Jump to content

టమాటో

వికీపీడియా నుండి
(సొలానమ్ లైకోపెర్సికమ్ నుండి దారిమార్పు చెందింది)

టమాటో
టమాటో కోసిన తరువాత, కోయక ముందు
Scientific classification
Kingdom:
Subkingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సొలానమ్ లైకోపెర్సికమ్
Binomial name
లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్
Synonyms

లైకోపెర్సికాన్ లైకోపెర్సికమ్
లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్

టమాటాలు
వివిధ జాతుల టమేటాలు

టమాటో (ఆంగ్లం: Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది .

ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము.

ఈ మొక్క గురించి

[మార్చు]
ప్రకాశం జిల్లా గిద్దలూరులో టమాటో మార్కెట్

ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును.

ఇందలి రకములు

[మార్చు]

దేశవాళీ

[మార్చు]

అనగా మొదట ఐరోపా నుండి దేశానికి తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు ఎరుపు రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు రసము తక్కువ లోన అవకాశము ఉండుటయు ఉంది. చర్మము జిగియైనది. వీటిని కొన్ని ప్రాంతాలలో రామములక్కాయలు అని కూడా అంటారు.

టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద

గ్లోబ్‌

[మార్చు]

ఇది ఒక అమెరికా దేశపు రకము. కాయ మధ్యమ పరిమాణము కలిగి గుండ్రముగను నునుపుగాను ఉండును. లోన గుల్ల యుండదు. రసమయము.

మార్‌ గ్లోబ్‌

[మార్చు]

పాండిరోజా

[మార్చు]

బానీ బెస్టు

[మార్చు]

ఆక్సుహర్టు

[మార్చు]

చెర్రీరెడ్‌

[మార్చు]

సియూ

[మార్చు]

పూసారూబీ

[మార్చు]

పూసా రెడ్ప్లం

[మార్చు]

తినే పద్దతులు

[మార్చు]
టమాటా పచ్చడి
దస్త్రం:పాలకూర, టమాట పప్పు (2).jpg
పాలకూర, టమాట పప్పు
టమాటా పప్పు
  1. పచ్చివిగా తినవచ్చు
  2. టమాటో వేపుడు
  3. టమాటో పచ్చడి
  4. టమాటో చారు లేదా టమాటో సూప్
  5. టామాటో ఇతర కాంబినేషనులు
  6. టమాటా పప్పు

టమాటో వంటకాలు

[మార్చు]
టమాట పప్పు

టమాటోను నిజంగా ఎన్నిరకముల కాంబినేషనులలో వాడవచ్చో తెలిస్తే మీరు ముక్కుమీద వేలు వేసుకుంటారు,

  1. టమాటో సొరకాయ
  2. టమాటో బంగాళదుంప
  3. టమాటో కోడిగుడ్డు
  4. టమాటో ఉల్లిగడ్డ
  5. టమాటో సాంబారులో
  6. టమాటో పెరుగు పచ్చడిలో
  7. టమాటో జాం
  8. టమాటో మిక్షుడ్ ఫ్రూట్ జాం
  9. టమాటో సాస్
  10. టమాటో కెచప్
  11. టమాటో అన్నము

ఉపయోగాలు

[మార్చు]
  • ఎసిడిటీ టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.
  • మధుమేహ రోగులకు మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • కంటి జబ్బులకు టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది.
  • రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగనిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది. వారానికి పదిసార్లు టమోటాలు తీసుకుంటే ప్రోస్టేట్‌, మలద్వార, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండటం విశేషం.
  • బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. బరువును తగ్గించే గుణము : టమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు . టమాటోలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను తక్కువగా తింటారు . టమాటోలు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని, ఇతర పదార్దములు గాని తిననీయదు ... కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు పెరగరు .
  • ఎముకలు బలపడడానికి : పాలు తాగితే ఎముకలు బలపడతాయి.. ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు దాడిచేయకుండా ఉంటాయి.. అయితే ఈ ఘనత ఒక్క పాలకే కాదు.. టమాటా రసానికీ చెందుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటా రసాన్ని తాగలేనివారు కెచప్‌, సాస్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. జాతీయ సంస్థ ఆస్టియోపోరోసిస్‌ సూచనల ప్రకారం కాషాయరంగు, గులాబీ రంగులో ఉన్న ఏ కాయగూరలని తిన్నా క్యాల్షియం తగుపాళ్లలో అంది ఎముకలు బలపడతాయి. టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
  • టమోటాతో పక్షవాతం దూరం: చూడగానే ఎర్రగా, నోరూరించే టమోటాల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఏ దండిగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరగటానికి, విశృంఖల కణాలు తగ్గటానికి విటమిన్‌ సి దోహదం చేస్తే.. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్‌ ఏ తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా వీటితో లభిస్తుంది. టమోటాలకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త సంగతి కూడా బయటపడింది. వీటిల్లోని యాంటీఆక్సిడెంటు గుణాలు గల లైసోపేన్‌.. పక్షవాతం ముప్పు 59% వరకు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు ఫిన్‌లాండ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటం మూలంగా పక్షవాతం ముప్పు తగ్గుతుందనే విషయాన్ని ఈ అధ్యయనం మరింత బలపరిచింది. టమోటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించే మాంగనీసు వంటివీ ఉంటాయి.
  • టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి.టమోటాల్లో లైకోపేన్‌ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ 25 మి.గ్రా. లైకోపేన్‌ తీసుకుంటే చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ 10 శాతం వరకు తగ్గుతుంది.లైకోపేన్‌ తీసుకోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. (ఈనాడు20.5.20p
  • tamotalu tisukuntay
  • [1]
Red tomatoes, raw
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి74 కి.J (18 kcal)
3.9 g
చక్కెరలు2.6 g
పీచు పదార్థం1.2 g
0.2 g
0.9 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
5%
42 μg
4%
449 μg
123 μg
థయామిన్ (B1)
3%
0.037 mg
నియాసిన్ (B3)
4%
0.594 mg
విటమిన్ బి6
6%
0.08 mg
విటమిన్ సి
17%
14 mg
Vitamin E
4%
0.54 mg
విటమిన్ కె
8%
7.9 μg
ఖనిజములు Quantity
%DV
మెగ్నీషియం
3%
11 mg
మాంగనీస్
5%
0.114 mg
ఫాస్ఫరస్
3%
24 mg
పొటాషియం
5%
237 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు94.5 g
Lycopene2573 µg

Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టమాటో&oldid=3484074" నుండి వెలికితీశారు