సలాత్ అల్ జనాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇరాన్ లోని ఖోమ్ లో హుసేన్ అలి ముంతజరి, యొక్క జనాజా నమాజ్ దృశ్యం.

సలాత్ అల్ జనాజా : Salat al-Janazah (అరబ్బీ: صلاة الجنازة‎, Persian: نماز مرده‎) ఇస్లామీయ విధానంలో ఖననసంస్కారాలలో ఒక భాగం. శవానికి ఖననం చేయుటకు ముందు ఆచరించే లేదా చేసే ప్రార్థనే ఈ సలాత్ అల్ జనాజా. ఇది ఒక ముస్లింల ఆచారం. ఖననానికి ముందు, ముస్లింల సమూహం, చనిపోయినవారి ఆత్మశాంతికొరకు, అతని పాపాలను మన్నించమని అల్లాహ్ ముందు చేసే దుఆ లేదా ప్రార్థన. దీనిని ఫర్జ్ కిఫాయా నమాజ్ అని కూడా అంటారు, అనగా ప్రతిముస్లిం యొక్క విద్యుక్తధర్మం. ఇది ఆచరించని ఎడల ముస్లింలకు అల్లాహ్ ముందు జవాబివ్వవలసి వుంటుంది. ఈ నమాజ్ లో సజ్దా (మోకరిల్లడం) వుండదు.

విశ్లేషణ[మార్చు]

ఈ నమాజ్ ఆచరించువారు జనాజా ముందు బారులుగా నిలబడి ప్రార్థించాలి. ఇలా నిలబడే ముస్లింల సమూహానికి ఇమామ్ నాయకత్వం వహించి నమాజ్ ఆచరిస్తాడు. నమాజీలు ఇమాంని అనుకరిస్తారు. ఇమాం ముందు జనాజాలో వుంచిన చనిపోయినవారి శరీరం వుంచుతారు. ఇమాం, నమాజీల సమూహం ఖిబ్లా వైపు ముఖం వుంచి నిలబడుతారు. పార్థివ శరీరాల జనాజాలు ఒకటి కంటే ఎక్కువగా వుంటే ఆ జనాజాలు ఒకదానికి ముందు ఒకటి వుంచుతారు, రెండు జనాజాలకూ నమాజు ఒకటే చదువుతారు. నమాజ్ ఆచరించిన తరువాత మెల్లగా ఫాతిహా చదువుతారు, ఆతరువాత ఆఖరున దుఆ చదువుతారు.

ముహమ్మద్ ప్రవక్త, వారి సహాబాలు జనాజా నమాజ్ ఏవిధంగా ఆచరించాలి అనే విధం ఈ విధంగా చెప్పారు. : [1]

1. మనసులో ప్రార్థనా లక్ష్యాన్ని (నియ్యత్) వుంచుకోవాలి, మొదట చేతులు పైకెత్తి తక్బీర్ (మొదటి తక్బీర్) పఠించాలి, ఆతరువాత చేతులను ముడుస్తూ తమ ఛాతీ క్రింది భాగాన వుంచాలి. కుడి చేతిని ఎడమ చేతిపై వుంచాలి. షైతాన్ బారినుండి కాపాడాలని అల్లాహ్ ను వేడుకోవాలి. తరువాత బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం పఠించాలి. ఆతరువాత దీన్ని పఠించాలి. سُبحَانَکَ اللّٰھُمَّ وَ بِحَمدِکَ وَ تَبَارَکَ اسمُکَ وَ تَعَالٰی جَدُّکَ وَ جَلََّ ثَنَائُكَ وَ لَا ِالٰہَ غَیرُک َّّ సుబ్'హానక్-అల్లాహుమ్మ, వ బిహమ్‌దిక, వ తబారకస్ముక, వ తఆల జద్దుక, వ జల్లసనాఉక వ లా ఇలాహ గైరుక్..

2. ఆతరువాత తక్బీర్, దరూదె ఇబ్రాహీమి చదువుతారు.

3. ఆతరువాత మూడవ తక్బీర్ చదివి, చనిపోయినవారి కోసం దుఆ చేస్తారు .

ఒక ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు. :

" ఓ ప్రభువా, జీవించియున్నవారికీ, మరణించియున్నవారికీ క్షమాబిక్ష ప్రసాదించు, మాలో హాజరువన్నావారికినీ, గైరుహాజరువున్నవారికినీ, మా యువతకు, వయస్సుమీరిన వారికినీ, పురుషులకునూ స్త్రీలకునూ. ఓ ప్రభువా, నీవెవరినైనా జీవింపదలచియుంటే ఇస్లాంలోనే (నీకు శరణుజొచ్చుటలోనే) జీవమివ్వు, అలాగే విశ్వాసిగానే మరణమివ్వు. ఓ ప్రభువా, ఇహలోకాలలో మార్గభృష్టులు కాకుండా చూడు, నీ కృపకు పాత్రులు కాకుండా వినాశం పొందుట నుండి రక్షించు. ఓప్రభువా, ఇతడిపై (మరణించిన వారిపై) నీ కృపను నొసంగు, ఇతడిని రక్షించు, క్షమించు, ఇతడిని ప్రశాంతంగా వుంచు, ఇతడిని పరలోకంలో సుళువుగా ప్రవేంపజేయి, ఇతడిని శుద్ధి చేసి ఆరోగ్యం ప్రసాదించు, ఇతడి పాపాలను కడిగివేయి, పాపాల మైలనుండి శుద్ధి చేయి. ఓప్రభువా, ఇహలోకంలోని గృహం కంటే మంచి గృహాన్ని, కుటుంబాన్ని పరలోకంలో ప్రసాదించు. ఓ ప్రభువా, ఇతడిని స్వర్గంలో స్థానాన్ని ప్రసాదించు, ఇతడిని సమాధిలోనూ నరకాగ్ని వల్లనూ కలిగే బాధలనుండి విముక్తి చేయి; ఇతడి సమాధిని విస్తారపరచు, వెలుగుతో నింపు. "

దుఆ చేయునపుడు ఇతర వాక్యాలనూ వాడవచ్చును, ఉదా:

"ఓ ప్రభువా, ఇతడు సత్ప్రవర్తనుడైతే, ఇతడి పుణ్యములను ఇంకనూ పెంచు, కానైతే, ఇతడి పాపాలను మన్నించు. ఓ ప్రభువా, ఇతడిని క్షమించు, ఇతడిని నిజాలను నిష్కర్షగా (ప్రళయదినాన, జవాబుచెప్పే దినాన) చెప్పే ధైర్యాన్నీ ప్రసాదించు. "

4. ఆతరువాత నాల్గవ తక్బీర్ చదువుతారు, కొంచెం విరామం తరువాత "తస్లీమ్" అనగా అస్సలాము అలైకుం వ రహమతుల్లా" అంటూ కుడి-ఎడమ భుజాలవైపు తిరిగి పలుకుతారు. దీనితో ఈ నమాజ్ ను ముగిస్తారు

మినహాయింపు[మార్చు]

ఒక అధికారపూరిత హదీసు ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త, ఆత్మహత్య చేసుకున్నవారికి జనాజా నమాజ్ ఆచరించాలని చెప్పలేదు. ;

జాబిర్ బి.సమూరా ఉల్లేఖనం : ఒక మనిషి ఒక వెడల్పైన బాణంతో ఆత్మహత్య చేసుకుంటే, అతడి శరీరాన్ని (శవాన్ని) ముహమ్మద్ ప్రవక్త ముందు తీసుకువచ్చారు. అప్పుడు ప్రవక్తగారు అతడి ఖనన సంస్కారానికి ముందు "జనానా నమాజ్" ఆచరించలేదు.

— హదీసు- సహీ ముస్లిం - 004 - 2133.
దస్త్రం:Muslim Funeral1.jpg
శవాన్ని, ఖనన సంస్కారం కొరకు ఖబ్రస్తాన్కు తీసుకెళ్ళే దృశ్య చిత్రం.

ఇవీ చూడండి[మార్చు]మూలాలు[మార్చు]

  1. Kitaab Majmoo’ Fataawa wa Maqaalaat Mutanawwi’ah li Samaahat al-Shaykh ‘Abd al-‘Azeez ibn ‘Abd-Allaah ibn Baaz, vol 13, p. 141

బయటి లింకులు[మార్చు]

మూస:నమాజ్