Coordinates: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E / 16.35; 79.3667

వెల్దుర్తి (పల్నాడు జిల్లా)

వికీపీడియా నుండి
(వెల్దుర్తి(గుంటూరు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెల్దుర్తి
—  రెవెన్యూ గ్రామం  —
వెల్దుర్తి is located in Andhra Pradesh
వెల్దుర్తి
వెల్దుర్తి
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E / 16.35; 79.3667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం వెల్దుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ చంద్రయ్య
జనాభా (2001)
 - మొత్తం 4,938
 - పురుషుల సంఖ్య 2,454
 - స్త్రీల సంఖ్య 2,484
 - గృహాల సంఖ్య 1,176
పిన్ కోడ్ 522613
ఎస్.టి.డి కోడ్ 08642

వెల్దుర్తి పల్నాడు జిల్లాలోని ఒక మండలం.ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1218 ఇళ్లతో, 4552 జనాభాతో 4705 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2282, ఆడవారి సంఖ్య 2270. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1200 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 392. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589818.[1]

సమీప గ్రామాలు[మార్చు]

శిరిగిరిపాడు 5 కి.మీ, గొట్టిపాళ్ళ 9 కి.మీ, మందడి 9 కి.మీ, ముటుకూరు 12 కి.మీ, కండ్లకుంట 12 కి.మీ.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోను, ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 2013 లో వజ్రోత్సవాలు నిర్వహించారు.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

వెల్దురి గ్రామ ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి కూచిపూడి నళిని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం అందుకున్నారు.

శాఖ గ్రంథాలయం[మార్చు]

వెల్దుర్తి గ్రామములో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని, 2015,డిసెంబరు-21వ తేదీనాడు, డాక్టర్ త్రివేది ప్రారంభించారు. ఈ గ్రంథాలయ నిర్మాణానికి, ఈ గ్రామానికి చెందిన శ్రీ పులుసు నర్సిరెడ్డి కుమారుడు సాంబశివారెడ్డి సహకారం అందజేసినారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వెల్దుర్తిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు,ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో ఒక ప్రభుత్వేతర వైద్య సౌకర్యం ఉంది. ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది. జెర్రివాగు త్రాగునీటి పథకం ద్వారా త్రాగునీరు లభిస్తోంది.

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

.స్థానిక నాయకుడు, తన స్వంత ట్రాక్టర్, తన పొలంలో వేయించిన గొట్టపు బావి (బోరు) ద్వారా, నెలకు ఒక రూపాయల వ్యయంతో, గ్రామస్థులకు త్రాగునీరందించుచున్నారు. ఈయన స్వయంగా తన ట్రాక్టరును తనే స్వయంగా నడుపుకుంటూ వచ్చి గ్రామస్థులకు నీటిని అందించడం విశేషం. ఇంతే గాకుండా ఈయన పొలంలో వేసిన గొట్టపు బావి ద్వారా, మండలంలోని ఉప్పలపాడు, వెల్దుర్తి, శిరిగిరిపాడు, బోదిలవీడు, గుండ్లపాడు గ్రామాలవారే గాక, దుర్గి మండలంలోని ముటుకూరు, శివలింగాపురం, పట్టవీడు, ఎర్రపాలెం గ్రామాలవారు ఇక్కడ తమ ట్రాక్టర్ల ద్వారా నీటిని తమ గ్రామాలకు తరలించుకొని పోవుచున్నారు. ప్రతి రోజు ఇక్కడ నుండి 100 ట్రాక్టర్ల నీటిని తరలించుకొనిపోవుచున్నారు.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వెల్దుర్తిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది.సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్,వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వెల్దుర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1214 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2539 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 122 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 146 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 129 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 318 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 236 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 236 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వెల్దుర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • చెరువులు: 236 హెక్టార్లు

మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంక్

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చంద్రయ్య సర్పంచిగా ఎన్నికైనాడు

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

దివి రంగనాధాచార్యుల - ఇతను ఈ వెనుకబడిన ప్రాంతానికి వైద్యులుగా వచ్చి ప్రజానాడి తెలుసుకొని, విద్యాభివృద్ధికి బీజాలు వేశారు. 35 ఏళ్ళుగా డాక్టరుగా పేదలకు సేవచేయడం తోపాటు, వెల్దుర్తి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఉపాధ్యాయునిగా ఎటువంటి వేతనం లేకుండా కొంతకాలం పనిచేశారు. పాఠశాల భవనాలునిర్మించారు. ఆటస్థలం కోసం ఆరు ఎకరాల స్థలం సమకూర్చారు. ఆసుపత్రి కోసం 32 సెంట్ల స్థలం ఉచితంగా అందజేశారు. గ్రంథాలయం కోసం 32 సెంట్ల స్థలంలో భవనాన్ని నిర్మించి ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి గారిచే ప్రారంభింపజేశారు. 1962 లోనే పశువుల ఆసుపత్రికి 28 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. హరిజన కాలనీలకు స్థలాల కేటాయింపు, దేవాలయాల పునరుద్ధరణకు వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాడులలో నిధులిచ్చారు. శ్రీ సత్యసాయి సేవాసమితి ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 1974 లో ఈయనకు "దేశబంధు" అను బిరుదును ప్రదానం చేశారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".