Jump to content

హంసగీతె

వికీపీడియా నుండి
హంసగీతె
దర్శకత్వంజి.వి.అయ్యర్
రచనత.రా.సు
నిర్మాతజి.వి.అయ్యర్
తారాగణంఅనంత్ నాగ్
రేఖా రావ్
నారాయణ రావ్
బి.వి. కారంత్
ప్రేమా కారంత్
ఛాయాగ్రహణంనిమాయ్ ఘోష్
కూర్పువి.ఆర్.కె.ప్రసాద్
సంగీతంమంగళంపల్లి బాలమురళీకృష్ణ
నిర్మాణ
సంస్థ
అనంతలక్ష్మీ ఫిలింస్
విడుదల తేదీ
1975
దేశంభారతదేశం
భాషకన్నడ

హంసగీతె జి.వి.అయ్యర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించబడి 1975లో విడుదలైన సంగీత ప్రధానమైన కన్నడ చలనచిత్రం. ఈ సినిమాను కన్నడ భాషలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నిర్మించారు. తెలుగులో ఆఖరిగీతం పేరుతో విడుదలయ్యింది. హంసగీతె చిత్రానికి 1975లో ఉత్తమ కన్నడ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

రెండు వందల సంవత్సరాల క్రితం మన దేశంలో జరిగిన ఒక వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకుని, సంగీతానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ చిత్రం స్క్రీన్ ప్లే తయారు కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఈ కథకు సంబంధించి బి.ఎన్.రెడ్డి, పి.పుల్లయ్య, గిరీష్ కర్నాడ్, బి.వి. కారంత్ మొదలైన కళాకారులు, మేధావుల సలహాలు, సూచనలు స్వీకరించారు.

చిత్రీకరణ

[మార్చు]

ఈ చిత్రంలో కనిపించే ప్రతి అంశం, ప్రతి వస్తువు కూడా రెండు వందల సంవత్సారాల క్రితం ఉన్నటువంటివే ఉపయోగించారు. ఆయా సంఘటనలు ఎక్కడైతే జరిగాయో ఆయా ప్రదేశాలలోనే చిత్రీకరించారు.

నటీనటులు

[మార్చు]
  • అనంత్ నాగ్
  • రేఖా రావ్
  • నారాయణరావ్
  • బి.వి.కారంత్
  • ప్రేమా కారంత్
  • మైసూర్ మఠ్
  • వాసుదేవ్ గిరిమాజి
  • జి.వి.అయ్యర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ : తళుకు రామస్వామయ్య సుబ్బరాయ (తరాసు)
  • దర్శకత్వం : జి.వి.అయ్యర్
  • చిత్రానువాదం : జి.వి.అయ్యర్
  • సంగీతం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బి.వి.కారంత్
  • నేపథ్యగానం: ఎం.బాలమురళీకృష్ణ, ఎం.ఎల్.వసంతకుమారి, పి.బి.శ్రీనివాస్, శ్యామలాభావే, పి.లీల, బి.కె సుమిత్ర,బెంగళూరు లత, ఏ.సుబ్బారావు
  • ఛాయాగ్రహణం: నిమాయ్ ఘోష్
  • కూర్పు: వి.ఆర్.కె.ప్రసాద్
  • నిర్మాత: జి.వి.అయ్యర్

మదకరి నాయక చిత్రదుర్గానికి రాజు. అతను దైవభక్తుడు, రసికుడే కాక సంగీత ప్రియుడు కూడా. ఆ చిత్రదుర్గంలోనే వెంకన్న అనే యువకుడు సంగీతంలో నిష్ణాతుడిగా అందరి మన్ననలూ పొందాడు. అతనికీ అతని గురువుకూ సంగీతంలో పోటీ ఏర్పాటయిందని తెలిసి రాజు మారువేషంలో వచ్చి ఆ పోటీ రోజున తానూ ప్రేక్షకులలో ఒకడయ్యాడు. వెంకన్న సంగీతంలో తన ప్రతిభనంతా చూసి విజయాన్ని సాధించాడు. గురువు ఆ పోటీలో తన విశాల దృక్పథాన్ని ప్రదర్శించినప్పటికీ, ఓటమి అపఖ్యాతిగా భావించి ఆత్మహత్య చేసుకోవడంతో వెంకన్న హృదయం ఆవేదనతో ఆక్రోశించింది. మేనమామ అనంతయ్య వెంకన్నను ఓదార్చాడు.

సదానందబువా హిందుస్తానీ సంగీతంలో ప్రావీణ్యం గడించిన వ్యక్తి. తన జీవితంలో ఏర్పడిన ఒక విషాదం కారణంగా సంగీతాన్ని మరచిపోయి విరాగిలా తిరుగుతున్నా, సంగీతం మాత్రం అతన్ని అనుసరిస్తూనే వుంది. వెంకన్న సదానందను కలుసుకోవడం తటస్థించింది. అతని సంగీత జ్ఞానం వెంకన్నను ఆకర్షించి అతనికి శిష్యుడిని చేసింది. కానీ సదానంద అకస్మాత్తుగా మరణించడం మళ్ళీ వెంకన్నకు పిడుగుపాటే అయింది. జీవితం మీద అతనికి విరక్తి ఏర్పడింది. ఆ సమయంలో మేనమామ అనంతయ్య అతనిలో నూతన చైతన్యాన్ని కలిగించాడు. మదుకరి నాయక ఆస్థానంలో వెంకన్నకు సంగీత విద్వాంసుని పదవి లభించేలా చేశాడు. పదవి లభించడంతో వెంకన్న స్వభావం మారసాగింది. అతనిలో అహం, అధికారం చోటు చేసుకోసాగాయి. ఫలితంగా ఒకరోజు తనకంటే చిన్నవాడైన ఒక మృదంగ వాద్యనిపుణుని ముందు అవమానం పొంద వలసి వచ్చింది.

ఆ సమయంలో జీవితానుభవం పండిన ఓ జ్ఞాని అతని కళ్ళు తెరిపించడంతో వెంకన్న తన పదవిని విడిచిపెట్టి ఒంటరిగా సంగీత సాధన ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా అతనికి దూరమైన వెంకన్న ప్రేయసి చంద్రాసాని ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. వెంకన్న ఆమెను కాపాడి, ఆమె వ్యామోహంలో బందీ అవుతాడు. తన సంగీతసాధనను విస్మరిస్తాడు. వెంకన్న సంగీత ప్రతిభ నిరుపయోగం కాకూడదని అనంతయ్య చేసిన తీవ్రమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వెంకన్నలో మళ్ళా కొత్త చైతన్యం ఉద్భవిస్తుంది. అతను బంధాలన్నీ తెంపుకుని తన జీవిత లక్ష్యాన్ని సంగీతానికే అంకితం చేసి భైరవీ రాగ సాధనలో ఆపూర్వమైన ప్రావీణ్యాన్ని గడిస్తాడు.

ఈలోగా దేశంలో ఏర్పడిన రాజకీయ పరిణామాలవల్ల మదకరి నాయకుని రాజ్యం హైదరాలీ హస్తగతమౌతుంది. ఒక రోజు హైదరాలీ కుమారుడు టిప్పు సుల్తాన్ వెంకన్నను తన ఆస్థానంలోకి వచ్చి సంగీతం పాడవలసిందిగా కోరతాడు. వెంకన్న తన సంగీతం శ్రీదేవికే అంకితమైనదని, టిప్పుసుల్తాన్ కోరిక అంగీకరించలేననీ జవాబిస్తాడు. టిప్పు ఆగ్రహావేశాలతో ఇరవై నాలుగు గంటలలోగా వెంకన్న తన ఆజ్ఞ పాటించకపోతే అతని నాలుక ఖండించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.

తన సంగీతాన్ని, జీవితాన్ని జగన్మాతకే అంకితం చేసిన వెంకన్న ఆ శ్రీదేవి ముందే తన చివరి గీతాన్ని పాడి తన నాలుకను తానే కోసుకుని విగత జీవుడవుతాడు. టిప్పు తన ఆగ్రహావేశాల ఫలితంగా జరిగిన విషాదానికి చింతిస్తూ దేశ చరిత్రలో వెంకన్నగాధ రక్తాక్షరాలతో లిఖింపబడడానికి తాను కారకుడైనందుకు కుమిలిపోతాడు.[1]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1975 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ కన్నడ సినిమా జి.వి.అయ్యర్ గెలుపు
1975 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గెలుపు
1975 కర్ణాటక రాష్ట్రప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ద్వితీయ సినిమా జి.వి.అయ్యర్ గెలుపు
1975 కర్ణాటక రాష్ట్రప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకుడు మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం, బి.వి.కారంత్ గెలుపు
1975 కర్ణాటక రాష్ట్రప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రాహకుడు నేమాయ్ ఘోష్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 November 1975). "చివరిగీతం". విజయచిత్ర. 10 (3): 46–49.

బయటి లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=హంసగీతె&oldid=3867080" నుండి వెలికితీశారు