హలో బ్రదర్
స్వరూపం
(హలో బ్రదర్ నుండి దారిమార్పు చెందింది)
హలో బ్రదర్ | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
రచన | ఎల్. బి. శ్రీరామ్ (మాటలు) |
నిర్మాత | కె. ఎల్. నారాయణ |
తారాగణం | అక్కినేని నాగార్జున , సౌందర్య , రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాల రెడ్డి |
కూర్పు | కె. రవీంద్రబాబు |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 |
భాష | తెలుగు |
హలో బ్రదర్ 1994లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా రమ్యకృష్ణ, సౌందర్య జంటగా నటించి మంచి ప్రజాదరణ పొందిన సినిమా ఇది.[1]
కథ
[మార్చు]ఎస్.పి. చక్రవర్తి మిశ్రో అనే బందిపోటు దొంగను నిర్భందిస్తాడు. తప్పించుకోవడం కోసం మిశ్రో తనను తానే కాల్చుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వస్తారు. అదే సమయానికి చక్రవర్తి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లలిద్దరూ దగ్గర్లో ఉంటే అసంకల్పితంగా ఒకరినొకరు అనుకరిస్తారని వైద్యులు చెబుతారు. మిశ్రో చక్రవర్తి భార్త గీతను గాయపరిచి వారిలో ఒక పిల్లాడిని తీసుకుని పారిపోతాడు. చక్రవర్తి అతణ్ణి వెంబడిస్తుంటే మిశ్రో ఆ పిల్లాడిని రైలు పట్టాలపై పడుకోబెట్టేస్తాడు. చక్రవర్తి అతన్ని కాల్చి చంపుతాడు. రైలు పట్టాలపై ఉన్న బిడ్డను వేరే దంపతులు చేరదీస్తారు.
తారాగణం
[మార్చు]- దేవా/రవివర్మ గా నాగార్జున ద్విపాత్రాభినయం
- మంగ గా రమ్యకృష్ణ
- ఊహ గా సౌందర్య
- చక్రవర్తి గా శరత్ బాబు
- చక్రవర్తి భార్య గీత గా సంగీత
- మిత్రా గా నెపోలియన్
- మిశ్రో గా చరణ్ రాజ్
- రాజనాల
- అక్కమాంబ గా అన్నపూర్ణ
- మంగ తండ్రి గా గిరిబాబు
- కాశీ గా బ్రహ్మానందం
- సత్తి పండు గా బాబుమోహన్
- తాడి మట్టయ్య గా కోట శ్రీనివాసరావు
- చిట్టి గా మల్లికార్జున రావు
- ఆలీ
- శ్రీహరి
పాటలు
[మార్చు]- ప్రియరాగాలే గుండె లోన పొంగుతున్న ఈ వేళ , రచన: భువన చంద్ర,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
- కన్నెపిట్టరో కన్ను కొట్టరో, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- అబ్బా ఏందెబ్బా , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఎక్కండయ్యా బాబు వచ్ఛిందయ్యా బండి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మనసిచ్చీ ఇచ్చీ బరువాయే , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- చుక్కేసి పక్కేసి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.
ఇతర వివరాలు
[మార్చు]- ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండే సన్నివేశాల్లో నాగార్జునకి డూప్ గా నటుడు శ్రీకాంత్ నటించాడు.[2].1994లో విడుదలైన ‘హలో బ్రదర్’ సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.
మూలాలు
[మార్చు]- ↑ "హలో బ్రదర్ సినిమా". iqlikmovies.com. Retrieved 27 February 2018.
- ↑ Andrajyothy (29 September 2021). "Hello Brother: నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా?". Archived from the original on 29 సెప్టెంబరు 2021. Retrieved 29 September 2021.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- అక్కినేని నాగార్జున సినిమాలు
- 1994 తెలుగు సినిమాలు
- రాజనాల నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- రమ్యకృష్ణ నటించిన సినిమాలు
- సౌందర్య నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు
- శివాజీ రాజా నటించిన సినిమాలు