సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా మహబూబ్ నగర్ జిల్లా, కోస్గి మండలంలోని సర్జాఖాన్‌పేట గ్రామ శివారులో ఉంది. దీనిని నిజాం కాలంలో నిర్మించారు. ఈ దర్గాకు మతాలకతీతంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన భక్తులు వస్తుంటారు. దర్గాలో నగరాను హిందూ భక్తులు ఏర్పాటుచేయడమే అందుకు నిదర్శనం. ఇక్కడ ప్రతి యేటా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని అనేక ప్రాంతాలనుండి భక్తులు వస్తుంటారు. తమ కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడ కందురులు చేస్తుంటారు. మేకపోతులు, గొర్రెపోతులు కోసి ఖాద్రికి నైవేద్యంగా పెడతారు. బంధుమిత్రులను ఆహ్వానించి అందరికీ భోజనాలు ఏర్పాటుచేస్తారు. ప్రతి రోజు ఖాద్రి సేవల నిమిత్తమై కొందరు, ప్రార్థనల నిమిత్తమై కొందరు నియమింపబడి నిర్ణీత సమయాలలో దర్గా దగ్గర సేవలు అందిస్తుంటారు. దర్గా బాగోగులు చూసుకోవడానికి కొన్ని కుటుంబాలను ఏర్పాటుచేశారు. వారి జీవనోపాధికై కొన్ని భూములు కూడా ఏర్పాటుచేశారు. ఈ దర్గా సమీపంలోనే దండం చెరువు కూడా ఉంది. చెరువు దగ్గర కనిపించే దృశ్యాలు కనువిందు చేస్తాయి. అందువలననే ఈ ప్రాంతం విహార స్థలంగా కూడా విరాజిల్లుతుంది[1].

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 20