షేక్‌పేట
Jump to navigation
Jump to search
షేక్‌పేట | |
---|---|
Coordinates: 17°40′55″N 78°39′08″E / 17.68194°N 78.65222°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 008 |
Vehicle registration | టిఎస్ 13 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కార్వాన్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
షేక్‌పేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 110లో ఉంది.[3] టోలిచౌకి, దర్గా, మణికొండ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]షేక్‌పేట 29 చ.కి.మీ.ల విస్తార్ణంలో ఉంది. ఇది 17°40′55″N 78°39′08″E / 17.68194°N 78.65222°E అక్షాంశరేఖాంశాల మధ్యన ఉంది.
ఉప ప్రాంతాలు
[మార్చు]- షేక్‌పేట్ నాలా
- అలీజాపూర్
- ద్వారకా నగర్
- వినోభా నగర్
- ఓయూ కాలనీ
- అల్-హమ్రా కాలనీ
- గుల్షన్ కాలనీ
- డైమండ్ హిల్స్
- కుతుబ్ షాహీ టూంబ్స్
- వివేకానంద నగర్ కాలనీ
- మారుతి నగర్
- దత్తాత్రేయ నగర్
- జైహింద్ నగర్
- హరిజన్ బస్తీ
- సక్కు భాయి సొసైటీ
- వినాయక నగర్
- ఫ్రెండ్స్ కాలనీ
- మినీ గుల్షన్ కాలనీ
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 2,50,932 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,28,314 మంది పురుషులు కాగా, 1,22,618 మంది స్త్రీలు ఉన్నాయి. గ్రామంలో 57,917 గృహాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షేక్‌పేట మీదుగా మెహదీపట్నం, లక్డికాపూల్, అబిడ్స్, కోఠి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పటాన్చెరు, భెల్ వరకు బస్సులు నడుపబడుతున్నాయి.[4]
ఇతర వివరాలు
[మార్చు]- 1633-34 మధ్యకాలంలో కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా చే నిర్మించబడిన షేక్‌పేట సరాయి ఇక్కడ ఉంది.[5]
- ఈ ప్రాంతంలో షేక్‌పేట సెవెన్ టూంబ్స్ నుంచి రాయదుర్గం విస్పర్ వ్యాలీ వరకు 2.8 కిలోమీటర్ల మేర రూ.333.55 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం షేక్‌పేట ఫ్లైఓవర్ నిర్మించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Bushra Baseerat (2011-06-04). "Techies build bright careers in drab Old City". The Times of India. Archived from the original on 2011-06-08. Retrieved 2022-04-04.
- ↑ "Toli Chowki Locality". www.onefivenine.com. Retrieved 2022-04-04.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2022-04-04.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-04-04.
- ↑ Varma, Dr. Anand Raj. "Shaikpet sarai ravaged by nature". Telangana Today. Retrieved 2022-04-04.
- ↑ NavaTelangana (25 December 2021). "అందుబాటులోకి మరో రెండు ఫ్లై ఓవర్లు". Nava Telangana. Archived from the original on 25 December 2021. Retrieved 2022-04-04.