శశి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శశి
Sashi Movie Poster.jpg
శశి సినిమా పోస్టర్
దర్శకత్వంనడికట్ల శ్రీనివాస్ నాయుడు
దృశ్య రచయితమణికుమార్ చినిమిల్లి
ఐ. రవి (మాటలు)
కథనడికట్ల శ్రీనివాస్ నాయుడు
నిర్మాతఆర్.పి. వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు
తారాగణంఆది
సురభి
రాశి సింగ్
రాజీవ్ కనకాల
అజయ్
ఛాయాగ్రహణంఅమరనాథ్ బొమ్మిరెడ్డి
కూర్పుజి. సత్య
సంగీతంఅరుణ్ చిలువేరు
నిర్మాణ
సంస్థ
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
19 మార్చి, 2021
సినిమా నిడివి
131 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శశి, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా.[1][2] శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానరులో ఆర్.పి. వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి నడికట్ల శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆది, సురభి, రాశి సింగ్, రాజీవ్ కనకాల, అజయ్ నటించగా, అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చాడు.[3][4]

కథా నేపథ్యం[మార్చు]

ఎవ‌రి మాటా లెక్క‌చేయ‌కుండా త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉండాల‌నుకునే వ్యక్తి రాజ్ కుమార్ (ఆది). ప్రతిక్షణం సిగరెట్లు, మందు తాగుతుంటాడు. రాజ్ అన్నయ్య (అజ‌య్) ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, తన త‌మ్ముడిలో మార్పు కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోడు. ఎంత ప్ర‌య‌త్నించినా రాజ్‌ ప్రవర్తనలో మార్పురాదు. అలాంటి సందర్భంలో శశి (సురభి)ని కలుసిన రాజ్‌, శ‌శి స‌మ‌స్యల్లో చిక్కుకుందని తెలుసుకుంటాడు. ఆ స‌మ‌స్య ఏంటి? దాన్ని రాజ్ ఎలా ప‌రిష్క‌రించాడు అనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ సినిమాకి అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చాడు.

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఒకేఒక లోకం (రచన: చంద్రబోస్)"  సిద్ శ్రీరామ్ 3:29
2. "ధీంతన ధీంతన (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  హరిచరణ్ 4:29

స్పందన[మార్చు]

సినిమా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రామ్ వెంకట్ శ్రీకర్ ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చాడు.[5] టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు తడగత్ పాఠి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చాడు, 'నిస్తేజమైన ప్రేమకథ అని, ఇందులో వాస్తవికత లేదు' అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రొటీన్ కథ, స్క్రీన్ ప్లే ఉంది. ఆది, సురభి నటన బాగుంది' అని ఈనాడు సమీక్షకుడు రాశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Goud, Priyanka (2 February 2021). "Aadi Saikumar's Sashi To Release On March 19". www.thetelugufilmnagar.com. Retrieved 2021-03-21.
  2. Surbhi. "Happy #ValentinesDay Red heart Come & Fall in Love with #Sashi Couple with heart (woman, man) in theatres from March 19th! #SashiOnMarch19th #AadiSaikumar @rashis276 @SNaiduNadikatla @Arunchiluveru @Amar_Bommireddy @rpvarmadatla @SHMovieMakers @adityamusic". Twitter. Retrieved 2021-03-21.
  3. "Telugu movies we can't wait to watch in 2021". The Indian Express. 8 January 2021. Retrieved 2021-03-21.
  4. Hymavathi, Ravali (23 December 2019). "First Look Poster Of Aadi's Next Film 'Sashi'". The Hans India. Retrieved 2021-03-21.
  5. "Sashi Movie Review: An earnest drama brought down by a lack of originality". The New Indian Express. Retrieved 2021-03-21.
  6. "రివ్యూ: శశి - aadi and surbhi sashi telugu movie review". www.eenadu.net. Retrieved 2021-03-21.

బయటి లింకులు[మార్చు]