అత్తలు కోడళ్లు
అత్తలు కోడళ్లు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | నందినీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అత్తలు కోడళ్లు నందినీ ఫిల్మ్‌స్ బ్యానర్‌పై పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1971లో వెలువడిన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- కృష్ణ - రఘు
- వాణిశ్రీ - జానకి
- నాగభూషణం - గిరిబాబు
- కె.వి.చలం - గిరిబాబు సెక్రెటరి
- రాజబాబు - వరహాలు
- అల్లు రామలింగయ్య - తిరుపతయ్య
- చంద్రమోహన్ - చంద్రం
- పెరుమాళ్ళు -
- మణిమాల - రత్తాలు
- సూర్యకాంతం - సుందరమ్మ
- రావి కొండలరావు - మాధవయ్య
- ఛాయాదేవి - తారాబాయి
- పి.హేమలత - అన్నపూర్ణమ్మ
- నిర్మలమ్మ - బంగారమ్మ
- లీలారాణి - రాధ
- జ్యోతిలక్ష్మి -
- శ్రీదేవి(నటి) - జానకి
- బేబీ మున్నీ - రాధ
- బేబీ గౌరి - చంద్రం
- మాస్టర్ ఆదినారాయణ - రఘు
- వల్లం నరసింహారావు
- ఆనంద్ మోహన్
- జగ్గారావు
- కోళ్ళ సత్యం
- కె.కె.శర్మ
- భానుమతి (జూనియర్)
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం:పి.చంద్రశేఖరరెడ్డి
- నిర్మాతలు: కె.సుబ్బిరెడ్డి, ఎన్.సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి
- సంభాషణలు: పినిశెట్టి
- పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, అప్పలాచార్య
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత
- ఛాయాగ్రహణం: వి. ఎస్. ఆర్. స్వామి
- కళ: కృష్ణారావు
- కూర్పు: ఎం.ఎస్.ఎన్.మూర్తి
- నృత్యాలు: హీరాలాల్, తంగప్ప
కథ
[మార్చు]ముగ్గురు కోడళ్ళూ ముగ్గురు అత్తల మధ్య జరిగిన కథ ఇది. మాధవయ్య రెండవ భార్య సుందరమ్మ గయ్యాళి. స్వార్థపరురాలు. మొదటి భార్య కొడుకు రఘును నాయనమ్మ అన్నపూర్ణమ్మ ప్రేమతో పెంచింది. సుందరమ్మకు రఘు అంటే గిట్టదు. తన కొడుకు చంద్రం, కూతురు రాధలను ప్రేమగా చూస్తూ, అత్తగారిని ఆడిపోస్తూ ఉంటుంది. మాధవయ్య భార్య మాటకు ఎదురు చెప్పలేక చివరకు ఆమె ప్రోత్సాహంతో పట్నానికి వెళ్ళి వ్యాపారం పెట్టాడు. ఇంటి దగ్గర వ్యవసాయం రఘు చూస్తున్నాడు. జానకి రఘు మేనమామ కూతురు. ఆమె రఘును ప్రేమించింది. వారిరువురూ పెళ్ళి చేసుకున్నారు. సుందరమ్మ అన్న తిరుపతయ్య కోర్టుపక్షి. అతను తన కూతురు రత్తాలును చంద్రానికివ్వాలని అనుకున్నాడు. కాని సుందరమ్మ కొడుకు వరహాలు తిరుపతయ్య కన్నుకప్పి రత్తాలుకు తాళికట్టాడు. బస్తీలో సుందరమ్మ ఐశ్వర్య మదంతో నాగరికసమాజ పద్ధతులకు అలవాటుపడింది. చంద్రం చదువు సంధ్యలు లేక చెడిపోయాడు. జమీందారు గిరిబాబుకు రాధను ఇచ్చి పెళ్ళిచేసింది సుందరమ్మ. అయితే గిరిబాబు పచ్చిమోసగాడు. క్లబ్‌లకూ, జూదాలకూ అలవాటు పడ్డాడు. అతడూ, అతని తల్లి తారాబాయి మాటలకు మోసపోయి సుందరమ్మ తన ఆస్తినంతా పోగొట్టుకుంది. చివరకు అసలు బండారం బయట పడటంతో సుందరమ్మకు బుద్ధి వస్తుంది.[1]
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
పాలపిట్ట పాలపిట్ట | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
చీరకు రవికందము | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
ఈ వీణ పలికించు | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
అమ్మమ్మో అత్తమ్మో | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
బలే బలే బావయ్య | అప్పలాచార్య | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత |
చుక్కల్లో చంద్రుడు | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఎల్.ఆర్.ఈశ్వరి |
మూలాలు
[మార్చు]- ↑ రెంటాల (23 April 1971). "చిత్ర సమీక్ష: అత్తలూ కోడళ్ళు". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 29 జూలై 2020. Retrieved 29 July 2020.
బయటిలింకులు
[మార్చు]- 1971 తెలుగు సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- వాణిశ్రీ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన సినిమాలు
- నాగభూషణం నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు