విద్యా విభాగాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముఖ్యమైన విద్యా విభాగాల జాబితా

[మార్చు]
  • సైటాలజీ: కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం.
  • అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం.
  • ఎకాలజీ: మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం.
  • ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ): మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు. ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం.
  • ఎంబ్రియాలజీ: పిండాభివృద్ధి శాస్త్రం
  • జెనిటిక్స్: జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం.
  • పేలినాలజీ: పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం.
  • పేలియోబోటనీ: వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం.
  • టాక్సానమీ: మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం.
  • మైకాలజీ: వివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం.
  • పాథాలజీ: మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
  • ఫైకాలజీ: ఆల్గేల అధ్యయనం. దీన్నే ఆల్గాలజీ అంటారు.
  • బ్రయాలజీ: బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్‌వార్ట్స్, మాస్).
  • టెరిడాలజీ: ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం.
  • జువాలజీ: ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం.
  • హిస్టాలజీ: కణజాలాల శాస్త్రం.
  • ఎండోక్రైనాలజీ: అంతస్స్రావక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం).
  • ఎంటమాలజీ: కీటకాల అధ్యయన శాస్త్రం.
  • పేలియోజువాలజీ: జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం.
  • ఆర్నిథాలజీ: పక్షుల అధ్యయన శాస్త్రం.
  • హెల్మింథాలజీ: పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం.
  • లెపిడోటెరాలజీ: సీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం.
  • లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం.
  • మయాలజీ: కండరాల అధ్యయన శాస్త్రం.
  • ఓఫియాలజీ: పాముల అధ్యయన శాస్త్రం.
  • మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
  • బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
  • వైరాలజీ: వైరస్‌ల అధ్యయన శాస్త్రం.
  • ఆగ్రోస్టాలజీ: గడ్డి అధ్యయన శాస్త్రం.
  • హైడ్రాలజీ: భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం.
  • హైడ్రోపోనిక్స్: (నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
  • హార్టీకల్చర్: తోటల పెంపకం.
  • ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం.
  • పెడాలజీ: నేలల అధ్యయన శాస్త్రం.
  • విటికల్చర్: ద్రాక్షతోటల పెంపకం.
  • సిల్వీకల్చర్: కలపనిచ్చే చెట్ల పెంపకం.
  • ఇక్తియాలజీ: చేపల అధ్యయన శాస్త్రం.
  • పోమాలజీ: పండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం.
  • ఒలెరీకల్చర్: కూరగాయల పెంపకం.
  • ఎపీకల్చర్: తేనెటీగల పెంపకం.
  • టిష్యూకల్చర్: కణజాలాల సంవర్ధనం.
  • పిసికల్చర్: చేపల పెంపకం.
  • వర్మికల్చర్: వానపాముల పెంపకం.
  • కార్డియాలజీ: మానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • ఆఫ్తల్మాలజీ: మానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.మ్యునాలజీ: మానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం.
  • డెర్మటాలజీ: మానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • హెమటాలజీ: రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
  • గైనకాలజీ: స్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
  • హెపటాలజీ: కాలేయ అధ్యయన శాస్త్రం.
  • పీడియాట్రిక్స్: చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • న్యూరాలజీ: నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం.
  • ఆంకాలజీ: కేన్సర్ అధ్యయన శాస్త్రం.
  • జెరియాట్రిక్స్: వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • రుమటాలజీ: కీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • ఆంజియాలజీ: రక్తనాళాల అధ్యయన శాస్త్రం.
  • పల్మనాలజీ: ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం.
  • క్రేనియాలజీ: మానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం. దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు.
  • నెఫ్రాలజీ: మూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
  • క్రిమినాలజీ: నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం.
  • టాక్సికాలజీ: విషంపై అధ్యయనం చేసే శాస్త్రం.
  • క్రిప్టోగ్రఫీ: రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం.
  • ట్రైకాలజీ: మానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం.
  • థానటాలజీ: మృత్యువుపై అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఆస్ట్రానమీ: ఖగోళ అధ్యయన శాస్త్రం.
  • సీస్మాలజీ: భూకంపాల అధ్యయన శాస్త్రం.
  • లిథాలజీ: శిలల అధ్యయన శాస్త్రం.
  • ఓరాలజీ: పర్వతాల అధ్యయన శాస్త్రం.
  • కాస్మోలజీ: విశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం.
  • సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • మెటియోరాలజీ: వాతావరణ అధ్యయన శాస్త్రం.
  • పోటమాలజీ: నదుల అధ్యయన శాస్త్రం.
  • అకౌస్టిక్స్: ధ్వని అధ్యయన శాస్త్రం.
  • ప్టిక్స్: కాంతి అధ్యయన శాస్త్రం.
  • క్రయోజెనిక్స్: అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం.
  • థియోలజీ: వివిధ మతాల అధ్యయన శాస్త్రం.
  • సోషియాలజీ: సమాజ అధ్యయన శాస్త్రం.
  • డెమోగ్రఫీ: మానవ జనాభా అధ్యయన శాస్త్రం (జననాలు, మరణాల వంటి గణాంకాలు).
  • పెడగాగీ: బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం.
  • ఫిలాటలీ: స్టాంపుల సేకరణ.
  • న్యూమిస్‌మ్యాటిక్స్: నాణేల అధ్యయన శాస్త్రం.
  • లెక్సికోగ్రఫీ: నిఘంటువుల అధ్యయన శాస్త్రం.
  • ఎటిమాలజీ: పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • న్యూమరాలజీ: సంఖ్యా శాస్త్రం.
  • సెఫాలజీ: ఎన్నికల అధ్యయన శాస్త్రం.
  • ఫొనెటిక్స్: భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 05-11-2015 (అధ్యయన శాస్త్రాలు"సాక్షి భవిత"లో)

వెలుపలి లంకెలు

[మార్చు]