Jump to content

వరల్డ్ సిరీస్ క్రికెట్

వికీపీడియా నుండి
(WSC నుండి దారిమార్పు చెందింది)


వరల్డ్ సిరీస్ క్రికెట్
దస్త్రం:Wsc-logo.svg
నిర్వాహకుడుకెర్రీ ప్యాకర్
ఫార్మాట్వివిధ
తొలి టోర్నమెంటు1977
చివరి టోర్నమెంటు1979
జట్ల సంఖ్యనాలుగు:
Australia XI
Cavaliers XI
World XI
West Indies XI
అత్యధిక పరుగులుగ్రెగ్ చాపెల్
అత్యధిక వికెట్లుడెన్నిస్ లిల్లీ

వరల్డ్ సిరీస్ క్రికెట్ (WSC) అనేది 1977 - 1979 మధ్య జరిగిన వాణిజ్య వృత్తిపరమైన క్రికెట్ పోటీ. దీనిని కెర్రీ ప్యాకర్, అతని ఆస్ట్రేలియన్ టెలివిజన్ నెట్‌వర్క్ నైన్ నెట్‌వర్క్ నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు పోటీగా WSC పోటీలు నిర్వహించింది. వరల్డ్ సిరీస్ క్రికెట్, క్రికెట్ స్వభావాన్ని సమూలంగా మార్చివేసింది. దాని ప్రభావం నేటికీ కొనసాగుతోంది.

WSC ఏర్పడటానికి మూడు ప్రధాన కారకాలున్నాయి - క్రికెట్ నుండి జీవనోపాధి పొందేందుకు లేదా తమ మార్కెట్ విలువను ప్రతిబింబించడానికి ఆటగాళ్లకు తగిన మొత్తంలో చెల్లింపులు జరగడంలేదనే భావన ఆటగాళ్ళలో ఉంది. కలర్ టెలివిజన్ వ్యాప్తితో క్రీడా కార్యక్రమాలను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య పెరగడం. క్రికెట్‌ను బిర్వహిస్తున్న క్రికెట్ బోర్డులు, క్రికెట్‌కు ఉన్న వాణిజ్యపరమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదు. అప్పట్లో ఆస్ట్రేలియాలో క్రికెట్‌ ప్రసార హక్కులు ప్రభుత్వ యాజమాన్యం లోని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కమీషన్ (ABC) ఆధీనంలో ఉండేవి. ఆ ప్రసార హక్కులు తాను పొందాలని ప్యాకర్ కోరుకున్నాడు.

1976లో ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ల ప్రత్యేక టెలివిజన్ హక్కులను పొందేందుకు ఛానల్ నైన్ యొక్క బిడ్‌ను ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు (ACB) నిరాకరించడంతో, ప్రముఖ ఆస్ట్రేలియా, ఇంగ్లీష్, పాకిస్తానీ, దక్షిణాఫ్రికా, వెస్ట్ ఇండియన్ ఆటగాళ్ళతో రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకుని ప్యాకర్, తన సొంత సిరీస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే వరల్డ్ సీరీస్ క్రికెట్. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ టోనీ గ్రెగ్, వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్, ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్, కాబోయే పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ లు ప్యాకర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నవాళ్ళలో ఉన్నారు. వ్యాపారవేత్తలు జాన్ కార్నెల్, ఆస్టిన్ రాబర్ట్‌సన్ లు ప్యాకర్‌కు సహాయం అందించారు. వీరిద్దరూ సిరీస్ ప్రారంభ సెటప్ లోను, నిర్వహణ లోనూ పాలుపంచుకున్నారు.

ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ప్రపంచ సిరీస్ క్రికెట్ నాణ్యత గురించి చెబుతూ, తాను ఆడిన అత్యంత కఠినమైన క్రికెట్ అని చెప్పాడు (ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ అందులో పాల్గొన్నారు). [1]

కెర్రీ ప్యాకర్, ఆస్ట్రేలియన్ టెలివిజన్ పరిశ్రమ

[మార్చు]

1970ల మధ్యలో, ఆస్ట్రేలియన్ టెలివిజన్ పరిశ్రమ కూడలిలో ఉంది. 1956లో ప్రారంభమైనప్పటి నుండి, ఆస్ట్రేలియాలోని వాణిజ్య టెలివిజన్ దిగుమతి చేసుకున్న ప్రోగ్రామ్‌లపై ఆధారపడుతూ వచ్చింది. ముఖ్యంగా అమెరికా నుండి వాటిని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియా లోనే నిర్మించడం కంటే చౌకగా ఉంటుంది. 1970లో "TV: మేక్ ఇట్ ఆస్ట్రేలియన్" ప్రచారం నుండి మరింత ఆస్ట్రేలియా-నిర్మిత ప్రోగ్రామింగ్ కోసం ఆందోళన ఊపందుకుంది. ఇది 1973లో ప్రభుత్వం విధించిన కోటా వ్యవస్థకు దారితీసింది [2] 1975లో కలర్ ట్రాన్స్‌మిషన్‌ల ఆగమనంతో క్రీడలు ఒక టెలివిజన్ దృశ్యకావ్యం లాగా మారాయి., మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రీడ స్థానిక కంటెంట్‌గా పరిగణించబడుతుంది కాబట్టి. అయితే, క్రీడా నిర్వాహకులు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే, అవి మైదానంలో హాజరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని గ్రహించారు. క్రీడలు, కార్పొరేట్ స్పాన్సర్‌షిప్, టెలివిజన్‌ల మధ్య ఉన్న పరస్పర సంబంధం ఆ సమయంలో ఆస్ట్రేలియా క్రీడా నిర్వాహకులకు స్పష్టంగా కనిపించలేదు.

1974లో కెర్రీ ప్యాకర్, అతని తండ్రి సర్ ఫ్రాంక్ మరణించిన తర్వాత, తన కుటుంబ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రెస్ హోల్డింగ్స్ (CPH) యాజమాన్యంలోని అనేక మీడియా సంస్థలలో ఒకటైన ఛానెల్ నైన్‌పై నియంత్రణను చేపట్టాడు. [3] నైన్ రేటింగులు క్షీణించడంతో, ప్యాకర్ మరింత స్పోర్ట్స్ ప్రోగ్రామింగు ఉండే ఒక దూకుడు వ్యూహం ద్వారా నెట్‌వర్క్‌ను వృద్ధి లోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. మొదట, అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ హక్కులను పొందాడు. అతను టోర్నమెంట్‌కు శాశ్వత నివాసంగా సిడ్నీలోని ఆస్ట్రేలియన్ గోల్ఫ్ క్లబ్‌ను పునరుద్ధరించడానికి మిలియన్ల డాలర్లు వెచ్చించాడు. ఆ గోల్ఫు కోర్సును పునఃరూపకల్పన చేయడానికి, టోర్నమెంట్‌లో ఆడడానికీ జాక్ నిక్లాస్ ను నియమించాడు. [4] ప్యాకర్, క్రికెట్ అభిమాని. 1970ల మధ్యకాలంలో క్రికెట్‌ జనాదరణను పుంజుకుంది. 1976లో, ప్యాకర్ ఆస్ట్రేలియా స్వదేశీ టెస్ట్ మ్యాచ్‌లను టెలివిజన్ ప్రసారం చేయడానికి హక్కులను కోరాడు. అప్పటివరకు ఉన్న ఒప్పందం గడువు త్వరలో ముగియనుంది. అతను మూడు సంవత్సరాలకు A$1.5 మిలియన్ల ఆఫర్‌తో ACBని ఆశ్రయించాడు. అతనిచ్చిన ఆఫరు గత ఒప్పందానికి ఎనిమిది రెట్లు. అయినప్పటికీ బోర్డు దాన్ని తిరస్కరించింది. [5] వాణిజ్య నెట్‌వర్క్‌లేవీ ఆటపై పెద్దగా ఆసక్తి చూపనప్పుడు, ఇరవై సంవత్సరాల పాటు గేమ్‌ను ప్రసారం చేసిన ABC కి ACB విశ్వాసపాత్రంగా ఉంది. నిర్ణయానికి పాత స్నేహాలు కారణమని ప్యాకర్ విశ్వసించాడు.[6] తన బిడ్‌ను తిరస్కరించిన విధానంపై అతనికి కోపంగా వచ్చింది. ప్రభుత్వ-నిధులతో కూడిన ABC కమర్షియల్ నెట్‌వర్క్ బిడ్‌తో సరిపోలదు. కానీ 1976-77 సీజన్‌తో ప్రారంభమయ్యే మరో మూడు సంవత్సరాల కాంట్రాక్టును ABC కే, కేవలం $2,10,000 కే ఇవ్చ్చారు.

ఛానల్ నైన్‌లో కొంత క్రికెట్‌ను ప్రసారం చెయ్యాలని నిశ్చయించుకున్న ప్యాకర్, 1977లో షెడ్యూల్ చేయబడిన ఆస్ట్రేలియన్ టూర్ ఆఫ్ ఇంగ్లండ్‌ను ప్రసారం చేయడానికి టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB)కి ఒక ప్రతిపాదనను ఇచ్చాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు జాన్ కార్నెల్, ఆస్టిన్ రాబర్ట్‌సన్‌లు కొన్ని టెలివిజన్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రతిపాదనను అతనికి ఇచ్చారు. దాంతో అతని ఆసక్తి మరింత పెరిగింది.[7] రాబర్ట్‌సన్ డెన్నిస్ లిల్లీ వంటి అనేక ఉన్నత స్థాయి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లను మేనేజి చేసాడు. అయితే కార్నెల్ పాల్ హొగన్ కు బిజినెస్ మేనేజరు.

ప్యాకర్ ఈ ఆలోచనను తీసుకున్నాడు. ఆపై అత్యుత్తమ ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళకు, ప్రపంచంలోని ఇతర దేశాల ఆటాగాళ్ళతో కూర్చిన జట్టుకూ మధ్య పూర్తి సిరీస్‌ ఒక దాన్ని రూపొందించాడు. ABC ఇచ్చిన $2,10,000 ఆఫరు తానిచ్చిన ఆఫరులో 14% మాత్రమే ఉన్నప్పటికీ, దాన్నే అంగీకరించమని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, టిసిసిబి కి సలహా ఇవ్వడంతో క్రికెట్ నిర్వాహకులపై అతని అపనమ్మకం మరింత పెరిగింది. [8] మొదటి సారిగా, గేమ్ అధికారగణం, ప్యాకర్ స్వభావాన్ని ప్రత్యక్షంగా చూసారు: అతను వెంటనే తానిచ్చిన ఒరిజినల్ ఆఫర్‌ను రెట్టింపు చేసి ఆ కాంట్రాక్ట్‌ను గెలుచుకున్నాడు. [8] అయితే బిడ్‌ను గెలుచుకోవడంలో ఉన్న కుతంత్రాలను అతను ఎప్పుడూ మర్చిపోలేదు.

రహస్య సంతకాలు

[మార్చు]

ప్రతిపాదిత "ఎగ్జిబిషన్" సిరీస్ కు సంబంధించి, ప్యాకర్ ప్రణాళిక సాహసోపేతమైనది. 1977 ప్రారంభంలో, అతను అప్పుడే రిటైరైన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అందించిన జాబితా నుండి ఆస్ట్రేలియన్ ఆటగాళ్లతో కాంట్రాక్టులు కుద్ర్చుకోవడం ప్రారంభించాడు. ప్యాకర్ ఇంగ్లండ్ కెప్టెన్ టోనీ గ్రెగ్‌ను తీసుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆటగాళ్లతో సంతకం చేయడంలో ఏజెంట్‌గా వ్యవహరించమని అతన్ని ఒప్పించాడు.[9] 1977 మార్చిలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన సెంటెనరీ టెస్ట్ మ్యాచ్‌తో సీజన్ క్లైమాక్సుకు వచ్చే సమయానికి, దాదాపు రెండు డజన్ల మంది ఆటగాళ్ళు ప్యాకర్ సంస్థకు సంతకాలు చేసారు. ఆడటానికి ఇంకా ఎటువంటి మైదానాలు లేవు, పరిపాలన లేదు. క్రికెట్ ప్రపంచానికి అంతా రహస్యంగా ఉంది. అధికారిక క్రికెట్‌పై ఆటగాళ్ల అసంతృప్తి ఎంత ఉందంటే, అస్పష్టంగా ఉన్న ఒక భావన కోసం సంతకాలు చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. పైగా ప్రతిదీ రహస్యంగా ఉంచారు. [10]

1977 మేలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చే సమయానికి, జట్టులోని పదిహేడు మంది సభ్యులలో పదమూడు మంది ప్యాకర్‌కు సంతకాలు చేసారు. WSC ప్రణాళికల వార్తలు అనుకోకుండా ఆస్ట్రేలియన్ జర్నలిస్టులకు లీకయ్యాయి. వారు మే 9న కథనాన్ని ప్రచురించారు. తక్షణమే, సంప్రదాయవాద క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేగింది. ఊహించని విధంగా, ఆంగ్లేయులు దాన్ని "ప్యాకర్ సర్కస్" అంటూ ఎగతాళి చేసారు. ఆటగాళ్ళను అటు మళ్ళించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇంగ్లీష్ కెప్టెన్ టోనీ గ్రేగ్ కోసం ప్రత్యేకమైన తిట్లను కేటాయించారు. గ్రెగ్, జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు గానీ కెప్టెన్సీ నుండి అతన్ని తొలగించారు. క్రికెట్ వ్యవస్థలో అందరూ అతన్ని బహిష్కరించారు.వీరిలో చాలా మంది కొన్ని వారాల ముందు అతనిని ప్రశంసించినవారే.

It seemed certain that all Packer players would be banned from Test and first-class cricket. The Australian players were a divided group and the management made their displeasure clear to the Packer signees.[11] Dispirited by this turn of events and hampered by poor form and indifferent weather, Australia crashed to a 3–0 defeat, surrendering the Ashes won two years before. In light of the controversies the Sydney Gazette article clearly showed West Indian captain Clive Lloyd interviewed after leaving the Caribbean team to join Packer, Lloyd stated it was nothing personal it was clearly earning a more comfortable source of income. That interview created waves across the Caribbean and even in world cricket. It was then realised that the sport had been transformed into one's livelihood. 

కోర్టు కేసు

[మార్చు]

అప్పటికి పెద్దగా ఎవరికీ తెలియని కెర్రీ ప్యాకర్, 1977 మే న [12] లండన్ చేరుకున్నాడు. అతను డేవిడ్ ఫ్రాస్ట్ చేసే ది ఫ్రాస్ట్ ప్రోగ్రామ్‌లో వ్యాఖ్యాతలు జిమ్ లేకర్, రాబిన్ మార్లర్‌లతో తన కాన్సెప్ట్‌ను చర్చించాడు. మార్లర్ దూకుడుగా, కోపంగా ప్యాకర్‌ని విచారిస్తున్న ధోరణిని, ప్యాకర్ తన చాతుర్యం, చమత్కారం, ఆత్మవిశ్వాసాలతో తిప్పికొట్టాడు. [13] ఈ కార్యక్రమం ప్యాకర్ ప్రొఫైల్‌ను గణనీయంగా పెంచింది. కొందరిని తన ఆలోచనా విధానానికి తిప్పుకున్నాడు. అతని పర్యటన ప్రధాన లక్ష్యం ఆట అధికారులను కలవడం, ఒక రకమైన రాజీ చేసుకోవడం. రిచీ బెనాడ్‌ను కన్సల్టెంట్‌గా పొందడం ద్వారా అతను ఒక తెలివైన ఎత్తు వేసాడు. బెనాడ్‌ను తనవైపు తీసుకోవడంతో, అతని పాత్రికేయ నేపథ్యం ఆట రాజకీయాలలో ప్యాకర్‌ను నడిపించడంలో సహాయపడింది.

క్రికెట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ( ఐసిసి ) ఒకప్పుడు ఆస్ట్రేలియ దేశీయ సమస్యగా భావించిన వివాదంలోకి ప్రవేశించింది. WSC ప్రణాళికల గురించి చర్చించడానికి వారు జూన్ 23న లార్డ్స్‌లో ప్యాకర్, బెనాడ్, వారి ఇద్దరు సహాయకులతో సమావేశమయ్యారు. [14] ఇరువైపుల నుండి తొంభై నిమిషాల సమావేసంలో దాదాపు ఒక ఒప్పందానికి చేరుకున్న సమయంలో, 1978-79 సీజన్ ముగిసిన తర్వాత ICC తనకు ఆస్ట్రేలియా టెలివిజన్ హక్కులను ఇవ్వాలని ప్యాకర్ కోరాడు. అలా చేసే అధికారం ఐసిసికి లేదు.[15] దాంతో ప్యాకర్ సమావేశం నుండి వెళ్ళిపోయి దాదాపు యుద్ధ ప్రకటన లాంటిది చేసాడు, ఇలా: [16]

నాకు ఆ టీవీ హక్కులు ఇచ్చినట్లయితే, నేను ప్రస్తుత సన్నివేశం నుండి వైదొలగడానికి, క్రికెట్ నిర్వహణను బోర్డుకి వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికో సహాయం చేసే చర్యలేమీ నేణిప్పుడు తీసుకోను. ప్రతి మనిషి తన స్వార్థమే చూసుకుంటాడు.

ఈ ప్రకటనతో మునుపటి టెలివిజన్ కార్యక్రమంలో ప్యాకర్ సాధించుకున్న సద్భావన కాస్తా తుడిచిపెట్టుకుపోతింది. తన స్కీమ్‌ ఎంత వాణిజ్యపరమైనదో, ఆటగాళ్ళ పట్ల అంతే దాతృత్వం అని భావించి సంతకాలు చేసిన ఆటగాళ్ళు అప్రమత్త మయ్యారు.[17] ICC ఒక నెల తర్వాత ప్యాకర్ మ్యాచ్‌లకు ఫస్ట్-క్లాస్ హోదా ఇవ్వమనీ, పాల్గొన్న ఆటగాళ్ళు ఇకపై టెస్ట్ మ్యాచ్‌లు, ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడకుండా నిషేధిస్తామనీ ప్రకటించి ప్యాకర్ పథకాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది.

దాంతో, సంతకం చేసిన అనేక మంది ఆటగాళ్లు దాన్ని ఉపసంహరించుకోవాలని భావించారు. [18] జెఫ్ థామ్సన్, ఆల్విన్ కాళీచరణ్‌లు క్వీన్స్‌ల్యాండ్‌లో ఆడాలనే నిర్బంధ ఒప్పందాలు తమకు ఉన్నాయని తెలుసుకుని, తమ ఒప్పందాలను చింపేసారు.[19] ఆటగాళ్ళకు మద్దతునిచ్చేందుకు ప్యాకర్, ఆటగాళ్లతో సమావేశమై, వాళ్ళు తమ ఒప్పందాలను ఉల్లంఘించేలా ఆటగాళ్లను ఎవరూ ప్రేరేపించకుండా నిరోధించడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నాడు. చట్టపరమైన చిక్కులను (ప్రతిపాదిత నిషేధాలతో సహా) స్పష్టం చేయమంటూ TCCB పై హైకోర్టులో దావా వేసిన అతని ముగ్గురు ఆటగాళ్ళు- టోనీ గ్రేగ్, మైక్ ప్రోక్టర్, జాన్ స్నో లకు ప్యాకర్ మద్దతుగా నిలిచాడు.[20]

ఆ కేసులో జస్టిస్ క్రిస్టోఫర్ స్లేడ్ ఇచ్చిన తీర్పులో, ప్రొఫెషనల్ క్రికెటర్లు జీవనోపాధి పొందాలని, తన స్వంత ప్రయోజనాలకు దెబ్బతగిలే అవకాశం ఉంది కాబట్టి ఐసిసి వారికి అడ్డుగా నిలబడతానంటే కుదరదనీ అన్నాడు. విధేయత భావనను ఐసిసి బాగా సాగదీస్తోందని అతను అన్నాడు. WSC అందించే ప్రయోజనాలను ఆస్వాదించే అవకాశాన్ని, అధికారులు అడ్డుకుంటారు కాబట్టి ఆటగాళ్ళు తమ ఒప్పందాలను రహస్యంగా ఉంచడంలో తప్పులేదని, దాన్ని విమర్శించలేరనీ అన్నాడు.

ఈ నిర్ణయంతో క్రికెట్ అధికారులకు దెబ్బ తగిలింది. గాయానికి అవమానం తోడై, కోర్టు ఖర్చులు కూడా చెల్లించుకోవలసి వచ్చింది. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ జట్లు, ప్యాకర్ కోసం ఆడేందుకు సంతకం చేసిన తమ ఆటగాళ్ళు ఇప్పటికీ తమ తరపున ఆడేందుకు అర్హులేనని తేలడంతో సంతోషించాయి.

"సూపర్ టెస్టులు", వెస్టిండీస్, డ్రాప్-ఇన్ పిచ్‌లు

[మార్చు]
వెస్ట్ ఇండియన్ వివ్ రిచర్డ్స్ - WSCలో రెండవ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్.

అధికారిక క్రికెట్‌ వర్గానికి చిన్నపాటి విజయాలు లభించాయి. అవి: ప్యాకర్ "టెస్ట్ మ్యాచ్" అనే పదాలను ఉపయోగించలేకపోయాడు. ఆస్ట్రేలియన్ల జట్టును "ఆస్ట్రేలియా" అని పిలవలేకపోయాడు. క్రికెట్ అధికారిక నియమాలను ఉపయోగించలేకపోయాడు - వాటిపై మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్‌కు కాపీహక్కులున్నాయి కాబట్టి.[21]

దాంతో ఐదు-రోజుల మ్యాచ్‌లను "సూపర్‌టెస్ట్‌లు" అన్నారు. ఆస్ట్రేళియా జట్టును "WSC ఆస్ట్రేలియన్ XI" అన్నారు. సిరీస్ కోసం నియమాలను, ఆడే పరిస్థితులనూ రాసే పనిను రిచీ బెనాడ్‌కు అప్పగించారు. ముఖ్యంగా, WSC సాంప్రదాయ క్రికెట్ వేదికలను అందుబాటులో లేకుండా చేసారు. కాబట్టి ప్యాకర్ రెండు ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ స్టేడియాలను (మెల్బోర్న్‌లోని VFL పార్క్, అడిలైడ్‌లోని ఫుట్‌బాల్ పార్క్), అలాగే పెర్త్ లోని గ్లౌసెస్టర్ పార్కును (ట్రాటింగ్ ట్రాక్ ), సిడ్నీ మూర్‌ పార్క్ షోగ్రౌండ్ నూ లీజుకు తీసుకున్నాడు.

ఈ వేదికలలో తగిన ప్రమాణాలతో కూడిన గ్రాస్ పిచ్‌లను సిద్ధం చేయడం సమస్యగా మారింది. ఉమ్మడి ఏకాభిప్రాయం ప్రకారం, ఇంత తక్కువ సమయంలో పిచ్‌లను సృష్టించడం అసాధ్యమని భావించారు. [22] అయితే, "డ్రాప్-ఇన్" పిచ్‌ల భావనకు మార్గదర్శకుడైన క్యూరేటర్ జాన్ మాలీని ప్యాకర్ నియమించుకున్నాడు. [23] ఈ పిచ్‌లను వేదిక వెలుపల ఉన్న హాట్‌హౌస్‌లలో పెంచారు, తర్వాత క్రేన్‌లతో మైదాన ఉపరితలం పైన పెట్టారు. ఈ విప్లవాత్మక సాంకేతికత WSC మొదటి సీజన్‌లో పైకి కనబడని హైలైట్. ఇదే లేకపోయి ఉంటే, WSC ఒక మూర్ఖ ప్రయత్నంగా మిగిలి ఉండేది. [24]

సిరీస్‌లో మరో ఊహించని అంశం వెస్టిండీస్ జట్టు ఆవిర్భావం. డబ్ల్యూఎస్‌సిని మొదట ఆస్ట్రేలియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌గా భావించారు. వెస్ట్ ఇండియన్లు మొత్తం కెరీర్‌లో సంపాదించగలిగిన దానికంటే ఎక్కువ చెల్లించేలా కాంట్రాక్టులను ఇవ్వజూపినప్పుడు, వారందరూ సంతకం చేశారు. అయితే, WSC వెస్టిండీస్ ఆటగాళ్లను రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టులో కూడా ఉపయోగించుకుంది.

మొదటి WSC గేమ్, ఆస్ట్రేలియన్లు, వెస్ట్ ఇండియన్‌ల మధ్య జరిగిన "సూపర్‌టెస్ట్". ఇది 1977 డిసెంబరు 2 న VFL పార్క్‌లో ప్రారంభమైంది. క్రికెట్ ఉన్నతమైన ప్రమాణాలతో కూడుకున్నది, అద్భుతమైనది. కానీ ప్రేక్షకులు మాత్రం తక్కువగా ఉన్నారు. 79,000 సామర్థ్యం గల స్టేడియంలో ఇది మరీ కొట్టొచ్చినట్లు కనబడింది. అదే సమయంలో బ్రిస్బేన్‌లో బలహీనంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు, భారత్‌తో ఆడిన అధికారిక టెస్ట్ మ్యాచ్ చాలా మంది ప్రేక్షకులను ఆకర్షించింది.

మొదటి సీజన్: 1977–78

[మార్చు]

వ్యక్తిత్వ ఆధారిత మార్కెటింగ్‌ని ఉపయోగిస్తూ WSC, ఫాస్ట్ బౌలింగ్ లోని "గ్లాడియేటోరియల్" కోణానికి గొప్ప ప్రాధాన్యతనిచ్చింది. డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్, మైఖేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్ వంటి ఫాస్ట్ బౌలర్లను బాగా ప్రోత్సహించింది. స్లో బౌలింగ్ ప్రభావంపై ప్యాకర్ సందేహం వ్యక్తం చేశాడు. అంతగా నాణ్యత లేని పిచ్‌లపై పేస్ బౌలర్ల నిరంతర దాడిని ఎదుర్కోవడానికి, WSC బ్యాట్స్‌మెన్లు తమ శరీర రక్షణను పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావించారు. డిసెంబరు 16న జరిగిన సిడ్నీ సూపర్‌టెస్ట్‌లో, వెస్టిండీస్ ఆండీ రాబర్ట్స్ వేసిన బౌన్సరుతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ హుక్స్‌కు తీవ్ర గాయమైంది. [25] వైరుధ్యంగా, హుక్స్ యొక్క విరిగిన దవడ ప్రభావం, నైన్ కెమెరాల ద్వారా గ్రాఫికల్‌గా సంగ్రహించబడింది, WSC మ్యాచ్‌ల సీరియస్‌నెస్‌ను వెలుగులోకి తెచ్చింది:

... ఆండీ రాబర్ట్స్ వేసిన బౌన్సరుతో అతని దవడ పగిలిపోయింది. . . ఆ క్షణం వరకు, WSC ని ఏదో వినోదాన్ని అందించే ప్యాకేజీ గానే చూసారు; కానీ హుక్స్‌కు అయిన గాయంతో పోటీ లోని తీవ్రత పరిశీలకులందరినీ ఆకట్టుకుంది. [26]

ఈ సంఘటన మరొక ప్రభావాన్ని కూడా చూపింది: మొదటిసారి బ్యాట్స్‌మెన్ తలలపై హెల్మెట్‌లు కనిపించాయి. [27] ప్రారంభంలో, ఇంగ్లీషువాడైన డెన్నిస్ అమిస్ WSCలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోటర్‌సైకిల్ హెల్మెట్‌ ధరించాడు.[28] త్వరలోనే చాలా మంది ఇతర ఆటగాళ్ళు అతన్ని అనుసరించారు. క్రికెట్‌కు సంబంధించి, రక్షణ పరికరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. WSC ముగిసే సమయానికి, [29] WSC లోను, అధికారిక టెస్ట్ మ్యాచ్‌లలోనూ కూడా బ్యాట్స్‌మెన్‌లు ఏదో ఒక రకమైన రక్షణాత్మక హెల్మెట్లు ధరించారు.

ఐక్య ఫ్రంట్ బలహీనపడింది

[మార్చు]

రెండు WSC సీజన్ల మధ్య, ICC దేశాలు ప్రదర్శించిన ఐక్యత క్షీణించడం ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లో ప్యాకర్ పట్ల తీవ్ర అసహనం ఉంది, అయితే కౌంటీ క్లబ్‌ల అధికారులు చాలా మంది ప్యాకర్ ఆటగాళ్లను తమ కాంట్రాక్టులలో ఉంచుకునేందుకు సిద్ధమయ్యారు.

వెస్టిండీస్ ఆర్థికంగా అత్యంత బలహీనమైన దేశం. ఐక్యత ప్రయోజనాల కోసం మాత్రమే అది ICCకి ఓటు వేసింది. ఇటీవలి ఆస్ట్రేలియన్ పర్యటన లోని ఆర్థిక, రాజకీయ సమస్యల కారణంగా 1979 వసంతకాలంలో కరేబియన్‌లో WSC సిరీస్ కోసం ప్యాకర్‌తో చర్చలు మొదలుపెట్టారు. ప్రారంభంలో, పాకిస్తాన్ కఠినంగా వ్యవహరిస్తూ, ప్యాకర్ ఆటగాళ్లను జట్టు లోకి ఎంపిక చేయడానికి నిరాకరించింది. అయితే ఆఫ్-సీజన్ సమయంలో WSC మరింత మంది పాకిస్థానీలతో సంతకాలు చేసుకోవడం, ఇంగ్లాండులో మూడు టెస్టుల సిరీస్‌లో బలహీనమైన అధికారిక పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో సులభంగా ఓడిపోవడం చూసి వారు 1978 వేసవిలో మరింత ఆచరణాత్మక విధానాన్ని చేపట్టారు. దాంతో 1978 అక్టోబరులో భారత పాకిస్తాన్ల మధ్య పదిహేడేళ్ల తరువాత మొదటి టెస్ట్ సిరీస్‌ ఆడే సమయం వచ్చినప్పుడు, ప్యాకర్ ఆటగాళ్లందరినీ జట్టులో చేర్చుకుంది. భారత ఆటగాళ్ళు అప్పటికి ఇంకా పాల్గొనలేదు గానీ, కెప్టెన్ బిషన్ బేడీ, స్టార్ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్‌లు WSC కి సంతకాలు చేశారనే పుకార్లు పుష్కలంగా వచ్చాయి. [30]

రెండవ సీజన్: 1978–79

[మార్చు]

1978 నవంబరు 28 న సాంప్రదాయ క్రికెట్ మైదానంలో WSC ఆస్ట్రేలియన్, వెస్ట్ ఇండియన్ జట్ల మొదటి డే-నైట్ మ్యాచ్ SCGలో జరిగినప్పుడు, యుద్ధం నాటకీయంగా ప్యాకర్‌కు అనుకూలంగా మారింది. ఆ పరిమిత ఓవర్ల పోటీని వీక్షించేందుకు దాదాపు 44,377 మంది ప్రేక్షకులు తరలివచ్చి, పరోక్షంగా ACB కి హెచ్చరిక చేసారు. కొన్ని రోజుల తర్వాత, అధికారిక ఆస్ట్రేలియా జట్టు బ్రిస్బేన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓటమి పొందింది. గ్రాహం యాలప్ కెప్టెన్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఆ సీరీస్‌ను 5-1తో కోల్పోయింది. యాలప్ తాను ఆ స్థానానికి సరిపోనని భావించాడు. అతని జట్టు అనుభవజ్ఞులైన, వృత్తిపరమైన ఇంగ్లాండ్ జట్టుతో పోటీపడలేకపోయింది. ఆంగ్లేయులు తమకు ఎదురుగా నిలబెట్టిన ప్రత్యర్థిని ఓడించినప్పటికీ, వారు చాలా నెమ్మదిగా క్రికెట్ ఆడి ACB ప్రయోజనాలను మరింత దెబ్బతీశారు. పర్యవసానంగా, హాజరు తక్కువగా ఉంది. ఆస్ట్రేలియా జట్టు పూర్తి స్థాయికి తిరిగి రావాలని మీడియా గట్టిగా కోరింది.

మరోవైపు WSC, దాని దూకుడు మార్కెటింగుతో, రాత్రిపూట ఆటలతో, అనేక వన్-డే మ్యాచ్‌లతో, హాజరును, టెలివిజన్ రేటింగ్‌లనూ పెంచుకుంది. మహిళలు, పిల్లలు ఎక్కువగా WSC కి తరలి వచ్చారు. ఆట ప్రమాణాలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

సయోధ్య

[మార్చు]

1979 నాటికి, ACB తీరని ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అంతులేని నగదు వనరులను కలిగి ఉన్న ప్రత్యర్థితో పోరాడాల్సి వచ్చింది. రెండు సీజన్లలో, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా అనే రెండు అతిపెద్ద క్రికెట్ అసోసియేషన్ల సంయుక్త నష్టాలు మొత్తం అర మిలియన్ డాలర్ల కంటే ఎక్కువయ్యాయి. కెర్రీ ప్యాకర్ కూడా ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నాడు - చాలా సంవత్సరాల తర్వాత, WSC ఇన్‌సైడర్‌లు అతను పొందిన నష్టాలు ఆ సమయంలో బయటికి చెప్పిన నష్టాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సంవత్సరం మార్చిలో ప్యాకర్, అప్పటి ACB బోర్డు ఛైర్మన్ బాబ్ పారిష్‌తో వరుస సమావేశాలు పెట్టుకున్నాడు.ఇది ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తుపై ఒక ఒప్పందం కుదుర్చుకోడానికి దారితీసింది.

ట్రివియా

[మార్చు]
  • WSC లో జరిగిన మొత్తం మ్యాచ్‌లలో 56,126 పరుగులు తీసారు, 2,364 వికెట్లు తీసారు. [31] మ్యాచ్‌లు ఫస్ట్-క్లాస్ కాదని ICC ఇచ్చిన 1977 లో ఇచ్చిన తీర్పు అలాగే ఉంది కాబట్టి, WSC ఆటగాళ్ళ రికార్డులలో WSC లో చేసిన పరుగులు, వికెట్లు చేర్చలేదు. [32]
  • WSC వారి అడ్వర్టైజింగ్ జింగిల్ " C'mon Aussie C'mon " సింగిల్‌ పాటగా విడుదలై, 1979 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా చార్ట్‌లలో మొదటి స్థానంలో నిలిచింది [33]

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  • క్యాష్‌మన్, రిచర్డ్ తదితరులు. – సంపాదకులు (1996): ది ఆక్స్‌ఫర్డ్ కాంపానియన్ టు ఆస్ట్రేలియన్ క్రికెట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ .ISBN 0-19-553575-8 .
  • హైగ్, గిడియాన్ (1993): ది క్రికెట్ వార్ – ది ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ కెర్రీ ప్యాకర్స్ వరల్డ్ సిరీస్ క్రికెట్, టెక్స్ట్ పబ్లిషింగ్ .ISBN 1-86372-027-8ISBN 1-86372-027-8 .
  • మెక్‌ఫార్లైన్, పీటర్ (1977): ఎ గేమ్ డివైడెడ్, హచిన్సన్ ఆస్ట్రేలియా.ISBN 0-09-130680-9ISBN 0-09-130680-9 .
  • పొలార్డ్, జాక్ (1982): ఆస్ట్రేలియన్ క్రికెట్: ది గేమ్ అండ్ ది ప్లేయర్స్, హోడర్ అండ్ స్టౌటన్ .
  • గోల్డెన్ ప్రెస్ (1978): క్రికెట్ అలైవ్! వరల్డ్ సిరీస్ క్రికెట్, మొదటి ఉత్తేజకరమైన సంవత్సరం, మకార్తుర్ ప్రెస్ISBN 0-85558-798-9 . రిచీ బెనాడ్ ముందుమాట
  • గోల్డెన్ ప్రెస్ (1979): క్రికెట్ ఎలైట్! వరల్డ్ సిరీస్ క్రికెట్, ఇన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ది వెస్టిండీస్‌, మకార్థర్ ప్రెస్ISBN 0-85558-608-7 . డెన్నిస్ లిల్లీ రాసిన ముందుమాట

మూలాలు

[మార్చు]
  1. Burnett, Adam (25 November 2015). "Cricket Australia Recognise World Series Cricket Statistics". Cricket.com.au. Retrieved 12 July 2022.
  2. Australian Heritage Council. Archived 10 అక్టోబరు 2007 at the Wayback Machine Accessed 29 July 2007.
  3. "Media colossus pushed the boundaries of family empire". Sydney Morning Herald. 28 December 2005.
  4. Sydney Morning Herald. Accessed 29 July 2007.
  5. Haigh (1993), p 34.
  6. McFarline (1977), p 157.
  7. Lillee (2003), p 129.
  8. 8.0 8.1 Haigh (1993), p 41.
  9. Wisden Cricketer magazine. Accessed 28 July 2007.
  10. Pollard (1982), p. 1138.
  11. The Age. Archived 14 ఫిబ్రవరి 2009 at the Wayback Machine Accessed 28 July 2007
  12. Haigh (1993), p 67.
  13. McFarline (1977), p 33.
  14. McFarline (1977), p56.
  15. McFarline (1977), pp 56–57.
  16. Haigh (1993), p 76.
  17. Haigh (1993), p 77.
  18. McFarline (1977), pp 61–62.
  19. McFarline (1977), pp 100–101.
  20. Haigh (1993), p 101. The ICC was not a defendant in the case as it had no legal "personality" at the time.
  21. Marylebone Cricket Club. Archived 9 మే 2008 at the Wayback Machine Accessed 29 July 2007.
  22. Lillee (2003), p 131.
  23. Cashman et al. (1996), p 327. After WSC concluded, Maley was the curator of the WACA ground in Perth from 1980–88.
  24. Lillee (2003), p 132.
  25. Cricinfo.com. Accessed 29 July 2007.
  26. Cricinfo.com: David Hookes player profile. Retrieved 27 September 2007.
  27. Haigh (1993), p 132.
  28. Dennis Amiss: A limpet at the crease. Accessed 28 July 2007.
  29. Australia Innovates project. Archived 3 మార్చి 2016 at the Wayback Machine Accessed on 29 July 2007.
  30. Wisden 1979. Accessed 29 July 2007.
  31. Haigh (1993), p 326.
  32. Cricinfo.com. Accessed 30 July 2007.
  33. Australian music charts archive. Archived 15 జూలై 2007 at the Wayback Machine Accessed 29 July 2007.