సిరి లాబాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరి లాబాల
Siri Labala 09.jpg
సిరి లాబాల
జననంసరిత
(1974-09-02) సెప్టెంబరు 2, 1974 (వయస్సు 46)
ఝాన్సీ, భారతదేశం
వృత్తివ్యాపారం
కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తవెంకటరమణ
తండ్రిచిట్టిబాబు
తల్లిపుణ్యవతి

సిరి లాబాల యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం - చదువు[మార్చు]

1974, సెప్టెంబరు 2న పుణ్యవతి, చిట్టిబాబు దంపతులకు ఝాన్సీలో జన్మించారు. వీరి తల్లి గృహిణి, తండ్రి గారు సైనికుడు. అనేక యుద్ధాలలో పాల్గొని “సంగ్రాం మెడల్”ని అందుకున్నారు. ఈవిడ హిందీలో ఎం.ఎ చేశారు. బి.ఎడ్ కూడా చదివారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి గ్రామంలో నివసిస్తున్నారు.

రవీంద్రభారతిలో జరిగిన “తెలుగు సాహితీ సంబరాలు”

వివాహం[మార్చు]

వీరికి వెంకటరమణతో వివాహం జరిగింది. వీరికిద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి చైనాలో వైద్య విద్య, చిన్న అమ్మాయి కాకినాడలో బి.టెక్ నాలుగో సంవత్సరం, బాబు కేశవరెడ్డి స్కూల్ లో పదో తరగతి చదువుచున్నాడు.

వృత్తి - ప్రవృత్తి[మార్చు]

వృత్తి - వ్యాపారం. ప్రవృత్తి- కవితలు, కథలు వ్రాయడం. కుట్లు, అల్లికలు, బట్టలు కుట్టడం, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం. త్వరలో రాబోయే సినిమాకు పాటలు, మాటలు రాశారు.

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

'నన్ను చంపకండి ప్లీజ్' అనే కవిత తెలుగు పోయెట్రీస్.కామ్ లో ప్రచురితం అయింది.”కంటి చెమ్మ” అనే కథ జాగృతి వార పత్రికలో ప్రచురితం అయింది.

కవితల జాబితా[మార్చు]

 • ఆడపిల్ల ఈడపిల్ల కాదేమో[1]
 • ఉగాదికి స్వాగతం[2]
 • గుప్పెడంత గుండె[3]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

 1. 'సిరి' వెన్నెల స్వరం - (17.07.2016 న విశాఖపట్టణం లోని వైశాఖి జల ఉద్యానవనం ఆడిటోరియంలో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షులు “పొట్లూరి హరికృష్ణ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది .
అంతర్వేది 'సాహితీ పండుగ' కవిసమ్మేళనం

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

 • 10వ తరగతిలో స్కూల్ లో జరిగిన 'సైన్స్ ఎగ్జిబిషన్' లో పాల్గొని డా. కిమిడి మృణాలిని గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు.
 • 2014, ఆగష్టు 30 న హైదరాబాదు లోని రవీంద్రభారతి లో జరిగిన “తెలుగు సాహితీ సంబరాలు”లో పాల్గొని ఓలేటి పార్వతీశం, సినీ హాస్యనటులు కొండవలస లక్ష్మణరావు వంటి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
 • అంతర్జాలంలో 'మన తెలుగు మన సంస్కృతి', 'సాహితి సేవ', 'కృష్ణా తరంగాలు', 'మా ఆసరా' వంటి ముఖ పుస్తక సమూహాలలో చిత్ర కవితల పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
 • 2014 నవంబరు 11న అంతర్వేదిలో జరిగిన 'సాహితీ పండుగ' లో కవిసమ్మేళనంలో పాల్గొని “డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు, పొట్టి రాంబాబు, వంగపండు వంటి ప్రముఖుల చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు.
 • 2015 ఏప్రిల్ 12న హైదరాబాదు సాహితిసేవ వారు ఏర్పాటుచేసిన 'కవితా వసంతం' కవిసమ్మేళనంలో పాల్గొని 'స్రవంతి ఐతరాజు, సామాన్య' గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
'కవితా వసంతం'

'సిరి' వెన్నెల స్వరం ఆవిష్కరణ చిత్రమాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. అచ్చంగా తెలుగు. "ఆడపిల్ల ఈడపిల్ల కాదేమో". acchamgatelugu.com. Retrieved 17 September 2016.[permanent dead link]
 2. మాలిక, కవితలు. "ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ". http://magazine.maalika.org/. Archived from the original on 6 అక్టోబర్ 2016. Retrieved 17 September 2016. Check date values in: |archive-date= (help); External link in |website= (help)
 3. తెలుగు వేదిక, తెలుగు కవిత్వం. "గుప్పెడంత గుండె". www.teluguvedika.net. Retrieved 17 September 2016.[permanent dead link]