Jump to content

వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చదువరి అభిప్రాయాలు

[మార్చు]

ఈ ప్రతిపాదనపై నా అభిప్రాయం:

  1. యూజర్ గ్రూపు అవసరమా లేదా?: అవసరం. వికీపీడియా తరపున బయట చేసే కార్యక్రమాలకు ఒక వేదిక ఉండాలి. వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి పని చేసేందుకు ఒక గొడుగు ఉండాలి. తెలుగు వికీపీడియాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక వేదిక కావాలి. అంచేత ఈ యూజర్ గ్రూపు ఉండాలి. ఇది వికీమీడియా ఫౌండేషను గుర్తింపు పొందేలా పనిచెయ్యాలి.
  2. యూజర్ గ్రూపు పరిధి ఏమిటి?: నా ఉద్దేశం తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూపు అయితే బాగుంటుంది. అయితే ఆంధ్ర తెలంగాణ వికీమీడియనుల యూజర్ గ్రూపుతో నాకు అభ్యంతరం లేదు గానీ, అందులో తెలుగు రానివారు కూడా ఇందులో చేరుతారు కాబట్టి, భాషంతరాల వల్ల ఆ గ్రూపు పనితీరు కుంటుపడుతుందేమోనని నా ఉద్దేశం.

ఈ గ్రూపు ఏర్పాటులో గాని, పనిలో గానీ నా కప్పగించిన పని చేసేందుకు నేను సిద్ధం.__చదువరి (చర్చ •  రచనలు) 01:24, 26 డిసెంబరు 2019 (UTC)స్[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ అభిప్రాయాలు

[మార్చు]

ఈ ప్రతిపాదన మీద నేనూ నా అభిప్రాయాలు వెల్లడిస్తున్నాను:

  • అవసరమా?: అవసరమేనని నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా ఆఫ్‌లైన్ కార్యక్రమాల విషయంలో దీని అవసరం ఉంది ఇప్పుడు. దీన్ని నిర్వహించే సాధన సంపత్తి, శక్తియుక్తులు కూడా మనకి ఉన్నాయి. యూజర్ గ్రూప్ అన్నది ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న విషయాల్లో మనకు మోడల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మరింత మెరుగ్గా రూపొందించగలం మనం.
  • పరిధి?: కనీసం తెలుగు భాష మాట్లాడగలిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన కృషి వివిధ ప్రాజెక్టుల్లో (వికీమీడియా కామన్స్, వికీడేటా, ఇంగ్లీష్‌ వికీపీడియా, ఇలా) చేసే వికీమీడియన్లను కలుపుకుపోగలిగేలాంటి లక్ష్యాలు, పరిధితో ఉండాలని నా ఉద్దేశం. ఇందువల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి: ఒకటి- కొద్ది కొద్దిగా మిగిల్చిన పరిధుల్లో ఇతరులు వేరే పోటీ గ్రూపులు ఏర్పాటుచేయగలిగే అవకాశం నివారించడం, రెండు- పరిధి ఆ మేరకు విస్తరిస్తే సామర్థ్యం, ఆసక్తి ఉన్న ఇతర వికీపీడియన్లు కూడా మనతో చేరే వీలివ్వడం. ఇదలా ఉంచి: మన గ్రూపు ద్వారా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఇతర చిన్న చిన్న భాషా సముదాయాల వారు తమ కార్యక్రమాలు చేసుకోవడానికి సహకారం కావాలంటే చేయడమన్నది కూడా లక్ష్యాల్లో చేర్చడం మంచిదని నా భావన. ఇది బయట నుంచి సహకారంలా ఉండవచ్చు. ఇవి లక్ష్యాల్లో ఉంచి- పేరును తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అనే ఉంచుదామని నా ప్రతిపాదన.

ఈ గ్రూపు ఏర్పాటుకు, దాని నిర్వహణకు బాధ్యతలు స్వీకరించి పనిచేయడానికి నేను సిద్ధమేనని తెలియపరుస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:54, 26 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సి.చంద్రకాంతరావు అభిప్రాయాలు

[మార్చు]

యూజర్ గ్రూపును ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే ప్రశ్నకు ముందు అసలు యూజర్ గ్రూపు ఏర్పాటు చెయ్యడపోవడం వల్ల తెవికీకి ఇప్పుడున్న ఇబ్బందులేమిటి? ఏర్పాటు చేస్తే ఆ ఇబ్బందులు తీరుతాయా ? అనేదానిపై దృష్టి సారించాలి. తెవికీ సభ్యులు తెవికీలోనే చర్చించుకుంటూ తెవికీని అభివృద్ధిపథంలో పయనింపజేసిన ఒకానొకదశలో యూజర్ గ్రూపులున్నాయా ? చాప్తర్లున్నాయా ? పట్టుమని పదిమంది కూడా చురుకుగా లేని ఇప్పటి తెవికీదశలో, నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, యూజర్ గ్రూపులకై ఆలోచించడం సమంజసం కాదనిపిస్తుంది ! ఇప్పుడు యూజర్ గ్రూపు ఏర్పాటు అంటాము, ఏడాదికోసారి నివేదిక పంపాలి అంటాము, నివేదికకై గణాంకాలు పెరగాలంటాము, గణాంకాలకై కొందరు సభ్యులను పురమాయిస్తాము, చివరికి నాణ్యతను గాలికొదిలేస్తాము, ఇది ఊబి నుంచి మరింత ఊబిలోకి వెళ్ళడమే తప్ప మరేమి కాదు ! ఇవన్నీ గతానుభవాలే చెబుతున్నాయి. తెవికీలో నాణ్యతలేని వ్యాసాలున్నాయనీ, నిర్వహణ భారంగా మారిందనే అభిప్రాయాలున్న ప్రస్తుత తరుణంలో మళ్ళీ గణాంకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దశకు మళ్ళడం భావ్యమనిపించడంలేదు. యూజర్ గ్రూపు ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు, యూజర్ గ్రూపు ఏర్పాటు లేకుండా చేయడానికి వీలుపడదా ? యూజర్ గ్రూపు ఏర్పాటు వల్ల ఏమైనా ప్రత్యేక గ్రాంటులు లభిస్తాయా ? పొరుగు రాష్ట్రాలకు చెందిన భాషావికీలవారు ఇలాంటిపని చేయకపోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా ? యూజర్ గ్రూపువల్ల సభ్యుల మధ్య కాని, తెవికీలోకాని అభిప్రాయబేధాలు రావనడానికి నమ్మకం కలిగించగలమా ? వికీమీడియా ఫౌండేషన్‌తో సంప్రదింపులకు ఏ ఇద్దరిని తీసుకోవాలి ? ఆ ఇద్దరికీ ఏదైనా ప్రత్యేకత ఉంటుందా (వేతనంకాని, ప్రాధాన్యతకాని) ? ప్రదిపాదించినవారే బాధ్యత తీసుకుంటామని ఎందుకంటున్నారు ? పలువురు ముందుకువస్తే ఇదివరకు పదవులు పొందినవారిని వదిలేయమని చెప్పగలమా ? ఇలాంటివాటిపై సభ్యులు దృష్టిసారించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రారంభించడం ముఖ్యంకాదు, ఆ తర్వాత తెవికీకి నష్టం జరగకపోవడానికే ఆలోచించాలి. యూజర్ గ్రూపులవల్ల తెవికీకి ప్రయోజనమే తప్ప నష్టమేమీ జరగబోదని నిరూపిస్తే నా మద్దతు తప్పకుండా ఉంటుంది. కాని ముందుగా ఒక్కో అంశంపై వివరంగా చర్చజరగాలి, సమాధానం ఇచ్చేవారు ఓపికతో సమాధానం ఇవ్వాలి. (సందేహాలంటే ఇవి మాత్రమే కావు, ఇతర సభ్యులు కూడా తమ సందేహాలు బహిర్గతపర్చాలి) సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 26 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రశ్నల్లో చాలావరకూ సమాధానాలు అదే పేజీలో ఇచ్చిన లింకులు అనుసరిస్తే దొరుకుతాయి. (ఉదాహరణకు: నివేదికలు ఎలావుంటాయో చూడొచ్చు, నివేదికల జాబితయే ఉంది. ఆయా నివేదికలు చదివితే గణాంకాల కోసమే పనులు చేయాలా, లేక చిత్తశుద్ధితో అభివృద్ధి కోసం పనిచేయవచ్చా లేదంటే ఎలాంటి పనులు ఇప్పటికే జనం చేస్తున్నారు వాటి నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చా, ఇలాంటి విషయాలు అనేకం తెలుస్తాయి) ఆ సమాచారం అధ్యయనం చేసి మిగిలిన అంశాలపై ఎవరికి వారు అభిప్రాయాలు ఏర్పరుచుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 05:51, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారి అభిప్రాయాలపై నేను అనుకుంటున్నదిది:
  • ముందు అసలు యూజర్ గ్రూపు ఏర్పాటు చెయ్యడపోవడం వల్ల తెవికీకి ఇప్పుడున్న ఇబ్బందులేమిటి? ఏర్పాటు చేస్తే ఆ ఇబ్బందులు తీరుతాయా ?:- అవును తీరవు, తెవికీలోని ఇబ్బందులను మనమే పరిష్కరించుకోవాలి. అది యూజరు గ్రూపు పని కాదు. యూజరు గ్రూపు ఉద్దేశమూ అది కాదు. మన లోటుపాట్లు, ఇబ్బందులూ మరొక పేజీలో ఉన్నాయి, అది చూడగలరు. అక్కడ కూడా మీ అభిప్రాయం, సూచనలూ రాయండి. అది మనకు ఎంతో అవసరం.
  • పట్టుమని పదిమంది కూడా చురుకుగా లేని ఇప్పటి తెవికీదశలో, నిర్వహణే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, యూజర్ గ్రూపులకై ఆలోచించడం సమంజసం కాదనిపిస్తుంది !:- నిర్వహణ భారంగానే ఉంది. కానీ దానికి పరిష్కారం నిర్వాహకులు నిర్వహణ పనులు చెయ్యడమే గాని, యూజరు గ్రూపు పెట్టడం గాని, పెట్టకపోవడం గానీ కాదు. యూజరుగ్రూపు పెట్టనంత మాత్రాన దానికి పరిష్కారం దొరకదు గదా. మనందరం మనం తీసుకున్న బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటే, అదే పరిష్కారం.
  • ఇది ఊబి నుంచి మరింత ఊబిలోకి వెళ్ళడమే తప్ప మరేమి కాదు !:- వికీ బయట చెయ్యాల్సిన కార్యక్రమాలు చేసి తెవికీ అభివృద్ధి కోసం పాటు పడ్డం, యూజరు గ్రూపు లక్ష్యం. గణాంకాల కోసం మాత్రమే నని అనుకోవడం, భయపడ్డం అనవసరం.
  • యూజర్ గ్రూపు ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు, యూజర్ గ్రూపు ఏర్పాటు లేకుండా చేయడానికి వీలుపడదా ?:- ఎలా చెయ్యొచ్చో చెప్పండి. ఏం చేసామో చెప్పండి.
  • యూజర్ గ్రూపు ఏర్పాటు వల్ల ఏమైనా ప్రత్యేక గ్రాంటులు లభిస్తాయా ?:- గ్రూపు చేస్తున్న పనుల పట్ల సంతృప్తి చెందితే గ్రాంటు రావచ్చని నేను భావిస్తున్నాను.
  • పొరుగు రాష్ట్రాలకు చెందిన భాషావికీలవారు ఇలాంటిపని చేయకపోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా ?:- భారత దేశంలో దాదాపు పది పన్నెండు యూజరు గ్రూపులు ఉన్నాయని, అవి ఏమేంటో కూడా రాసారు కదా?
  • యూజర్ గ్రూపువల్ల సభ్యుల మధ్య కాని, తెవికీలోకాని అభిప్రాయబేధాలు రావనడానికి నమ్మకం కలిగించగలమా ?:- ఎందుకు రావు, వస్తాయి. అది ఆరోగ్య సూచకం. అసలు అభిప్రాయ భేదాలు లేకపోతే మనం ఆలోచించడమెందుకు? కాకపోతే, వ్యక్తిగత ద్వేషాలను మనసులో పెట్టుకుని అడ్దగోలు వాదనలు చేస్తే రచ్చ జరిగే అవకాశం ఉంది. దానిపట్ల జాగ్రత్త గానే ఉండాలి. వ్యక్తులపై ఉండే రాగద్వేషాలను పక్కనబెట్టి, లక్ష్యం కోసం పని చేస్తూ ఉంటే రచ్చ జరక్కుండా నివారించుకోవచ్చు.
  • ప్రదిపాదించినవారే బాధ్యత తీసుకుంటామని ఎందుకంటున్నారు ?:- ఈ పని చేస్తానని ముందుకు రావడంలో పవన్ గారికేదో దురుద్దేశం ఉందేమోననే సందేహం నాకైతే లేదు. పవన్ గారు ఈ పని మీద కొంత పరిశోధన చేసారు. అది కూడా డిసెంబరు 17 నాటి సన్నాహక సమావేశంలో పాల్గొన్నవాళ్లం చెప్పాం కాబట్టే చేసారు. 22 నాటి సమావేశంలో ఆయన్ను పాయింట్ పర్సనుగా ఉండమని కూడా కోరాం. అంచేతే ఆయన ఏర్పాటు విషయంలో పని చేస్తానని అంటున్నారు. గతంలో ఆయన వికీమీడియా ఫౌండేషనుతోటి, ఇతర సంస్థల తోటీ పని చేసి ఉన్నారు. ఆయా పద్ధతులు ఆయనకు తెలిసి ఉంటాయి గదా, చెయ్యడం ఆయనకు తేలిక అవుతుంది అని నేనయితే భావించాను. పోనీ ఆ పని ఆయనకు అప్పజెప్పడం మీకు ఇష్టం లేకపోతే ఆ బాధ్యత మీరే తీసుకోండి, పవన్ గారిని పక్కన పెడదాం. మరో సంగతి.. ఇది కేవలం గ్రూపు ఏర్పాటు చేసే ముందు చేసే సన్నాహకాల గురించి మాత్రమే. యూజరు గ్రూపు ఏర్పాటయ్యాక, దాన్ని ఎవరు నడిపిస్తారు అనేది ఇప్పుడు నిర్ణయించలేం, అది గ్రూపు సభ్యులే నిర్ణయిస్తారు.
  • పలువురు ముందుకువస్తే ఇదివరకు పదవులు పొందినవారిని వదిలేయమని చెప్పగలమా ?:- వేరెవరైనా ఈ పని చేసేందుకు ముందుకు వస్తే, సంతోషంగా వాళ్ల వెనక నడుద్దాం.
  • యూజర్ గ్రూపులవల్ల తెవికీకి ప్రయోజనమే తప్ప నష్టమేమీ జరగబోదని నిరూపిస్తే నా మద్దతు తప్పకుండా ఉంటుంది.:- సంతోషం సార్. దీని వలన తెవికీకి నష్టం కలగదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూజరు గ్రూపు తెవికీ బయట చేసే కార్యక్రమాల కోసమే. కాకపోతే ఖచ్చితంగా తెవికీలోని వాడుకరులు మాత్రమే చేసేవి. అది కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ లేని తెవికీ వాడుకరులు మాత్రమే ఇందులో పని చెయ్యాలనేది నా ఉద్దేశం. తెవికీలో మనం చేసే పనులకు ఇది ఏమాత్రం అడ్డంకి కాదు.
__చదువరి (చర్చరచనలు) 08:15, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మరింకోటి కాస్త వివరంగా చెప్తాను. ఈ పాయింట్ పర్సన్‌గా ఉండడం కానీ, యూజర్‌ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులకు కానీ డబ్బులొచ్చే పని కాదు.నిర్వాహక సభ్యత్వం/పాయింట్ పర్సన్ కావడం వల్ల తెలుగు వికీపీడియా ఆన్‌లైన్ ప్రాజెక్టులో ప్రత్యేకించి దక్కే అధికారాలు, హక్కులూ ఏమీ ఉండవు. చదువరి గారన్నట్టు- స్వచ్ఛందంగా దీని మీద పనిచేయదలుచుకున్నవారు ఎవరైనా బాధ్యతలు స్వీకరించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 09:11, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నా సందేహాలకు సమాధానాలిచ్చిన సభ్యులకు ముఖ్యంగా ఓపికతో ఒక్కో సందేహానికి సమాధానమిచ్చిన చదువరి గారికి కృతజ్ఞతలు (దీనివల్ల నాకు కొన్ని సందేహాలు తీరినట్లయింది). ఏ ప్రతిపాదనకైననూ పలువైపుల నుంచి ఆలోచించి ముందే సందేహాలు లేవనెత్తి సందేహనివృత్తి చేసుకోవడం అత్యావశక్యం. ఎలాంటి సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళి బోర్లాపడటం కంటే పలువైపుల నుంచి ఎదురయ్యే సమస్యలను బేరీజు వేసుకొనడం వల్ల భవిష్యత్తు బాటలకు మంచి పునాది ఏర్పడుతుందనేది కాదనలేని సత్యం. ఒక విషయం గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తలూపడం కంటే సందేహాత్మక దృష్టిలో ఆలోచించడం నాకు వృత్తితో పెట్టిన విద్య. గతానుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు గురించి బాగా ఆలోచించినప్పుడే భవిష్యత్తు ప్రగతికి సరైన మార్గం ఏర్పడుతుంది. దీనికై సభ్యులిచ్చే సమాధానాలు తెవికీ సమాజానికి ఇక ముందు కూడా ఎంతో దోహదపడతాయి. సభ్యులు సమాధానం ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు, ఇది తప్పనిసరేమీ కాదు. కాని సభ్యులు చర్చా విషయంపై మాట్లాడటం తప్పి ఇతర సభ్యుల చర్చల ధోరణిపై మాట్లాడటం మాత్రం సరికాదు. ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:24, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ! సందేహాలకు మీరిచ్చిన సమాధానాల ప్రకారం మరోవిషయం కూడా స్పష్టపరుస్తాను. వికీ పదవుల గురించి నేను ఏ మాత్రం ఆశించడం లేదు. ఒకవేళ తీసుకోవాలని ఉద్దేశ్యముంటే నిర్భయంగా, సూటిగా అడుగేవాణ్ణి. తెవికీని సాధ్యమైనంత వరకు అభివృద్ధిపర్చాలనే ఏకైక నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను. నిజం చెప్పాలంటే అప్పట్లో ఇప్పుడున్నట్లు ఎలాంటి పదవులు, ప్రతిఫలాలు, సమావేశాలు తదితరాలు ఏమీ లేవు కూడా. మరింతనిజం చెప్పాలంటే ఇటీవలి కాలంలో కొన్ని చర్చలలో మినహా నేనసలు చురుకుగా లేను కూడా. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు అభిప్రాయాలు

[మార్చు]
ఇప్పటి వరకు జరిగి చర్చలను బట్టి నా అభిప్రాయం తెలుపుచున్నాను. ఏ విషయంమైనా మనం ఆలోచించే దానినిబట్టి మనకు అభిప్రాయాలు ఏర్పడతాయి.అంటే దీని అర్థం మనం ఏదైనా వ్యతిరేఖభావంతో ఆలోచిస్తే అవే ఫలితాలు ఉంటాయని మన మనసులో ఒక దురభిప్రాయం ఏర్పడింది.అదే మంచి భావనతో ఆలోచిస్తే దాని ఫలితాలు మంచిగానే ఉంటాయి.మంచి చెడూ బేరీజు వేయవచ్చు గానీ,కేవలం చెడును గురించి మాత్రమే ఆలోచిస్తే దానికి అర్థంలేదని నాఅభిప్రాయం. భగవద్గీతలో చెప్పినది నీ పని నీవు చేసుకుంటూపో! ఫలితాన్ని గురించి ఆలోచించవద్దని భోధిస్తుంది. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని అవసరంమౌతాయి. ఇవాల్టి పరిస్థితినిబట్టి మనం ఆలోచించకూడదనేది నాఅభిప్రాయం. అభిప్రాయబేధాలు అనేవి ఎప్పుడూ ఏదో ఒక సందర్బంలో ఉంటాయి.అది మానవ సహజం.ఇప్పుడు మాత్రం లేకుండ ఉన్నాయా?అంత మాత్రంచేత ప్రతిపని మానేస్తే మనం సాధించేది ఏమి ఉండదనేది నా అభిప్రాయం.యూజర్ గ్రూపు ఏర్పాటు గురించి తెవికీ 16వ వార్షిక సమావేశంలో మంచి చెడూ గురించి చర్చించాం.యూజర్ గ్రూపు అవసరం అని నేను భావిస్తున్నాను.వికీపీడియా కార్యక్రమాలు పరిశీలనా దృక్పదంతో మరింత నాణ్యతగా జరగటానికి ఇలాంటి గ్రూపు ఉండాలి. వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి ఇది పని చేసేందుకు వికీమీడియా ఫౌండేషను గుర్తింపు పొందిన ఒక అధికారక సంస్థలాగా ఒకటి వికీపీడియాకు అవసరం. అంచేత ఈ యూజర్ గ్రూపు ఏర్పడటానికి అవసరమైన చర్యలు చేపట్టటానికి నేను పూర్తి మద్దతు, అంగీకారం తెలుపుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:27, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, మీకు ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం అంటున్నారు కాబట్టి పరిధి విషయంలో కూడా మీ అభిప్రాయం చెప్పగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:13, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ,యూజర్ గ్రూప్ పరిధి విషయంలో తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూపుగా ఉండాలనే చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:55, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడుగారి జయన్న అభిప్రాయాలు

[మార్చు]

ఇటీవల వికీలో క్రియాశీలంగా లేని నేను ఈ చర్చలో పాల్గొనడం సబబు కానప్పటికీ, వికీ శ్రేయోభిలాషిగా పాల్గొనడం తప్పేమీ కాదనుకుంటా! గణాంకాల మోజులో వాసిలేని రాశి పెరిగిపోతదేమో! అన్న సంశయం ఒక్కటి తప్పించి, తెవికీ యూజర్ గ్రూపు వికీ అభివృద్ధికి దొహదం చేస్తుందే గానీ, నష్టమేమి చేయదని నేను భావిస్తున్నాను.--నాయుడు గారి జయన్న (చర్చ) 17:56, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారూ, చర్చలో పాల్గొనడం తప్పు ఎంత మాత్రమూ కాదు. ఈ గ్రూపు పరిధి పట్ల కూడా మీ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 03:59, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి అభిప్రాయాలు

[మార్చు]

తెలుగు వికీపీడియాకు యూజర్ గ్రూపు కావాలని 2014 నుండి కోరుకుంటున్నా. 2014లో బెంగళూరులో జరిగిన వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశంలో అప్పటికే యూజర్ గ్రూపులను ఏర్పాటుచేసుకున్న ఇతర భాషల సముదాయ సభ్యుల నుండి ఈ విషయమై సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది, తెవికీ సముదాయ సభ్యులతో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. వికీ పురోగతిని అడ్డుకునే దుశ్చర్యలను నిరోధించేందుకు వికీలో ఒక వ్యవస్థ ఉండాలని నా అభిప్రాయం. ఇక పరధి పరంగా చూస్తే తెలుగు వికీపీడియాకు ప్రత్యేకంగా యూజర్ గ్రూపు ఉండాలన్నదానికే నా మొదటి ప్రాధాన్యత.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:15, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]