Jump to content

తుమకూరు

అక్షాంశ రేఖాంశాలు: 13°20′N 77°06′E / 13.34°N 77.1°E / 13.34; 77.1
వికీపీడియా నుండి
(Tumkur నుండి దారిమార్పు చెందింది)
  ?తుముకూరు
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°20′N 77°06′E / 13.34°N 77.1°E / 13.34; 77.1
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 822 మీ (2,697 అడుగులు)
జిల్లా (లు) తుముకూరు జిల్లా
జనాభా 248,592 (2001 నాటికి)

తుమకూరు (కన్నడ: ತುಮಕೂರು), ఇది వరకు తుమ్కూరుగా పిలవడిన ఈ నగరం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రములోని ఒక ప్రముఖ నగరం. ఇది తుమకూరు జిల్లా ముఖ్యపట్టణం.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

వ్యుత్పత్తి ప్రకారం తుమకూరు ఇక్కడ విరివిగా కనిపించే తుంబే పువ్వు మీదుగా తుంబే ఊరు అన్న వాడుకనుండి వచ్చిందని భావిస్తారు. లేదా తమాటే ఊరు నుండి వచ్చిందని మరో అభిప్రాయం (ఇక్కడ పూర్వం ఉపయోగించేవారని భావిస్తున్న తమాటే ఒక డప్పు వాయిద్యము). ఈ నగరానికి కొబ్బరికాయల నగరం అని కూడా పేరు.

భౌగోళిక స్వరూపం

[మార్చు]

తుమకూరు 13°20′N 77°06′E / 13.34°N 77.1°E / 13.34; 77.1 అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది.[1] సముద్ర మట్టం నుండి ఈ నగరపు సరాసరి ఎత్తు 822 మీటర్లు (2696 అడుగులు). తుముకూరు నగరం యొక్క వాతావరణం బెంగుళూరును పోలి ఉంటుంది. బెంగుళూరుకు వాయువ్యాన 43 మైళ్ళ దూరములో ఉన్న ఈ నగరంలో దక్షిణ రైల్వే విభాగంలో భాగమైన రైల్వేస్టేషను ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] తుమకూరు 2,48,592 మంది జనాభా కలిగి ఉంది. అందులో 52% పురుషులు, 48% స్త్రీలు. తుముకూరు ప్రజల సగటు అక్షరాస్యత 75% (జాతీయ సరాసరి 59.5% కంటే అధికం). పురషులలో అక్షరాస్యత 79%. స్త్రీలలో అక్షరాస్యత 70‍%. 11% జనాభా 6 సంవత్సరాలు లేదా అంతకంటే పిన్నవయస్కులు.

ఆర్ధికరంగం

[మార్చు]

ఇక్కడ పండించే ప్రధాన పంటలు చిరుధాన్యాలు, వరి, పప్పుదినుసులు, పోకచెక్కలు , నూనెగింజలు. పరిశ్రమలలో ముతక నూలు వస్త్రాలు, ఉన్ని కంబళ్ళు, తాళ్ళు, గడియారాలు (హిందుస్తాన్ మెషీన్ టూల్స్), విప్రో, టి.వి.ఎస్.ఈ , కార్‌మోబిల్స్ ముఖ్యమైనవి. తుముకూరు పరిసరాల్లోని ఖ్యాత సంద్ర సిద్ధగంగ మఠము ప్రసిద్ధమైనది. ఇక్కడ దేశములోని వివిధ ప్రాంతాలకు చెందిన 8000కు పైగా విద్యార్థులు వివిధ సిద్ధగంగ సంస్థలలో విద్యనభ్యసించుచున్నారు. ఈ మఠానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగు కళాశాల (సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కూడా ఉంది. ఇటీవల సిద్ధగంగ మఠం నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుత మఠ నిర్వాహకుడు శివకుమార్ స్వామీజీని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం కర్ణాటక రత్న పురస్కారంతో సత్కరించింది.

కర్ణాటక అర్ధశతోత్సవం "సువర్ణ కర్ణాటక" పురస్కరించుకొని తుమ్కూరు యొక్క అధికారిక నామాన్ని తుమకూరుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఇంకా ఆమోదించలేదు. 80% శాతం రాష్ట్ర జనాభా రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు చేరటానికి తుమకూరు గుండా ప్రయాణించటం విశేషం.

జిల్లాలో తాలూకాలు

[మార్చు]
సిద్దగంగా మఠం, కోటే ఆంజనేయ స్వామి విగ్రహం, గ్లోబ్ లైబ్రరీ ఆఫ్ ఎస్ఎస్ఐటి, ఎస్ఐటి, ఇండియా ఫుడ్ పార్క్

తుముకూరు జిల్లాలో 10 తాలూకాలున్నాయి. అవి గుబ్బి, తిపటూరు, మధుగిరి, పావగడ, కొరటగేరె, సీరా, తురువెకేరె, చిక్కనాయకనహళ్ళి, కుణిగల్ , తుమకూరు.

మూలాలు

[మార్చు]
  1. "Falling Rain Genomics, Inc - Tumkur". Archived from the original on 2008-12-04. Retrieved 2008-11-22.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తుమకూరు&oldid=3939889" నుండి వెలికితీశారు