వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/అట్టల రూపకల్పన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2024 డిసెంబరులో హైదరాబాదులో జరగబోయే పుస్తక ప్రదర్శనలో, తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు కార్యక్రమాల్లో భాగంగా ఒక స్టాలు పెట్టబోతున్నామని తెలిసిన సంగతే. తెవికీని ప్రజలకు పరిచయం చెయ్యడంతో పాటు, ఇక్కడ ఎవరు రాయొచ్చు, ఎలా రాయాలి వంటి విషయాలను కూడా బోధించి, కొత్త వాడుకరులు తెవికీలో చేరేలా ప్రోత్సహించడం ఈ స్టాలు ద్వారా మనం సాధించదలచిన ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో భాగంగా తెవికీని పరిచయం చేసే ఒక చిన్న పుస్తకాన్ని వేద్దామని కూడా యూజర్‌గ్రూపు సంకల్పించింది. ఆ పుస్తకంలో ఉండాల్సిన సమాచారాన్ని తయారుచేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. ఒక వైపున ఈ పని జరుగుతూండగా, ఆ పుస్తకానికి ముందు అట్ట, వెనుక అట్టల రూపకల్పన చెయ్యడం కోసం అవసరమైన సమాచారాన్ని నిశ్చయించడం ఈ పేజీ లక్ష్యం.

ముందు అట్ట, వెనుక అట్టల రూపకల్పన ఏయే అంశాలపై ఆధారపడి ఉండాలనేది మనం నిశ్చయిస్తే వాటిని రూపకర్తకు ఇచ్చి తదనుగుణంగా అట్టలను రూపొందించమని అడగవచ్చు. ఈ విషయమై మనం పరిగణించాల్సిన అంశాలివి:

  1. పుస్తకం ద్వారా ఎటువంటి సమాచారాన్ని అందిస్తున్నాం?
    1. తెలుగు వికీపీడియా గురించి తెలియని వారికి దాని గురించి (అలాగే వికీసోర్సు గురించి, ఇతర వికీమీడియా ప్రాజెక్టుల గురించి కూడా) ప్రాథమిక విశేషాలను తెలియజెయ్యడం
    2. తెలిసినవాళ్ళకు, తామూ ఇక్కడ రాయవచ్చని చెప్పి, వారు రాసేలా ప్రోత్సహించడం
    3. రాయడం మొదలుపెట్టేందుకు అవసరమైన కనీస మాత్రపు సమాచారాన్ని అందించడం

పై 3 అంశాలను బట్టి పుస్తకం పేరు, ట్యాగ్‌లైను (అవసరమనుకుంటే) లను మనం ఇక్కడ రూపొందించాలి. ఈ పేజీలో మన ఆలోచనలూ, అభిప్రాయాలను కలబోసుకుందాం. (ఈ పేర్లు బాగా క్యాచీగా, ఆకట్టుకునేలా ఉండాలి. ఉదా: "30 రోజుల్లో తమిళం". ఆ పుస్తకంలో దేని గురించి రాసారో ఈ పేరు తోటే తెలిసిపోతోంది. అలాంటి శీర్షిక, ఉపశీర్షికలు మన పుస్తకానికి కూడా ఉంటే బాగుంటుంది)

  1. పుస్తకం ముందు అట్ట, వెనుక అట్టలపై వేసే బొమ్మ ప్రతిబింబించాల్సిన అంశం ఏంటి?
    1. అట్ట వికీమీడియా ప్రాజెక్టుల తాత్వికతను ప్రతిబింబించాలి. క్లుప్తంగా ఆ తాత్వికత ఏంటంటే -
      1. స్వేచ్ఛగా, ఉచితంగా, యథేచ్ఛగా వాడేసుకోగలిగే విశ్వ విజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం. ఇక్కడ లభించే సమాచారాన్ని స్వేచ్ఛగా వ్యాపార ప్రయోజనాల కోసం కూడా వాడేసుకోవచ్చు
      2. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు, తమకు ఆసక్తి ఉన్న ఏ అంశం గురించైనా రాయవచ్చు
      3. రాసేవాళ్లంతా స్వచ్ఛంద సేవకులే, వికీమీడియా ఆస్తులను సమీకరించడం, నిర్వహించడం చేసే వికీమీడియా ఫౌండేషను కూడా అలాంటిదే -కేవలం విరాళాలపై ఆధారపడి పనిచేసే, ఆర్జన లేని స్వచ్ఛంద సంస్థ.

డిజైనరుకు ఈ మూడు ముక్కలను చెప్పి, ఈ తాత్వికత ప్రతిఫలించేలా అట్టలను సృజించమందాం

  1. ఈ పుస్తకం వికీమీడియా ప్రాజెక్టుల గురించి వేస్తున్నాం కాబట్టి వికీమీడియా లోగో, దీన్ని యూజర్‌గ్రూపు తరపున వేస్తున్నాం కాబట్టి యూజర్‌గ్రూపు లోగో - ఈ రెండూ అట్టలపై ఉండడం సముచితంగా ఉంటుంది. అయితే యూజర్‌గ్రూపుకు లోగో లేదు. దాని విషయమై ఒక చర్చ మొదలుపెట్టాం. ఆ చర్చలో మీ అభిప్రాయాలు చెబితే, వచ్చే నాలుగు రోజుల్లో దాన్ని ఖాయం చేసెయ్యొచ్చు.

లోగో చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు సూచనలు చెప్పండి

అభిప్రాయాలు సూచనలు

[మార్చు]

పై విభాగం లోని అంశాలపై మీ అభిప్రాయాలూ సూచనలూ ఇక్కడ రాయండి

పుస్తకం పేరు

[మార్చు]
  • వికీపీడియా అంటే మీకు తెలుసా
  • వికీపీడియాను గురించి తెలుసుకోవాలని ఉందా
  • దీనిని గురించి తెలుసుకోండి

ఇలా మీకు తట్టిన వాటి పేర్లు పైన రాస్తే దానిలో నుండి మంచి పేరు ఎంపిక చేద్దాం.--యర్రా రామారావు (చర్చ) 08:01, 12 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

  • విశ్వం నుండి విసనకర్ర దాకా విజ్ఞానం - వికీపీడియాలో
  • వికీ వీధుల్లో విశ్వవిజ్ఞానం
  • ఆవకాయ నుండి అంతరిక్షం దాకా - అరచేతిలో
  • అరచేతిలో అనంత జ్ఞానం

పరిశీలించండి _చదువరి (చర్చరచనలు) 11:33, 13 నవంబరు 2024 (UTC).[ప్రత్యుత్తరం]

సరళంగా, క్లుప్తంగా నేరుగా మన ఉద్దేశ్యం అందించే పుస్తకం పేరు - "వికీపీడియా అంటే మీకు తెలుసా"
టాగ్ లైన్ -
  • అందరం రాద్దాం, అందరికీ అందిద్దాం
  • ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చదవొచ్చు, ఉపయోగించుకోవచ్చు
  • స్వచ్ఛందం · స్వేచ్ఛ · ఉచితం
V.J.Suseela (చర్చ) 07:43, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా: ప్రారంభకులకు మార్గదర్శి లేదా తెలుగు వికీపీడియాలో అడుగులు .

ముఖచిత్రం మీద వికిపీడియా లోగొతో పాటు మన తెలుగు వికీపీడియా URL వుండటం ముఖ్యం అని నేను భావిస్తున్నాను ఇందులో నేర్చుకొండి కూడా కలిపితే బాగుంటుంది అనుకొంటున్నను -

Telugu Wikipedia Stand

--Kasyap (చర్చ) 06:49, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ట్యాగ్‌లైను లేదా ఉపశీర్షిక

[మార్చు]
  • రేపటి తరానికి మనమిచ్చే ఆస్తి
  • మహాభారతం · వేమన శతకం · కన్యాశుల్కం · వికీపీడియా
  • రేపటి కోసం నేటి కృషి
  • అందరం రాద్దాం, అందరికీ అందిద్దాం
  • నేనూ రాస్తా, ముందు తరాలకు అందిస్తా
  • ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చదవొచ్చు
  • స్వచ్ఛందం · స్వేచ్ఛ · ఉచితం

__చదువరి (చర్చరచనలు) 13:23, 13 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తాత్వికత గురించి

[మార్చు]

ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటే..

[మార్చు]

తెవికీ స్టాండ్ లో స్వేచ్ఛగా సవరించండి, రాయండి, పంచుకోండి, ఉపయోగించుకోండి--V.J.Suseela (చర్చ) 07:46, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]