వియ్యాలవారి కయ్యాలు (1979 సినిమా)
వియ్యాలవారి కయ్యాలు (1979 తెలుగు సినిమా) | |
సినిమా పాటలపుస్తకం ముఖచిత్రం | |
---|---|
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
తారాగణం | కృష్ణ, జయప్రద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | విష్ణుప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
వియ్యాలవారి కయ్యాలు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నిర్మించబడిన తెలుగు సినిమా. ఇది 1979, ఫిబ్రవరి 24వ తేదీన విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- జయప్రద
- నాగభూషణం
- సూర్యకాంతం
- రావు గోపాలరావు
- ఎస్.వరలక్ష్మి
- పి.ఎల్.నారాయణ
- ఛాయాదేవి
- సత్యేంద్రకుమార్
- జయమాలిని
- సారథి
- సుధామాల
- మాడా
- రాజ్యలక్ష్మి
- కాకరాల
- జూ.భానుమతి
- సి.హెచ్.కృష్ణమూర్తి
- కె.వి.చలం
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
- నిర్మాతలు: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, మాలి రంగయ్య
- సంభాషణలు: జంధ్యాల
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: వెంకట్
- కళ: బి.ఎన్.కృష్ణ
- కూర్పు: ఉమానాథ్
- నృత్యాలు: సీను, తంగప్ప
- స్టంట్: రాఘవులు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్ని సమకూర్చాడు.[2]
- బోడిగుండు బొప్పరాయి గుండు బోల్తా కొట్టింది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఈ కలలోని ఊర్వశీ కలకాని ప్రేయసీ వచ్చాను వలపే నీవనీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- గుటకాయస్వాహా సర్వం గుటకాయ స్వాహా అత్త సొత్తుకే అల్లుడి దానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పాలు పొంగే వయసే నీది పంచదార మనసే నాది కలుపుకుంటే కమ్మగుంటదిలే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది - పి.సుశీల
- లోకాలేలే నూకాలమ్మా మేలుకో మమ్మేలుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
కథా సంగ్రహం
[మార్చు]శారద ఇంటర్ విద్యార్థిని. శేఖర్ బి.ఎ.విద్యార్థి. టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. అతడిని టేబుల్ టెన్నిస్ ఆటలో శారద ఓడిస్తుంది. ఓ రోజు శారదను ఓ ఆకతాయి ఏడిపిస్తుండగా శేఖర్ అడ్డుపడతాడు. తత్ఫలితంగా ఇద్దరి మనసులు కలుస్తాయి. శారద తల్లిదండ్రులు దుర్గమ్మ, హరిప్రసాదరావులు పల్లెటూరిలో ఉంటారు. శేఖర్ పట్నంలోని లాయర్ మాధవరావు, భాగ్యలక్ష్మిల ముద్దుల కొడుకు. దుర్గమ్మ వంశంలో గత ఆరు తరాలుగా ఇల్లరికం రావడం ఆనవాయితీగా ఉంది. ఆ కారణంతో శారదకు ఓ ఇల్లరికపుటల్లుణ్ణి తెమ్మని హరిప్రసాదరావును పోరి పట్నం పంపిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Viyyalavaari Kaiyalu". indiancine.ma. Retrieved 30 June 2021.
- ↑ జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (1979). వియ్యాల వారి కయ్యాలు పాటలపుస్తకం. p. 12. Retrieved 30 June 2021.