Jump to content

శాంతి-క్రాంతి

వికీపీడియా నుండి
శాంతి-క్రాంతి
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రవిచంద్రన్
తారాగణం అక్కినేని నాగార్జున,
జుహీ చావ్లా
సంగీతం హంసలేఖ
నిర్మాణ సంస్థ శ్రీ ఈశ్వరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

శాంతి క్రాంతి 1991లో క్రైమ్ చిత్రం. వి. రవిచంద్రన్ తన ఈశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగార్జున, వి. రవిచంద్రన్, జూహి చావ్లా, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. హంసలేఖ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగు, కన్నడం, తమిళాలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇందులో తెలుగు వెర్షన్‌లో అక్కినేని నాగార్జున, తమిళ వెర్షన్‌లో రజనీకాంత్, కన్నడంలో వి. రవిచంద్రన్ నటించారు. ఈ తెలుగు వెర్షన్ ఉన్నప్పటికీ, రజనీకాంత్ తమిళ వెర్షన్‌ను తెలుగులో పోలీస్ బుల్లెట్ అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.

ఒక నిజాయితీగల పోలీసు అధికారి సుభాష్ ( అక్కినేని నాగార్జున ), డాడీ ( అనంత్ నాగ్ ) అనే భయంకరమైన నేరస్థుడిపై అతడు చేసే పోరాటం కథే ఈ సినిమా.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."స్వతంత్ర భారతమా"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:44
2."అర్థరాత్రిలో"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి8:30
3."గాలియో గాలియో"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి5:14
4."పుట్టేది నిజం"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి6:36
5."ఎవ్వరు నీసరి"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:52
6."వన్ టూ త్రీ"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర7:37
7."ఏనుగొచ్చె ఏ ఊరొచ్చె"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:49
8."అనాథ బంధువే"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి1:57
9."వచ్చడు యమరాజు"[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం0:56
మొత్తం నిడివి:43:35

మూలాలు

[మార్చు]
  1. Shanti Kranti (1991) – IMDb