వేకనూరు

వికీపీడియా నుండి
(వెకనూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వేకనూరు
—  రెవిన్యూ గ్రామం  —
వేకనూరు is located in Andhra Pradesh
వేకనూరు
వేకనూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°58′50″N 80°55′25″E / 15.980693°N 80.923539°E / 15.980693; 80.923539
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ సైకం బాబూరావు
జనాభా (2011)
 - మొత్తం 4,963
 - పురుషులు 2,548
 - స్త్రీలు 2,415
 - గృహాల సంఖ్య 1,471
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

వేకనూరు, కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 121., యస్.టీ.డీ.కోడ్= 08671. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నాగాయలంక, మోదుమూడి, అవనిగడ్డ, మాచవరం, మోపిదేవిలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 67 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన దివ్బంగత విశ్వనాధుని బసవయ్య, ఈ పాఠశాలకు కావలసిన భూమిని విరాళంగా అందజేసినారు. [20]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

అంగనవాడీకేంద్రo[మార్చు]

వేకనూరు గ్రామంలోని అక్కారావుపేటలో, అంగనవాడీకేంద్ర భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ మాదివాడ వీరరాఘవయ్య, శ్రీ మాదివాడ వెంకటేశ్వరరావులు వితరణగా సమకూర్చారు. అక్కారావుపేట ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా రహదారి ప్రక్కనగల ఒక లక్ష రూపాయల విలువచేసే 3.20 సెంట్ల స్థలాన్ని వారి పెద్దలు శ్రీ మాదివాడ కోటయ్య, శ్రీ మాదివాడ సూర్యనారాయణ గారల పేరిట, అంగనవాడీ భవన నిర్మాణానికి అందించారు. [7]

మాదివాడ అంకినీడు సంపూర్ణమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి అవసరమైన నాలుగు లక్షల రూపాయల విలువైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ మాదివాడ వెంకటేశ్వరరావు, ఆయన సోదరి, వారి తల్లిదండ్రులు శ్రీ మాదివాడ అంకినీడు, సంపూర్ణమ్మల పేరిట సమకూర్చారు. గత సంవత్సరం శంకుస్థాపన నిర్వహించిన ఈ కేంద్రానికి ఇంతవరకు రు.58.19 లక్షలు ఖర్చు చేసారు. ఈ భవనం నిర్మాణం పూర్తిచేసికొని ప్రారంభమైనది. [13]&[16]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలెం, మోదుమూడి, వేకనూరు, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, సుమారు 8 సంవత్సరాల క్రితం, అవనిగడ్డ సంఘంలో విలీనం చేసారు. [14]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామస్థులైన శ్రీ గుడివాక అంజిబాబు, జన్మించిన గ్రామంపై మమకారంతో, ఏడు లక్షల రూపాయల వ్యయంతో, గుడివాక అంజిబాబు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన ఒక ఆర్.వో.ప్లాంట్ ను, 2016, ఏప్రిల్-28న ప్రారంభించారు. రక్షిత మంచినీటి చెరువు నుండి గొట్టపు మార్గం ద్వారా ఆర్.వో.ప్లాంటుకు నీటి సరఫరా జరిగేలాగా ఏర్పాటు చేసారు. ఈ నీటికి ఖనిజ లవణాలను మిశ్రమం చేసి, సురక్షితమైన త్రాగునీటిని హ్రామస్థులకు అందజేయుచున్నారు. [18]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

దేవుడి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. గాజులవారిపాలెం, గుడివాకవారిపాలెం గ్రామాలు, వేకనూరు గ్రామానికి శివారు గ్రామాలు.
 2. వేకనూరు పంచాయితీ సర్పంచులుగా పనిచేసిన వారు.
పేరు ఆరంభము ముగింపు పార్టీ
సైకం బాబూరావు 2013 జూలై - - ?
 1. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చాట్రగడ్డ నాంచారమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ తుంగల మురళీకృష్ణ ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారి ఆలయం:- 2016, ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారంనాడు, రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో, వేదపండితుల ఆధ్వర్యంలో, స్వామివారి శాంతికళ్యాణం ఆగమపండితులు, ఋత్విక్కుల మంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా నిర్వహించారు. [15]
 2. శ్రీ గంగా పార్వతీ సమేత ఉభయముక్తేశ్వరస్వామి ఆలయం:- ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ముందురోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించెదరు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. తరువాత భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.[3]
 3. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, 2014, మే-17,18 తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రామాలకొరకై ఆలయంలో భక్తుల సౌకర్యార్ధమై, చలువ పందిళ్ళు వేసినారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు[4].
 4. శ్రీ రామాలయం:- ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో, రామాలయం పునర్నిర్మాణం జరుగుచున్నది[5].
 5. శ్రీ భూసమేత సంతాన వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి శనివారంనాడు, గ్రామస్థుల సహకారంతో, భక్తులకు ఉచిత భోజనసౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖపౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [17]&[19]
 6. శ్రీ ప్రసన్న గుర్రాలమ్మ తల్లి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో కొలువైయున్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖపౌర్ణమికి కన్నుల పండువగా నిర్వహించెదరు. [8]
 7. శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం:- రజకుల ఇలవేలుపైన ఈ అమ్మవారి వార్షిక ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖపౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. [8]
 8. శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం:- మాదివాడ వంశీకుల ఇలవేలుపైన ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు,, ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి, వైశాఖపౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరను, 2015వ సంవత్సరంలో, మేనెల రెండవ తేదీనుండి ప్రారంభించారు. [8]
 9. శ్రీ అమ్మగారమ్మ అమ్మవారి ఆలయం:- వేకనూరు గ్రామంలోని తుంగల వంశస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా, 2015, ఆరవతేదీ శనివారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 7-44 గంటలకు శ్రీ శ్రవణా నక్ష్త్రయుక్త మిధునలగ్న పుష్కరాంశమందు, అమ్మవారికి పవిత్ర కృష్ణానదీ తీరాన పుణ్యస్నానార్చనలు, గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి, నైవేద్యాల సమర్పణ, గుడి సంబరంతోపాటు భారీగా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

 1. వేకనూరు గ్రాములోని కొత్తూరులో, శ్రీ మాదివాడ వెంకటేశ్వర్లు అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఈయన ఇంతవరకూ రాగిసంకటి తింటూ, వ్యవసాయపనులు చేసుకుంటూ జీవించుచున్నారు. ఈయన 2014, జూలై-24వతేదీ ఉదయం, తన 103వ ఏట, ఆకస్మాత్తుగా కాలంచేసారు. [5]
 2. ఈ గ్రామానికి చెందిన శ్రీ భోగాది రామదాసు, జ్యోతి దంపతుల కుమార్తె గోదా పల్లవి, హైదరాబాదులో మార్చి-2015లో 10వ తరగతి పరీక్షలు వ్రాసినది. 2015, మే-17వ తీదీనాడు, తెలంగాణా రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించాగా, ఈమె 10/10 జి.పి.ఏ. సాధించి, తన తల్లిదండ్రులకూ, గ్రామానికీ పేరు తెచ్చింది. [10]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5429.[6] ఇందులో పురుషుల సంఖ్య 2755, స్త్రీల సంఖ్య 2674, గ్రామంలో నివాస గృహాలు 1481 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1524 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,963 - పురుషుల సంఖ్య 2,548 - స్త్రీల సంఖ్య 2,415 - గృహాల సంఖ్య 1,471

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Vekanuru". Retrieved 26 June 2016. External link in |title= (help)
 3. కృష్ణా/అవనిగడ్డ, 9-9-13, 1వ పేజీ: 5-10-13,2వ పేజీ.
 4. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-19; 3వ పేజీ
 5. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2,మార్చ్-2014; 3వ పేజీ
 6. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లంకెలు[మార్చు]

[5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-25; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-10; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-29; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-3; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-16; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-18; 2వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-8; 1వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-19; 3వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-7; 44వపేజీ. [15] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-15; 1వపేజీ. [16] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-17; 2వపేజీ. [17] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-1; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-9; 2వపేజీ. [19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-21; 2వపేజీ. [20] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఆగస్టు-21; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=వేకనూరు&oldid=2864570" నుండి వెలికితీశారు