కమ్మవారిపాలెం (నందిగామ)
కమ్మవారిపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°45′53″N 80°19′53″E / 16.764702°N 80.331371°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నందిగామ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521185 |
ఎస్.టి.డి కోడ్ | 08678 |
కమ్మవారిపాలెం, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జగ్గయ్యపేట. నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]- రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, నారాయణ టేక్నో స్కూల్, నందిగామ.
- ఇక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ. అందరు తమ పిల్లలని చదివిస్తారు. ఈ ఊరిలో రెండు మూడు తరాల నుండి విదేశాలలో స్థిరపడిన వారు, చదువుకొని తిరిగి వచ్చిన వారు ఉన్నారు. నందిగామలోని పేరు గన్న జూనియర్ కళాశాల, పాఠశాల, ఈ ఊరి వారు స్థాపించినవే.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన పేద విద్యార్థి భూక్యా మోతీలాల్ నెహ్రూ, కోదాడలో 3వ సం. బి.ఎస్.సి. చదువుచున్నాడు. ఇతడు క్రికెట్ పోటీలలో అండర్-25 విభాగంలో ఆడి, తన అత్యుత్తమ ప్రతిభతో మార్చి-2015లో నిర్వహించే, సౌత్ ఏషియన్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనాడు.
మౌలిక వసతులు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ ఊరికి ప్రధాన నీటి వనరు వైరా ఏరు. ఈ ఊరిలో పంపింగ్ స్కీమ్ కూడా ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వేల్పుల కిషోర్‌బాబు సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. 2017,ఏప్రిల్-4న, దాతలు కొణిదెన సతీష్, లక్ష్మీచైతన్య దంపతులు, శ్రీరామనవమికి కళ్యాణం జరిపించుటకై, ఈ ఆలయానికి 30 వేల రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు నిర్వహించారు. దాతలు ఈ విగ్రహాలకు పంచామృతాలతో సంప్రోక్షణ నిర్వహించారు. [2]
ప్రధాన పంటలు
[మార్చు]వరి, పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలలో మామిడి మాత్రమే కాక సపోటా పండ్లు కూడా పండుతాయి. ఇక్కడి మామిడి తోటలలో బంగినపల్లి, చిన్న రసాలు,పెద్ద రసాలు,యెల్లమంద రకాలు చాలా ప్రసిద్ధి.
ప్రధాన వృత్తులు
[మార్చు]ప్రధాన వృత్తి వ్యవసాయము.
గ్రామ ప్రముఖులు
[మార్చు]డాక్టర్ కిలారు సురేంద్రనాథ్‌బెనర్జీ.