Jump to content

2017 భారత చైనా సరిహద్దు ప్రతిష్ఠంభన

వికీపీడియా నుండి
2017 భారత చైనా సరిహద్దు ప్రతిష్ఠంభన
తేదీ2017 జూన్ 16 – 2017 ఆగస్టు 28
(2 నెలలు, 1 వారం , 5 రోజులు)
ప్రదేశండోక్లమ్
ఫలితంస్టేటస్ కో యాంటె బెల్లమ్
  • ఇరు పక్షాలూ తమ బలగాలను డోక్లాం నుండి ఉపసంహరించాయి
ప్రత్యర్థులు
 India
(on behalf of  Bhutan)
 China
ప్రాణ నష్టం, నష్టాలు
అనేకమంది గాయపడ్డారు[1]అనేకమంది గాయపడ్డారు[1]

2017 భారత చైనా సరిహద్దు ప్రతిష్టంభన లేదా డోక్లామ్ ప్రతిష్టంభన అనేది చైనాలో డోంగ్లాంగ్ లేదా డోంగ్లాంగ్ కావోచాంగ్ (అంటే డోంగ్లాంగ్ పచ్చిక బయళ్ళు) అని పిలువబడే ట్రైజంక్షన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న డోక్లామ్‌లో చైనా రహదారిని నిర్మించడంపై భారత సాయుధ దళాలు, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య జరిగిన సైనిక ప్రతిష్టంభన. 2017 జూన్ 16న చైనా, భారతదేశ మిత్రదేశమైన భూటాన్ క్లెయిమ్ చేసే భూభాగమైన డోక్లామ్‌లో నిర్మాణ వాహనాలు, రహదారి నిర్మాణ సామగ్రితో చైనా సైనికులు ఇప్పటికే ఉన్న రహదారిని దక్షిణం వైపు విస్తరించడం ప్రారంభించారు.[2][3][4][5][6][7]

2017 జూన్ 18న, ఆపరేషన్ జూనిపర్‌లో భాగంగా,[8] దాదాపు 270 మంది సాయుధ భారత సైనికులు రెండు బుల్‌డోజర్‌లతో సిక్కిం సరిహద్దును దాటి డోక్లామ్‌లోకి ప్రవేశించి, చైనా దళాలను రహదారిని నిర్మించకుండా అడ్డుకున్నారు.[4][9][10] ఆగస్టు 28న, డోక్లామ్‌లోని ఈ ముఖాముఖి ప్రదేశం నుండి తమ సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు భారత్, చైనాలు ప్రకటించాయి.

నేపథ్యం

[మార్చు]
పటం
About OpenStreetMaps
Maps: terms of use
8km
5miles
జోంపెల్రి రిడ్జ్
జోంపెర్లి రిడ్జ్
డోంగ్‌క్యా రేంజి
డోంగ్‌క్యా రేంజ్
అమో చు నది
అమో చు
సిన్‌చేలా
సిన్చేలా
డోకా లా
డోకా లా
బటాంగ్ లా
బటాంగ్ లా
గిప్‌మోచి శిఖరం
గిప్‌మోచి
OpenStreetMap లో డోక్లామ్ భూటాన సరిహద్దు స్థానాలు ; పశ్చిమాన సిక్కిం ఉత్తరాన చుంబీ లోయ

డోక్లామ్, చైనా భూటాన్ మధ్య వివాదాస్పద ప్రాంతం. ఇది, ఈ రెండు దేశాలు, భారతదేశం ఈ మూడింటి ట్రై-జంక్షన్ సమీపంలో ఉంది.[11][12] చైనా, భూటాన్‌ల లాగా భారత్‌, డోక్లామ్‌ తమదని వాదించదు గానీ, భూటాన్‌ వాదనకు మద్దతిస్తోంది.[4][13][14]

డోక్లామ్‌పై చైనా దావా 1890లో చైనా, బ్రిటన్‌ల మధ్య కలకత్తాలో కుదిరిన 1890 బ్రిటిషు చైనా ఒడంబడికపై ఆధారపడి ఉంది.[15]

ఈ ఒప్పందం ప్రకారం, సిక్కిం-టిబెట్ సరిహద్దు ప్రారంభ స్థానం "భూటాన్ సరిహద్దులో ఉన్న గిప్మోచి పర్వతం" అని, ఇది ట్రై-జంక్షన్ పాయింట్‌ను స్పష్టంగా నిర్వచిస్తుందనీ చైనా నొక్కి చెప్పింది. [16] [17]  అయితే, భూటాన్ ఆ సదస్సులో భాగస్వామి కాదు. దానిపై సంతకం చేయడానికి ముందు భూటాన్‌ను సంప్రదించినట్లు ఎటువంటి ఆధారాలూ లేవు.[18][19]

1949లో, భూటాన్ తన దౌత్య, రక్షణ వ్యవహారాలకు మార్గనిర్దేశం చేసేందుకు భారతదేశానికి భత్యం ఇచ్చే ఒప్పందంపై సంతకం చేసింది. 2007లో, ఈ ఒప్పందం స్థానే కొత్త స్నేహ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం, భారత్‌కు డబ్బులు చెల్లించే అవసరం ఇక భూటాన్‌కు లేదు. అయితే భూటాన్ తన విదేశాంగ విధానాన్ని భారతదేశంతో సమన్వయం చేసుకోవడానికి అంగీకరించింది.

1958 నుండి, చైనా మ్యాప్‌లు భూటాన్ భూభాగంలోని పెద్దపెద్ద భాగాలను చైనాలో భాగంగా చూపించడం ప్రారంభించాయి.[20] 1960వ దశకంలో స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి, అయితే 1970లలో చైనా, భూటాన్‌ల మధ్య చర్చలు జరిగాయి. కొన్నిసార్లు భారతదేశం సహాయక పాత్రను పోషించింది. డోక్లామ్ పీఠభూమి స్థితిపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడంలో ఈ చర్చలు విఫలమయ్యాయి. 1984లో మొదలైనప్పటి నుండి భూటాన్, చైనాలు 24 రౌండ్ల సరిహద్దు చర్చలను నిర్వహించాయి. 1988, 1998లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. రెండవ ఒప్పందంలో, ఇరుపక్షాలూ బలాన్ని ఉపయోగించడదని కట్టడి కూడా చేసింది. శాంతియుత మార్గాలను కచ్చితంగా పాటించేలా రెండు పార్టీలను ప్రోత్సహించింది.

2000వ దశకం ప్రారంభంలో చైనా, సించేలా పాస్ (వివాదరహిత భూభాగంలో) వరకు, ఆపై పీఠభూమి మీదుగా (వివాదాస్పద భూభాగంలో), డోకా లా పాస్ వరకు రోడ్డు నిర్మించింది. సిక్కిం సరిహద్దులో ఉన్న భారత స్థావరానికి 68 మీటర్ల దగ్గర వరకు ఈ రహదారిని నిర్మించింది. ఇక్కడ, వారు వాహనాలు వెనక్కి తిరిగేందుకు వీలుగా మలుపును నిర్మించారు. ఈ రహదారి కనీసం 2005 నుండి ఉనికిలో ఉంది [21] ఈ రహదారిని దక్షిణంగా పొడిగించడం 2017 ప్రతిష్టంభనకు దారితీసింది.[4]

ఘటన కాలక్రమం

[మార్చు]

2017 జూన్ 16న, చైనా దళాలు నిర్మాణ వాహనాలు, రహదారి నిర్మాణ సామగ్రితో డోక్లామ్ పీఠభూమిపై ఇప్పటికే ఉన్న రహదారిని దక్షిణ దిశగా విస్తరించడం ప్రారంభించాయి.[2][4][5][6]

2017 జూన్ 18న, దాదాపు 270 మంది భారత సైనికులు, ఆయుధాలు, రెండు బుల్‌డోజర్‌లతో డోక్లామ్‌లోకి ప్రవేశించి చైనా దళాలు చేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు.[4][10]

2017 జూన్ 29న, వివాదాస్పద భూభాగంలో చైనా రహదారిని నిర్మించడాన్ని భూటాన్ నిరసించింది.[22] భూటాన్ ప్రభుత్వం ప్రకారం, చైనా గతంలో డోకా లా వద్ద ఆగిన రహదారిని, జంఫేరి రిడ్జ్‌కి దక్షిణంగా 2 కి.మీ. దూరంలో ఉన్న జోర్న్‌పెల్రి వద్ద ఉన్న భూటాన్ ఆర్మీ క్యాంప్ వైపు విస్తరించడానికి ప్రయత్నించింది. ఆ శిఖరాన్ని చైనా సరిహద్దుగా చూస్తుంది. కానీ భూటాన్, భారతదేశం రెండింటి అభిప్రాయం ప్రకారం అది పూర్తిగా భూటాన్‌లో ఉంది. భారతదేశానికి అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్‌ను చేరుకునేలా తూర్పు వైపున విస్తరించి ఉంది.[23] పెరుగుతున్న ఉద్రిక్తతల ఫలితంగా భూటాన్ సరిహద్దులో హై అలర్ట్‌ను ఉంచారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.[24]

అదే రోజున చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డోక్లామ్‌ను చైనాలో భాగంగా చిత్రీకరిస్తూ మ్యాప్‌ను విడుదల చేసింది. మ్యాప్‌ను ఉదాహరణగా ఉపయోగిస్తూ, చైనా ప్రతినిధిలు కాంగ్, 1890 కలకత్తా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ Iని చదివి, మ్యాప్‌లో చూపిన విధంగా గిప్‌మోచికి ఈశాన్య భూభాగమైన డోంగ్‌లాంగ్ (డోక్లామ్) ప్రాంతం చైనాకు చెందినదని రుజువు చేసింది.[25]

జూన్ 30న, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డోక్లామ్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు పేరుతో తన అధికారిక వైఖరిని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది.[26] ట్రై-జంక్షన్ సరిహద్దు పాయింట్లను ఖరారు చేయడం, భద్రతాపరమైన ఆందోళనలను కలిగించడం గురించి రెండు ప్రభుత్వాల మధ్య 2012 నాటి అవగాహనను ఉల్లంఘించి యథాతథ స్థితిని చైనా మార్చిందని అభియోగాలు మోపింది.[27] డోకా లా వద్ద ఉన్న "భారత సిబ్బంది" భూటాన్‌తో సమన్వయం చేసుకున్నారని, "చైనీస్ కన్‌స్ట్రక్షన్ పార్టీని సంప్రదించి, యథాతథ స్థితిని మార్చకుండా ఉండవలసిందిగా వారిని కోరారు." అనీ ఆ ప్రకటనలో తెలిపింది.[26]

జూన్ 30న, భూటాన్ నిరసన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చైనా అధికార ప్రతినిధి లూ కాంగ్, డోక్లామ్ చరిత్ర గురించి, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం పూర్తిగా చైనా అధికార పరిధిలో ఉంది, ఎందుకంటే ఇది చైనా-భూటాన్ సంప్రదాయ సంప్రదాయ రేఖకు పూర్తిగా చైనా వైపు ఉంది అని చెబుతూ, ఈ క్రింది ప్రకటన చేశారు:[28]

1960లకు ముందు, భూటాన్ సరిహద్దు నివాసులు డోక్లామ్‌లో పశువులను మేపుకోవాలంటే, వారికి చైనా సమ్మతి అవసరమయ్యేది. చైనాకు గడ్డి పన్ను చెల్లించాల్సి వచ్చేది. జి జాంగ్ టిబెట్ ఆర్కైవ్స్ లో ఇప్పటికీ ఆ గడ్డి పన్ను రశీదులు ఉన్నాయి.

2017 జూలై 3న, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, 1890 బ్రిటన్-చైనా ఒప్పందాన్ని అంగీకరించారు అని చెబుతూ:[29]

అదే సంవత్సరం సెప్టెంబరు 26న, ప్రీమియర్ జౌ ఎన్‌లాయ్‌కి రాసిన సమధానంలో ప్రధాన మంత్రి నెహ్రూ, నిస్సందేహంగా "సిక్కిం, జి జాంగ్, చైనా మధ్య సరిహద్దు 1890 కన్వెన్షన్ ద్వారా నిర్వచించబడింది. ఈ సరిహద్దు 1895లో గుర్తించబడింది. సిక్కిం, జి జాంగ్ ( టిబెట్ ), చైనాల మధ్య సరిహద్దుపై ఎటువంటి వివాదం లేదు. ".

భారత మీడియా, చైనా ఉదహరించిన 1959 సెప్టెంబరు 26న నెహ్రూ జౌకు రాసిన లేఖలో వాస్తవానికి, 1959 సెప్టెంబరు 8న జౌ చేసిన వాదనలను పాయింట్లవారీగా ఖండించినట్లు నివేదించింది. పూర్తిగా ప్రచురించనప్పటికీ, భారతీయ పత్రికలకు లభించిన ఆ లేఖలో, నెహ్రూ ఇలా వ్రాశారు:[30]

1890 నాటి ఈ సమావేశం సిక్కిం, టిబెట్ మధ్య సరిహద్దును కూడా నిర్వచించింది; ఆ తరువాత, 1895లో సరిహద్దును గుర్తించారు. అందువల్ల టిబెట్ ప్రాంతంతో సిక్కిం సరిహద్దుకు సంబంధించి ఎలాంటి వివాదం లేదు.

వివాదాస్పద ట్రై-జంక్షన్ గురించి భారత మీడియా అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ క్రింది వ్యాఖ్యతో సమాధానమిచ్చారు:[29]

ట్రై జంక్షన్ అని పిలవబడేది, ఆ పేరు సూచిస్తున్నట్లు, ఒక బిందువు. ఇది రేఖ కాదు, ఒక ప్రాంతం అంతకంటే కాదు. భారతదేశం ట్రై-జంక్షన్ పాయింట్‌ను ఒక ప్రాంతం అని తప్పుగా అర్థం చేసుకుంటోంది. ఈసారి, భారత సైన్యపు అతిక్రమణ స్థానం సిక్కిం-చైనా సరిహద్దులో ఉంది. ఈ ట్రై-జంక్షన్ బిందువు, 1890 ఒప్పందం గుర్తించిన మౌంట్ గిప్మోచి నుండి 2000 మీటర్ల దూరంలో ఉంది.

2017 జూలై 5 న చైనా ప్రభుత్వం, డోక్లామ్ చైనాకు చెందుతుందని భూటాన్‌తో గత 24 నెలలుగా ప్రాథమిక ఏకాభిప్రాయం ఏర్పడిందని, రెండు దేశాల మధ్య ఎలాంటి వివాదం లేదనీ పేర్కొంది.[31]

2017 జూలై 19 న, డోక్లామ్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశానికి చైనా పిలుపునిచ్చింది.[32]

2017 జూలై 24 న, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విలేకరులతో మాట్లాడుతూ, డోక్లామ్‌లో ప్రతిష్టంభనలో ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది చాలా స్పష్టంగా ఉందనీ, చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడలేదని భారతీయ సీనియర్ అధికారులు కూడా బహిరంగంగా చెప్పారనీ చెప్పాడు.[33][34] "మరో మాటలో చెప్పాలంటే, చైనా భూభాగంలోకి తాము ప్రవేశించినట్లు భారతదేశం అంగీకరించింది. ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం - వారు తమ నడవడి మార్చుకుని ఉపసంహరించుకుంటారు" అని వాంగ్ చెప్పాడు.[33][34]

ఉపసంహరణ

[మార్చు]

2017 ఆగస్టు 28న, డోక్లామ్‌లో ప్రతిష్ఠంభన నుండి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్లు భారత చైనాలు ప్రకటించాయి. రోజు ముగిసే సమయానికి ఉపసంహరణ పూర్తయినట్లు సమాచారం.[35][36]

భూటాన్ సరిహద్దులో 500 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న డోకా లా వద్ద ఉన్న తమ అవుట్‌పోస్ట్ వద్దకు భారత దళాలు తిరిగి వెళ్ళాయి.[37][38] టైమ్స్ ఆఫ్ ఇండియా, ఒక మూలాన్ని ఉటంకిస్తూ ఇలా నివేదించింది: "పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై-జంక్షన్ సమీపంలో రహదారిని నిర్మించడం ద్వారా యథాతథ స్థితిని మరోసారి ఏకపక్షంగా మార్చడానికి మళ్ళీ ప్రయత్నిస్తే, మన సైనికులు శిఖరం పైభాగంలో కూర్చుని, వేగంగా స్పందించగలరు." [37]

ఉపసంహరణకు భారతదేశం, చైనాలు పరస్పరం అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారతదేశం, చైనాలు ఇటీవలి వారాల్లో దౌత్యపరమైన సంభాషణను కొనసాగించాయనీ, భారతదేశం తన "ఆందోళనలు, ప్రయోజనాలను" తెలియజేయగలిగిందని ఆ ప్రకటన పేర్కొంది. బీజింగ్‌లో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ఆ స్థలంలో ఉన్న చైనా దళాలు భారత దళాలు వైదొలిగునట్లు ధ్రువీకరించాయని చైనా దళాల సంఖ్య తగ్గుతోందనీ సూచించింది. చైనా దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ కొనసాగిస్తాయని, దానిని దండుగా ఉంచడానికి, "సార్వభౌమ హక్కులను" వినియోగించుకుంటాయనీ ఆమె చెప్పింది. అయితే, ఆమె రోడ్డు నిర్మాణ కార్యకలాపాల గురించి ప్రస్తావించలేదు. ది డిప్లొమాట్ ప్రకారం, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, "బీజింగ్ ప్రతిష్టంభన నుండి బయటపడే మార్గాన్ని అందించింది." అని ప్రకటించారు.[38]

అదే రోజున మళ్ళీ ఇరుపక్షాలూ తమ దళాలను ఉపసంహరించుకున్నట్లు భారతీయ విదేశీ వ్యవహారాల సాఖ మరో ప్రకటనను విడుదల చేసింది. దాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉన్నట్టు కూడా తెలిపింది. ఆ రోజు చివర్లో భారతీయ వార్తా ఛానెల్ NDTV, చైనీయుల రోడ్డు నిర్మాణ పరికరాలను ప్రతిష్ఠంభన స్థలం నుండి తొలగించినట్లు నివేదించింది. మరొక ప్రతిష్టంభన పూర్తిగా సాధ్యమే కాబట్టి అతిగా ఆశాజనకంగా ఉండకూడదని కొందరు నిపుణులు హెచ్చరించారు.[35][36]

భారత్ ఉపసంహరణకు ప్రతిగా చైనా రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించడం వంటి రాయితీలేమైనా అందించిందా అనేది స్పష్టంగా తెలియదని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందం ఇరుపక్షాల పరువు కాపాడుకునేందుకు వీలు కల్పించిందని పేర్కొంది. అయినప్పటికీ చైనా తన అధికారిక వ్యాఖ్యలలో "జాగ్రత్త"ను కొనసాగిస్తోంది.[35][39] చైనా తన చారిత్రక వాదనలను వదులుకోవడం లేదని, తన "చారిత్రక సరిహద్దులను" భారతదేశం గౌరవిస్తుందని భావిస్తున్నట్లూ అల్ జజీరా తెలిపింది.[40] రహదారిని విస్తరించడం కాకుండా, ఆ ప్రాంతాన్ని రక్షించడానికి చైనాకు చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని స్కాలర్ టేలర్ ఫ్రావెల్ ఎత్తి చూపారు.[41]

ఉపసంహరణను భూటాన్, ఆగస్టు 29 న స్వాగతించింది. ఇది ప్రశాంతతకు, సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని కొనసాగించడానికీ దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.[42]

సెప్టెంబరు 5న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా గంటసేపు చర్చలు జరిపారు. వారు "ముందు చూపు" విధానాన్ని పాటించాలని అంగీకరిస్తూ, డోక్లామ్ ప్రతిష్టంభన వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడం చాలా అవసరమని వారు పునరుద్ఘాటించారు.[43]

రెండు దేశాల సైనికులు ఇప్పటికీ తమ మునుపటి స్థానం నుండి 150 మీటర్లు వెనక్కి వెళ్లి, ముఖాముఖి స్థలం ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నాయని సెప్టెంబరు 7 న కొన్ని వార్తల్లో వచ్చింది.[44]

భూటానీయుల స్పందన

[మార్చు]

భూటాన్ ప్రభుత్వం, జూన్ 29 న పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత మౌనంగా ఉండిపోయింది. మీడియా కూడా నిశబ్దంగా ఉండిపోయింది.[45] చైనా రహదారిని నిర్మిస్తున్న భూభాగం, "భూటాన్ భూభాగం" అని, దాన్ని చైనా తనదిగా చెప్పుకుంటోందనీ, ఇది తమ సరిహద్దు చర్చలలో భాగమనీ భూటాన్ స్పష్టం చేసింది.[46] భూటాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిశ్శబ్ద విధానాన్ని ఈ ప్రకటన సమర్థిస్తూ, "భారతదేశం, చైనాలు యుద్ధానికి వెళ్లాలని భూటాన్ కోరుకోవడం లేదు. ఇప్పటికే వేడెక్కిన పరిస్థితిని మరింత వేడెక్కించేలా ఏమీ చేయకుండా అది నివారిస్తోంది." అని చెప్పింది.[47]

ఇతరత్రా

[మార్చు]

భారతదేశం, చైనాకు డబ్బులు చెల్లించి బ్రహ్మపుత్ర నది సరిహద్దు ప్రవాహాలపై డేటాను కొనుక్కుంటూ ఉంటుంది. ప్రతిష్టంభన సమయం, నదికి గరిష్ఠ స్థాయి వరదలు వచ్చే సమయం కూడా. ఆ సమయంలో చైనా, ఈ డేటాను భారతదేశానికి ఇవ్వడానికి నిరాకరించింది. ప్రబ్వాహాన్ని కొలిచే స్టేషన్లు కొట్టుకుపోయాయని వంక చెప్పింది.[48]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "India, China soldiers involved in border altercation: Indian sources". Reuters. 18 August 2017. Archived from the original on 15 August 2017.
  2. 2.0 2.1 "Press Release – Ministry of Foreign Affairs". mfa.gov.bt. Archived from the original on 30 June 2017.
  3. China Foreign Ministry 2017, p. 6.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Barry, Ellen; Fisher, Max; Myers, Steven Lee (26 July 2017). "How India and China Have Come to the Brink Over a Remote Mountain Pass". The New York Times. ISSN 0362-4331. Archived from the original on 27 August 2017.
  5. 5.0 5.1 "China says India violates 1890 agreement in border stand-off". Reuters. 3 July 2017. Archived from the original on 15 August 2017.
  6. 6.0 6.1 Safi, Michael (5 July 2017). "Chinese and Indian troops face off in Bhutan border dispute". The Guardian. Archived from the original on 10 August 2017.
  7. "Doklam standoff: China sends a warning to India over border dispute". Los Angeles Times. Associated Press. 24 July 2017. Archived from the original on 25 July 2017.
  8. Philip, Snehesh Alex (17 October 2019). "Operation Juniper — inside story of how Indian Army pushed China back from Doklam". The Print. Archived from the original on 18 October 2019.
  9. China Foreign Ministry 2017, p. 1.
  10. 10.0 10.1 George, Nirmala (August 2017). "China warns Indian troops to get out of contested region". Archived from the original on 10 August 2017.
  11. Pradhan, Ramakrushna (29 July 2017). "Doklam Standoff: Beyond Border Dispute". Mainstream Weekly. Archived from the original on 2 August 2017.
  12. Mitra, Devirupa (5 July 2017). "Expert Gyan: On India, China Stand-Off At Border Tri-Junction With Bhutan". The Wire. Archived from the original on 31 July 2017.
  13. Nanda, Prakash (30 June 2017). "Sikkim standoff: Beijing should realise Bhutan is as important to India as North Korea is to China". Firstpost. Archived from the original on 29 July 2017.
  14. "Indian bunker in Sikkim removed by China: Sources". The Times of India. 28 June 2017. Archived from the original on 28 June 2017.
  15. China Foreign Ministry 2017, p. 12–13.
  16. China Foreign Ministry 2017, p. 5.
  17. CGTN (14 August 2017), 'The Border': A debate between China & India
  18. Swami, Praveen (2017-07-05). "Behind the ongoing stand-off in Doklam, century-old manoeuvres of geostrategy". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-03-29.
  19. Manoj Joshi, Doklam, Gipmochi, Gyemochen: It's hard making cartographic sense of a geopolitical quagmire, Observer Research Foundation, 21 July 2017.
  20. Bhardwaj, Sandeep (2017-08-09). "Doklam may bring Bhutan closer to India". mint (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2017. Retrieved 2023-03-29.
  21. Panda, Ankit. "The Political Geography of the India-China Crisis at Doklam". The Diplomat (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 14 July 2017. Retrieved 2023-03-29.
  22. "Press Release – Ministry of Foreign Affairs". 21 August 2017. Archived from the original on 21 August 2017.
  23. Gurung, Shaurya Karanbir (2018-07-12). "Behind China's Sikkim aggression, a plan to isolate Northeast from rest of India". The Economic Times. ISSN 0013-0389. Archived from the original on 24 August 2017. Retrieved 2023-03-29.
  24. "Bhutan issues scathing statement against China, claims Beijing violated border agreements of 1988, 1998". Firstpost. 30 June 2017. Archived from the original on 2 July 2017.
  25. Krishnan, Ananth (July 2, 2017). "EXCLUSIVE: China releases new map showing territorial claims at stand-off site". India Today. Archived from the original on 4 July 2017.
  26. 26.0 26.1 "Recent Developments in Doklam Area". mea.gov.in. Archived from the original on 16 August 2017.
  27. Panda, Ankit (July 18, 2017). "What's Driving the India-China Standoff at Doklam?". The Diplomat. Archived from the original on 19 July 2017.
  28. "Foreign Ministry Spokesperson Lu Kang's Regular Press Conference on June 30, 2017". Archived from the original on 1 February 2018.
  29. 29.0 29.1 "Foreign Ministry Spokesperson Geng Shuang's Regular Press Conference on July 3, 2017". fmprc.gov.cn. Archived from the original on 19 August 2017.
  30. Full letter EXT-1959-10-04_8160 Archived 26 ఆగస్టు 2017 at the Wayback Machine, Government of India.
  31. "No dispute with Bhutan in Doklam: China". The Economic Times. 5 July 2017. Archived from the original on 29 July 2017.
  32. Bodeen, Christopher (19 July 2017). "China holds live-fire drills in disputed Himalayan territory, tells India to withdraw". Archived from the original on 19 July 2017.
  33. 33.0 33.1 CCTV中文国际 (25 July 2017), [Focus Today] 20170726 | CCTV-4, archived from the original on 2 March 2019
  34. 34.0 34.1 "U.S. scholar: India should remember the history". www.ecns.cn. Retrieved 2023-03-29.
  35. 35.0 35.1 35.2 India, China agree to pull back troops to resolve tense border dispute Archived 29 ఆగస్టు 2017 at the Wayback Machine, The Washington Post, 28 August 2017
  36. 36.0 36.1 Gettleman, Jeffrey; Hernández, Javier C. (2017-08-28). "China and India Agree to Ease Tensions in Border Dispute". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 28 August 2017. Retrieved 2023-03-29.
  37. 37.0 37.1 Pandit, Rajat (29 August 2017). "Indian soldiers withdraw but hold vantage point, ready to step in again". The Times of India. Archived from the original on 3 September 2017.
  38. 38.0 38.1 Panda, Ankit (31 August 2017). "What China Learned About India at Doklam". The Diplomat. Archived from the original on 3 September 2017.
  39. Who blinked in the China-India military standoff?
  40. "China and India agree to end border standoff". www.aljazeera.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2017. Retrieved 2023-03-29.
  41. Fravel, Maris Taylor (2017-09-01). "Why India Did Not "Win" the Doklam Standoff with China". War on the Rocks (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 September 2017. Retrieved 2023-03-29.
  42. "Bhutan welcomes end of Doklam standoff". The Times of India. 2017-08-29. ISSN 0971-8257. Archived from the original on 16 August 2018. Retrieved 2023-03-29.
  43. Chaudhury, Dipanjan Roy (2018-07-13). "Doklam discussed, Pakistan skipped: Here's what happened at the 1 hour meet between Xi and Modi". The Economic Times. ISSN 0013-0389. Archived from the original on 7 September 2017. Retrieved 2023-03-29.
  44. "troops steeped back 150 meters each". Archived from the original on 8 September 2017.
  45. Myers, Steven Lee (15 August 2017). "Squeezed by an India-China Standoff, Bhutan Holds Its Breath". The New York Times. Archived from the original on 7 September 2017.
  46. Lamsang, Tenzing (2017-01-07). "Understanding the Doklam border issue". The Bhutanese (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 September 2017. Retrieved 2023-03-29.
  47. Lamsang, Tenzing (2017-05-08). "The Third Leg of Doklam". The Bhutanese (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 September 2017. Retrieved 2023-03-29.
  48. Chaudhary, Archana; Mangi, Faseeh (11 March 2020). "New Weather Patterns Are Turning Water Into a Weapon". Archived from the original on 13 March 2020.