Jump to content

వి.ఆర్.వి. సింగ్

వికీపీడియా నుండి
వి.ఆర్.వి.సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1984-09-17) 1984 సెప్టెంబరు 17 (వయసు 40)
చండీగఢ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm ఫాస్ట్ మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 2
చేసిన పరుగులు 47 8
బ్యాటింగు సగటు 11.75 8.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 29 8
వేసిన బంతులు 669 72
వికెట్లు 8 0
బౌలింగు సగటు 53.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/48
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/–
మూలం: CricInfo, 2008 జనవరి 7

విక్రమ్ రాజ్ వీర్ సింగ్ (జననం 1984 సెప్టెంబరు 17), భారత క్రికెట్ జట్టులో ఆడిన మాజీ భారతీయ క్రికెటర్. అతను కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు. గత దశాబ్దంలో భారతదేశం సృష్టించిన కొద్దిమంది నిజమైన ఫాస్ట్ బౌలర్లలో అతను ఒకడు.[1] 2005లో శ్రీలంకతో ఆడేందుకు భారత జట్టులోకి పిలిచిన తర్వాత, అతను ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో అతన్ని తొలగించారు. అతను చివరగా జంషెడ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. అతను 2006 జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆడడం మొదలుపెట్టి, 2019 మార్చిలో అతను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[2] 2019 ఆగస్టులో BCCI, చండీగఢ్ కోసం ప్రత్యేక క్రికెట్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్ అని పేరు పెట్టింది. వీఆర్‌వీ సింగ్‌ను అందులో కోచ్‌గా నియమించారు.[3]

జీవితం తొలి దశలో

[మార్చు]

సింగ్ చండీగఢ్‌లో జన్మించాడు. ఫాస్ట్ బౌలరుగా సింగ్‌, అదనపు పేస్ కోసం ఖచ్చితత్వంతో రాజీ పడ్డాడు. అతను 2003/04 రంజీ ట్రోఫీ సీజన్‌లో పంజాబ్ తరపున అరంగేట్రం చేసి, పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తున్నాడు. పంజాబ్ మాజీ కోచ్, భూపిందర్ సింగ్ సీనియర్ ప్రకారం, "అతను ధ్యేయం వేగంగా బౌలింగ్ చేయడమే, అతనికి వేరే వాటి గురించి పట్టింపులేమీ లేవు".[4] 2004లో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో సింగ్‌, భారతదేశం తరపున ఆడాడు, కానీ బంతితో నిరాశపరిచాడు. అతని ఏకైక మ్యాచ్‌లో ఐదు ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత అతను బోర్డర్-గవాస్కర్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నాడు. దాని ద్వారా ఆస్ట్రేలియాలోని క్రికెట్ అకాడమీలలో శిక్షణ పొందాడు.[5] అతనితో స్కాలర్‌షిప్ పొందిన RP సింగ్ కూడా ఆ తరువాత భారతదేశం తరపున ఆడాడు.

దేశీయ కెరీర్

[మార్చు]

సింగ్ తన దేశీయ కెరీర్‌ను పంజాబ్ క్రికెట్ జట్టుతో రంజీ ట్రోఫీ పరిమిత ఓవర్ల వెర్షన్‌లో ప్రారంభించాడు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో వికెట్ తీసుకోలేక పోయాడు. ట్రోఫీ ఫస్ట్ క్లాస్ వెర్షన్‌లో పంజాబ్ తరపున అరంగేట్రం చేసినప్పుడు, 6 మ్యాచ్‌లలో 21.00 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు.[6] అయితే, వన్‌డేలలో 4 మ్యాచ్‌లలో 109 పరుగులతో ఆకట్టుకోలేకపోయాడు.[7] అయినప్పటికీ, అతను తన రాష్ట్రం కోసం కేవలం 5 వన్‌డేలే ఆడినప్పటికీ, శ్రీలంకతో జరిగిన భారత వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో తిరిగి దేశీయ సర్క్యూట్‌కు పంపబడ్డాడు.[8] అతను 2005-06 వన్‌డే రంజీ ట్రోఫీ సీజన్‌లో తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని, 4 మ్యాచ్‌లలో 20.75 సగటుతో, 4 వికెట్లు తీసుకున్నాడు.[9]

సింగ్ తన పేస్‌తో చాలెంజర్ ట్రోఫీలో చాలా మందిని ఆకట్టుకున్నాడు. టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన ఆటగాడతడు. అతను ఇండియా A తరపున ఆడి, కొన్ని వికెట్లు తీసుకున్నప్పుడు అతన్ని, VVS లక్ష్మణ్ "భారతదేశంలో అత్యంత వేగవంతమైన బౌలర్" అని, జవగల్ శ్రీనాథ్ "ప్రస్తుతం అత్యంత వేగవంతమైన బౌలర్" అని పేర్కొన్నారు.[10] అతను వెస్టిండీస్ పేస్ బౌలింగ్ గ్రేట్ ఇయాన్ బిషప్‌ను కూడా ఆకట్టుకున్నాడు. అతను ప్రతి గేమ్‌తోనూ మెరుగుపడుతున్నాడని, భారతదేశానికి మంచి ఫాస్ట్ బౌలరుగా అభివృద్ధి చెందుతున్నాడని చెప్పాడు.[11]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2006 సీజన్‌లో ఇంగ్లండ్ భారత పర్యటనలో ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టులో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడేందుకు సింగ్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత సిరీస్‌లో భారత జట్టు తరపున తన తొలి వన్‌డే ఆడాడు. అదే సిరీస్‌లో ఇండోర్‌లో మళ్లీ ఇంగ్లండ్‌తో ఆడాడు. మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ ఉండటంతో అతను వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను ఆడిన రెండు వన్డే మ్యాచ్‌లలో వికెట్లు తీయలేదు. [1]

సింగ్, వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడి రెండు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో కూడా రెండు టెస్టులు ఆడి, మరో 2 వికెట్లు సాధించాడు. [1]

గాయం, పునరాగమనం

[మార్చు]

గాయాలు VRV సింగ్‌ను దెబ్బతీశాయి. కింగ్స్ XI పంజాబ్ కోసం కొన్ని IPL మ్యాచ్‌లు ఆడినప్పటికీ, 2008 నుండి 2012 వరకు పంజాబ్ కోసం ఒక్క దేశీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. నెట్స్, క్లబ్‌ల స్థాయిలో మొదలుపెట్టి, పూర్తి ప్రక్రియ ద్వారా మళ్లీ రాష్ట్ర జట్టుకు వెళ్లవలసి వచ్చింది. 2012 మార్చిలో సింగ్, అస్సాంకు వ్యతిరేకంగా తన T20 పునరాగమనం చేసాడు.[12] ఐదు టీ20లు ఆడి మళ్లీ కనిపించకుండా పోయాడు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, అతను 2013 నవంబరులో హర్యానాకు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు. ఆ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకున్నాడు. [13]

కోచింగ్ కెరీర్

[మార్చు]

2019 ఆగస్టులో BCCI, చండీగఢ్ కోసం ప్రత్యేక క్రికెట్ సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్ అని పేరు పెట్టింది. వీఆర్‌వీ సింగ్‌ను అందులో కోచ్‌గా నియమించారు. [3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Alter, Jamie. "Crincinfo Player Profile : Vikram Singh". Cricinfo. Retrieved 2006-12-27.
  2. "Former India pacer VRV Singh brings curtains down on 'incomplete career'". ESPN Cricinfo. Retrieved 13 March 2019.
  3. 3.0 3.1 "Chandigarh to feature in Ranji Trophy with VRV Singh as coach". Sportstar. 14 August 2019. Retrieved 16 August 2019.
  4. Vaidyanathan, Siddhartha. "VRV Horsepower". Cricinfo. Retrieved 2006-12-27.
  5. "Three Indian juniors to visit Australian academy". Cricinfo. Retrieved 2006-12-27.
  6. "Ranji Trophy Statistics – 2004/05". Cricinfo. Retrieved 2006-12-27.
  7. "Ranji Trophy ODI Statistics – 2004/05". Cricinfo. Retrieved 2006-12-27.
  8. "Yadav in for injured VRV". Cricinfo. Retrieved 2006-12-27.
  9. "Ranji Trophy Statistics – 2005/06". Cricinfo. Retrieved 2006-12-27.
  10. "Hindustan Times Cricket Profile – Vikram Singh". Hindustan Times. Archived from the original on 8 November 2006. Retrieved 2006-12-27.
  11. "VRV looks a good prospect – Bishop". Cricinfo. Retrieved 2006-12-27.
  12. "VRV Singh returns, tougher and still hungry". Cricinfo. 2012-03-30. Retrieved 2013-11-30.
  13. "VRV Singh hopes to build on comeback". Cricinfo. 2012-03-30. Retrieved 2012-03-30.