అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్ గా పేరొందిన దొంగరి మల్లయ్య నేటి ప్రముఖ తెలుగు రచయితల్లో ఒకరు.[1] 2004 లో ఈయన రాసిన కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[2] కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారు.[3]
జననం - ఉద్యోగం
[మార్చు]ఆర్థిక శాస్త్ర ఆచార్యుడైన నవీన్, 1941లో జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, వావిలాల గ్రామంలో దొంగరి నారాయణ, పిచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎం. ఎ చేశాడు. కరీంనగర్, వరంగల్లులో లెక్చరర్ గా పనిచేశాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]చైతన్య స్రవంతి శిల్పంతో ప్రభావితమయ్యారు. అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి నవలల్ని రచించాడు. ఈ మూడు నవలల్లో కథానాయకుని పేరు రవి కావడంతో, మూడింటిని కలిపి రవిత్రయ నవలలు అని వ్యవహరిస్తారు. ఇతను 1965- 1968 సంవత్సరాల మధ్య రాసి 1969లో ప్రచురించిన అంపశయ్య నవల ఎంతగా విజయవంతమైందంటే, అదే నవల పేరుతో అప్పటి నుండి ఇంటిపేరుగా అంపశయ్య నవీన్ గా పేరొందాడు.ఇతని కథలు అనేకం హిందీ, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మరాఠీలలోకి అనువదించబడ్డాయి.[4]
అంపశయ్య నవీన్ 1941 డిసెంబరు 24వ సంవత్సరంలో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల అనే గ్రామంలో జన్మించాడు.[5] బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను చూశాడు. ఆ సభ ప్రారంభోత్సవంలో వేడుకగా అలంకరించిన బండిని 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి, అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్ పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను వ్రాయలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది [6] 1996 లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీవిరమణ చేశాక, నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టాడు. కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు” అనే నవలాత్రయంగా విడుదల చేశాడు.[7] 2004లో కాలరేఖలు రచనకు, అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.
1962లో బి.ఏ.పూర్తి చేశాక,పెళ్ళి చేసుకున్నాడు.[8]నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య. తొలి రోజుల్లో ఆ పేరుతోనే అనేక రచనలు చేశాడు. అయితే వాటిల్లో చాలావరకు అచ్చుకాలేదు. తన ప్రియమిత్రుడు వరవరరావు సలహామేరకు తన పేరును నవీన్‌గా మార్చుకొన్నాడు. నవలా రచయిత లను ప్రోత్సహించాలనే తపనతో ప్రతీ ఏటా తన జన్మదినం సందర్భంగా నవలాకారులకు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డులను అందజేస్తున్నారు. [9]
పురస్కారాలు
[మార్చు]- కాళోజీ సాహిత్య పురస్కారం (తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ సాహిత్యంలో విశేష కృషికి) - 2018
- కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు, నుంచి 2004లో 16వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, 2002 లో ఉత్తమ కథల, నవలా విభాగంలో ప్రతిభా పురస్కారం
- హైదరాబాదులో రావి శాస్త్రి పురస్కారం, 2000 సంవత్సరంలో
- జ్యేష్ట సాహిత్య పురస్కారం, 1999లో, విశాఖపట్నం, స్వీయ రచన బలి ని ఆంగ్లంలోకి అనువదించినందుకు
- ఉత్తమ కథ: చెర - ఆంధ్రజ్యోతి వార పత్రిక, 1973
- ఉత్తమ కథ: బలి - స్వాతి వార పత్రిక, 1984
- ఉత్తమ కథ: దాడి - పల్లకి వార పత్రిక, 1985
- ఉత్తమ కథ: చెర - ఆంధ్రప్రభ వార పత్రిక, 1986
- ఉత్తమ కథ: తెర - ఆంధ్రజ్యోతి వార పత్రిక, 1987
- ఉత్తమ నవల దాగుడు మూతలు - స్వాతి వార పత్రిక, 1978
- ఉత్తమ నవల అంత:స్రవంతి - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 1994
రచనలు
[మార్చు]నవలలు:
- అంపశయ్య
- కాలరేఖలు
- చెదిరిన స్వప్నాలు
- బాంధవ్యాలు
- రక్తకాసారం
- చీకటిరోజులు
- చీకటి మూసిన ఏకాంతంలో
- ముళ్ళపొదలు
- అంతస్స్రవంతి
- మనోరణ్యం
- విచలిత
- సంకెళ్ళు
- దాగుడు మూతలు
- ప్రత్యూష
- చెమ్మగిల్లని కన్నులు
- తీరనిదాహం
- సౌజన్య
- మౌనరాగాలు
- తారు-మారు
- దృక్కోణాలు
కథా సంకలనాలు:
- ఫ్రం అనురాధ విత్ లవ్
- ఎనిమిదో అడుగు
- లైఫ్ ఇన్ ఎ కాలేజి
- నిష్కృతి
- బంధితులు
- అస్మదీయులు - తస్మదీయులు
వ్యాస సంకలనాలు:
- నవీన్ సాహిత్య వ్యాసాలు
- సాహిత్య కబుర్లు
- జీవనశైలి (ప్రజాశక్తి కాలమ్)
- సినిమా వీక్షణం
- మనోవైజ్ఞానికి నవలల విశ్లేషణ
- సప్తవర్ణాల హరివిల్లు (సాహిత్య వ్యాసాలు)
పదవులు - గుర్తింపులు
[మార్చు]- కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు[3]
మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు వెలుగు: ఆ మార్గాన్నే అనుసరించా". ramojifoundation.org. ఈనాడు. October 2018. Archived from the original on 2018-11-10. Retrieved 2018-11-15.
- ↑ "సాహితీ లోకంలో నిత్యాన్వేషి..అంపశయ్య నవీన్". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-23. Archived from the original on 2021-12-24. Retrieved 2021-12-26.
- ↑ 3.0 3.1 ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (24 March 2018). "ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం". Retrieved 24 March 2018.[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-14. Retrieved 2010-06-06.
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. అంపశయ్య నవీన్ (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 49.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "No life without literature, says `Ampasayya' Naveen". The Hindu. 2006. Archived from the original on 2007-11-11. Retrieved 2010-08-08.
- ↑ నేనూ నా రచనలు - అంపశయ్య నవీన్ Archived 2010-11-02 at the Wayback Machine ఈమాట జనవరి 2007 సంచిక
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. అంపశయ్య నవీన్ (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 52.
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఈనాడులో నవీన్ ఫై చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2010-08-11. Retrieved 2010-06-06.
ఇతర లింకులు
[మార్చు]- Pages using the JsonConfig extension
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1941 జననాలు
- తెలుగు రచయితలు
- తెలుగు నవలా రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- జనగామ జిల్లా రచయితలు
- జనగామ జిల్లా ఉపాధ్యాయులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు
- లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతలు
- కలం పేరుతో ప్రసిద్ధులైన తెలంగాణ వ్యక్తులు