వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తొమ్మిది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొమ్మిది[మార్చు]

వ్యాసం సగం తెలుగులో, సగం ఇంగ్లీషులో ఉంది. తెలుగులో ఉన్న భాగం ఏదో పుస్తకం లోంచి కాపీచేసి (బహుశా వేమూరి వెంకటేశ్వరరావు గారి పుస్తకం లోంచి అయి ఉంటుంది. మూల్ంలో ఉదహరించారు) ఇక్కడ పెట్టినట్టు ఉంది. రాసిన శైలి తెవికీకి పనికిరాదు. ఉన్నదున్నట్టుగా రాసినా ఇక్కడ పనికిరాదు. కాబట్టి దాన్ని తీసెయ్యాలి. దాన్ని తీసేస్తే ఉండేదంతా ఇంగ్లీషే. అది తెలుగు వికీకి అక్కర్లేదు. కాబట్టి దాన్నీ తీసెయ్యాలి. దాన్నీ తీసేస్తే ఉండేది మొలక! మొత్తం ఒక ఉల్లిపాయ లాంటి వ్యాసమిది. పనికిరానిదంతా తీసేస్తే ఏమీ ఉండదు. కాబట్టి పేజీని తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 06:36, 20 ఏప్రిల్ 2020 (UTC)

ఈ వ్యాసంలో అధిక భాగం శుద్ధి చేయబడని గూగుల్ అనువాదంగా ఉంది. మరికొంత భాగం ఆగ్లంలో ఉంది. పనికిరానిదంతా తీసేస్తే మిగిలినది ఏమీ లేదు. కనుక తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 07:12, 20 ఏప్రిల్ 2020 (UTC)
ఫై అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:17, 20 ఏప్రిల్ 2020 (UTC)
వ్యాసంలో కొంత భాగాన్ని తొలగించినా, ఇంకా మూలాలు చేర్చలేదు. వాడుకరి చర్చ పూర్తి కాకుండా తొలగింపు మూసను తొలగించాడు. అనుభవజ్ఞుడైన వాడుకరి అయినా నియమాలు పట్టించుకోవడాం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 05:03, 11 మే 2020 (UTC)
  • మూలాలు చేర్చబడినవి, తొలగింపు మూస తీసివేయగలరు.YVSREDDY (చర్చ) 08:39, 11 మే 2020 (UTC)