వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ
వికీపీడియా వ్యాసాల్లో ఇచ్చిన మూలాల్లో వివిధ లోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ లోపాల్లో కొన్ని సరిదిద్ద వలసినవి కాగా, కొన్నిటిని నిర్వహణ రీత్యా సవరించవలసి ఉంటుంది. వాటిని నిర్వహించేందుకు చేపట్టినది ఈ ప్రాజెక్టు.
లోపాల్లోని రకాలు
[మార్చు]మూలాల్లో దొర్లే లోపాలు ప్రధానంగా రెండు రకాలు
- CS1 మూసల పరామితుల విలువల వలన ఏర్పడే లోపాలు: CS1 మూసల్లోని వివిధ పరామితులకు ఇచ్చే విలువల వలన ఈ లోపాలు ఏర్పడతాయి. ఈ పేజీలువర్గం:CS1 errors అనే వర్గంలో ఉన్న వివిధ ఉపవర్గాల్లోకి చేరతాయి.
- పేజీలో మూలాలను నిర్వచించే విధానం వలన ఏర్పడే లోపాలు. ఉదాహరణలు ఒకే పేరుతో మూలాన్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వచించడం, అసలు నిర్వచించకుండానే వేరే చోట్ల పునరుల్లేఖన చెయ్యడం మొదలైనవి. ఇలాంటి లోపాలున్న పేజీలు వర్గం:మూలాల లోపాలున్న పేజీలు అనే వర్గం లోకి చేరుతాయి.
ఈ ప్రాజెక్టు ప్రస్తుతం మొదటి రకం లోపాల పైననే దృష్టి పెడుతుంది.
లోపాలున్న పేజీలను గుర్తించడం
[మార్చు]మూలాల్లో లోపాలున్న పేజీలను మీడియావికీ సాఫ్టువేరు స్వయంగా గుర్తించి ఆయా పేజీలను వర్గం:CS1 అనే వర్గం లోని ఉపవర్గాల్లోకి చేరుస్తుంది. ఆ ఉపవర్గాల్లో వర్గం:CS1 errors అనేది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైనది (ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి ఇందులో 50 ఉపవర్గాలున్నాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది). మిగతావి, ఆవశ్యకత రీత్యా తక్కువ ప్రాధాన్యత కలిగినవి.
గమనిక: ఏదైనా పేజీ, ఏవైనా "దాచిన వర్గాల్లో"కి చేరి ఉంటే మామూలుగా కనబడవు. అంచేత అభిరుచుల్లో, రూపురేఖలు ట్యాబులో "దాచిన వర్గాలను చూపించు" అనే దాన్ని ఎంచుకుని పెట్టుకుంటే మంచిది.
ప్రాజెక్టు మొదలుపెట్టేనాటి స్థితి
[మార్చు]2023 జనవరి 9 నాటికి వర్గం:CS1 errors వర్గం లోని మొత్తం 52 వివిధ ఉపవర్గాల్లో ఉన్న అన్ని పేజీల సంఖ్య: 9,043. ఒకే పేజీ వివిధ వర్గాల్లో ఉండే అవకాశం ఉన్నందున, లోపాలున్న వివిక్త (యునిక్) పేజీల సంఖ్య దీనికంటే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి వర్గం:CS1 errors వర్గం లోని వివిధ ఉప వర్గాల్లో ఉన్న పేజీల సంఖ్య కింది విధంగా ఉంది.
ఈ వర్గాల్లోని పేజీల తాజా స్థితి
[మార్చు]ఈ ప్రాజెక్టు ద్వారా చేసిన కృషి వలన తాజా స్థితిని తెలుసుకోడానికి కింది వర్గాలను చూడవచ్చు
ఎలా పనిచెయ్యాలి
[మార్చు]పైన చూపిన ఉపవర్గాల పేజీల్లో వర్గ వివరణ ఉంటుంది. ఏ కారణం వలన ఆయా పేజీలు ఈ వర్గం లోకి చేరుతున్నాయో, ఆ లోపాలను ఎలా సవరించాలో ఆ వివరణలో లభిస్తుంది. ఆ వివరణను అనుసరించి అందులోని పేజీల్లో తగు మార్పులు చేసి ఆ లోపాలను సవరించాలి. లోపాలన్నిటినీ సవరించినపుడే ఆ పేజీ ఆ ఉపవర్గం లోంచి తొలగిపోతుంది.
గమనిక: పేజీలో ఎన్ని లోపాలున్నాయో సాఫ్టువేరు చూపదు. లోపం ఒక్కటి ఉన్నా సంబంధిత వర్గం లోకి చేరుస్తుంది. అందుచేత, ఉన్న లోపాలు అన్నిటినీ తొలగిస్తేనే ఫలితం కనిపిస్తుంది.
ప్రాజెక్టులో పనికి సంబంధించి కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి
- ప్రస్తుతం వర్గం:CS1 errors అనే వర్గం లోని ఉపవర్గాలపై మాత్రమే పనిచేస్తే బాగుంటుంది. మిగతా రెండు వర్గాల లోని లోపాలు అంత ఆవశ్యకమైనవి కానందున వాటిని తరువాత పరిష్కరించవచ్చు. అయితే వాటిపైనే ఆసక్తి ఉన్న వాడుకరులు ఆ పనినైనా చేపట్టవచ్చు
- ముందుగా ఎక్కువ పేజీలున్న వర్గాలను తీసుకుందాం. ఉదా: వర్గం:CS1 errors: dates
- ఆ వర్గపు పేజీలో వర్గ వివరణ ఉంటుంది. పేజీ ఆ వర్గం లోకి ఎందుకు చేరింది, ఆ లోపాన్ని ఎలా సవరించాలి అనే వివరణ ఉంటుంది. సాధారణంగా అది చదివితే విషయం అర్థమౌతుంది. ఏమైనా సందేహాలుండే పక్షంలో ఈ ప్రాజెక్టు చర్చ పేజీలో రాస్తే, తెలిసినవాళ్ళు సమాధానం ఇస్తారు. లేదా అందరం చర్చించుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు.
- ఒకే పేజీలో వివిధ రకాలైన లోపాలు ఉండవచ్చు - అంటే ఆ పేజీ, వివిధ లోపాల వర్గాల్లో చేరి ఉంటుందన్నమాట. ఆ లోపాలన్నిటినీ ఒక్కసారే సరిచెయ్యవచ్చు. లేదా మీరు తలపెట్టిన వర్గపు పని మాత్రమే చెయ్యవచ్చు.
- ఒకే లోపం పేజీలో ఒకే చోట మాత్రమే ఉండాలని ఏం లేదు, అనేక చోట్ల ఉండవచ్చు. ఆ లోపాలన్నిటినీ సవరిస్తేనే పేజీ ఆ లోప వర్గం నుండి తొలగిపోతుంది. చిక్కేంటంటే, లోపం ఉందని చూపిస్తుంది తప్ప, ఎన్నిచోట్ల ఉందో చూపించదు. అయితే -
- కొన్ని లోపాలకు సంబంధించి, మూలాలు విభాగంలో సదరు మూలం పక్కనే లోపం గురించిన వివరణను ఎర్ర రంగులో చూపిస్తుంది. తద్వారా లోపం ఏయే మూలాల్లో ఉందో తెలిసిపోతుంది. ఈ సౌకర్యం అన్ని మూలాలకూ లేదు.
నైపుణ్య స్థాయి
[మార్చు]ఈ పనిచెయ్యడానికి కొంత నైపుణ్య స్థాయి అవసరం.
- మూలాల్లో సాధారణంగా ఉపయోగించే CS1 మూసల లోని పరామితుల పట్ల అవగాహన ఉండాలి. ఇందుకోసం సహాయం:CS1 errors అనే పేజీ ఉపకరిస్తుంది (ఈ పేజీ కొంతవరకే అనువాదమైంది. పూర్తిగా అనువాదం చెయ్యాల్సి ఉంది)
- కొన్ని సవరణలు చేస్తే సాధారణంగా ఎలాంటి లోపాలు జరుగుతున్నాయో అవగాహన అవుతుంది. తద్వారా పని వేగవంతమౌతుంది.
- రెగ్యులర్ ఎక్స్ప్రెషను వాడే నైపుణ్యం ఉంటే బాగా ఉపయోగం. పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిచి, రెగ్యులర్ ఎక్స్ప్రెషను ద్వారా ఎక్కువగా దొర్లే లోపాలను వేగంగా గుర్తించవచ్చు, సరిచెయ్యనూ వచ్చు.
- AWB వాడితే పని వేగంగా జరుగుతుంది. అయితే AWB లోని రెగ్యులర్ ఎక్స్ప్రెషను వాడే నైపుణ్యం ఉండాలి. లేదంటే AWB వలన ఉపయోగం ఉండదు.
- గమనిక: ఏయే పనులు చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసుకుంటే చాలు, మానవికంగా నైనా పని చెయ్యవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషను, AWB ల గురించి తెలిసి ఉండాల్సిన ఆవశ్యకతేమీ లేదు. అవి తెలిస్తే పని కొంత వేగవంతమౌతుంది తప్ప, అది తప్పనిసరేమీ కాదు
ప్రాజెక్టు గుర్తింపులు
[మార్చు]ఈ ప్రాజెక్టులో పనిచేసే వాడుకరులు దానికి గుర్తింపుగా కింది అంశాలను తమ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. ఆ వాడుకరులు వర్గం:మూలాల లోపాల సవరణ ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు అనే వర్గం లోకి చేరుతారు.
- వాడుకరిపెట్టె - {{మూలాల లోపాల సవరణ ప్రాజెక్టు సభ్యులు}}
- టాప్ఐకన్ - {{మూలాల ప్రాజెక్టు topicon}}
పనిచేసే వాడుకరులు
[మార్చు]- చదువరి (చర్చ • రచనలు)
- ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:37, 9 జనవరి 2023 (UTC)
- యర్రా రామారావు (చర్చ • రచనలు)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:55, 9 జనవరి 2023 (UTC)
- పవన్ సంతోష్ (చర్చ) 06:56, 18 జూన్ 2023 (UTC)
పురోగతి
[మార్చు]తేదీ | ఈ వర్గాల్లో ఉన్న పేజీలు |
---|---|
2023 జన 9 | 9,043
|
2023 జన 25 | 4,056
|
2023 ఫిబ్ర 4 | 2,636
|
2023 ఫిబ్ర 14 | 1,810
|
2023 మార్చి 10 | 851
|
2023 మార్చి 21 | 425
|
ఇప్పుడు | 4,111
|
- 2023 జనవరి 9,10 తేదీల్లో వర్గం:CS1 errors: dates వర్గంలో ఉన్న పేజీలపై పనిచేసాను. ఆటోవికీబ్రౌజరులో రెగ్యులర్ ఎక్స్‌ప్రెషను వాడి కింది లోపాలను సవరించాను.
- తెలుగు నెలల పేర్లు తప్పుగా ఉన్నవాటిని సవరించాను
- yyyy-mm-dd ఆకృతిలో ఉండాల్సిన తేదీ yyyy-m-dd లోనో yyyy-mm-d లోనో ఉన్నవాటిని సవరించాను
- month dd, yyyy ఆకృతిలో ఉండాల్సిన తేదీ yyyy m, dd లో ఉన్నవాటిని సవరించాను
- తద్వారా ఈ వర్గంలో తొలుత ఉన్న 3285 పేజీల సంఖ్యలో 2606 పేజీలు తగ్గి, ఇప్పుడు 679 పేజీలకు చేరింది.__చదువరి (చర్చ • రచనలు) 06:27, 10 జనవరి 2023 (UTC)
- వర్గం:CS1 errors: markup వర్గం లోని మొత్తం 185 పేజీల్లో, 150 పేజీల్లో ఆటోవికీబ్రౌజరు ద్వారా లోపాలను సవరించాను. __చదువరి (చర్చ • రచనలు) 09:58, 10 జనవరి 2023 (UTC)
- నిన్న వెంకటరమణ గారు చేసిన సవరణల తరువాత వర్గం:CS1 errors: dates వర్గం లోని పేజీల సంఖ్య 627 కు తగ్గింది.__చదువరి (చర్చ • రచనలు) 05:20, 11 జనవరి 2023 (UTC)
కాలక్రమంలో..
[మార్చు]- 2023 జనవరి 21 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 5,168. ప్రాజెక్టు మొదలైన నాడు ఉన్న 9,043 పేజీల్లో 3,875 పేజీలు తగ్గాయి.
- 2023 జనవరి 25 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 4,056. ప్రాజెక్టు మొదలైన నాడు ఉన్న 9,043 పేజీల్లో 4,987 పేజీలు తగ్గాయి.
- 2023 ఫిబ్రవరి 4 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 2,636. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, అందులో 6,407 పేజీల్లోని లోపాలను సవరించాం. ప్రాజెక్టు మొదలైనపుడు ఈ వర్గంలో మొత్తం 3 ఖాళీ ఉపవర్గాలుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 33 కు పెరిగింది.
- 2023 ఫిబ్రవరి 14 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 1,810. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, ఇప్పటివరకు అందులో 7,233 పేజీల్లోని లోపాలను సవరించాం. ఖాళీ అయిన ఉపవర్గాల సంఖ్య 33 గానే ఉంది.
- 2023 మార్చి 5 నాటికి వర్గం:CS1 errors లోని ఉపవర్గాల్లో ఉన్న మొత్తం పేజీల సంఖ్య: 949. ప్రాజెక్టు మొదలైన నాడు ఈ ఉపవర్గాల్లో మొత్తం 9,043 పేజీలుండగా, ఇప్పటివరకు 8,094 పేజీల్లోని లోపాలను సవరించాం. ఈ వర్గంలో ఉన్న మొత్తం 52 ఉపవర్గాల్లో 40 ఖాళీ అయ్యాయి.