Jump to content

శంఖపుష్పం

వికీపీడియా నుండి
(శంఖపుష్పము నుండి దారిమార్పు చెందింది)

శంఖపుష్పం
Clitoria ternatea vine
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. ternatea
Binomial name
Clitoria ternatea

శంఖపుష్పం (Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.[1] విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.

ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.

Side view of the flower at Kolkata, West Bengal, India
Flower and pods in different states of ripeness

పేర్లు

[మార్చు]

ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు "క్లిటోరియా (Clitoria)" క్లిటోరిస్ "(Clitoris)". (Synonyms: Clitoris principissae.) నుండి ఉత్పన్నమైనది.[2] టెర్నేటియా ("Ternatea") ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్ (Ternate) నుండి వచ్చింది. తమిళం, తెలుగు, మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది.

ఉపయోగాలు

[మార్చు]
  • శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
  • భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
  • శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.[3]
  • దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[4]
  • దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
  • దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
  • ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకంగా వాడుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. గిరికర్ణిక - శంఖపుష్పము, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 89.
  2. Pharmacopia Indica Awl
  3. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Mukherjee PK, Kumar V, Kumar NS, Heinrich M"The Ayurvedic medicine Clitoria ternatea-From traditional use to scientific assessment." J Ethnopharmacol. 2008 Sep 20;

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.