతాబ్దంలో కొనసాగుతాయని దాదాపు ఖాయంగా చెప్పవచ్చు. 1950 ల నుండి, కరువు, వేడి కాలాలు మరింతగా సంభవిస్తూ, ఏకకాలంలో కనిపిస్తూ ఉన్నాయి.[42] భారతదేశం, తూర్పు ఆసియాలో రుతుపవనాల కాలంలో తీవ్రమైన అతివృష్టి లేదా తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడడం పెరిగింది.[43] వేగంగా వేడెక్కుతున్న ఆర్కిటిక్ నుండి మధ్య అక్షాంశాలలో ఏర్పడుతున్న తీవ్రమైన శీతోష్ణస్థితిని వివరించే వివిధ యంత్రాంగాలను గుర్తించారు. జెట్ ప్రవాహం మరింత అస్తవ్యస్తంగా మారడం వాటిలో ఒకటి. హరికేన్లు టైఫూనుల నుండి గరిష్ట వర్షపాతం, గాలి వేగం పెరుగుతున్నాయి.[44]

గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు: శతాబ్దాలు, సహస్రాబ్దుల కాలావధుల్లో, గ్లోబల్ వార్మింగ్ పరిమాణాన్ని ప్రధానంగా మానవజనిత CO2 ఉద్గారాలు నిర్ణయిస్తాయి.[45] వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ జీవితకాలం సుదీర్ఘంగా ఉండడమే దీనికి కారణం.[46] ఉద్గారాల వలన ప్రస్తుత ఇంటర్‌గ్లేసియల్ కాలం కనీసం 1,00,000 సంవత్సరాలు పెరుగుతుందని అంచనా. [47] హిమానీనదాలు, ఐసు దుప్పట్ల మహా ద్రవ్యరాశి ఫలితంగా భూమి క్రస్టు కుంగిపోయింది. మంచు కరగడం, హిమానీనదాలు తగ్గిపోవడం వలన కలిగే దీర్ఘకాలిక ప్రభావం ఏంటంటే, కుంగిన ఈ భూతలం తిరిగి పైకి పొంగడం. దీన్ని పోస్ట్ గ్లేసియల్ రీబౌండ్ అంటారు. ఇది ఐస్లాండ్ వంటి ప్రదేశాలలో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలకు దారితీస్తుంది. మహాసముద్రాల్లోని వెచ్చని నీరు, సముద్రాల అడుగున ఉన్న పెర్మాఫ్రాస్ట్‌ను కరిగించడం వలన గానీ, గ్యాస్ హైడ్రేట్లు విడుదల అవడం వలన గానీ సముద్రాల లోపల మంచుచరియలు విరిగిపడి సునామీలు ఏర్పడవచ్చు. సముద్ర మట్టం పెరుగుదల అనేక శతాబ్దాలుగా కొనసాగుతోంది.

ఆకస్మిక శీతోష్ణస్థితి మార్పు, శీతోష్ణస్థితి వ్యవస్థలోని తిరుగులేని మార్పులు: శీతోష్ణస్థితి మార్పు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులకు దారితీయవచ్చు. కొన్ని పెద్ద-స్థాయి మార్పులు ఆకస్మికంగా అనగా స్వల్ప కాల వ్యవధిలో సంభవించవచ్చు. అవి కోలుకోలేని, తిరుగులేని మార్పులు కూడా కూడా కావచ్చు. ఆకస్మిక శీతోష్ణస్థితి మార్పుకు ఒక సంభావ్య మూలం - పెర్మాఫ్రాస్ట్ నుండి మీథేన్, కార్బన్ డయాక్సైడ్లు వేగంగా విడుదలవడం. ఇది గ్లోబల్ వార్మింగ్‌ను ఇనుమడింప జేస్తుంది. మరొక ఉదాహరణ అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ నెమ్మదించవచ్చు లేదా పూర్తిగా ఆగిపోనూవచ్చు. ఇది ఉత్తర అట్లాంటిక్, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో శీతలీకరణను ప్రేరేపిస్తుంది.[48]

జీవావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి మార్పుల కారణంగా సముద్రపు ఐసు తగ్గడంతో 2050 నాటికి ధృవపు ఎలుగుబంట్ల జనాభా మూడింట రెండు వంతులు తగ్గుతాయి అని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది

భూసంబంధ పర్యావరణ వ్యవస్థలలో, వసంతకాలంలో జరిగాల్సిన ఘటనలు ముందే జరగడం, మొక్కలు జంతువులు ధ్రువాల దిశగా తరలడం వంటివి ఇటీవలి వార్మింగు‌తో ముడిపడి ఉన్నాయని చాలా నమ్మకంగా చెప్పవచ్చు.[49] వాతావరణంలో CO2 స్థాయిలు పెరగడం, అధిక ప్రపంచ ఉష్ణోగ్రతల వల్ల చాలా పర్యావరణ వ్యవస్థలు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పొడి వాతావరణ మండలాల విస్తరణకు దోహదపడింది, - ఉపఉష్ణమండలంలో ఎడారుల విస్తరణ వంటివి. గ్లోబల్ వార్మింగ్ రేటును తగ్గించడానికి గణనీయమైన చర్యలు తీసుకోకపోతే, భూ-ఆధారిత పర్యావరణ వ్యవస్థల కూర్పు, నిర్మాణం పెద్ద మార్పులకు లోనయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మీద, శీతోష్ణస్థితి మార్పు వల్ల అనేక జాతులు అంతరించిపోతాయిని, పర్యావరణ వ్యవస్థల వైవిధ్యం తగ్గుతుందనీ భావిస్తున్నారు.[50] పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తేనెటీగలు అంతరించిపోవచ్చు.

సముద్రం నేల కంటే నెమ్మదిగా వేడెక్కింది. కాని సముద్రంలోని మొక్కలు, జంతువులు భూమిపై ఉన్న జీవజాతుల కంటే వేగంగా చల్లగా ఉండే ధ్రువాల వైపుకు వలస వెళ్ళాయి.[51] భూమిపై ఉన్నట్లే, శీతోష్ణస్థితి మార్పుల వల్ల సముద్రంలో కూడా వేడి తరంగాలు ఎక్కువగా సంభవిస్తాయి. పగడాలు, కెల్ప్, సముద్ర పక్షులు వంటి అనేక రకాల జీవులపై దీని హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి.[52] మహాసముద్ర ఆమ్లీకరణ వలన పగడపు దిబ్బలు, మత్స్య సంపద, రక్షిత జాతులు, సమాజానికి విలువైన ఇతర సహజ వనరులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.[53] సముద్రాల్లో అధిక CO2 వలన కొన్ని చేప జాతుల మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ ప్రభావితం మౌతాయి. వాటి వినికిడి, వాసన శక్తులు సన్నగిల్లి, తమను వేటాడే జీవుల నుండి తప్పించుకోలేక పోతాయి.

మానవులు

[మార్చు]
కాలిఫోర్నియాలో అడవి మంటపై హెలికాప్టర్ నీరు చల్లుతోంది. శీతోష్ణస్థితి మార్పులతో ముడిపడి ఉన్న అధిక ఉష్ణోగ్రతలు, కరువుల వలన పెద్ద పెద్ద మంటల చెలరేగుతున్నాయి.

వేడెక్కడం, అవపాతంలో మార్పుల వంటి శీతోష్ణస్థితిలో మార్పుల ప్రభావాలు మానవ వ్యవస్థలపై ప్రపంచవ్యాప్తంగా కనుబడ్డాయి. శీతోష్ణస్థితి మార్పులు భవిష్యత్తులో చూపించే సామాజిక ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తక్కువ-అక్షాంశాల్లోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలు గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. గ్లోబల్ వార్మింగ్ బహుశా ఇప్పటికే ప్రపంచంలో ఆర్థిక అసమానతలను పెంచింది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంచనా. శీతోష్ణస్థితి మార్పు ప్రాంతీయంగా కలిగించే ప్రభావాలు ఇప్పుడు అన్ని ఖండాలలోను, సముద్ర ప్రాంతాలలోనూ గమనించవచ్చు.[54] తక్కువ అక్షాంశాల వద్ద ఉన్న ప్రాంతాలు శీతోష్ణస్థితి మార్పుల వల్ల ముఖ్యంగా ప్రభావితమౌతాయి.[55] గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ నష్టాలూ పెరుగుతాయి.

ఆహారం, నీరు

[మార్చు]

తక్కువ అక్షాంశాల వద్ద ఉన్న దేశాలలో పంట దిగుబడి తగ్గుతుంది. అయితే ఉత్తర అక్షాంశాల వద్ద ఇది తగ్గవచ్చు, పెరగనూ వచ్చు.[56] ప్రపంచ వ్యాప్త ఉష్ణోగ్రతలు 20 వ శతాబ్దపు చివర్లో ఉన్న స్థాయి కంటే 4  °C పెరిగితే, ప్రపంచ, ప్రాంతీయ ఆహార భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. 1960–2013 సంవత్సరాల్లో శీతోష్ణస్థితి మార్పు ప్రభావం గోధుమ, మొక్కజొన్నలకు ప్రతికూలంగా ఉంది. సోయా, వరి లపై తటస్థంగా ఉంది. భూతాపం వలన ప్రపంచవ్యాప్తంగా అదనంగా 18.3 కోట్ల మంది, ముఖ్యంగా తక్కువ ఆదాయాలు ఉన్నవారు, ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది.[57] CO2 స్థాయిలు పెరిగినప్పుడు, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పంట పెరుగుదలకు సహాయపడతాయి. కానీ ఆ పంటల్లో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. శీతోష్ణస్థితి మార్పు ఇప్పటికే దక్షిణ అమెరికా లోను, ఆసియాలోని పర్వత ప్రాంతాల లోను, వివిధ పొడి భూముల లోనూ (ముఖ్యంగా ఆఫ్రికాలోవి) ఆహార భద్రతను ప్రభావితం చేస్తోంది. హిమానీనదాల నీటిపై ఆధారపడిన ప్రాంతాలు, ఇప్పటికే పొడిగా ఉన్న ప్రాంతాలు, చిన్న ద్వీపాల్లో కూడా శీతోష్ణస్థితి మార్పుల వల్ల నీటి లభ్యత కొరవడే ప్రమాదం ఉంది.[58]

ఆరోగ్యం, భద్రత

[మార్చు]
దక్షిణ బంగ్లాదేశ్ మీదుగా సిదర్ తుఫాను వెళ్ళిన తరువాత దృశ్యం. పెరుగుతున్న సముద్ర మట్టాలు తుఫానుల నుండి పెరిగిన వర్షపాతం కలిసి, దేశాలను వరదలకు గురి చేస్తున్నాయి. ప్రజల జీవనోపాధిని, ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తున్నాయి.

సాధారణంగా, ప్రజారోగ్యంపై ప్రభావాలు సానుకూలంగా కంటే ప్రతికూలంగానే ఉంటాయి. తీవ్రమైన శీతోష్ణస్థితుల ప్రత్యక్ష ప్రభావాల వలన గాయాలవడం, ప్రాణనష్టం కలగడం జరుగుతాయి; పంట వైఫల్యాల వల్ల పోషకాహార లోపం వంటి పరోక్ష ప్రభావాలుంటాయి. శీతోష్ణస్థితి మార్పు వలన ఆత్మహత్యలు పెరుగుతాయి [59] కొత్త రకాల వ్యాధులు కూడా రావచ్చు. ఉదాహరణకు, మామూలుగా కాండిడా ఆరిస్‌ అనే ఈస్ట్ మానవులకు ఆశించకముందే సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా చచిపోతాయి. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తట్టుకునే శక్తిని చేకూర్చుకుని మానవులను ఆశించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. [60] శీతోష్ణస్థితి మార్పు వలన పేదరికం పెరగడం, ఆర్థిక షాక్‌లను కలిగించడం.. వీటి ద్వారా హింసాత్మక సంఘర్షణ పెరుగుతుంది. ముష్టి యుద్ధాలు, హింసాత్మక నేరాలు, పౌర అశాంతి, యుద్ధాలతో సహా అనేక రకాల హింసాత్మక ప్రవర్తనలకు శీతోష్ణస్థితి మార్పు దారితీస్తుంది.

జీవనోపాధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు

[మార్చు]

సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా చిన్న ద్వీపాలు, మెగా డెల్టాల్లో ఉండే కీలకమైన మౌలిక సదుపాయాలు, మానవ నివాసాలూ మునిగిపోయే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వంటి పల్లపు ప్రాంతాలున్న దేశాలలో ప్రజలు నిరాశ్రయులౌతారు.[61] అలాగే మాల్దీవులు, టువాలు వంటి ద్వీప దేశాలలోని ప్రజలకు తమదంటూ ఒక దేశమే లేని లేని పరిస్థితి ఏర్పడుతుంది.[62] శీతోష్ణస్థితి మార్పు వలన దేశాల అంతర్గతం గాను, వివిధ దేశాల మధ్యా ప్రజల వలసలకు దారితీస్తుంది.

శీతోష్ణస్థితి మార్పులు కలుగ జేసే అత్యంత తీవ్ర ప్రభావాల్లో ఎక్కువ భాగం సబ్-సహారా ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియాలో సంభవిస్తాయని అంచనా వేసారు. ఇక్కడ పేదరికం పెచ్చరిల్లుతుంది. శీతీష్ణస్థితుల్లో కలిగే మార్పుల పర్యవసానంగా పురుషులకు మహిళలకు, ధనికులకు పేదలకూ, వివిధ జాతుల ప్రజల మధ్యా ప్రస్తుతం ఉన్న అసమానతలు మరింత తీవ్రమవుతాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేమ, ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువైపోయి, మానవులు మనుగడ సాగించలేని స్థితికి చేరుకుంటాయి.

స్పందనలు

[మార్చు]

శీతోష్ణస్థితి మార్పులను తగ్గించడం, వాటికి అలవాటు పడడం ఈ రెండూ గ్లోబల్ వార్మింగ్‌కు రెండు పరిపూరకరమైన ప్రతిస్పందనలు. ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తే, అలవాటు పడడం సులభం. గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు అతి తక్కువ కారకులైన చాలా దేశాలు శీతోష్ణస్థితి మార్పులకు అత్యధికంగా ప్రభావితమౌతున్నాయి. ఇది ఉపశమనం, అనుసరణలకు సంబంధించి న్యాయాన్యాయాల ప్రశ్నలను లేవనెత్తుతుంది.

తీవ్రతను తగ్గించడం

[మార్చు]
వివిధ రంగాల నుండి వెలువడుతున్న వార్షిక గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, 2010 నాటికి. ఉద్గారాలను కార్బన్ డయాక్సైడుకు సమానమైన కొలతగా ఇచ్చాం. ఐపిసిసి ఐదవ అసెస్‌మెంట్ రిపోర్ట్ నుండి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్స్ ఉపయోగించి

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారాను, వాతావరణం నుండి గ్రీన్‌హౌస్ వాయువులను గ్రహించడానికి కార్బన్ సింకుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారానూ వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్‌లో స్వల్ప, దీర్ఘకాలిక పోకడలు గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 లేదా 2 °C కన్నా తక్కువకు పరిమితం చేయకుండా ఉంటాయి. పారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తే 21 వ శతాబ్దం చివరినాటికి ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే సుమారు 3°C ఎక్కువ ఉంటాయి. దీన్ని 2°C కంటే తక్కువ స్థాయిలో ఉంచాలంటే, సమీప కాలంలో ఉద్గారాల తగ్గింపులను మరింత కఠినంగా అమలు చెయ్యాల్సి ఉంటుంది. దాంతో 2030 తరువాత తగ్గింపుల వేగం తగ్గినా సరిపోతుంది. దీన్ని 1.5 °C లోపుకే పరిమితం చెయ్యాలంటే, శక్తి, భూమి, నగరాలు, రవాణా, భవనాలు, పరిశ్రమలు మొదలైన వాటిలో మున్నెన్నడూ లేనంత స్థాయిలో, ఎంతో ప్రభావవంతమైన వ్యవస్థాగత మార్పులు అవసర మౌతాయి.

2015 లో దేశం ప్రకారం గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు

ఇరవయ్యవ శతాబ్దం చివరి మూడు దశాబ్దాల్లో, తలసరి స్థూల జాతీయోత్పత్తి, జనాభా పెరుగుదలలు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల దహనం, భూ వినియోగ మార్పుల కారణంగా CO 2 ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి.

భవిష్యత్తులో గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల్లో రాగల మార్పులపై అంచనాలు అనిశ్చిత ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సహజ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. ఈ అంచనాలను ఉద్గార చిత్రాలు అంటారు. కొన్ని చిత్రాలు ఉద్గారాలు శతాబ్దంలో పెరుగుతూనే ఉంటాయని చూపిస్తోంటే, మరికొన్ని తగ్గనున్నట్లు చెప్పాయి. శిలాజ ఇంధన నిల్వలు పుష్కలంగా ఉండడంతో, 21 వ శతాబ్దంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి దోహదపడవు. ఉద్గార చిత్రాలకు కార్బన్ చక్రపు మోడలింగ్‌ను కలిపితే, భవిష్యత్తులో వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు ఎలా మారవచ్చో అంచనా వేయవచ్చు. ఈ మిశ్రమ నమూనాల ప్రకారం, 2100 నాటికి వాతావరణంలో CO2 సాంద్రత కనిష్ఠంగా 380 గరిష్ఠంగా 1400 ppm వరకు ఉండవచ్చు, ఇది ప్రపంచం అనుసరించే షేర్డ్ సోషియో ఎకనామిక్ పాత్‌వే (SSP)ను బట్టి, ఉపశమన చర్యలను బట్టీ ఉంటుంది.

గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడం

[మార్చు]
Refer to caption and image description
వాతావరణ మార్పులను 1.5 °C లేదా 2 °C కి పరిమితం చేయడానికి గ్రాఫ్ వివిధ దారులను చూపుతుంది. అన్ని దారుల్లోనూ అడవుల పెంపకం, జీవ శక్తి వంటి ఉద్గార వ్యతిరేక సాంకేతికతలు ఉన్నాయి.

ప్రధానంగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, శిలాజ ఇంధన సంస్థలను మరింత బాగా నియంత్రించడం వంటి చర్యల ద్వారా ఉద్గారాలను తగ్గించడానికి అవకాశం చాలా ఉంది. సౌరశక్తి, పవన శక్తి, బ్యాటరీ నిల్వ వంటి తక్కువ-కార్బన్ శక్తి సాంకేతికతలు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతిని సాధించాయి. అయితే అణుశక్తి, కార్బన్ సంగ్రహణ, నిల్వ అదే స్థాయిలో ముందడుగు వెయ్యలేదు. జీవశక్తి వాడకం ఆహార భద్రతకు చెరుపు చెయ్యవచ్చు. ఇంకా శక్తి పరిరక్షణ, శక్తి సమర్థత పెంపు; భవనాల్లో, రవాణా రంగంలో కార్బన్‌ను తగ్గించడం; అడవులు పెంచడం, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా కార్బన్ సింక్‌లను పెంచడం వంటి చర్యలు కూడా తీసుకోవాలి. సిటీబ్యాంక్ తన 2015 నివేదికలో, తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థకు తరలడం వలన పెట్టుబడులపై వచ్చే లాభాలు పెరుగుతాయని తేల్చింది. 1.5 °C, 2 °C  తగ్గించే సిద్ధాంతాలు చాలావరకు ప్రతికూల ఉద్గార సాంకేతికతలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే, ఈ సాంకేతికతలు ఇంకా పరిపక్వం చెందలేదు. పెద్ద ఎత్తున వాడేందుకు ఇవి చాలా ఖరీదైనవి కావచ్చు కూడా.

వ్యక్తిగత కార్బన్ వినియోగం తగ్గించడానికి వాతావరణ మార్పుపై వ్యక్తులు చేపట్టగల చర్యలు ఇలా ఉన్నాయి: అతి వినియోగాన్ని తగ్గించుకోవడం, కారు లేకుండా జీవించడం, విమాన ప్రయాణాలు మానెయ్యడం, మొక్కలపై ఆధారపడిన ఆహారాన్ని తినడం. వాతావరణ మార్పు తగ్గింపు చర్యల సహ ప్రయోజనాలు సమాజానికీ, వ్యక్తులకూ మరింత త్వరగా సహాయపడతాయి కూడా. ఉదాహరణకు, సైకిలు తొక్కడం వలన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడమే కాక, అదే సమయంలో దేహానికి వ్యాయామాన్నిచ్చి, నిశ్చల జీవనశైలి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.

కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన, సమగ్రమైన విధానం కార్బన్ టాక్స్. లేదా దానికి దగ్గరి సంబంధం ఉన్న ఉద్గారాల వ్యాపారం. ప్రత్యామ్నాయ ప్రభావవంతమైన విధానాలలో బొగ్గును మండించడంపై తాత్కాలిక నిషేధం, శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే రాయితీల దశల వారీగా తొలగించి, [63] ఆ నిధుల్లో కొంత భాగాన్ని స్వచ్ఛ శక్తికి మళ్ళించడం. పారిస్ ఒప్పంద లక్ష్యాల కోసం తగినంత ఉద్గార తగ్గింపులను సాధించాలంటే, స్వచ్ఛ సాంకేతిక పరిజ్ఞానాల (తక్కువ CO2 ను ఉత్పత్తి చేసే సిమెంటు ) అభివృద్ధి, వ్యాప్తి కీలకం.

అనుకూలీకరణం

[మార్చు]

శీతోష్ణస్థితి మార్పుకు అనుకూలంగా తమను తాము మార్చుకోవడమే అనుకూలీకరణ లేదా అనుసరణ.[64] అనుకూలీకరణకు ఉదాహరణలు మెరుగైన తీరప్రాంత రక్షణ, మెరుగైన విపత్తు నిర్వహణ, మరింత నిరోధక పంటల అభివృద్ధి మొదలైనవి. [65] గ్లోబల్ వార్మింగుకు ప్రతిచర్యగానో లేదా ముందే ఊహించి ప్రణాళికా బద్ధంగానో చెయ్యవచ్చు. లేదా ఆకస్మికంగా, అంటే, ప్రభుత్వ జోక్యమేమీ లేకుండా కూడా అనుకూలీకరణ ప్రణాళిక చేయవచ్చు.

ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం, సమాజాలూ అన్నీ తమను తాము అనుకూలీకరించుకోవడంలో అనుభవం గడిస్తున్నాయి. అనుకూలీకరణను కొన్ని ప్రణాళిక ప్రక్రియలలో పొందుపరుస్తున్నారు. మౌలిక సదుపాయాల్లోను, ఉద్గారాల తగ్గింపుల్లోనూ అనుకూలీకరణ గురించి ప్రచారం చేస్తూ, వాతావరణంలో మార్పులు, వాటి వలన కలిగే నష్టాలను పర్యావరణ సంస్థలు, ప్రజా ప్రముఖులు నొక్కిచెబుతున్నారు.

గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ఎక్కువగా ప్రభావితం చేసేది అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలనే అని భావిస్తున్నందున వారు ఈ స్థితికి తమను తాము అనుకూలించుకోవడం చాలా ముఖ్యం. అనుకూలీకరణ సామర్ధ్యం అనేది వేర్వేరు ప్రాంతాల్లో, జనాభాల్లో వేర్వేరు విధాలుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనుకూలీకరణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. 2019 జూన్‌లో, ఐరాస ప్రత్యేక రిపోర్టర్ ఫిలిప్ ఆల్స్టన్ "వాతావరణ సంబంధ జాతివివక్ష" పరిస్థితి ఏర్పడుతున్నట్లు హెచ్చరించాడు. గ్లోబల్ వార్మింగ్ "2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికంలోకి నెడుతుంది. పేద దేశాలు, ప్రాంతాలు, పేద ప్రజలు అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటారు." [66] అని అతడు చెప్పాడు.

క్లైమేట్ ఇంజనీరింగ్

[మార్చు]

శీతోష్ణస్థితిని ఉద్దేశపూర్వకంగా మార్చడాన్నే క్లైమేట్ ఇంజనీరింగ్ అంటారు. (కొన్నిసార్లు జియో ఇంజనీరింగ్ లేదా క్లైమేట్ ఇంటర్వెన్షన్ అని పిలుస్తారు) . నాసా ,రాయల్ సొసైటీతో సహా వివిధ సమూహాలు దీనిని పరిశోధించాయి. అనేక పథకాల గురించి సూచనలు వచ్చినప్పటికీ, అధ్యయనం చేసిన పద్ధతులను సాధారణంగా సౌర వికిరణ నిర్వహణ, కార్బన్ డయాక్సైడ్ తొలగింపు అనే రెండు వర్గాలుగా చెయ్యవచ్చు. అత్యంత సాధారణ క్లైమేట్ ఇంజనీరింగ్ పద్ధతులను పరిశోధించిన ఒక అధ్యయనం 2014 లో, "క్లైమేట్ ఇంజనీరింగ్ పద్ధతులు పనికొచ్చేవి కావు. అవి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. శీఘ్ర వాతావరణ మార్పులకు దారి తీయకుండా వాటిని ఆపలేమ"ని తేల్చి చెప్పింది.[hello this is nishita]

శాస్త్రీయ చర్చ

[మార్చు]

ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఈ ధోరణికి ప్రధాన కారణం మానవ ప్రేరిత గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారమే ననీ శాస్త్రీయ సాహిత్యంలో అధిక ఏకాభిప్రాయం ఉంది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి శాస్త్రీయ సంస్థ ఏది కూడా ఈ అభిప్రాయంతో విభేదించలేదు. IPCC ఐదవ అసెస్మెంట్ రిపోర్టులో చెప్పినట్లుగా, శాస్త్రీయ ఏకాభిప్రాయం ఇలా ఉంది: "20 వ శతాబ్దం మధ్యకాలం నుండి గమనించిన వార్మింగుకు ప్రధాన కారణం మానవ ప్రేరితమే అనడానికి చాలా అవకాశం ఉంది". [67]

ప్రపంచ ఉద్గారాలను తగ్గించే విధానాల కోసం జాతీయ సైన్స్ అకాడమీలు ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చాయి. 2017 నవంబరులో 184 దేశాలకు చెందిన 15,364 మంది శాస్త్రవేత్తలు సంతకం చేసిన "మానవజాతికి రెండవ హెచ్చరిక" ఇలా పేర్కొంది: "శిలాజ ఇంధనాలు, అటవీ నిర్మూలన, వ్యవసాయ ఉత్పత్తి ల - ముఖ్యంగా మాంసం వినియోగం కోసం చేసే వ్యవసాయం - కారణంగా గ్రీన్‌హౌస్ వాయువులు పెరగడం వలన, శీతోష్ణస్థితిలో కలుగుతున్న మార్పుల తీరు "చాలా ఆందోళనకరంగా ఉంది". 2018 లో ఐపిసిసి 1.5°C గ్లోబల్ వార్మింగ్ పై ప్రత్యేక నివేదికను ప్రచురించింది. ప్రస్తుత స్థాయి నుండి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల రేటును తగ్గించకపోతే, 2030 - 2052 మధ్య కాలానికే గ్లోబల్ వార్మింగ్ 1.5°C కి చేరుకునే ప్రమాదం ఉందని అది హెచ్చరించింది. ఇటువంటి సంక్షోభాలను నివారించాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మున్నెన్నడూ లేనంత, వేగవంతమైన పరివర్తన అవసరమని నివేదిక పేర్కొంది. 2019 నవంబరులో, 153 దేశాలకు చెందిన 11,000 మందికి పైగా శాస్త్రవేత్తల బృందం శీతోష్ణస్థితి మార్పును "అత్యవసర పరిస్థితి" అని పేర్కొంటూ, పెద్దయెత్తున మార్పులేమీ జరగకపోతే "చెప్పలేనంత మానవ విషాదాలకు" దారితీస్తుందని చెప్పింది.[68] "శిలాజ ఇంధన దహనం వలన CO2 ఉద్గారాల పెరుగుదలకు ముఖ్య కారణమైన అంశాల్లో" ఆర్థిక వృద్ధి, జనాభా పెరుగుదల ఉన్నాయి. "ఆర్థిక, జనాభా విధానాల్లో మనం సాహసోపేతమైన, తీవ్రమైన పరివర్తనలు తీసుకురావాలి" అని అత్యవసర ప్రకటన నొక్కి చెప్పింది.

ప్రజాభిప్రాయం, వివాదాలు

[మార్చు]
2017 పీపుల్స్ క్లైమేట్ మార్చిలో నిరసనకారులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబరు 2019 వాతావరణ సమ్మె

గ్లోబల్ వార్మింగ్ సమస్య 1980 ల చివరలో అంతర్జాతీయంగా ప్రజల దృష్టికి వచ్చింది. [69] వాతావరణ మార్పుల గురించి ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారు, వారు సమస్యను ఎంతగా అర్థం చేసుకున్నారనే విషయాల్లో వివిధ ప్రాంతాలమధ్య పెద్ద తేడాలు ఉన్నాయి. 2010 లో, అమెరికా జనాభాలో సగం మంది ఇది తమకు లేదా వారి కుటుంబాలకు తీవ్రమైన ఆందోళనకారి అని భావించారు. లాటిన్ అమెరికాలో 73% మంది, అభివృద్ధి చెందిన ఆసియాలో 74% మందీ ఈ విధంగా భావించారు. అదేవిధంగా, 2015 లో సగటున 54% అది "చాలా తీవ్రమైన సమస్య" అని భావించారు. కానీ ఈ సమస్యను అత్యంత తక్కువగా పట్టించుకుంటున్న వారిలో అమెరికన్లు, చైనీయులూ (వార్షిక CO 2 ఉద్గారాలకు అతిపెద్ద బాధ్యులు ఈ రెండు దేశాలే) ఉన్నారు. 2011 లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ప్రజలు సహజ కారణాల కంటే మానవ కార్యకలాపాలే గ్లోబల్ వార్మింగ్‌‌కు ఎక్కువ కారణమని చెప్పారు. అమెరికాలో మాత్రం, జనాభాలో దాదాపు సగం మంది భూతాపాన్ని సహజ కారణాలకే ఆపాదించారు. గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రజల స్పందన, దాని ప్రభావాల పట్ల ఆందోళన పెరుగుతోంది. చాలామంది దీనిని అత్యంత తీవ్రమైన గ్లోబల్ ముప్పుగా భావించారు. 2019 సిబిఎస్ పోల్‌లో, యుఎస్ జనాభాలో 64% మంది శీతోష్ణస్థితి మార్పు అనేది "సంక్షోభం" లేదా "తీవ్రమైన సమస్య" అని చెప్పారు. 44% మంది, మానవ కార్యకలాపాలు గణనీయంగా దోహదం చేస్తున్నాయని చెప్పారు.

1990 ల ప్రారంభంలో ప్రసార మాధ్యమాలు, ఓజోన్ క్షీణత, వాతావరణ మార్పు వంటి సమస్యలను తరచూ కలిపేసి ప్రజలను గందరగోళ పరచింది. ఈ రెంటికీ మధ్య కొద్దిపాటి సంబంధం ఉన్నప్పటికీ, అది బలహీనమైన సంబంధం.

వివాదం

[మార్చు]

సుమారు 1990 నుండి, అమెరికన్ సాంప్రదాయవాద మేధావులు గ్లోబల్ వార్మింగ్ లోని తార్కికతను ఒక సామాజిక సమస్యగా వర్ణించడం మొదలుపెట్టారు. వారు శాస్త్రీయ ఆధారాలను సవాలు చేశారు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రయోజనాలు ఉంటాయని వాదించారు, గ్లోబల్ వార్మింగ్ పట్ల చేస్తున్న ఆందోళన అమెరికన్ పెట్టుబడిదారీ విధానాన్ని అణగదొక్కడానికి సామ్యవాదులు చేస్తున్న కుట్ర అని హెచ్చరించారు, దీనికి వాళ్ళు సూచిస్తున్న పరిష్కారాలు మంచి కంటే హాని ఎక్కువ చేస్తాయని నొక్కిచెప్పారు. లిబర్టేరియన్ కాంపిటేటివ్ ఎంటర్‌ప్రైజ్ ఇన్స్టిట్యూట్, వంటి సంస్థలు, సాంప్రదాయిక వ్యాఖ్యాతలూ ఐపిసిసి వారి భావి శీతోష్ణస్థితి మార్పుపై అభిప్రాయాలను సవాలు చేశారు. శాస్త్రీయ ఏకాభిప్రాయంతో విభేదించే శాస్త్రవేత్తలకు నిధులు సమకూర్చారు. గ్లోబల్ వార్మింగ్ పట్ల విధించ దలచిన కఠినమైన నియంత్రణల కోసం అయ్యే ఆర్థిక వ్యయం గురించి తమ స్వంత అంచనాలను చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్ స్వభావం, కారణాలు, పరిణామాలకు సంబంధించిన విషయాలతో ఇది పెద్ద వివాదాస్పద అంశమైంది. శాస్త్రీయ సాహిత్యంలో కంటే జనాదరణ పొందిన మీడియాలో ఇది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రత పెరగడానికి కారణం సాధారణ వాతావరణ వైవిధ్యాలలో ఉందా, మానవజాతి దీనికి గణనీయంగా దోహదపడిందా, పెరుగుదలకు పేలవమైన కొలతలు పూర్తిగా కారణమా లేక కొంత కారణమా అనేవి వివాదాస్పద సమస్యలలో కొన్ని. శీతోష్ణస్థితి సున్నితత్వపు అంచనాలు, అదనపు తాపపు అంచనాలు, గ్లోబల్ వార్మింగ్ పరిణామాలు ఎలా ఉంటాయి, దాని గురించి ఏమి చేయాలి వంటివి ఇతర వివాదాస్పద అంశాలు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన చర్యలలో తక్కువ మంది పిల్లలను కనడం ఒకటి అని కొందరు అభిప్రాయపడ్డారు. కాని కొంతమంది దీనితో విభేదిస్తూ, పిల్లలంటే "భవిష్యత్తు పట్ల నిండైన ఆశను కలిగి ఉండడం" అన్నారు. సంపన్నుల జీవనశైలి మార్చుకోవడానికీ, శిలాజ ఇంధన సంస్థలు, ప్రభుత్వ నిష్క్రియాత్మకత వంటి అంశాలకూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

20 వ శతాబ్దం లోను, 2000 ల ప్రారంభంలోనూ, ఎక్సాన్ మొబిల్ వంటి కొన్ని సంస్థలు శీతోష్ణస్థితి మార్పుపై ఐపిసిసి దృక్పథాన్ని సవాలు చేశాయి. శాస్త్రీయ ఏకాభిప్రాయంతో విభేదించిన శాస్త్రవేత్తలకు నిధులు సమకూర్చాయి. కఠినమైన నియంత్రణల కోసం అవసరమయ్యే ఆర్థిక వ్యయం గురించి వారి స్వంత అంచనాలను అందించాయి. 2010 నుండి మాత్రం శీతోష్ణస్థితి మార్పు ఉందనే అంశాన్ని, దీనికి శిలాజ ఇంధనాల దహనం వల్ల సంభవిస్తుందనే అంశాన్నీ ప్రపంచ చమురు కంపెనీలు వివాదం చేయడం లేదు.[70] అయితే, 2019 నాటికి కొందరు కార్బన్ పన్నుకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నారు. చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నారు. అయితే మరికొందరు శీతోష్ణస్థితి మార్పుల పరిహారాన్ని కోరుకునే వ్యాజ్యాల నుండి రక్షణగా కార్బన్ పన్ను చెల్లించేందుకు అనుకూలంగా ఉన్నారు.

నిరసనలు, వ్యాజ్యాలు

[మార్చు]

శీతోష్ణస్థితి మార్పులపై మరింత చురుకైన చర్యలు చేపట్టాలంటూ 2010వ దశాబ్దంలో శిలాజ ఇంధన వాడకం తగ్గింపు, ప్రపంచవ్యాప్త ప్రదర్శనలు, శీతోష్ణస్థితి మార్పులపై పాఠశాలల సమ్మె వంటి నిరసనలు పెరిగాయి. [71] ఎక్స్టింక్షన్ రెబెలియన్ లాంటి సంఘాలు కొన్ని, పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ చర్యలు చేపట్టాయి. [72] శీతోష్ణస్థితి చర్యలను బలోపేతం చేయడానికి కోర్టు కేసులను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు శీతోష్ణస్థితి చర్యల పట్ల మరింత చురుగ్గా మారాలని లేదా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయాలని ఈ వ్యాజ్యాల అతిపెద్ద లక్ష్యం. నష్ట పరిహారం కోరుతూ కార్యకర్తలు, వాటాదారులు, పెట్టుబడిదారులూ శిలాజ-ఇంధన సంస్థలపై కేసులు పెడుతున్నారు.[73]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. NASA: The Causes of Climate Change 2019.
  2. NCA4: Climate Science Special Report 2017.
  3. IPCC SROCC Summary for Policymakers 2019, p. 6.
  4. NASA: The Study of Earth as an Integrated System 2016.
  5. "global warming". ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 - Telugu On-line Dictionaries Project.
  6. "పర్యావరణానికి ప్రాణాధారం కాప్-21". Sakshi Education. Retrieved 2021-12-05.
  7. "Myths vs. Facts: Denial of Petitions for Reconsideration of the Endangerment and Cause or Contribute Findings for Greenhouse Gases under Section 202(a) of the Clean Air Act". U.S. Environmental Protection Agency. 25 August 2016.
  8. "Scientific consensus: Earth's climate is warming". Climate Change: Vital Signs of the Planet prevent dangerous anthropogenic climate change. NASA.
  9. "List of Organizations". The Governor's Office of Planning & Research, State of California.
  10. "Climate Impacts on Ecosystems". 19 January 2017.
  11. "Climate Change: Ocean Heat Content". NOAA. 2018.
  12. IPCC AR4 WG1 Ch1 2007, FAQ1.1: "To emit 240 W m−2, a surface would have to have a temperature of around −19 °C (−2 °F). This is much colder than the conditions that actually exist at the Earth's surface (the global mean surface temperature is about 14 °C).
  13. ACS. "What Is the Greenhouse Effect?". Archived from the original on 26 May 2019. Retrieved 26 May 2019.
  14. Olivier & Peters 2019, pp. 14, 16–17, 23.
  15. Gronewald, Nathaniel; E; NewsNov. 26, E.; 2019; Am, 9:02 (26 November 2019). "New U.N. climate report offers 'bleak' emissions forecast". Science (in ఇంగ్లీష్). Retrieved 28 November 2019. {{cite news}}: |last4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  16. Curtis et al. 2018.
  17. World Resources Institute, 8 December 2019.
  18. IPCC AR5 WG1 Ch2 2013, p. 183.
  19. He et al. 2018; Storelvmo et al. 2016.
  20. Ramanathan & Carmichael 2008.
  21. Wild et al. 2005; Storelvmo et al. 2016; Samset et al. 2018.
  22. Twomey 1977.
  23. Albrecht 1989.
  24. USGCRP Chapter 2 2017, p. 78.
  25. Sand et al. 2015.
  26. "Is the Sun causing global warming?".
  27. "Thermodynamics: Albedo". NSIDC.
  28. "The study of Earth as an integrated system". Earth Science Communications Team at NASA's Jet Propulsion Laboratory / California Institute of Technology. 2013..
  29. "Earth's Energy Budget, in: Climate and Earth's Energy Budget: Feature Articles". Earth Observatory, part of the EOS Project Science Office, located at NASA Goddard Space Flight Center.
  30. USGCRP Chapter 2 2017, pp. 89–91.
  31. NASA, 28 May 2013.
  32. Cohen et al. 2014.
  33. Turetsky et al. 2019.
  34. NASA, 16 June 2011: "So far, land plants and the ocean have taken up about 55 percent of the extra carbon people have put into the atmosphere while about 45 percent has stayed in the atmosphere. Eventually, the land and oceans will take up most of the extra carbon dioxide, but as much as 20 percent may remain in the atmosphere for many thousands of years."
  35. IPCC SRCCL Ch2 2019, pp. 133, 144.
  36. Melillo et al. 2017: Our first-order estimate of a warming-induced loss of 190 Pg of soil carbon over the 21st century is equivalent to the past two decades of carbon emissions from fossil fuel burning.
  37. "How the oceans absorb carbon dioxide is critical for predicting climate change". Retrieved 24 February 2019.
  38. Lenton, Timothy M.; Rockström, Johan; Gaffney, Owen; Rahmstorf, Stefan; Richardson, Katherine; Steffen, Will; Schellnhuber, Hans Joachim (27 November 2019). "Climate tipping points — too risky to bet against". Nature (in ఇంగ్లీష్). 575 (7784): 592–595. doi:10.1038/d41586-019-03595-0. PMID 31776487.
  39. IPCC SROCC Summary for Policymakers 2019, p. 18.
  40. Doney et al. 2009.
  41. Deutsch et al. 2011
  42. USGCRP Chapter 15 2017, p. 415.
  43. Scientific American, 29 April 2014; Burke & Stott 2017.
  44. USGCRP Chapter 9 2017, p. 260.
  45. National Research Council 2011, p. 14; IPCC AR5 WG1 Ch12 2013, pp. 88–89, FAQ 12.3.
  46. National Research Council 2011, p. 14; IPCC AR5 WG1 Ch12 2013, pp. 88–89, FAQ 12.3.
  47. Crucifix 2016
  48. Liu et al. 2017.
  49. IPCC SR15 Ch3 2018, p. 218.
  50. Urban 2015.
  51. Poloczanska et al. 2013; Lenoir et al. 2020.
  52. Smale et al. 2019.
  53. IPCC SROCC Summary for Policymakers 2019, p. 13.
  54. IPCC AR5 WG2 Ch18 2014, pp. 983, 1008.
  55. IPCC AR5 WG2 Ch19 2014, p. 1077.
  56. IPCC AR5 WG2 Ch7 2014, p. 488
  57. IPCC SRCCL Ch5 2019, p. 462
  58. Holding et al. 2016; IPCC AR5 WG2 Ch3 2014, pp. 232–233.
  59. USA Today, 13 July 2018.
  60. American Society for Microbiology (23 July 2019). "Rise of Candida auris blamed on global warming". Science Daily. Retrieved 25 July 2019.
  61. IPCC SROCC Ch4 2019, p. 328.
  62. UNHCR 2011, p. 3.
  63. Bertram et al. 2015.
  64. IPCC SR15 Ch4 2018, pp. 396–397.
  65. NASA's Global Climate Change. "Global climate change adaptation and mitigation".
  66. "UN expert condemns failure to address impact of climate change on poverty". OHCHR. 25 June 2019. Archived from the original on 10 July 2019. Retrieved 9 July 2019.
  67. IPCC AR5 WG1 Summary for Policymakers 2013, p. 17, D.3.
  68. Ripple et al. 2017; Ripple et al. 2019; Fletcher 2019, p. 9
  69. Weart "The Public and Climate Change (since 1980)".
  70. A list of oil company statements has been collected at the Environmental Studies website of the University of Wisconsin – Oshkosh. See Oil Company Positions.
  71. The Guardian, 19 March 2019; Boulianne, Lalancette & Ilkiw 2020.
  72. Deutsche Welle, 22 June 2019.
  73. Setzer & Byrnes 2019.

గ్రంథాలు

[మార్చు]

శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ పానెల్ (IPCC reports)

[మార్చు]
AR4 Working Group I Report
[మార్చు]
AR4 Working Group II Report
[మార్చు]
AR4 Working Group III Report
[మార్చు]


AR5 Working Group I Report
[మార్చు]

AR5 Working Group II Report


AR5 Working Group III Report
[మార్చు]
AR5 Synthesis Report
[మార్చు]


Special Report: Global Warming of 1.5 °C
[మార్చు]


Special Report: Climate change and Land
[మార్చు]


Special Report: The Ocean and Cryosphere in a Changing Climate
[మార్చు]

AR6 Working Group I Report

[మార్చు]

Other peer-reviewed sources

[మార్చు]
[మార్చు]

Non-technical sources

[మార్చు]