ఒకటో నంబర్ కుర్రాడు
ఒకటో నంబర్ కుర్రాడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
స్క్రీన్ ప్లే | కె. రాఘవేంద్రరావు |
కథ | ఆకుల శివ |
నిర్మాత | కె. రాఘవేంద్రరావు సి. ఆశ్వినీదత్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 18 సెప్టెంబరు 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒకటో నంబర్ కుర్రాడు 2002 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. స్వప్న సినిమా బ్యానరులో కె. రాఘవేంద్రరావు, సి. ఆశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తారకరత్న, రేఖ, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. తారకరత్నకు ఇది తొలి సినిమా.
తారాగణం
[మార్చు]- తారకరత్న (బాలు)
- రేఖ (స్వప్న)
- తనికెళ్ల భరణి (స్వప్న తండ్రి)
- రాజీవ్ కనకాల (రాజీవ్)
- దేవదాస్ కనకాల (రాజీవ్ తండ్రి)
- గిరిబాబు (స్వప్న మామయ్య)
- చిత్రం శ్రీను
- ఎమ్మెస్ నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సునీల్
- చిట్టి బాబు
- రఘు బాబు
నిర్మాణం
[మార్చు]ఇది తారకరత్న నటించిన రెండవ సినిమా అయినాకానీ మొదట ఈ సినిమానే విడుదలైంది.[1] ముందు దీనికి 1వ నంబర్ కుర్రాడు అనే పేరు పెట్టారు.[2]
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు.[2]
- "తొడకొట్టి చెబుతున్నా" - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాడ్విన్
- "నువ్వు చూడు చూడకపో" - ఎం.ఎం.కీరవాణి, గంగ
- "ఒరేయ్ నువ్వు" - ఎస్.పి. చరణ్, కె.ఎస్. చిత్ర
- "అగ్గిపుల్ల" - టిప్పు, కల్పన
- "నెమలి కన్నోడ" - ఉదిత్ నారాయణ్, కెఎస్ చిత్ర
- "ఎన్ని జన్మలెత్తినా" - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర
స్పందన
[మార్చు]"తారకరత్న తన నటన, డ్యాన్స్, ఫైటింగ్‌లతో ఆకట్టుకున్నాడని, సాధారణమైన ఇతివృత్తంతో, రొటీన్ కథతో ఉందని" ది హిందూలోని గుడిపూడి శ్రీహరి అభిప్రాయపడ్డాడు.[3] "ఈ సినిమా ఒక ఆసక్తికరమైన సంఘటనతో ప్రారంభమవుతుంది, కానీ మధ్యలో చూపించిన సన్నివేశాలు వీక్షకులను ఆకట్టుకునేలా లేవు" అని ఐడెల్ బ్రెయిన్ లోని జీవీ వ్రాశాడు.[4] "ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొత్తదేమీ లేదు" అని ఫుల్ హైదరాబాదుకు చెందిన ఒక విమర్శకుడు రాశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Sunil, Sreya. "Audio review of Okato Number Kurradu - Mass masti music". Idlebrain.com. Archived from the original on 20 June 2003. Retrieved 2023-02-20.
- ↑ 2.0 2.1 "Juke Box - 1va Number Kurraadu". Idlebrain.com. Archived from the original on 23 August 2002. Retrieved 2023-02-20.
- ↑ Srihari, Gudipoodi (23 October 2002). "One more from NTR clan". The Hindu. Archived from the original on 27 January 2022. Retrieved 2023-02-20.
- ↑ "Movie review - Okato Number Kurraadu". Idlebrain. 18 September 2002. Archived from the original on 27 January 2022. Retrieved 2023-02-20.
- ↑ "Okato Numberu Kurraadu Review". Full Hyderabad. Archived from the original on 27 January 2022. Retrieved 2023-02-20.