వైశాలి కాసరవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైశాలి కాసరవల్లి
జననం(1952-04-12)1952 ఏప్రిల్ 12
మరణం2010 సెప్టెంబరు 27(2010-09-27) (వయసు 58)
జీవిత భాగస్వామి
(m. 1978⁠–⁠2010)
పిల్లలుఅపూర్వ (కుమారుడు)
అనన్య (కుమార్తె)

వైశాలి కాసరవల్లి (1952, ఏప్రిల్ 122010, సెప్టెంబరు 27) కర్ణాటకకు చెందిన సినిమా నటి, టెలివిజన్ సీరియల్ దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్.[1] 1997లో తాయ్ సాహెబ్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

జననం, విద్య

[మార్చు]

వైశాలి 1952, ఏప్రిల్ 12న నాటకరంగ ప్రముఖులైన డాక్టర్ చితాగోపి - నిర్మల దంపతులకు కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించింది. బీఏ చదువు పూర్తిచేసింది.[2]

వృత్తి జీవితం

[మార్చు]

నటిగా

[మార్చు]

బివి కారంత్ రూపొందించిన నాటకం ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టింది. తన కుటుంబం బెంగుళూరుకు వలస వెళ్ళిన హయవదన, జోకుమారస్వామి, మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, నాటకాకార ష్ధనేయల్లి ఆరు పత్రాలు, అనేక ఇతర నాటకాలలో నటించింది. సేవంతి ప్రసంగ అనే నాటకానికి దర్శకత్వం వహించింది. మరాఠీ, హిందీ నుండి అనేక క్లాసిక్ రచనలను కన్నడ భాషలోకి అనువదించింది.

1972లో వచ్చిన యావ జన్మద మైత్రి అనే సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. 1974లో ప్రొఫెసర్ హుచూరయ్య సినిమాలో నటించింది. ఆ తరువాత అక్రమ, యరిగు హెల్బేడి, కిట్టు పుట్టు, కుబి మత్తు ఇయాల, అంగయిల్లి అప్సరే, క్రౌర్య, హోంబిసిలు, స్వామి, తబరన కథే, క్షీర సాగర, అనుకోలకోబ గండ, ఆసెగొబ మీసెగొబ్బ, మూరు చంద్రాస దారీగలు, మహాదాస, బస్సా దారీగలు, మహాదాస, బస్సొదారి పాన్ హూవొందు బేకు బల్లిగే, విఘ్నేశ్వరన వాహనం, శంకర్ గురు, పాలితంశ, పరివర్తన, స్పర్శ, నిగత, గణేశన మదువే, గౌరీ గణేశ, తవరుమనే ఉడుగోరే, నం 73 శాంతినివాస వంటి జనాదరణ పొందిన సినిమాలలో నటించింది. గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన అక్రమణలో ప్రధాన పాత్రలో నటించి ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా గెలుచుకుంది.

టిఎస్ నాగభరణ దర్శకత్వం వహించిన నమ్మ నమ్మి అనే సీరియల్‌లో తొలిసారిగా నటించింది. నమ్మ నమ్మల్లి, కాస ముసురే సరోజ, మాల్గుడి డేస్, క్షమయ దరిత్రి, మాయామృగ, మన్వంతర, సాధనే సహా అనేక టెలి-సీరియల్స్‌లో కూడా వైశాలి నటించింది.[3]

సినిమాలు

[మార్చు]
 • 1972 యావ జన్మద మైత్రి (నటి)
 • 1972 సుభద్ర కళ్యాణ (నటి)
 • 1974 ప్రొఫెసర్ హుచ్చురయ్య (నటి)
 • 1974 ఏరడు కనసు (నటి)
 • 1974 భూతయ్యన మగ అయ్యు (నటి)
 • 1974 బంగారద పంజర (నటి)
 • 1976 ఫలితంష (నటి)
 • 1976 పరివర్తనే (నటి)
 • 1977 కిట్టు పుట్టు (నటి - గౌరి)
 • 1978 సందర్భ (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 1978 శంకర్ గురు (నటి)
 • 1978 హోంబిసిలు (నటి - డాక్టర్ వాసంతి)
 • 1978 గీజగాన గూడు (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 1980 వాత్సల్య పథ (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 1980 అక్రమ (నటి)
 • 1982 మానస సరోవర (నటి)
 • 1983 అన్వేషనే (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 1984 విఘ్నేశ్వర వాహన (నటి)
 • 1985 మారుతీ మహిమే (నటి)
 • 1985 మమతేయ మడిలు (నటి)
 • 1986 హెన్నే నినాగేను బంధన (నటి)
 • 1988 చిరంజీవి సుధాకర్ (నటి)
 • 1988 తబరణ కథే (నటి)
 • 1988 మహాదాసోహి శరణ బసవ (నటి)
 • 1988 కడినా బెంకి (నటి)
 • 1989 మనే (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 1989 బంగారు బడుకు (నటి)
 • 1990 శృతి (నటి)
 • 1990 హోసా జీవన (నటి)
 • 1990 గణేశన మదువే (నటి- సత్యభామ/గణేశ తల్లి)
 • 1990 అభిమన్యు (నటి)
 • 1990 ఆసెగొబ్బ మీసగొబ్బ (నటి)
 • 1991 తవరుమనే ఉడుగోరే (నటి)
 • 1991 రెడీమేడ్ గండ (నటి)
 • 1991 మాంగల్య (నటి)
 • 1991 కల్యాణ మంటపం (నటి)
 • 1991 గౌరీ కళ్యాణ (నటి)
 • 1991 గౌరీ గణేశ (నటి - చంద్రమౌళి తల్లి)
 • 1992 అమర ప్రేమ (నటి)
 • 1992 కుబి మత్తు ఇయాల (నటి, కాస్ట్యూమ్)
 • 1992 క్షీర సాగర (నటి)
 • 1992 హతమారి హెన్ను కిలాడి గండు (నటి)
 • 1992 గూండా రాజ్య (నటి)
 • 1992 గణేశ సుబ్రమణ్య (నటి)
 • 1992 బెల్లియప్ప బంగారప్ప (నటి)
 • 1992 అగ్ని పంజర (నటి)
 • 1993 నానెందు నిమ్మవనే (నటి)
 • 1993 మణికంఠన మహిమే (నటి)
 • 1993 కాదంబరి (నటి)
 • 1993 హూవొండు బేకు బల్లిగే (నటి)
 • 1993 అనురాగడ అలెగలు (నటి)
 • 1993 అంగయ్యల్లి అప్సరే (నటి)
 • 1994 యరిగి హెల్బేడి (నటి)
 • 1995 నిఘాతా (నటి)
 • 1995 హోసా బదుకు (నటి)
 • 1996 సౌభాగ్య దేవతే (నటి)
 • 1996 హలో డాడీ (నటి)
 • 1996 అమెరికా అమెరికా (నటి)
 • 1996 క్రౌర్య (అసోసియేట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైన్)
 • 1997 తాయి సాహెబ్ (కాస్ట్యూమ్ డిజైన్)
 • 1997 ప్రేమ రాగ హడు గెలాతి (నటి)
 • 1997 కళావిడ (నటి)
 • 1999 చంద్రముఖి ప్రాణసఖి (నటి)
 • 2000 శ్రీరస్తు శుభమస్తు (నటి)
 • 2000 ప్రేమి (నటి)
 • 2002 ద్వీప (కాస్ట్యూమ్)
 • 2003 పాంచాలి (నటి)
 • 2003 రాంగ్ నంబర్ (నటి)
 • 2006 సావిర మెట్టిలు (నటి)
 • 2007 నం. 73, శాంతి నివాస (నటి - సీతాదేవి)
 • 2007 నయీ నేరాలు (డబ్బింగ్ ఆర్టిస్ట్)
 • 2010 కనసెంబో కుదురేయనేరి (కాస్ట్యూమ్)

దర్శకురాలిగా

[మార్చు]

'ముత్తిన తోరణ', 'మూడలా మనే' అనే ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్ కి దర్శకత్వం వహించింది.

కాస్ట్యూమ్ డిజైనర్ గా

[మార్చు]

తన భర్త గీరీష్ కాసరవల్లి తీసిన బన్నాడ వేష, మనే, కుబి మత్తు ఇయ్యాల, క్రౌర్య, తాయ్ సాహెబ్ (1998లో జాతీయ అవార్డు గెలుచుకుంది), ద్వీప, కనసెంబ కుదురయనేరి వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.

అవార్డులు

[మార్చు]

వైశాలి పలు సన్మానాలు అందుకున్నారు

రాజకీయం

[మార్చు]

90వ దశకం చివరిలో రాజకీయాల్లోకి వచ్చిన వైశాలి, 1996లో బెంగుళూరు సిటీ కార్పొరేషన్ ఎన్నికలకు లోక్ శక్తి పార్టీ నుండి పోటీచేసి ఓడిపోయింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వైశాలి ప్రముఖ సినీ నిర్మాత గిరీష్ కాసరవల్లిని వివాహం చేసుకున్నది. వారికి ఒక కుమారుడు (అపూర్వ కాసరవల్లి), ఒక కుమార్తె (అనన్య కాసరవల్లి) ఉన్నారు.

మరణం

[మార్చు]

మధుమేహం, కాలేయం, మూత్రపిండాల సమస్యలతో 2010, సెప్టెంబరు 27న బెంగళూరులో మరణించింది.[1]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "Vaishali Kasaravalli passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2010-09-27. Retrieved 2023-03-25.
 2. "Actor-director Vaishali Kasaravalli passes away - Times Of India". web.archive.org. 2012-11-03. Archived from the original on 2012-11-03. Retrieved 2023-03-25.
 3. "Vaishali Kasaravalli passes away". The New Indian Express. Retrieved 2023-03-25.

ఇతర లింకులు

[మార్చు]