శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
శ్రీరామాంజనేయ యుద్ధం (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బాపు |
నిర్మాణం | పొట్లూరి వెంకటనారాయణరావు, యన్.బి.కె.ఉమామహేశ్వరరావు |
కథ | గబ్బిట వెంకటరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి, రాజశ్రీ, ముక్కామల, ధూళిపాళ, జయంతి, కాంతారావు |
సంగీతం | కె.వి.మహదేవన్, పూహళేంది (సహాయకుడు) |
నేపథ్య గానం | ఎమ్.బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది సత్యం, కె.రఘురామయ్య, ఎమ్.ఎస్.రామారావు, పి.సుశీల, ఎస్.జానకి, పి.లీల, బి.వసంత |
నృత్యాలు | బి.హీరాలాల్, కె.యస్.రెడ్డి, వెంపటి చినసత్యం |
గీతరచన | ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, గబ్బిట వెంకటరావు |
సంభాషణలు | గబ్బిట వెంకటరావు |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రసాద్ |
కళ | ఎ.కె.శేఖర్, వి.భాస్కరరాజు, వాలి |
కూర్పు | బి.హరినారాయణ, మందపాటి రామచంద్రయ్య |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీనారాయణ ఫిలింస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బాపు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు నటించిన తొలి చిత్రం. బాపుతో ముళ్ళపూడి ఈ సినిమకు పనిచేయలేదు. సంభాషణలు పద్యాలు గబ్బిట వెంకటరావు రాశారు. కె.వి. మహదేవన్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్ర కథ గయోపాఖ్యానం, లవకశ లను గుర్తుకు తెస్తుంది. కృష్ణార్జునయుద్ధంలో గయుడుగా నటించిన ధూలిపాళ అదే తరహా పాత్ర ఐన యయాతి పాత్ర పోషించారు. మమూలుగానే అర్జా జనార్ధనరావు హనుమంతుని పాత్ర పోషించారు. ఈలపాట రఘురామయ్య పాటలు ఈ చిత్ర ప్రత్యేక ఆకర్షణ. చాహుంగా మై తుఝే (దోస్తి) పాట వరుసలో స్వరపరచబడ్డ 'సాకేత సార్వభౌమ' జనాదరణ పొందింది. అలాగే యయాతి పిల్లలు పాడిన "శ్రీకరమౌ శ్రీరామ బాణం" పాట కూడా హిట్టే.
పాత్రలు
[మార్చు]పాత్రధారి | పాత్ర |
---|---|
నందమూరి తారకరామారావు | శ్రీరాముడు |
బి.సరోజాదేవి | సీతాదేవి |
ధూళిపాళ | యయాతి |
జయంతి | శాంతిమతి-యయాతి భార్య |
అర్జా జనార్ధనరావు | హనుమంతుడు |
హేమలత | అంజనాదేవి |
కాంతారావు | నారదుడు |
రాజశ్రీ | పార్వతీదేవి |
ముక్కామల | విశ్వామిత్ర మహర్షి |
శ్రీధర్ | భరతుడు |
నాగరాజు (లవకుశలో లవుడు) | లక్ష్మణుడు |
కథాంశం
[మార్చు]కాశీరాజ్య పాలకుడైన యయాతి (ధూళిపాళ) శ్రీరామ భక్తుడు. అతను పరమదానశీలుడు, ధర్మజ్ఞుడు కూడా. అతను హనుమంతుడంతగా శ్రీరాముడిని ఆరాధించేవాడా కాదా అని తలచి, అతనిని పరీక్షించడానికి పార్వతీదేవి (రాజశ్రీ) పూనుకుంటుంది. ఆ పరీక్షలో భాగంగా మాయ అను ఒక వ్యక్తిని పంపగా, కాశీరాజ మందిరం వద్దకు రాగానే హనుమంతుడు (అర్జా జనార్ధనరావు) ప్రత్యక్షమై తన గదతో ఆమెను ఒక తన్ను తంతాడు. మాయవల్ల యయాతి అనుకోకుండా విశ్వామిత్ర మహర్షి (ముక్కామల)ని నొప్పిస్తాడు. దానితో విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై శ్రీరాముడి వద్దకు వెళ్ళి యయాతిని శిక్షించమంటాడు. మహర్షి మాట కాదనలేక శ్రీరాముడు (ఎన్టీ రామారావు) యయాతిని తీసుకురావడానికి లక్ష్మణ శతృఘ్నులు నిరాకరించగా భరతుడిని (శ్రీధర్) పంపిస్తాడు. భరతుడు వెళ్ళినప్పుడు యయాతి రాముడిని పూజిస్తుంటాడు, అప్పుడు అతనితో మాట్లాడలేక తర్వాత వచ్చి విషయం చెప్పుతాడు. యయాతి ఏ తప్పూ చేయలేదని, అతనిని తీసుకు వెళ్ళవద్దని అతని భార్య (జయంతి) వేడుకుంటుంది. కానీ యాయాతి బయలుదేరక తప్పలేదు. భరతుడతనిని తీసుకు వెళ్ళగా, అతని రథం వెంట మరో రథంలో యయాతి భార్య బయలు దేరుతుంది. దారిలో శివుడు తుఫాను తెప్పిస్తాడు. భరతుని రథానికి అడ్డంగా చెట్టువిరిగి పడుతుంది. ఆ తుఫానులో శాంతిమతి, ఆమె పిల్లలు విడిపోతారు. ఒక రాక్షసుడు శాంతిమతి వెంటపడతాడు. అతడి నుంచి తప్పించుకుంటూ ఓ శివలింగం వద్ద మూర్ఛపోతుంది. శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేసి శాంతిమతిని సీతాదేవి మందిరంలో చేర్చుతాడు. యాయాతి అంజనాదేవి (హేమలత) వద్దకు చేరుకుంటాడు, ఆమె హనుమంతుడిని యాయాతికి అభయమివ్వమంటుంది, తనకు హాని తలపెట్టింది శ్రీరాముడు అని చెప్పేలోపే హనుమంతుడు యయాతికి అభయమిస్తాడు. నిజం తెలుసుకుని నిర్ఘాంతపోతాడు కానీ ఇచ్చిన మాట జవదాటకూడదననుకుంటాడు. మరోపక్క శాంతిమతికి స్పృహరాగానే సీతాదేవి వద్ద తన భర్తను క్షమించమని మొర పెట్టుకుంటుంది. సీతాదేవి శ్రీరామునికి ఈ విషయం వివరించగా అతను తన కర్తవ్యమే ముఖ్యమంటాడు. మరోపక్క యయాతి పిల్లలను వశిష్టముని చెరదీస్తాడు. యయాతి రామాంజనేయ యుద్ధం సంభవించకుండా చూడటానికి ఆత్మహత్య చేసుకోబోతాడు, శివుడు అతడిని కాపాడి, మారు రూపంలో హనుమంతుని వద్దకు చేర్చుతాడు. యయాతిని తీసుకురావడానికి భరతుడు కిష్కిందకు వెళ్తాడు, అప్పుడు జరిగిన యుద్ధంలో అంగదుని చేతిలో మూర్ఛపోతాడు. అతని కిరీటమును, ఆయుధాలను మాయ అయోధ్యకు తీసుకు వెళ్ళి, వానర రూపంలో శ్రీరాముడిని, లక్ష్మణ శత్రఘ్నునులను రెచ్చగోడుతుంది. లక్ష్మణశత్రఘ్నులు యుద్ధముకు వెళ్తారు. ఆ యుద్ధంలో లక్ష్మణ శత్రఘ్నులు సహా సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మరణిస్తారు. ఇది చూసి హనుమంతుడు క్షోభిస్తాడు. వశిష్టముని యయాతి పిల్లలను శ్రీరాముని వద్దకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు రాముడు హనుమంతునితో యుద్ధానికి బయలుదేరబోతాడు. వారు చెప్పినా యయాతిని క్షమించనంటాడు. మరో పక్క హనుమంతుడు ఈ యుద్ధం విశ్వామిత్రుని వల్ల అని గ్రహించి అతనిని చంపుటకు బయలుదేరబోగా శ్రీరాముడు వస్తాడు. వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంటుంది. చివరికి శ్రీరాముడు తన రామబాణాన్ని ప్రయోగించగా, హనుమంతుడు రామనామాన్ని తన కవచంగా జపిస్తాడు. రామనామం, రామబాణం ప్రళయాన్ని సృష్టిస్తాయి. సీతాదేవి, శాంతిమతి, యయాతి పిల్లలు, విశ్వామిత్రుడు, నారదుడు యుద్ధం జరిగే ప్రదేశానికి చేరుతారు. శివపార్వతులు ప్రత్యక్షమై యుద్ధం ఆపి, మరణించిన వారందరినీ బ్రతికిస్తారు, రామబాణం కన్నా రామనామం శక్తివంతమైందని చెప్పుతారు.
పాటలు
[మార్చు]- సాకేత సార్వభౌమా శరణు శరణయా జానకిరామా - కె.రఘురామయ్య
- జయతు జయతు మంత్రం .... రామ నీలమేఘశ్యామా కోదండరామా - కె.రఘురామయ్య బృందం
- మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా - యం.బాలమురళీకృష్ణ, పి.లీల బృందం
- శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సాధం - పి.సుశీల, బి.వసంత
- శ్రీయుతమౌ శ్రీరామపాదం త్రిటజన మందారం - పి.సుశీల, బి.వసంత
- భీకరమౌ శ్రీరామబాణం తిరుగులేని అస్త్రం - పి.సుశీల, బి.వసంత
- భీషణమౌ శ్రీరామశపథం వీడదు సర్వపథం - పి.సుశీల, బి.వసంత
- శరణమునీవే శ్రీరామా పావననామా రఘురామా - ఎమ్.ఎస్.రామారావు
- రామా సుగుణధామా (పద్యం) - ఎమ్.ఎస్.రామారావు
- కరుణాలోలా నారాయణ త్రిటజనపాల దీనావనా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- రారా ఓరాజా చలచల్లని దినరాజా - ఎస్.జానకి
- క్షేమంబేకద ఆంజనేయునకు సుగ్రీవాదులున్ భద్రమే (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రమణ్యం
- వచ్చింది వచ్చింది రామరాజ్యం - మాధవపెద్ది సత్యం, బి.వసంత బృందం
- వినోదాల కోసం ఈ జీవితం విలాసాల కోసం _పీ.సుశీల బృందం, రచన: దాశరథి
పద్యాలు
[మార్చు]పద్యరచన: గబ్బిట వెంకటరావు.
1.అంతటి శౌర్యవంతులు మహాబలశాలి, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం
2.అభయమిచ్చిన వెనక కాదనుడు హనుమ, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
3.అమరాదీశ మహేశ్వర ప్రముఖులే, గానం.మాధవపెద్ది సత్యం
4.అమ్మా పార్వతీ ఈ ఉపేక్ష తగదమ్మా సాటి ఇల్లాలు, గానం.బి.వసంత
5.అరయవైతివి మనకు గలట్టి కూర్మి కాంచవైతివి, గానం.బాలసుబ్రహ్మణ్యం
6.ఆడితప్పుటకంటే అఘము లేదనిగదా , గానం.మాధవపెద్ది సత్యం.
7.గజ్జెలందెలు ఘల్లు ఘల్లున కౌసల్య, గానం.మాధవపెద్ది సత్యం
8.గురునాజ్ఞ నెపమున తరుణి యంచెంచక, గానం.మాధవపెద్ది సత్యం
9.ఘాటక బ్రహ్మచారికి కోర్కెయేల, గానం.మాధవపెద్ది సత్యం
10.ట్రిజగన్నుత శౌర్యరమాలరామా , గానం.మాధవపెద్ది సత్యం
11.ధర్మము ధర్మమటంచి వృధా వ్యధ చెందుట, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
12.దారుణ ఎల్లడన్ విలయతాండవ మాడు , గానం.శ్రీపతి పoడితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
13.నీలకంధర పాల నేత్రాగ్ని కీలల నేదిరించి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
14.బాహు బలశాలి నన్న దర్ఫంబు కాదు మదిని శ్రీరామ, గానం.మాధవపెద్ది సత్యం
15.భండన భీముడు ఆర్తజన భాంధవుడు, గానం.మాధవపెద్ది సత్యం
16.వగచి శరణన్నవాడు నీ భక్తవరుడు బ్రోవ, గానం.మోపర్తి సీతారామారావు
17.శరణార్థి సుగ్రీవూ సాహచర్య మొనర్చి, గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
18.శ్రీరఘురామ చారు తులసీదళదామా , గానం.మాధవపెద్ది సత్యం
19.సీతమ్మ జాడ మీ చెవినివేయ అంబోధి తృటికాలమందు , గానం.మాధవపెద్ది సత్యం
20.సర్వేశ్వరుడగు జానకిరాముని చరణాంబుజములే, గానం.మాధవపెద్ది సత్యం
21.శ్రీమన్మహా విష్ణుదేవా అమేయప్రభావ ,(దండకం), రచన: గబ్బిట వెంకటరావు, గానం.మాధవపెద్ది సత్యం.