సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి
సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి


తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2018 – ప్రస్తుతం
ముందు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌
నియోజకవర్గం యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
2004 - 2018
ముందు అసదుద్దీన్ ఒవైసీ
నియోజకవర్గం చార్మినార్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-09-15) 1954 సెప్టెంబరు 15 (వయసు 69)
హైదరాబాదు, తెలంగాణ
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
తల్లిదండ్రులు సయ్యద్ ముర్తుజా పాషా క్వాద్రీ - సయ్యదా అమతుల్ కరీం[1]
జీవిత భాగస్వామి సయ్యదా అజ్గర్ ఉన్నిసా
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు, తెలంగాణ
వృత్తి రాజకీయ నాయకుడు

సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2][3] ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[4][5]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి 1954, సెప్టెంబరు 15న సయ్యద్ ముర్తుజా పాషా క్వాద్రీ - సయ్యదా అమతుల్ కరీం దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రికి సయ్యదా అజ్గర్ ఉన్నిసాతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి 1986 నుండి 1991 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్కు కార్పోరేటర్ గా పనిచేశాడు. ఈయన 2004 నుంచి 2014 వరకు చార్మినార్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీచేసి గెలుపొందాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాషీత్ పై 36,615 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి శాం సుందర్ రెడ్డి పై 46,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]

పదవులు[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

ఇరాక్, జోర్డాన్, పాలస్తీనా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్‌ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Syed Ahmed Pasha Quadri". My Neta. Retrieved 8 August 2017.
  2. Jan 20, TNN /; 2013; Ist, 06:06. "Case against MIM MLA Pasha Quadri | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Case against MIM MLA Pasha Quadri | Hyderabad News - Times of India".
  4. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  5. "YAKUTPURA Election Result 2018, Winner, YAKUTPURA MLA, Telangana". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  6. "Syed Ahmed Pasha Quadri MLA of Charminar Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  7. "Yakutpura Election Result 2018 Live Updates: Syed Ahmed Pasha Quadri of AIMIM Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.