హబీబ్ ఫైసల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హబీబ్ ఫైసల్
హబీబ్ ఫైసల్ (2012)
జననం
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం

హబీబ్ ఫైసల్ మధ్యప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, గీత రచయిత. దో దూనీ చార్ (2010), ఇషాక్‌జాదే (2012) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జననం[మార్చు]

హబీబ్ ఫైసల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

జామియా మిలియా ఇస్లామియా పూర్వ విద్యార్థి. కరీనా కరీనా అనే టెలివిజన్ సీరియల్ కు దర్శకత్వం వహించాడు.[1] న్యూఢిల్లీలో ఎన్డీటీవిలో కెమెరా పర్సన్‌గా పనిచేశాడు.[2]

2010లో దో దూని ఛార్ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.[3] ఆ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ తీసిన సలామ్ నమస్తేకు సహ రచయితగా పనిచేశాడు.[4] అభిషేక్ బచ్చన్, ప్రీతి జింటాలతో దర్శకుడు షాద్ అలీ తీసిన ఝూమ్ బరాబర్ ఝూమ్,[4] సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన సిద్ధార్థ్ ఆనంద్ తీసిన తరా రమ్ పమ్,[4] 2010లో విడుదలైన బ్యాండ్ బాజా బారాత్‌ సినిమాలకు కూడా రాశాడు.[5]

2012లో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రాలతో ఇషాక్‌జాదే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. [6] ఈ సినిమా విమర్శకుల నుండి సానుకూల స్పందనను పొందడంతోపాటు బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్ళను సాధించింది.[7] ఆ తర్వాత నూపూర్ అస్థాన దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్, రిషి కపూర్‌లు నటించిన బెవకూఫియాన్‌ సినిమాకు రాశాడు.[8] 2014లో ఆదిత్య రాయ్ కపూర్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలతో దావత్-ఎ-ఇష్క్ అనే సినిమా తీశాడు.[9] దావత్-ఎ-ఇష్క్ 2014 సెప్టెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[10][11]

2017 ఆగస్టు 25న ఇతని నాలుగవ సినిమా ఖైదీ బ్యాండ్ విడుదలైంది.

పాటలు[మార్చు]

పేరు సంవత్సరం గాయకుడు సినిమా
"చోక్రా జవాన్" 2012 అమిత్ త్రివేది ఇషాక్జాదే
"జగ్ మాగ్" 2017 ఖైదీ బ్యాండ్
"ఐ అయామ్ ఇండియా" 2017

సినిమాలు[మార్చు]

  • 2021: దిల్ బెకరార్ (దర్శకుడు, అదనపు మాటలుస్)
  • 2020: ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్) (రచయిత)
  • 2018: రాజుగాడు (తెలుగు సినిమా) (రచయిత, మారుతితో పాటు)
  • 2018: హోమ్ (దర్శకుడు, బాలాజీ ఒరిజినల్ సిరీస్)
  • 2017: ఖైదీ బ్యాండ్ (రచయిత, దర్శకుడు)
  • 2016: ఫ్యాన్ (రచయిత)
  • 2014: దావత్-ఎ-ఇష్క్ (రచయిత, దర్శకుడు)
  • 2014: బెవకూఫియాన్ (రచయిత)
  • 2012: ఇషాక్‌జాదే (దర్శకుడు)
  • 2011: లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (మాటలు)
  • 2010: బ్యాండ్ బాజా బారాత్ (స్క్రీన్ ప్లే, మాటలు)
  • 2010: దో దూని చార్ (రచయిత, దర్శకుడు)
  • 2007: జూమ్ బరాబర్ ఝూమ్ (రచయిత)
  • 2007: త ర రమ్ పమ్ (స్క్రీన్ ప్లే, మాటలు)
  • 1996: ఓపస్ 27 (షార్ట్ ఫిల్మ్)
  • 1992: ఎలక్ట్రిక్ మూన్ (అసిస్టెంట్ డైరెక్టర్)

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు వర్గం శీర్షిక ఫలితం మూలాలు
2010 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సంభాషణలు బ్యాండ్ బాజా బారాత్ గెలుపు [12]
2010 స్క్రీన్ అవార్డులు ఉత్తమ సంభాషణలు గెలుపు [13]
2010 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ డూ దూని ఛార్ గెలుపు
2012 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ గీత రచయిత ఇషాక్జాదే నుండి "చోక్రా జవాన్" ప్రతిపాదించబడింది [14]
2021 ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డులు ఉత్తమ ఒరిజినల్ కథ ఆశ్రమ్ ప్రతిపాదించబడింది [15]

మూలాలు[మార్చు]

  1. "Writing is a very solitary experience: Habib Faisal". Hindustan Times. 18 October 2015. Retrieved 2023-07-29.
  2. "Jhoom celebrates a positive attitude". Rediff.com. 15 June 2007. Retrieved 31 December 2010.
  3. "Do Dooni Chaar about state of teachers in India". The Indian Express. 5 October 2010. Retrieved 2023-07-29.
  4. 4.0 4.1 4.2 "Middle Class Hero". The Indian Express. 15 October 2010. Retrieved 2023-07-29.
  5. "Nothing filmy about Band Baaja Baarat". The Indian Express. 24 November 2010. Retrieved 2023-07-29.
  6. "Ishaqzaade - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
  7. "Rowdy Rathore Bumper Opening In Single Screens Good At Multiplexes". Box Office India. Archived from the original on 5 November 2013. Retrieved 2023-07-29.
  8. "Bewakoofiyaan - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
  9. "Daawat-e-Ishq - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
  10. "Daawat-E-Ishq to release on September 19". The Times of India. Retrieved 2023-07-29.
  11. "Daawat-e-Ishq release date shifted to 19 Sept". India Today. Retrieved 2023-07-29.
  12. "Filmfare Awards: Bollywood and Regional Film Awards". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-29.
  13. "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-07-29.
  14. "Nominations - Mirchi Music Award Hindi 2012". www.radiomirchi.com. Retrieved 2023-07-29.
  15. "Nominees for the MyGlamm Filmfare OTT Awards 2021". Filmfare (in ఇంగ్లీష్). 2 December 2021. Retrieved 2023-07-29.

బయటి లింకులు[మార్చు]