వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-50వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజాత

సుజాత (డిసెంబర్ 10, 1952 – ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె శ్రీలంక లో పుట్టి పెరిగింది. జన్మస్థలం కేరళ లోని మరదు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి.

సుజాతను దాసరి నారాయణరావు గారు తెలుగులో గోరింటాకు (1979 సినిమా) చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా అధారంగా తయారయిన సంధ్య (కోదండరామి రెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీ లో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. అంతులేని కథ తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.

ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంక లో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే తబస్విని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన అవళ్‌ ఒరు తొడర్‌ కథై (తెలుగులో అంతులేనికథ )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లిచేసుకొంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి (సినిమా) చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డు అందుకున్నారు.

కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

సినిమాలు[మార్చు]

చిత్ర సౌజన్యం: http://expressbuzz.com/entertainment/tamil/actress-sujatha-dies-of-heart-attack/263410.html